సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 20


  • ఇతరుల తప్పులను ఎత్తిచూపే ముందు మీసొంత తప్పులను గురించి తెలుసుకోండి.
  • చిన్న చిన్న గొడ్డలి పెట్లే మహావృక్షాన్ని సహితం పడదోస్తాయి.
  • జీవితంలో విజయాలు సాధించటానికి ఏకాగ్రత, తదేకదీక్ష అత్యంత అవసరం.
  • ఎప్పుడు చిరునవ్వు నవ్వుతుంటే భగవంతునికి సన్నిహితముగా ఉంటావు.
  • అసూయ ఆత్మకు పచ్చకామర్లు.
  • చెడు చేయాలన్న గునం మనలో నిండి ఉన్నదువల్లే ఇతరులను గురించి అతి చెడుగా ఆలోచించడంను విశ్వసించే అవకాశాలు ఉన్నాయి.
  • ఇతరులను జయించాలనుకోకు. నిన్ను నీవు జయించు. అప్పుడు ప్రపంచం నీచే జయింపబడుతుంది.
  • మరమ్మత్తు చేయలేని దాన్ని గురించి బాధపడరాదు.
  • ప్రపంచంలోని అందరు మేథావులకన్నా ఒక మంచి హృదయం గల వ్యక్తి ఎంతో గొప్పవాడు.
  • తుఫానులో చేసిన ప్రమాణాలను ప్రశాంతంలో మరచిపోతాం.
  • మీ మనసుకు శిక్షణనిచ్చి అభివృద్ధి పరచడం అన్నది మీ కర్తవ్యం.
  • మాటల కంటే చేతలు బిగ్గరగా మాట్లడతాయి.
  • ప్రేమగుణం కలిగిన వారు ఎదుటివారి నుంచి ఏమీ ఆశించరు.
  • నోట్లో తేవెగల తేనెటీగకు కాటేసే తోక ఉంటుంది.
  • సాధుగుణం లాంటి బలం వేరొకటి లేదు. అసలైన బలానికి మించిన సాధుత్వం వేరొకటి లేదు.
  • నిర్మలమైన మనసు కలిగి ఉండటం కన్నా గొప్ప శాంతి లేనేలేదు.
  • మంచితనానికి మించిన మతమే లేదు.
  • అతి ఉత్తమమైన ఆదర్శాన్ని ఎన్నుకొని దానికి తగ్గట్టుగా జీవించండి.
  • ఉన్నత భావాలు తోడుగా ఉన్నవారికి ఒంటరితనమంటూ లేదు.
  • దైన్యం రకరకాల వ్యక్తులతో పరిచయం కలిగిస్తుంది.
  • నిజం ఉన్నతమైనది కాని నిజాయితీతో జీవించడం అన్నది అంతకంటే ఉత్తమమైనది.
  • సంఘటనలు కావు కాని వాటి వెనుకనున్న కారణాలు ఆసక్తికరంగా ఉంటాయి.
  • మీలో ఎలాంటి లోపం లేదనుకోవడం తప్పులలో అతి పెద్ద తప్పు.
  • ఉదయం రోజుకు అద్దం పట్టినట్లే బాల్యం మనషికి అద్దంపడుతుంది.
  • గొప్పవారు లేనిదే మనం ఏ గొప్పదాన్ని సాదించలేము. తాను గొప్పవారం కావాలని నిర్ణయించుకున్నప్పుడే మనుషులు గొప్పవారౌతారు.
  • చాలా అపురూపమైనదీ,చాలా సున్నితమైనదీ, సామర్ధ్యం కంటే అరుదైనదీ ఒకటుంది. అదే సామర్ధ్యాన్ని గుర్తించగల సామర్ధ్యం.
  • తాను పుట్టిన నేలనీ, దేశాన్ని ప్రేమించలేని వాడు దేనీని ప్రేమించలేడు.
  • సంతోషం అన్నది మీరు పొందే వస్తువుపై కాకుండా మీరు ఇచ్చే వస్తువుపై ఆధారపడి ఉంటుంది.
  • ఒక కొవ్వొత్తిని వెలిగించిన కొవ్వొత్తి నష్టపోయేది ఏమీ ఉండదు.
  • ఉపదేశం పూర్తి అయిన తరువాత మీ ప్రవర్తనను సూచించేదే మీ మతం.
  • దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు.
  • గొణుక్కోకుండా భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందండి.
  • తను పోవలసిన దారిని మొదట వెతుక్కున్నవాడే ఇతరులకు దారి చూపగలడు.
  • ఏదో ఒక వ్యక్తిగా ఉండడంలో కాదు. ఇతరులకు సహాయపడే వ్యక్తిగా ఉండడంలోనే గొప్పతనం దాగుంది.
  • నిరాడంబరమైన, యదార్ధమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి.
  • అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు.
  • మనం నిజంగా ఏమో అదే మన గుణం. మనం ఇతరులకు ఎలా కనిపిస్తామో అదే మన నడత.
  • అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు - మహాత్మాగాంధి.
  • తన అఙ్ఞానాన్ని గురించి గ్రహించినవాడే నిజంగా తెలివైనవాడు
  • అతి ఉత్తమమైన ఆదర్శాన్ని ఎన్నుకొని దానికి తగ్గట్టుగా జీవించండి.
  • మంచి చెట్టు చెడుఫలాన్ని ఇవ్వనట్లే కుళ్ళిన చెట్టు మంచి ఫలాన్ని ఇవ్వదు.
  • మీ గురించి ప్రజలు మంచిగా చెప్పకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ గురించి మీరే గొప్పలు చెప్పకోండి.
  • నిజానికి గ్రహణం పట్టవచ్చునే కానీ అది ఎప్పటికీ సమసిపోదు.
  • నిజమైన నమ్రతే గొప్పతనపు గుర్తు.
  • సుగుణం వెలకు అతీతమైనది.

No comments:

Post a Comment