సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 22


  • శరీరానికి ఆహారం అవసరం అయినట్లే ఆత్మకు ప్రార్ధన అవసరం.
  • నీ ఆలోచనలను, శీలాన్ని, స్వభావాన్ని పవిత్రం చేసుకో; ప్రగతి పొందు.
  • నవ్వని దినం పోగొట్టుకున్న దినం.
  • మరొక కొవ్వొత్తిని వెలిగిండం వల్ల కొవ్వొత్తి కోల్పోయేది అంటూ ఏమీ ఉండదు.
  • తాను లూటీ చేసిన పుష్పాన్నే తేనెటీగ ఫలవంతం చేస్తుంది.
  • నిజమే ఎప్పుడూ బలమైన వాదన అవుతుంది.
  • అందరిని సంతోష పరచాలని ప్రయత్నం చేసే మనిషి ప్రయత్నాలు వ్యర్ధమైనవి.
  • మీలోని మంచితనం మరింత మంచితనంగా, మరింత మంచితనం అతి మంచితనంగా మారనంత వరకు విశ్రమించండి.
  • పరిస్థితులను మన అదుపులో ఉంచుకోవడంలోనే మగతనం ఉంది.
  • కావలసిన దానికన్నా ఎక్కువ తీసుకొని దాస్తే మనం దొంగలం.
  • ఏ గొప్పవ్యక్తి వ్యర్ధంగా జీవించడు. ప్రపంచ చరిత్ర అంతా గొప్ప వ్యక్తుల జీవిత (ఆత్మ) కథలే - థామస్ కార్లెల్.
  • మనకు ఎదురయ్యే అవరోధాల వెనుక అనంతమైన విజయాలు దాగి ఉంటాయి.
  • తన తోటివారికి ఎంతవరకు సహాయపడతాడో అంతవరకే మనిషి గొప్పవాడవుతాడు.
  • అతి ఉత్తమమైన ఆదర్శాన్ని ఎన్నుకొని దానికి తగ్గట్టుగా జీవించండి.
  • అఙ్ఞానం అనేది అభివృద్దికీ, మార్పుకూ ఎప్పుడూ అడ్డుగోడే.
  • రహస్యమనేది మీలో మీరు దాచుకున్నంతసేపూ అది మీకు బానిస; బయటకు వొదిలారా, అది మీకు యజమాని.
  • అన్నింటికి సహనమే మూలం. గుడ్డును పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది కానీ పగులగొడితే కాదు.
  • ఙ్ఞానం అనేది మనం సంపాదిస్తే వచ్చేది కాదు. మనలోని అఙ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది.
  • శారీరక రోగాల కంటే మానసిక రుగ్మతలు ఎక్కువ హానిని కలిగిస్తాయి.
  • తన అఙ్ఞానాన్ని గురించి గ్రహించినవాడే నిజంగా తెలివైనవాడు
  • చదువు సారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది.
  • మనం చేసే పనిని ఎవ్వరూ విమర్శించకుండా ఉండేలా చేయాలంటే ఆ పనిని ఎన్నటికీ చేయలేం.
  • రహస్యాన్ని కాపాడడం, తగిలిన గాయాన్ని మరచిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవదం- ఈ మూడూ చాలా కష్టతరమైన పనులు.
  • కష్టాలు గొప్పవారి సంపదలు. గాలిపటం ఎదురుగాలి ఉన్నప్పుడే పైకి లేస్తుంది.
  • కష్టసుఖాలు మానసిక స్ధితులు.
  • తెలివితేటలంటే విన్నదాంట్లో సగాన్ని మాత్రం విశ్వసించడం.
  • అపాయంను చూసి భయపడేవారికి ఈ ప్రపంచంలో అపాయం భయం ఎప్పుడూ ఉంటుంది.
  • పని కంటే కూడా ఎక్కువ ప్రజలు చింత కారణంగా చనిపోవడం అన్నది పనిచేయకుండా చింతించడం వల్లే జరుగుతోంది.
  • వివేకాన్ని పాటించే చోట శాంతి పుష్కలంగా లభిస్తుంది.
  • గుడ్డివాడికి మరో గుడ్డివాడు దారి చూపితే ఇద్దరూ గోతిలో పడతారు.
  • మంచి సంకల్పాలు మంచి ప్రవర్తనకు బీజాలు.
  • ఇతరుల కోసం జీవించబడే జీవితమే సార్ధకమైనది.
  • తప్పు చేయడం తప్పుకాదు. చేసిన తప్పునే మళ్ళీ చేయడమే తప్పు.
  • సుఖదుఃఖాల బంగారు ఇనుప తీగలు మన జీవితంలో విడదీయలేనంతగా కలిసిపోయి ఉన్నాయి.
  • దూరం సోందర్యంనూ, దృశ్యాన్నీ మరింత సుందరం చేస్తుంది.
  • మనం ఎల్లప్పుడూ ఉపకారం చేసేవారిగా ఉండలేము. కానీ ఉంపకారం చేసే విధంగా మనం ఎల్లప్పుడూ మాట్లాడాలి.
  • ఉపదేశం పూర్తి అయిన తరువాత మీ ప్రవర్తనను సూచించేదే మీ మతం.
  • మంచి అలవాట్ల తరువాత మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగినది మంచి జ్ఞాపకాలే - సిడ్నీ హరిస్.
  • నీ ఆలోచనలను, శీలాన్ని, స్వభావాన్ని పవిత్రం చేసుకో; ప్రగతి పొందు.
  • ఒకరు మరొకరికి జీవితాన్ని. తక్కువ కష్టాలతో కూడిన దానిగా చేయడం కోసం కాకుండా మనం మరి దేనికోసం జీవించగలము?
  • కావలసిన దానికంటే ఎక్కువ వివేకం కలిగి ఉండడం వివేకం అనిపించుకోదు.
  • వంతెనలను కాకుండా గోడలను కట్టుకునేందువల్ల ఒంటరితనానికి ప్రజలు లోనవుతున్నారు.
  • విద్య యొక్క అర్ధం, పరమార్ధం రెండూ వ్యక్తిని ఉత్తమమైన వానిగా రూపొందింపచేయడమే.
  • మీరు మాట్లాడే విషయాన్ని గురించి ఆలోచించండి. అంతేకాని మీరు ఏమి ఆలోచించారో దాన్ని గురించి మాట్లాడకండి.
  • ఒకే ఒక ముద్దొచ్చే బిడ్డ ఈ ప్రపంచంలో ఉంది. ఆ బిడ్డను ప్రతి అమ్మ కలిగి ఉంటుంది.

No comments:

Post a Comment