తెలుగు సూక్తులు - మంచి మాటలు

  • 20 ఏళ్ళ అనుభవం నేర్పే పాఠాలను ఏడాది గ్రంధ పఠనం నేర్పుతుంది.
  • అంకెలతో దేన్నయినా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప.
  • అంతరంగంలో ఉన్న ప్రేమ కంటే బహిరంగంగా మందలించడం మంచిది.
  • అంతరాత్మ మనలను మందలించే పనులు మనం చెయ్యకూడదు.
  • అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు.
  • అందం అన్నది సత్యం యొక్క శోభ.
  • అందమైన వస్తువు ఎప్పుడూ ఆనందాన్నిస్తుంది.
  • అందమైనది మంచిగా ఉంటుంది. మంచిగా ఉన్నవాడూ అందాన్ని పొందుతాడు.
  • అందరి సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కో.
  • అందరిపట్ల విధేయత కనపరచండి. కాని మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి.
  • అందానికీ, కళ్ళకీ అవినాభావ సంబంధం ఉంటుంది - ప్రేంచంద్.
  • అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక.
  • అఙ్ఞానం అనేది అభివృద్దికీ, మార్పుకూ ఎప్పుడూ అడ్డుగోడే.
  • అఙ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువవుతుంది. నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది.
  • అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు.
  • అడిగిన వెంటనే ఇవ్వబడిన దానం గొప్పది.
  • అణుకువ అనేది లేకుంటే అందం అనేది కూడా అసహ్యంగా, వికారంగా కనిపిస్తుంది.
  • అతి ఉత్తమమైన ఆదర్శాన్ని ఎన్నుకొని దానికి తగ్గట్టుగా జీవించండి.
  • అతి వివేకవంతుడి బుర్రలో వేపకాయంత వెఱ్ఱి ఉంటుంది.
  • అత్యాశకు గురికాని వారు చిన్న విషయాలలో గొప్ప విజయాన్ని సాధిస్తారు.
  • అదుపులో ఆనందం, పొదుపులో భాగ్యం.
  • అదృష్టం సంసిద్దంగా ఉన్న మనస్సునే వరిస్తుంది.
  • అదృష్టం సాహసవంతులను వరిస్తుంది.
  • అధైర్యానికి అవకాశమివ్వకు, ఆనందాన్ని చేజార్చుకోకు.
  • అధ్యాయం ప్రారంభించిన తరువాత కాని మన అజ్ఞానం తెలిసి రాదు.
  • అనవసరమైనదాన్ని వదలివెయ్యడంలోనే చదువు యొక్క కళ ఆధారపడి ఉంది.
  • అనుబంధం లేకుండా ఏ అనుభవం రాదు.
  • అనుభవమే అన్ని విజయాలకూ మూలం.
  • అన్ని ఆశలు అడియాసలైనప్పుడు మన ముందు భవిష్యత్తు అలానే స్థాణువుగా ఉంటుంది.
  • అన్ని విషయాలలో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం మంచిది.
  • అన్ని సాక్షాలు కంటే ఆత్మ సాక్షం అధికం.
  • అన్ని సుగుణాలకు పట్టుదలే పట్టుకొమ్మ - థామస్ కార్ల్
  • అన్నింటికి సహనమే మూలం. గుడ్డును పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది కానీ పగులగొడితే కాదు.
  • అన్నింటిని గురించి ఎంతో కొంత తెలుసుకోవడం తేలికే. కానీ అన్నింటిని గురించి అంతా తెలుసుకోవడం చాలా కష్టం
  • అన్నింటినీ నమ్మేవాడూ నష్టపోతాడు ఏదీ నమ్మనివాడూ నష్టపోతాడు.
  • అన్నీ కళలలోకి గొప్ప కళ అందమైన నడవడి.
  • అన్నీ భగవంతుడిపైనే ఆధారపడ్డాయన్నట్లు ప్రార్ధించు. అన్నీ నీపైనే ఆధారపడ్డాయన్నట్లు శ్రమించు.
  • అపజయం అంచులవరకు పోకుండా లభించే విజయంలో పులకింత ఉండదు.
  • అప్రయత్నంగా సాధించే గెలుపుకంటే, మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.
  • అభినందన పొందాలనే వాంచే ప్రతి హృదయంలోని గాఢమైన కోరిక.
  • అభిప్రాయానికి, ఆచరణకి మధ్య ఉన్న విరామం, కాలం.
  • అభిమానం అనేది అసాధారణ ధర్మంగా పరిణమిస్తే అహంకారం అవుతుంది.
  • అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరేవరకూ శ్రమించండి.
  • అరకొఱగా ఏ పనినీ చేయవద్దు.
  • అర్హతను సంపాదించండి. ఆ తరువాత కోరికను పెంచుకోండి.
  • అలవాటు మానవ స్వభావాన్ని నియత్రించే చట్టం - కార్లెయిల్.
  • అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలే ఉండాలి, కాని ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు - ఏ.జి. గార్డెనర్.
  • అవకాశం అనేది రాదు. అది ఇక్కడే ఉంటుంది.
  • అవకాశాలు గ్రుడ్లలాంటివి. ఒకసారి ఒకటే వస్తుంది.
  • అవతలివాడు తప్పు చేస్తున్నాడని చెప్పకు. నీవు తప్పు చేస్తే ఒప్పుకో.
  • అవసరానికి మించి ఒక్కమాట కూడా అదనంగా మాట్లాడకండి.
  • అవివేకి హృదయం అతని నోటిలో ఉంటే, వివేకి నోరు అతని హృదయంలో ఉంటుంది.
  • అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు.
  • అసమానత్వం వల్ల హింస పెరుగుతుంది.
  • అసమ్మతితో కూడుకున్న చిరునవ్వు అందాన్ని చెరుపుతుంది. ఇది కోపానికంటే ఎక్కువ చిరాకును పుట్టిస్తుంది.
  • అసాధారణమైన ప్రతిభ ఎప్పటికైనా తాను చేయవలసిన దానిని చేసి తీరుతుంది.
  • అసూయ ఆత్మకు పచ్చకామర్లు.
  • అహం నశించినప్పుడు ఆత్మ మేల్కొంటుంది.
  • అహంకారం అఙ్ఞానానికి అనుంగు బిడ్డ.
  • అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు - మహాత్మాగాంధి.
  • ఆంతరంగిక అనుభవంలోనే నిజమైన ఆనందం దాగుంది.
  • ఆకర్షణలు తిరుగుబోతుల వంటివి. ఒకదాన్ని ఆదరిస్తే, తన మిత్రులతో తిరిగి వస్తుంది.
  • ఆకలిగొన్న వాడితో న్యాయాన్ని గురించి మాట్లాడకు. ఆకలి తీర్చిన తరువాత అతడి అంతరాత్మతో వ్యవహరించు.
  • ఆగ్రహం అనేది ఎప్పుడూ తప్పిదంతో ఆరంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది.
  • ఆత్మ బలం లోపించిన వ్యక్తిలో శ్రద్ద స్థిరపడదు.
  • ఆత్మ విశ్వాసమే విజయానికి ప్రధమ సూత్రం.
  • ఆత్మకు తెలియకుండా ఇంద్రియాలు ఏపనీ చేయలేవు.
  • ఆత్మను కోల్పోయాక లోకాన్నంతా జయించినా శాంతి సమకూరదు.
  • ఆత్మవిశ్వాసం నిజమైన సంతోషానికి గీటురాయి - మనుధర్మ శాస్త్రం.
  • ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేనినీ నమ్మడు.
  • ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం.
  • ఆదర్శం అనేది లేని వ్యక్తి ఎన్నటికీ ఎదగలేడు.
  • ఆదర్శవాదికి అందరూ విరోధులే.
  • ఆదర్శాలు నక్షత్రాల లాంటివి. మనం వాటిని చేరలేము. కాని వాటిని అనుసరించి మనం ఒక ప్రణాళికను తయారు చేసుకోగలం.
  • ఆదర్శాలు లేని మనిషి - ఒక విషాద దృశ్యం వంటివాడు.
  • ఆదేశం కంటే అనుకరణ ద్వారానే పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు.
  • ఆనందం సుగంధం లాంటిది. మీపైన కొన్ని చుక్కలు పడకుండా ఇతరులపై చల్లలేరు.
  • ఆనందానికి మార్గం మీ హృదయంలో ద్వేషం లేకుండా మనసులో చికాకు లేకుండా ఉంచుకోవడమే - హెచ్.జి.
  • ఆపదలందు ధైర్యం ప్రదర్శించే వాడే వీరుడు.
  • ఆపదలు ప్రతిభను వెలుగులోకి తెస్తే సంపద దాని కప్పి పుచుతుంది.
  • ఆరాధన భావంతో సేవను చేయండి.
  • ఆరోగ్య పోషణకు రోజూ కొంత సమయం వెచ్చించకపోతే జబ్బుపడి చాలా సమయం కోల్పోవలసి రావచ్చు.
  • ఆరోగ్యం నమ్మకాన్ని ఇస్తుంది. నమ్మకం అన్నింటినీ ప్రసాదిస్తుంది.
  • ఆరోగ్యం పరమ ప్రయోజనం.
  • ఆరోగ్యానికి, ఆనందానికి నీతిసూత్రాలే బలమైన పునాదులు.
  • ఆలోచన అనేది - ఒక మొగ్గ, భాష అనేది - చిగురు, కార్యం అనేది - దాని వెనుకనున్న ఫలం.
  • ఆలోచన లేని చదువు వృధాగా శ్రమించడం లాంటిది.
  • ఆలోచన లేని చదువు వ్యర్థం. చదువులేని ఆలోచన ప్రమాదభరితం.
  • ఆలోచన, ఏకాగ్రత ద్వారానే నైపుణ్యం అబ్బుతుంది.
  • ఆలోచనలపై అంకుశమే ఏకాగ్రత.
  • ఆలోచించకుండా చదివే చదువు జీర్ణించుకోకుండా తినడం లాంటిది.
  • ఆవేశం చెలరేగినప్పుడు మేధావికి మౌనమే శరణ్యం.
  • ఆవేశం వల్ల కలిగే ఫలితం మనల్ని తప్పుదారి పట్టించడమే - ఆస్కార్ వైల్డ్.
  • ఆశ జీవితం జీవితమే ఆశ.
  • ఆశలేని వాని కగచాట్లులేవు.
  • ఆశించడం వల్ల కాక, అర్హత సంపాదించడం వల్ల దేనినైనా పొందవచ్చు.
  • ఆశ్చర్యంలో నుంచే తత్త్వశాస్త్రం పుడుతుంది - సోక్రటీస్.
  • ఇంటిలో శాంతి నెలకొల్పాలన్నప్పుడు పక్కింటి తలుపులను బాది ప్రయోజనం లేదు.
  • ఇంద్రియాలను తన వశంలో పెట్టుకున్నవాడే వివేకి.
  • ఇచ్చువారికి దేవుడు ఇవ్వకమానడు.
  • ఇచ్చే వస్తువ కంటే కూడా ఆవస్తువును ఇచ్చే విధానమే దాత గుణానికి అద్దం పడుతుంది.
  • ఇతరుల కోసం జీవించబడే జీవితమే సార్ధకమైనది.
  • ఇతరుల తప్పులను ఎత్తిచూపే ముందు మీసొంత తప్పులను గురించి తెలుసుకోండి.
  • ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చేసే పనులు అనర్ధహేతువులు.
  • ఇతరుల పట్ల స్నేహంగా ఉండండి. అప్పుడే స్నేహితులు మీ చుట్టూ చేరుతారు.
  • ఇతరుల సహకారం తీసుకోండి. ఎవరిపై పూర్తిగా ఆధారపడకండి.
  • ఇతరులకు మీరిచ్చే సలహాలను పాటించటమే అతి ఉత్తమంగా, జీవితంలో విజయాన్ని సాధించే ఉత్తమ మార్గం అవుతుంది.
  • ఇతరులకు హాని చేసే ముందే క్రోధం నీకు హాని కలిగిస్తుంది.
  • ఇతరులతో పంచుకున్నప్పుడూ తరగకుండా పెరిగేది ప్రేమ ఒక్కటే - రికార్డా హక్.
  • ఇతరులను అర్థం చేసుకున్న వాడు జ్ఞాని, తనను తాను అర్ధం చేసుకున్న వాడు వివేకి.
  • ఇతరులను చూసి మనం అసూయపడుతున్నామంటే, వారికన్నా మనం తక్కువని మనమే ఒప్పుకొని బాధపడుతున్నామని అర్ధం.
  • ఇతరులను జయించాలనుకోకు. నిన్ను నీవు జయించు. అప్పుడు ప్రపంచం నీచే జయింపబడుతుంది.
  • ఇతరులపై ఆధారపడకుండా మీమీద మీరే ఆధారపడండి.
  • ఇతరులు నడచిన బాటలో నడిచేవడు తనకాలి జాడలను వదలలేడు.
  • ఇతురుల తప్పులను క్షమించడం, మరచిపోవడం అనేవి మంచితనానికి అసలు సిసలైన నిదర్శనాలు.
  • ఇతురుల సంక్షేమంలో ఆనందాన్ని పొందేవాడు మనుషుల చేత ఎన్నుకోబడిన విశిష్ట వ్యక్తి అవుతాడు.
  • ఇనప్పెట్టెలోని డబ్బుకంటే బజారులోని మిత్రుడు చాలా విలువైనవాడు.
  • ఈ పని తర్వాత ఏం చెయ్యాలని ఆలోచించకూడదు. ఆచరిస్తూ ఉంటే ఒకదాని వెంట మరొకటి అవే వస్తూ ఉంటాయి.
  • ఈ ప్రపంచం బాధపడేవారికి దుఃఖదాయకమైతే ఆలోచనాపరులకు సుఖదాయకం అవుతుంది.
  • ఈ రోజు చేయగల పనిని రేపటికి వాయిదా వేయవద్దు.
  • ఈ రోజు దొరికే గుడ్డుకంటే రేపు దొరికే కోడి మంచిది.
  • ఈరోజు నీవు చేస్తున్నదే రేపు నీకు రక్షణను ఇస్తుంది.
  • ఉజ్వల భవిష్యత్తు పై అచంచల విశ్వాసమే ఆస్తికత్వం.
  • ఉత్తమ గ్రంధాల సేకరణే ఒక నిజమైన విశ్వవిద్యాలయం.
  • ఉత్తమ మానవుని యొక్క లక్షణం నీతి గడించి, నియమంగా జీవించటమే .
  • ఉత్తమమైన పుస్తకాలను మొదట చదవండి. లేకపోతే అవి చదివే అవకాశమే దొరక్కపోవచ్చు.
  • ఉత్సాహం క్రియాశీలతలను వెయ్యి రెట్లు పెంచుతుంది.
  • ఉత్సాహం లేనిదే ఏగొప్ప పనిని సాధించలేము.
  • ఉత్సాహశీలికి ఎప్పుడూ విరామం అనేది ఉండదు.
  • ఉదార బుద్దితో చేయబడిన పని ఎప్పటికీ నశించదు.
  • ఉద్రేకాలకు లొంగినవాడు అందరినీ మించిన బానిస.
  • ఉన్నత భావాలు తోడుగా ఉన్నవారికి ఒంటరితనమంటూ లేదు.
  • ఉపదేశం తరువాత మీరు చేసేదే మీ మతం.
  • ఉపదేశం తేలిక. ఆచరణ అతి కష్టం.
  • ఉపదేశం పూర్తి అయిన తరువాత మీ ప్రవర్తనను సూచించేదే మీ మతం.
  • ఉపదేశాలకు మించి ధారాళంగా ఇవ్వబడేది వేరొకటి లేదు.
  • ఊరికే దొరికిన పుస్తకాన్ని సాధారణంగా చదవరు. డబ్బు పెట్టికొంటే తప్పకుండా చదువుతారు - శామ్యూల్ జాన్సన్.
  • ఎంత పంచుకుంటే అంత పొందగలం.
  • ఎక్కడైతే నిస్వార్ధత ఎంత ఎక్కువగా ఉంటుందో అక్కడ విజయం అంత ఎక్కువగా ఉంటుంది.
  • ఎక్కడైనా భయపడే వ్యక్తి ఎక్కడా సురక్షితంగా ఉండలేడు.
  • ఎక్కువగా నమ్మడం వల్ల మోసపోవచ్చు, కానీ నమ్మకమే ఉంచకుండా బతకడం దుర్భరం.
  • ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మంచి పనికి తమ చేతనైనంత సహాయం చేసే వారే గొప్పవారు.
  • ఎదుటి వారిని సంతోషింపజేయడంలోనే సంతోషం ఉంది.
  • ఎదురైన కష్టం ఎంత గొప్పదైతే దాన్ని అధిగమించడం వల్ల వచ్చే ఘనత అంత ఎక్కువ.
  • ఎన్నడూ నిరాశ చెందనివాడే నిజమైన సాహసి.
  • ఎన్ని సంవత్సరాలు జీవించారని కాదు. మీ జీవితానికి ఎంత ప్రాణం పోశారన్నదే ముఖ్యం.
  • ఎప్పుడు చిరునవ్వు నవ్వుతుంటే భగవంతునికి సన్నిహితముగా ఉంటావు.
  • ఎప్పుడూ క్రొత్తనే కోరుకుంటుంది మానవత.
  • ఎప్పుడూ జయమే సాధించే ఎదురులేని అస్త్రం ప్రేమ.
  • ఎప్పుడూ నిజాయితీపై విశ్వాసం ఉన్నవారే అందరిచేత గౌరవింపబడుతారు.
  • ఎప్పుడూ ప్రయత్నించని వ్యక్తి కంటే ప్రయత్నించి విఫలమైన వ్యక్తే మేలు.
  • ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న.
  • ఎప్పుడైనా తనమీద తనకు విశ్వాసం ఉన్నవారు బలవంతులైతే, సందేహాలతో సతమతమయ్యేవారు బలహీనులు.
  • ఎలా చదవాలో తెలియాలే కాని ప్రతి మనిషీ ఒక మహా గ్రంధమే.
  • ఎల్లప్పుడూ వెలుగుని చూడటం నేర్చుకొన్నవారికి అసలు చీకటనేదే కనిపించదు.
  • ఎవరి పని వారుచేసుకోవడం ఉత్తమ ధర్మం.
  • ఎవరిమీదా ఆధారపడకు, నీవు చేసే సత్కర్మలపై ఆధారపడు.
  • ఏ ఆదర్శాలూ లేనివాళ్ళు తెడ్డులేని పడవలాంటి వారు.
  • ఏ గొప్పవ్యక్తి వ్యర్ధంగా జీవించడు. ప్రపంచ చరిత్ర అంతా గొప్ప వ్యక్తుల జీవిత (ఆత్మ) కథలే - థామస్ కార్లెల్.
  • ఏ దేశానికైన ఆ దేశ సంస్కృతి అనేది ఆత్మలాంటిది.
  • ఏ పనిలోనైనా విజయం సాధించాలి అని అనుకుంటే అందుకు పద్దతిగా వ్యవహరించడం చాలా ముఖ్యం.
  • ఏ సగాన్ని నమ్మాలో తెలుసుకోవడమే ప్రతిభ.
  • ఏదైనా ఒక అవకాశం చేజారిపోయినప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా మరొక అవకాశం చేజారిపోకుండ జాగ్రత్తపడాలి.
  • ఏదైనా ఒక పనిని చేసే ముందు దాని పర్యవసానం ఏమిటో ఒక్క క్షణం ఆగి ప్రశ్నించుకొని అప్పుడు ఆ పనిని ప్రారంభించడం అత్యుత్తమం.
  • ఏదో ఒక వ్యక్తిగా ఉండడంలో కాదు. ఇతరులకు సహాయపడే వ్యక్తిగా ఉండడంలోనే గొప్పతనం దాగుంది.
  • ఏమి జరిగినా ఏమి జరగనట్లే ఎప్పుడూ ప్రవర్తించు.
  • ఐకమత్యం లేని బహుసంఖ్యాకులకు వ్యతిరేకంగా అల్పసంఖ్యాకులు కలిసికట్టుగా పనిచేస్తారు కాబట్టే రాజకీయ యంత్రాంగం గెలుస్తుంది.
  • ఒంటరిగా నిలబడిన మనిషే ప్రపంచంలో దృఢమైన వ్యక్తి.
  • ఒక కళాకారుడు ప్రతిచోట జీవిస్తాడు.
  • ఒక కోపిష్టి మనిషి తన నోరు తెరచి, కళ్ళు మూసుకుంటాడు.
  • ఒక మనిషి అంతః సౌందర్యం అతను మంచి ఆలోచనలు కలిగి ఉండటమే.
  • ఒక మనిషి దిగజారినా, అభివృద్ధి చెందినా అది అతని స్వయంకృతమే.
  • ఒక మనిషికి సహనం కనుక ఉంటే అతను ఏమి అనుకున్నా దానిని సాధించుకొంటాడు.
  • ఒక మనిషిలోని ప్రతిభను, ప్రావీణ్యాన్ని ఎవ్వరూ దాచలేరు. అవి ఎప్పటికైనా బయటపడతాయి.
  • ఒక మూర్ఖుడు తన పని మానుకుని ఇతరుల యొక్క (వ్యవహారపు) పని ఒత్తిడిలో ఉంటాడు.
  • ఒక మేలైన మానవుడు తన మాటల్లో నమ్రతగా ఉంటాడు, కానీ తన పనుల్లో అధికంగా ఉంటాడు.
  • ఒక మొక్కను నాటడం సంవత్సరమంతా చేసే ప్రార్థనకు సమానం.
  • ఒక వస్తువు మరో ఉత్పత్తికి ఆలంబం.
  • ఒక వస్తువు వినాశనం మరో ఉత్పత్తికి ఆలంబం.
  • ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించి చూడాలంటే అతనికి అధికారం ఇచ్చి చూస్తే చాలు.
  • ఒక వ్యక్తి యొక్క జయాపజయాలు అతను సమయాన్ని ఎలా ఖర్చు చేస్తాడన్న విషయం పైనే ఆధారపడి ఉంటాయి.
  • ఒక వ్యక్తి యొక్క విలువ అతని మాటలలోని నిలకడను బట్టి తెలుస్తుంది.
  • ఒక శిశు హృదయాన్ని కోల్పోనివాడే గొప్పవాడు.
  • ఒకచోట ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో గడపలేకపోవడం చేతనే అందరూ బాధలకు గురి అవుతున్నారు.
  • ఒకటిగా చేరడం ప్రారంభం, ఒకటిగా ఉండడం ప్రగతి, ఒకటిగా పనిచేయడం విజయం.
  • ఒకరి పొరపాటు ఇంకొకరికి గుణపాఠం.
  • ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు. కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు.
  • ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.
  • ఒక్క సంతోషం వంద విచారాలను తరిమికొడుతుంది.
  • ఒక్క సిరాచుక్క వేల, లక్షల మనుషులను ఆలోచింపజేస్తుంది.
  • ఒప్పుకున్న తప్పు సగం సరిదిద్దబడుతుంది.
  • ఓపిక ఉత్తమోత్తమమైన ఔషధం.
  • ఓపికతో వేచి ఉన్న వారు కూడా భగవంతుడికి సేవ చేయగలరు.
  • ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
  • ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు.
  • ఓర్పుకు మించిన తపస్సు లేదు.
  • కఠినమైన పనులను తేలికగా చేయగల వాడు - విద్యాబోధకుడు.
  • కదలకుండా నిలిచిన వాడే ఎక్కువ అలసిపోతాడు.
  • కర్తవ్యం విస్మరించి, జీవుని బాధించి, దేవుని పూజించిన లాభముండదు.
  • కలల స్ధానంలోకి శోకం, క్షోభ వచ్చేవరకు మనిషి వృద్ధుడు కాడు -జాన్ బారీమోర్.
  • కళ్ళద్దాలు తుడుచుకోవటం మర్చిపోయి, ఈ ప్రపంచం మురికిగా ఉందని ఫిర్యాదు చేయవద్దు.
  • కవి అన్నవాడు ఎప్పుడూ ఆకలితో అలమటించే వాడుగా గాని లేదా భగ్న ప్రేమికుడిగా గాని ఉండాలి.
  • కష్టపడి పనిచేసేవారికి అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి.
  • కష్టాలను జయించడానికి నిస్పృహకంటే చిరునవ్వు చాలా బలవంతమైనది.
  • కష్టాలను తప్పించుకోవడం కాదు, వాటిని అధిగమించడమే నిజంగా గొప్పదనం.
  • కష్టాలు మన జీవితాలను మెరుగుదిద్దేందుకే కాని నాశనం చేయడానికి కాదు.
  • కామంనకు మించిన వ్యాధీ, బ్రాంతికి మించిన శత్రువూ, కోపానికి మించిన అగ్నీ, విద్యకు మించిన ఆనందం వేరొకటి లేదు.
  • కార్యశూరుడి వలె ఆలోచించు, అలోచనాపరుడిగా వ్యవహరించు.
  • కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడపకుండా జీవితాన్ని దాటలేడు.
  • కావలసిన దానికంటే ఎక్కువ వివేకం కలిగి ఉండడం వివేకం అనిపించుకోదు.
  • కావలసిన దానికన్నా ఎక్కువ తీసుకొని దాస్తే మనం దొంగలం.
  • కీర్తి పొందని పుట్టుక నిష్ఫలము.
  • కుంటివాని వద్ద నడక, మూగవాని వద్ద మాటలు నేర్వడం కుదరదు.
  • కుక్కకు ఎముక వేయడం దానం కాదు. కుక్కకున్నంత ఆకలి నీకున్నప్పుడు ఆ కుక్కతో ఎముకను పంచుకోవడం నిజమైన దానం.
  • కృతజ్ఞత అనేది ఒకరిపట్ల చూపవలసిందే కాని ఒకరి నుండి ఆశించవలసింది కాదు.
  • కొద్ది కోరికలతో, చిన్న విషయాలతో తృప్తి పడటమే ఉత్తముని లక్షణం.
  • కొన్ని పట్టులాంటి ముఖాల వెనుక ముతక గుడ్డ ఉంటుంది.
  • కోపం పాపానికి ధూపం. రోషం దోషానికి మూలం.
  • కోపం యమధర్మరాజు లాంటిది.తృష్ణ వైతరణిలాంటిది. విద్య కామధేనువులాంటిది. ఇక సంతృప్తి దేవరాజైన ఇంద్రుడి నందనవనం లాంటిది.
  • కోపానికి కారణమైన గాయంకంటే అణచుకోని కోపం ఎక్కువ హాని కలిగిస్తుంది.
  • కోరిక ముగించిన చోట శాంతి ప్రారంభిస్తుంది.
  • కోరికల యొక్క యదార్థ స్వరూపం దుఃఖం.
  • క్రమబద్దతను పాటించకుండా సంపద, పరాక్రమం లేకుండా విజయం, ఉపకార గుణం లేకుండా పేరు, ఆధ్యాత్మిక ఙ్ఞానం లేకుండా ముక్తి లభించవు.
  • క్రోధాన్ని జయించిన వ్యక్తి అందరినీ జయిస్తాడు.
  • క్షణిక కోపాన్ని అణుచుకోగల వ్యక్తి ఒక రోజు దు:ఖాన్ని దూరం చేసుకోగలడు.
  • గంపెడు చదువుకంటే పిడికెడు లోకజ్ఞానం విలువైనది.
  • గతం త్రవ్వకండి. వర్తమానంలో పనిచేస్తూ భవిష్యత్తు నిర్మించండి.
  • గతం నుండి నేర్చుకోండి, కాని దాని కారణంగా దిగులుపడకండి.
  • గతమే వర్తమానానికి మార్గం.
  • గమ్యం చేరుకోవటం కంటే, నమ్మకంతో ప్రయాణం చేయటమే మేలైనది.
  • గర్వం వినాశనానికి ముందు పోతుంది. అహంకారం పతనానికి ముందు పోతుంది.
  • గుండెలోని భావాలను చెప్పని మాట వట్టి కళేబరం.
  • గుడ్డివాడికి మరో గుడ్డివాడు దారి చూపితే ఇద్దరూ గోతిలో పడతారు.
  • గురి వల్ల గొప్ప విలుకాడు అవుతాడే కాని పొదలో ఉన్న బాణాల వల్ల కాదు - ధామస్ ఫుల్లర్
  • గెలుపు అందవిహీనతను మరుగుపరిచే అరుదైన రంగు.
  • గొప్ప అంశాలు రూపొందేదే కర్మాగారం.
  • గొప్ప అణుకువ గల వ్యక్తి గొప్పకు చేరువవుతాడు.
  • గొప్ప ఆలోచనలను కలిగి ఉన్నవారు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు.
  • గొప్ప గొప్ప కార్యాలను సాధించటానికి ఉత్సాహమే ప్రధాన కారణం.
  • గొప్ప పనుల సుగంధమే పేరు ప్రతిష్టలు.
  • గొప్పపనలు చేయడానికి కావలసింది ముఖ్యంగా శక్తికాదు - ఓపిక.
  • గొప్పవారి యొక్క గొప్పతనం, వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది.
  • గొప్పవారిలోని గొప్పగుణాలు గుర్తించండి. వాటి గురించి రోజూ కాసేపు మననం చేసుకోండి.
  • గౌరవాలు పొందడం కాదు గొప్ప - వాటికి తగిన అర్హత సాధించడం గొప్ప.
  • ఙ్ఞాన, తప, యోగ మార్గాలకన్న సేవామార్గం మిన్న.
  • ఙ్ఞానం అనేది మనం సంపాదిస్తే వచ్చేది కాదు. మనలోని అఙ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది.
  • ఙ్ఞానం అమాంతంగా పొంగి పొర్లిపోదు, అది అంచెలంచెలుగ అభివృద్ధి చెందుతుంది.
  • ఙ్ఞానాన్ని మించిన శక్తి ప్రపంచంలో మరేదీ లేనే లేదు

No comments:

Post a Comment