సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 9


  • వెంట వచ్చేది సంసారం కాదు, సంస్కారం.
  • ఓపిక ఉత్తమోత్తమమైన ఔషధం.
  • బలవంతుణ్ణి బలహీనపరచి, బలహీనుణ్ణి బలవంతుడిగా మార్చలేము.
  • నివసిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల ప్రేమను పూర్తిగా అందించబడే చోటే గృహం అవుతుంది.
  • త్వరగా పడుకుని త్వరగా లేవడం వల్ల మనిషి ఆరోగ్యవంతుడిగా,భాగ్యవంతుడిగా,వివేక సంపన్నుడిగా తయారవుతాడు.
  • చేయూతనందించే చేతులలోనే గెలుపు తాళం చెవి ఉంటుంది.
  • అంతరాత్మకు సంబంధించినంత వరకు అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి తావులేదు.
  • నిజానికి మించిన మతం ఈ ఇలలో లేదు.
  • సాధించిన విజయం కంటే అభిలాష ఎంతో గొప్పది.
  • క్షణిక కోపాన్ని అణుచుకోగల వ్యక్తి ఒక రోజు దు:ఖాన్ని దూరం చేసుకోగలడు.
  • శ్రద్దగా వినండి కానీ మాట్లాడేటప్పుడు నిదానంగా మాట్లాడండి.
  • చెడును చేసేందుకు మంచి మార్గం అంటూ ఉండదు.
  • అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరేవరకూ శ్రమించండి.
  • భావామే అటు స్వాతంత్ర్యానికీ ఇటు ఎదుగుదలకు పని కొచ్చే తాళం చెవి.
  • న్యాయం గెలుస్తుందన్న మాట నిజమేకాని గెలిచేదంతా న్యాయం కాదు.
  • క్రమశిక్షణ అన్నది ఆపద అనే పాఠశాలలో నేర్చుకోబడుతంది.
  • పూలలో సువాసన, మనుష్యులలో యోగ్యత అనేవి దాచినా దాగని వస్తువులు.
  • ధనవంతుడి జోకులు ఎల్లప్పుడూ తమాషాగానే ఉంటాయి.
  • ప్రతి మందలోనూ, ఒక మోసగాడు ఉంటాడు.
  • కీర్తి పొందని పుట్టుక నిష్ఫలము.
  • ఏదైనా ఒక అవకాశం చేజారిపోయినప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా మరొక అవకాశం చేజారిపోకుండ జాగ్రత్తపడాలి.
  • మనం నిజంగా ఏమో అదే మన గుణం. మనం ఇతరులకు ఎలా కనిపిస్తామో అదే మన నడత.
  • తప్పులు పట్టవద్దు. తప్పులు దూరం చేయగల మార్గాలను వెతుకు.
  • అతి ఉత్తమమైన ఆదర్శాన్ని ఎన్నుకొని దానికి తగ్గట్టుగా జీవించండి.
  • మిమ్మల్ని ఎవరూ గమనించనప్పడు ఎల వ్యవహరిస్తారో అదే మీరు.
  • వివేకవంతుడు మనసును శాసిసే మూర్ఖుడు దానికి బానిస అవుతాడు.
  • అన్నింటిని గురించి ఎంతో కొంత తెలుసుకోవడం తేలికే. కానీ అన్నింటిని గురించి అంతా తెలుసుకోవడం చాలా కష్టం
  • చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా.
  • అసాధారణమైన ప్రతిభ ఎప్పటికైనా తాను చేయవలసిన దానిని చేసి తీరుతుంది.
  • మూగవాడు మాట్లాడగల భాష చెవిటివాడు వినగల భాషే దయ.
  • ప్రేమ మరియు నిపుణత్వాల కలయిక కళాఖండానికి జన్మనిస్తుంది.
  • వాడి అయిన ముళ్ళే తరచుగా నాజూకైన గులాబీని ఇస్తాయి.
  • ప్రతికారం ద్వారా పగ నిర్మూలనం కాదు -రాజాజీ.
  • సులభంగా తయారయే ముందు అన్ని విషయాలు కష్టంగా ఉంటాయి.
  • చెసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి. డబ్బును తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.
  • పంచుకున్న సంతోషం సంతోషాన్ని రెండింతలుగా పెంచుతుంది.
  • నా అదృష్ట దురదృష్టాలకు భాధ్యుడను నేనే.
  • పుష్పానికి సుగంధం - మనిషికి వ్యక్తిత్వం.
  • ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దాన్ని చేస్తాయి.
  • నిదురపోయే వ్యక్తిని మీరు మేల్కొలుపవచ్చును. కానీ నిదురపోయేట్లు నటించే వ్యక్తిని మేల్కొలుపలేరు.
  • గెలుపు అన్నది ప్రయాణం, లక్ష్యం కాదు.
  • మిమ్మల్ని బాగా ఆలోచించేలా చేయగల పుస్తకాలే మీకు బాగా సహాయం చేయగల పుస్తకాలు అవుతాయి.
  • పగ - ప్రతీకారం - ఈర్ష్య అసూయ - అసహ్యం విజయానికి శత్రువులు.
  • నవ్వని దినం పోగొట్టుకున్న దినం.
  • సజ్జనులతో మైత్రి చిరకాలం నిలిచి ఉంటుంది.

No comments:

Post a Comment