- చక్కగా తీర్చిదిద్దబడిన ఒక మంచి వ్యక్తి జీవితమే ఈ ప్రపంచంలో అతి పరిపూర్ణం అయిన అందమైన వస్తువు.
- చక్కటి ఆలోచన, సరైన ముందుచూపు లేని మనిషి జీవితంలో అడుగడుగునా ఆపదలు చుట్టుముడతాయి.
- చదవకుండా ఉండడం కంటే పుట్టకుండా ఉండడమే మేలు కారణం అజ్ఞానమే దురదృష్టానికి మూలం.
- చదివిన దానిని, విన్న దానిని ఆచరించడం సాధన.
- చదివిన పుస్తకాల నుండి జ్ఞానాన్ని పొంది పాఠాలను నేర్చుకోవడమే చదువు ఉద్దేశ్యం.
- చదువు సారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది.
- చదువుకోవడానికి మనిషి ఎప్పుడూ వృద్దుడు కాడు.
- చదువులేని ఉత్సాహం గుర్రపుశాల నుండి పరిగెత్తిన గుర్రం లాంటిది
- చరిత్ర చదవడం కాదు! చరిత్ర సృష్టించాలి.
- చలువరాతికి శిల్పం ఎలాగో ఆత్మకు విద్య అలాగు.
- చాలా కొంచెంను గురించి చాలా ఎక్కువ తెలుసుకున్న వ్యక్తి నిపుణుడు.
- చాలా తక్కువగా తినిన వారికంటే చాలా ఎక్కువగా తిన్నవారే ఎక్కువ మంది చనిపోయారు.
- చాలామంది ఇతరులకంటే బాగా చేయగలిగిన పని తమ చేతివ్రాతను తామే చదువుకోగలగడమే.
- చాలామంది సలహాలు తీసుకుంటారు, కానీ వివేకవంతులే దాని నుంచి లాభం పొందుతారు.
- చింత ఎల్లప్పుడూ చిన్న వస్తువుకు పెద్ద నీడ ఇస్తుంది.
- చితి శవాన్ని దహిస్తుంది, చింత ప్రాణాన్ని దహిస్తుంది.
- చిత్తశుద్దిలేని విద్య ప్రమాద భరితమూ, భయానకమూ అవుతుంది
- చిన్న అవకాశాలే తరచుగా గొప్పసాహస కార్యాలకు ప్రారంభాలు అవుతాయి.
- చిన్న గొడ్డలి పెట్లు మహా వృక్షాలను కూల్చగలవు.
- చిన్న చిన్న పనులే విశిష్టతను దారి తీస్తాయి. కానీ విశిష్టత చిన్నది కాదు.
- చిన్న పని కదా అని అలక్ష్యం చేయకండి. చిన్న విత్తనం నుండే మహావృక్షం ఉద్భవిస్తుందని మరువకండి.
- చిరునవ్వు ప్రతికూల పరిస్ధితులను కూడా అవకాశాలుగా మార్చగలదు
- చీకటిలో మీరు వ్యవహరించే తీరే మీ గుణం.
- చూస్తున్న పొరుగువాణ్ణి ప్రేమించలేనివాడు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు?
- చెట్టు పైకి ఎక్కాలనుకున్నప్పుడు పూలను కాదు, కొమ్మలను పట్టుకోండి.
- చెడును విస్మరించి, మంచిని స్మరించి సంరక్షించుకోవటం యోగ్యతకు లక్షణం.
- చెడ్డను నాటితే దక్కేది దుఃఖమే.
- చెదరిపోయిన మనసు సంపూర్ణంగా దర్శించ లేదు.
- చెప్పులు కుట్టేవాడు చెప్పులు అందంగా చేస్తాడు. కారణం అతను ఇంకేమి చేయడు.
- చెసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి. డబ్బును తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.
- చేటు కాలమునకు చెడు బుద్ది పుట్టును.
- చేసిన తప్పుడు పనులను గురించి చెప్పి పశ్చ్యాత్తాప పడటం అన్నది మంచి పనికి శ్రీకారం చుట్టే మంచి పని అవుతుంది.
- చేసిన తప్పును సమర్ధించుకోవడంతో అది రెండింతలు అవుతుంది.
- చేసిన మేలు ఎన్నడూ గుర్తుంచుకోకు, పొందిన మేలు ఎన్నడూ మరచిపోకు.
- జనన మరణాల మధ్యంతర కాలం జీవితం.
- జాతికి సంపద వెండి, బంగారాలు కాదు - సజ్జనులు.
- జాలి లేనివారే నిజమైన అంటరానివారు.
- జీర్ణించుకోలేనన్ని నమ్మకాలు మింగకూడదు.
- జీవించడం అన్నది ముఖ్యంకాదు ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేసామన్నది ముఖ్యం.
- జీవించడం అన్నది ముఖ్యంకాదు. ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేసామన్నదే ముఖ్యం.
- జీవిత పరిజ్ఞానంలేని గ్రంధాలు నిష్ప్రయోజనాలు.
- జీవితం అంటే గడిచిన ఏళ్ళు కాదు సాధించిన సత్కార్యాలు.
- జీవితం అనేక సంఘటనల గొలుసు. జీవించడం అనేక అనుభవాల గొలుసు.
- జీవితం ఎడతెరిపి లేకుండా ప్రవహించే అనుభవాల సారం.
- జీవితం నాకు ఆలోచించడం నేర్పింది. కానీ ఆలోచనలు ఎలా జీవించాలో తెలియజేయలేదు.
- జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశే మిగులుతుంది. అందుకే జీవితాన్ని శాసించటం నేర్చుకో.
- జీవితంలో అపూర్వ ఆభరణం వినయం.
- జీవితంలో విజయాలు సాధించటానికి ఏకాగ్రత, తదేకదీక్ష అత్యంత అవసరం.
- జీవితంలో సంఘర్షణ లేనప్పుడు కాదు, ఆ సంఘర్షణతో సర్దుకుని పోయినప్పుడే శాంతి లభిస్తుంది.
- జీవితపు గొప్ప ముగింపు తెలుసుకోవడంలో లేదు. చేయడంలోనే ఉంది.
- జీవితపు గొప్ప విజయాలన్నవి తరచుగా బాజాలతో కాక ప్రశాంతంగా సాధించినవే అవుతాయి.
- జీవితానికి అత్యున్నత లక్ష్యం ఏర్పరుచుకోవడం కష్టం. ఏర్పరుచుకుంటే దాన్ని సాధించడం సులభం.
- జీవితాన్ని విఫలం చేసే ప్రమాదకర లక్షణం తొందరపాటు.
- తన అఙ్ఞానాన్ని గురించి గ్రహించినవాడే నిజంగా తెలివైనవాడు
- తన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం.
- తన జానెడు పొట్టకు బానిస అయిన వ్యక్తి భగవంతుణ్ణి ససేమిరా పూజించలేడు.
- తన తోటివారికి ఎంతవరకు సహాయపడతాడో అంతవరకే మనిషి గొప్పవాడవుతాడు.
- తన తోటివారికి చేసిన మంచే మనిషి నిజమైన సంపద
- తన దోషాలను గుర్తించకపోవటాన్ని మించిన పొరపాటు లేదు.
- తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రతివ్యక్తి ఒక వాస్తుశిల్పే.
- తనకు అర్ధం కాని వాటిలో మనిషికి మరింత నమ్మకం.
- తనకు ఇష్టమైన పనిని గొప్ప మూర్ఖుడు కూడా పూర్తిచేయగలడు.కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు.
- తనకు నచ్చిన పనిని ప్రతివాడు చేస్తాడు. కానీ చేస్తున్న పనిని ఇష్టపడేవాడికే నిజమైన సంతోషం లభిస్తుంది.
- తనకోసం పాటు పడటం సంతృప్తిని ఇస్తుంది. కాని ఇతరుల కోసం పాటు పడటం ఉత్తేజం కలిగిస్తుంది.
- తనను తానే నమ్మని వ్యక్తి ఎవరినీ నమ్మలేడు.
- తనలోని పసి హృదయాన్ని పోగొట్టుకోని వ్యక్తే గొప్పవాడు.
- తను పోవలసిన దారిని మొదట వెతుక్కున్నవాడే ఇతరులకు దారి చూపగలడు.
- తప్పు చేయని వారు ధరణిలో లేరు.
- తప్పులను చేయని వ్యక్తి సాధారణంగా ఏమి చేయలేడు.
- తప్పులు ఎవరైనా చేస్తారు. కానీ మూర్ఖుడు తప్పులు చేస్తూనే ఉంటాడు.
- తప్పులు పట్టవద్దు. తప్పులు దూరం చేయగల మార్గాలను వెతుకు.
- తమ చావుకు ముందే పిరికివాళ్ళు అనేకసార్లు మరణిస్తారు.
- తమ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చడానికి మించిన కర్తవ్యం ఎవరికీ లేదు.
- తమకాలాన్ని దుర్వినియోగం చేసేవారు కాలం తక్కువగా ఉన్నదని ఎక్కువగా ఫిర్యాదు చేస్తారు.
- తమకు తామే సహాయాన్ని చేసుకునేవారికే దేవుడు సహాయపడతాడు.
- తలమీద జుట్టు అందాన్నిస్తుంది. తలలోని జ్ఞానం గొప్పదనాన్ని కలిగిస్తుంది.
- తాను పుట్టిన నేలనీ, దేశాన్ని ప్రేమించలేని వాడు దేనీని ప్రేమించలేడు.
- తాను లూటీ చేసిన పుష్పాన్నే తేనెటీగ ఫలవంతం చేస్తుంది.
- తాను శ్రమించిన పనివల్ల అతడికి లభించే ఫలితమే కాకుండా అతడు మారిన విధమే అతిగొప్ప బహుమతి అవుతుంది.
- తినుటకై జీవించు వాడు బుద్దుడు. జీవించుటకై తినువాడు ముక్తుడు.
- తీరిక లేకుండా పనిచేసే వ్యక్తే అతి సంతోషంగా ఉన్న వ్యక్తి.
- తీర్మానాలు చేస్తే చాలదు. వాటిని ఆచరణలో పెట్టాలి.
- తీసిన కొద్దీ చెలమలో నీరు ఊరినట్టు చదివిన కొద్దీ మనిషి వివేకం పెరుగుతుంది.
- తుఫానులో చేసిన ప్రమాణాలను ప్రశాంతంలో మరచిపోతాం.
- తృప్తి అమూల్యమైన ముత్యం. పదివేల కోరికలకు బదులుగా ఈ ముత్యాన్ని పొందినవాడు వివేకాన్ని, ఆనందాన్ని పొందుతాడు.
- తృప్తి కలిగినప్పుడే మానవునికి సంతోషం లభిస్తుంది.
- తృప్తితో నిన్ను నీవు బలపరచుకో, అది ఎవరూ జయించలేని కోట.
- తెలియని మూర్ఖుని కంటే అన్ని తెలిసిన మూర్ఖుడు అవివేకుడు.
- తెలివితక్కువతనాన్ని తెలుసుకోలేనంత తెలివితక్కువతనం మరొకటి ఉండదు.
- తెలివితేటలంటే విన్నదాంట్లో సగాన్ని మాత్రం విశ్వసించడం.
- తెలివితేటలు ఉన్నంత మాత్రాన ఎవరూ రచయితలు కాలేరు. ప్రతి పుస్తకం వెనుక ఒక వ్యక్తి ఉన్నప్పుడే అతడు రచయిత అవుతాడు.
- తెలుసు కోవటం కంటే తెలుసుకున్న దానిని జీర్ణించుకోవటం ముఖ్యం.
- తెలుసుకోడం కాదు, ఆచరించడమే కష్టం - షూకింగ్.
- తొందరపడకండి. విజయానికి అవసరమైనవి చిత్తశుద్ధి - ఓర్పు - పట్టుదల.
- త్యాగమయ జీవితం మహత్తర జీవితం.
- త్వరగా ఇచ్చేవాడు రెండు పర్యాయాలు ఇచ్చినట్లే.
- దయ అనబడే బంగారు గొలుసుతో మనుషులు ఒకటిగా చేర్చబడ్డారు.
- దయ తాళం వేయబడ్డ హృదయాల్ని తెరవగల సరైన తాళం చెవి.
- దయార్థ హృదయంకు ధర చెల్లించవలసిన అవసరం లేదు.
- దారి మాత్రం తెలిసి వాహనం నడిపే కళతెలియని వ్యక్తిని విమర్శకుడు అంటారు.
- దారిద్య్రం దుర్గుణం కాదు, అసౌకర్యం మాత్రమే.
- దీపపు వెలుగు నూనెపై ఆధారపడి ఉంటుంది.
- దూరపు కొండలు నునుపుగా తోచు.
- దృఢనిర్ణయం అన్నది విజయపథంపై మనం మొదటి అడుగు అవుతుంది.
- దృఢమైన హృదయమే దురదృష్టాన్ని ధ్వంసం చేయగలదు.
- దృశ్యాన్ని దూరమే మోహింపచేస్తుంది
- దేని స్థానంలో అది ఉంటేనే ఉపయోగం ఉద్యానవనంలో ఆవు ఉండడం వల్ల ఏం లాభం?
- దేన్ని చూసైనా సరే భయపడవద్దు! మీరు అద్భుతాలు సాధిస్తారు! భయపడిన మరుక్షణo, మీరు ఎందుకూ కొరగాని వారయిపోతారు.
- దేవుడికీ, మనిషికీ మధ్య ఉన్న అద్భుత వంతెనే ప్రార్ధన.
- దేవుడు సత్యం. దేవుడు బ్రహ్మానందం. దేవుడు సౌందర్యం.
- దేవుని ప్రేమించటం జీవిత లక్ష్యం, దేవునితో ఐక్యం చెందటం జీవిత గమ్యం.
- దేశకాల పరిస్థితులకు అతీతమైనది సంస్కృతి.
- దైన్యం రకరకాల వ్యక్తులతో పరిచయం కలిగిస్తుంది.
- దైవ భక్తికి అర్ధం - ఆదర్శాల పట్ల ప్రేమ.
- దైవకార్యంలో పాల్గొనే అవకాశం కలిగిన వాడే అందరినీ మించిన అదృష్టవంతుడు.
- ద్వేషం కంటే కూడా ప్రేమ అన్నది చాలా శక్తివంతమైనది.
- ద్వేషాన్ని పోషించే వారిని ద్వేషం హతం చేస్తుంది.
- ధనమే ఆనందం కాదు. ధనవంతులందరూ ధనం కారణంగా ఎప్పుడూ ఆనందంగా ఉండలేరు.
- ధనవంతుడి జోకులు ఎల్లప్పుడూ తమాషాగానే ఉంటాయి.
- ధనవంతుడిగా మరణించడం కంటే ధనవంతుడిగా జీవించడం హాయి.
- ధృడమైన మనస్సును కలిగి ఉన్నవారు అంధకారంలో కూడా కాంతిరేఖను చూడగలరు.
- ధైర్యం కేవలం పురుషుడి సొత్తు కాదు. మగవారిలాగా స్వతంత్రులం అని స్త్రీలు భావించాలి.
- ధైర్యంతో పనులను చేపట్టేవారినే విజయలక్ష్మి వరిస్తుంది.
తెలుగు సూక్తులు - మంచి మాటలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment