సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 23


  • సిద్దమైన వ్యక్తి సగం యుద్దం జయించినట్లే.
  • సమాజం నేరాన్ని తయారుచేస్తుంది, దాన్ని నేరస్తుడు చేస్తాడు.
  • మీ పట్ల మీ అభిప్రాయం గొప్పదై వుండాలి. ఈ ప్రపంచంలో మీ గురించి ఆలోచించే మొదటి వ్యక్తి మీరే.
  • విచక్షణ రాహిత్యం మానసిక అంధత్వం.
  • ధనమే ఆనందం కాదు. ధనవంతులందరూ ధనం కారణంగా ఎప్పుడూ ఆనందంగా ఉండలేరు.
  • తన మతం యొక్క హృదయాన్ని మనిషి చేరుకోగలిగితే అతడు ఇతరుల హృదయాన్ని కూడా చేరుకోగలడు.
  • ఈ రోజన్నది నిన్నటి రోజును గురించి దిగులుపడిన రేపు అవుతుంది.
  • చెడు మాటలు కత్తి కంతే పదునైన గయాన్ని చేస్తాయి
  • కష్టాల నుండి గట్టెక్కే ఉత్తమ మార్గం కష్టాలను భరించడమే.
  • మనకు ఎదురయ్యే అపజయాలన్నింటికీ ప్రధాన కారణం మనలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే.
  • ఒక పౌండు ధైర్యం ఒక టన్ను అదృష్టంతో సమానం.
  • చెదరిపోయిన మనసు సంపూర్ణంగా దర్శించ లేదు.
  • ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దాన్ని చేస్తాయి.
  • ఒక మనిషి దిగజారినా, అభివృద్ధి చెందినా అది అతని స్వయంకృతమే.
  • చిన్న చిన్న త్యాగాలు కలిసే మంచి అలవాట్లను -కలిగించేలా చేస్తాయి.
  • తన జానెడు పొట్టకు బానిస అయిన వ్యక్తి భగవంతుణ్ణి ససేమిరా పూజించలేడు.
  • అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు - మహాత్మాగాంధి.
  • మనిషిలో జ్ఞానం అనేది పెరిగేకొద్ది తనలోని అజ్ఞానం తెలిసివస్తుంది.
  • ఆకర్షణలు తిరుగుబోతుల వంటివి. ఒకదాన్ని ఆదరిస్తే, తన మిత్రులతో తిరిగి వస్తుంది.
  • క్రోధాన్ని జయించిన వ్యక్తి అందరినీ జయిస్తాడు.
  • మీపట్ల మీరు శాంతంగా వ్యవహరిస్తే ఇతరులతో మీరు ఎప్పుడూ ఘర్షణ పడలేరు.
  • మంచి మిత్రుడు రెండు శరీరాలలో నివశించే ఒక ఆత్మ.
  • చెడును బయటకు వెళ్ళగొట్టి మీ హృదయాన్ని మంచితో నింపుకోండి
  • పనిచేసే చేతులు ప్రార్ధన చేసే చేతులకంటే ఎంతో అమూల్యమైనవి.
  • వేదన అనేది రానున్న కష్టానికి చెల్లించే ముడుపు.
  • తప్పు చేయడం తప్పుకాదు. చేసిన తప్పునే మళ్ళీ చేయడమే తప్పు.
  • మనసా వాచా కర్మణా పరిశుద్ధంగా ఉన్నప్పుడే మీరు మీ మనసును భగవంతుడి స్వరంతో ఏకం చేసుకోగలుగుతారు.
  • భయం నుండీ ద్వేషానికి దారి తీసే రోడ్డు అతి చేరువలో ఉంటుంది.
  • మూర్ఖత్వంతో ప్రారంభమైన కోపం పశ్చాత్తాపంతో ముగుస్తుంది.
  • సమాజం నేరాన్ని తయారు చేస్తే నేరస్తుడు నేరం చేస్తాడు.
  • నా అదృష్ట దురదృష్టాలకు భాధ్యుడను నేనే.
  • రోజూ తాను చేస్తున్న పనితో సంతృప్తి పొందినవాడే గొప్ప ధనవంతుడు.
  • మాటలను వ్యక్తపరచడంలో పాండిత్యాన్ని కనబరచే సామర్ధ్యాన్నే నిపుణత అంటారు.
  • మనలో ప్రశాంతతను కనుగొనలేని పక్షంలో దానికోసం ఇతర చోట్ల వెతకడం వ్యర్ధం.
  • దేవుని ప్రేమించటం జీవిత లక్ష్యం, దేవునితో ఐక్యం చెందటం జీవిత గమ్యం.
  • ఇతురుల తప్పులను క్షమించడం, మరచిపోవడం అనేవి మంచితనానికి అసలు సిసలైన నిదర్శనాలు.
  • మరో కొవ్వొత్తిని వెలిగించినంత మాత్రానా కొవ్వొత్తి తన వెలుగును కోల్పోదు.
  • నమ్మకమే ఒకరు ఇంకొకరికి ఇచ్చుకోగల ఉత్తమోత్తమ కానుక అవుతుంది.
  • తప్పులను చేయని వ్యక్తి సాధారణంగా ఏమి చేయలేడు.
  • పరీక్షలకు గురికాకుండా మనిషి రాణించనట్లే రాపిడికి గురికాకుండా వజ్రం రాణించలేదు.
  • కష్టసుఖాలు మానసిక స్ధితులు.
  • ఈ రోజు పనిని చాలా బాగా చేయడమన్నదే రేపటి కోసం ఉత్తమమైన తయారీ అవుతుంది.
  • ఎప్పుడూ నిజాయితీపై విశ్వాసం ఉన్నవారే అందరిచేత గౌరవింపబడుతారు.
  • చాలాకాలం వరకు కొనసాగే అలవాటే మనిషి గుణం అవుతుంది.
  • ప్రేమ గాఢమైతే తప్పులు పలుచనౌతాయి.

No comments:

Post a Comment