సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 21


  • రుజువులతో నిమిత్తం లేకుండా ఒక విషయాన్ని సత్యంగా భావించడం నమ్మకం.
  • మీరు తప్పనిసరిగా చేయాల్సిన పనిని చిరునవ్వుతో చేయడం అన్నది సహకారం అవుతుంది.
  • నిర్భాగ్యునికి నిద్ర, అభాగ్యునకు ఆకలి ఎక్కువ.
  • అంతరంగంలో ఉన్న ప్రేమ కంటే బహిరంగంగా మందలించడం మంచిది.
  • అజ్ఞానం అన్నది మనస్సు యొక్క చీకటి.
  • అహం నశించినప్పుడు ఆత్మ మేల్కొంటుంది.
  • చరిత్ర చదవడం కాదు! చరిత్ర సృష్టించాలి.
  • నిరాడంబరమైన, యదార్ధమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి.
  • ఆశించడం వల్ల కాక, అర్హత సంపాదించడం వల్ల దేనినైనా పొందవచ్చు.
  • ప్రేమ గాఢమైతే తప్పులు పలుచనౌతాయి.
  • బాధలను తట్టుకోగల అనంత సామర్ధ్యాన్నే ప్రతిభ అంటారు.
  • తాను విలువనిచ్చే స్వాతంత్ర్యం కోసం మనిషి పుట్టినప్పటి నుండి గిట్టేంతవరకు ప్రాకులాడుతూ ఉంటారు.
  • ఉదయం రోజుకు అద్దం పట్టినట్లే బాల్యం మనషికి అద్దంపడుతుంది.
  • కవి అన్నవాడు ఎప్పుడూ ఆకలితో అలమటించే వాడుగా గాని లేదా భగ్న ప్రేమికుడిగా గాని ఉండాలి.
  • క్రమబద్దతను పాటించకుండా సంపద, పరాక్రమం లేకుండా విజయం, ఉపకార గుణం లేకుండా పేరు, ఆధ్యాత్మిక ఙ్ఞానం లేకుండా ముక్తి లభించవు.
  • సంపదకు స్నేహితులు మొండు, కాని పేదరికానికి కొంతమంది మాత్రమే.
  • ఇతరులను గౌరవించడం ద్వారానే గౌరవింపబడే హక్కును పోందగలము.
  • సంతృప్తి పేదవానికి సంపద ఇస్తుంది. అసంతృప్తి ధనవంతుణ్ణి పేదవానిగా చేస్తుంది.
  • ప్రేమ పొందే వారిని, పంచే వారిని - ఇద్దరినీ బాగుపరుస్తుంది - డా. కార్ల్ మెన్నింజర్.
  • ఆంతరంగిక అనుభవంలోనే నిజమైన ఆనందం దాగుంది.
  • మనం అభ్యుదయాన్ని పొందాలంటే చరిత్ర తిరిగి రానివ్వకుండా కొత్త చరిత్రను సృష్టించాలి.
  • తనకు అర్ధం కాని వాటిలో మనిషికి మరింత నమ్మకం.
  • మంచితనం ఉన్నవారు తమ బాధ్యతలను నిర్వహిస్తారు. మంచితనం లేనివారు తమ హక్కులపై దృష్టిని నిలుపుతారు.
  • వినయ విధేయతలున్నప్పుడు మీరు పూర్తిగా బీదవారు కాలేరు. వినయ విధేయతలు లేని పక్షంలో మీరు నిజంగా ధనవంతులు కాలేరు.
  • క్రమశిక్షణతో కూడిన కఠన పరిశ్రమ మాత్రమే పేదరికాన్ని మాయం చేయగలదు.
  • మీ కోరికలు అంతులేనివైతే, మీ చింతలూ, భయాలూ కూడా అంతులేనివే - థామస్ పుల్లర్.
  • గతం త్రవ్వకండి. వర్తమానంలో పనిచేస్తూ భవిష్యత్తు నిర్మించండి.
  • మనం ఎంత చదివితే మన అజ్ఞానం అంత బయటపడుతుంది.
  • క్రియ సామర్ధ్యానికి సంబంధించిన ఏకైక మార్గం.క్రియ సామర్ధ్యానికి సంబంధించిన ఏకైక మార్గం.
  • అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు.
  • దైవ భక్తికి అర్ధం - ఆదర్శాల పట్ల ప్రేమ.
  • ఉత్సాహం లేనిదే ఏగొప్ప పనిని సాధించలేము.
  • సలహా ఆముదం లాంటిది. ఇవ్వడం సులభం తీసుకోవడమే కష్టం.
  • మౌనం మనిషికి ఉత్తమోత్తమ ఆభరణం.
  • ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించి చూడాలంటే అతనికి అధికారం ఇచ్చి చూస్తే చాలు.
  • చక్కటి ఆలోచన, సరైన ముందుచూపు లేని మనిషి జీవితంలో అడుగడుగునా ఆపదలు చుట్టుముడతాయి.
  • ఏదైనా కానివ్వాండి అతి అన్నది చెడ్డది.
  • పసిబిడ్డ మనిషి తండ్రి.
  • విద్య సౌభాగ్యానికి ఒక ఆభరణం మరుయు ప్రతి కూలతలో ఒక అభయస్ధానం.
  • పిడికెడు లోకజ్ఞానం తట్టెడు చదువుతో సమానం.
  • మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడాని కంటే కూడా ఎక్కువగా భూమిపైన మిమ్మల్ని ప్రేమించే ఏకైక జంతువు కుక్క.
  • చదవదగ్గ విషయాలు రాయండి లేదా రాయదగ్గ పనులను చేయండి.
  • ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం.
  • పతకాలు కాదు పొల్గొన్నామన్న భావనే పదివేలు.
  • నీ పట్ల ఇతరులు ఆసక్తి చూపాలనుకోవడం కంటే ఇతరుల పట్ల నీవు ఎక్కువ ఆసక్తి చూపినప్పుడు ఎక్కువ స్నేహితులను పొందవచ్చు.

No comments:

Post a Comment