- మంచి అలవాట్ల తరువాత మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగినది మంచి జ్ఞాపకాలే - సిడ్నీ హరిస్.
- మంచి ఆరోగ్యం, మంచి తెలివి అన్నవి జీవితపు అతి గొప్ప వరాలు.
- మంచి ఆలోచన, మంచి ఆరోగ్యం, అవగాహన అన్నవి గొప్ప వరాలు.
- మంచి ఉదాహరణే మనం ఇతరులకు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి.
- మంచి గుణానికి మించిన సంపద, ధర్మానికి మించిన తపస్సు లేదు.
- మంచి చెడులను ఎంచగలిగే వివేకమే మానవాళి మనుగడుకు రక్ష.
- మంచి జ్ఞాపకశక్తి మంచిదే, కాని ఇతరులు మీకు కలిగించిన హానిని మరచిపోయే సామర్ధ్యం అన్నదే గొప్పతనపు పరీక్ష అవుతుంది.
- మంచి దస్తూరి అలవాటు చేసుకోవటం విద్యాభ్యాసంలో ఒక భాగం.
- మంచి పనులు ఆలస్యాన్ని సహించవు.
- మంచి పనులు ఎప్పుడూ శూన్యం నుంచి పుట్టుకురావు. నిరంతర ఆలోచనల ఫలితంగానే అవి ఊపిరి పోసుకుంటాయి.
- మంచి పనే మంచి ప్రార్ధన.
- మంచి పుస్తకంలా మంచివాడి స్నేహం కలకాలం తాజాగా ఉంటూ రోజూ ఆనందాన్ని ఇస్తుంది.
- మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు.
- మంచి మిత్రుడు రెండు శరీరాలలో నివశించే ఒక ఆత్మ.
- మంచి విషయాలను పొందేందుకు ఉపయోగపడే పనిముట్లుగా దేవుడు మనకు కష్టాల్ని ఇస్తాడు.
- మంచి శ్రోతలే మంచి వక్తలు. వినడం నేర్చుకోండి.
- మంచి సంకల్పాలు మంచి ప్రవర్తనకు బీజాలు.
- మంచి సభ్యత అన్నది చిన్న త్యాగాల ఫలితమే.
- మంచికి ఉన్న స్వేచ్చ చెడుకు లేదు. చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి లేదు.
- మంచితనానికి మించిన మతమే లేదు.
- మంచితనాన్ని మించిన గుణం లేదు. మంచితనంలోనే మర్యాద, మమత.
- మంచిమనుషుల మనసులు వెన్నలా ఉంటాయి - తులసీదాసు.
- మంచివారు కలుగజేసుకోకపోతే చెడు పెరుగుతుంది.
- మంచీ, చెడూ అనేదేదీ లేదు, కానీ ఆలోచన అలా తయారు చేస్తుంది.
- మందగించక ముందు అడుగెయ్ వెనుకబడితే వెనకేనోయ్ - గురజాడ.
- మతం భయాన్ని జయిస్తుంది. అది అపజయానికీ, మరణానికీ కూడా విఱుగుడు మందు.
- మన అవసరాలు ఎంత తగ్గితే దేవుడికి మనం అంత చేరువ అవుతాము.
- మన కర్తవ్యాన్ని ఉపేక్షిస్తే, మనమే స్వయంగా నష్టపోతాము.
- మన దురదృష్టాలకు మూలకారణం ఇతరులలో తప్పులు వెదకడం మనలోని తప్పులను తెలుసుకోగలిగితే అనేక సుగుణాల ద్వారాలు తెరుచుకుంటాయి.
- మన మాటలు చెప్పేదానికన్న మన జీవితం చెప్పేది ఉత్తమమైనది.
- మనం అభ్యుదయాన్ని పొందాలంటే చరిత్ర తిరిగి రానివ్వకుండా కొత్త చరిత్రను సృష్టించాలి.
- మనం ఇతరులలో లోపాన్ని ఎత్తి చూపే ముందు మనలో ఆ లోపం ఉండకుండా చూసుకోవాలి.
- మనం ఎంత ఎక్కువ కృషి చేస్తే, అంత ఎక్కువగా అదృష్టం మనల్ని వరిస్తుంది.
- మనం ఎంత చదివితే మన అజ్ఞానం అంత బయటపడుతుంది.
- మనం ఏ పని చేసినా సర్వశక్తులను, మనస్సును దానిపై స్థిరంగా కేంద్రీకరించినప్పుడే ఆ పనిని సక్రమంగా చేయగలుగుతాము.
- మనం చదివినదంతా మరచిపోయినప్పుడు చదువే వెనుక నుండి మనల్ని బలపరిచేందుకు మిగులుతుంది.
- మనం చేసే పనిని ఎవ్వరూ విమర్శించకుండా ఉండేలా చేయాలంటే ఆ పనిని ఎన్నటికీ చేయలేం.
- మనం చేసే పనిని పదిమందీ పంచుకుంటే, చేసే పని ఎంతో తేలికైపోతుంది.
- మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చుకాని, ఏ పనీ చెయ్యకుండా మాత్రం మనం ఆనందం పొందలేం.
- మనం చేసేవి చిన్న ప్రయత్నాలైనా వ్యర్ధం కావు.
- మనం ప్రేమించలేని వ్యక్తులను ప్రేమించడమే జీవితపు నిజమైన కష్టం అవుతుంది.
- మనం ప్రేమించే దాన్నిబట్టి మనం తీర్చిదిద్దబడతాము, రూపు దిద్దుకుంటాము.
- మనం సమాధానంలో భాగం కావాలి కాని, సమస్యలో భాగం కాకూడదు.
- మనకు ఉన్నదాన్నే ఉత్తమంగా రూపొందించుకుంటామని తీర్మానించుకుందాము.
- మనకు ఎదురయ్యే అపజయాలన్నింటికీ ప్రధాన కారణం మనలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే.
- మనకు ఎదురయ్యే అవరోధాల వెనుక అనంతమైన విజయాలు దాగి ఉంటాయి.
- మనకు జరిగేది కాదు మనలో జరిగే మార్పు గొప్పది.
- మనకు తక్కువ జ్ఞానం ఉన్నప్పుడే విషయాలు బాగా అర్థం అవుతాయి. అధికజ్ఞానంతో పాటు సందేహం కూడా పెరుగుతుంది.
- మనలను మనం జయించగలగడం మాత్రమే చిరకాలం నిలుస్తుంది. ఈ విజయం ఎలాంటి విచారాన్ని కలిగించదు.
- మనలో ఉండే ఆనందాన్ని గ్రహించక బయట ప్రపంచంలో ఉందని భ్రమించడం అజ్ఞానం.
- మనలో తప్పులు లేకపోతే ఇతరుల తప్పులను ఎత్తిచూపడానికి అంత ఉత్సాహపడము
- మనలో లోపాలే లేవనుకోవడానికి మించిన తప్పిదం లేదు.
- మనల్ని మనం మన శత్రువుకంటే ఎక్కువ నిశితంగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనలో మనకు కనిపించే మిత్రుడి కంటే గొప్ప మిత్రుడు ఇంకెక్కడా లేడు.
- మనసు భగవంతుడికి అప్పగించి హస్తాలను పనికి అప్పగించెయ్ - స్వామి ఓంకార్.
- మనసునిండా నిజాయతీ పెల్లుబకాలే కాని, అటువంటి మనిషి తక్కిన ఎంతోమందికన్నా మిన్నగా దేశానికి సేవలు అందించగలుగుతాడు - పండిట్ మోతీలాల్ నెహ్రూ.
- మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో మనిషి అంత గొప్ప వాడవుతాడు.
- మనస్సు గాలిగొడుగు లాంటిది. తెరచినప్పుడే అది పనిచేస్తుంది.
- మనస్సును చెదిరించడం బలహీనత, మనసు లగ్నం చేయడమే శక్తి.
- మనస్సులో అలజడి ఉన్నప్పుడు ముఖంలో ప్రశాంతత కనిపించదు.
- మనిషి అనామకునిగా మారటానికి అహంకారం అనేది ప్రధాన కారణమవుతుంది.
- మనిషి ఎప్పుడైతే అధికంగా వినడం నేర్చుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు.
- మనిషి చేసే అనేక తప్పులకు కారణం అతనిలోని అహంకారమే.
- మనిషి నుండి ఎన్నటికీ వేరు చేయలేని ఒకే ఒక్క సంపద విద్య.
- మనిషి ముసలివాడై చావుకు సిద్దమై ఉన్నా అతని ఆశ మాత్రం అణగదు.
- మనిషి యొక్క అతి విలువైన సంపదే కాలం.
- మనిషి శరీరం కంటే ముందుగా ఆత్మని శుద్ది చేయడం ఎంతైనా అవసరం. ఎందుకంటే వ్యర్ధమైన జీవితం కంటే మృత్యువు శ్రేయస్కరం.
- మనిషికి నాలుక ఒకటే చెవులు మాత్రం రెండు. దీనర్ధం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. అని - అబ్రహన్ హస్ దాయ్.
- మనిషికి విజ్ఞానం కన్నా మంచిమిత్రుడు లేడు, అఙ్ఞానం కన్నా పరమశత్రువు లేడు.
- మనిషికి సాధించగలనన్న ఆత్మవిశ్వామే అన్ని విషయాలకు మూలం.
- మనిషిపట్ల మనిషికున్న అమానుషత్వం లెక్కలేనంత వేల మందిని విచారపడేలా చేస్తుంది.
- మనిషిలో ఉన్న పరిపక్వతకు బాహ్యరూపమే చదువు.
- మనిషిలో జ్ఞానం అనేది పెరిగేకొద్ది తనలోని అజ్ఞానం తెలిసివస్తుంది.
- మనుషుల వద్ద లేనిది ఆత్మబలమే కాని శరీర బలం మాత్రం కాదు.
- మనోబలం లేకుండా గణనీయమైనదేదీ మనం సాధించలేము.
- మనోవికారాలకు గురి అయిన జీవితం ఆత్మవినాశనంతో ముగుస్తుంది.
- మన్నించడం మంచిది, మర్చిపోవడం ఇంకా మంచిది - బ్రౌనింగ్.
- మహనీయులకు ఆనందం ఇచ్చేది విజయం కాదు పోరాటం.
- మహాపురుషుల జీవితాలే మానవాళికి ఉత్తమ ఉపాధ్యాలు
- మాట ఇవ్వటానికి తొందరపడకు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తొందరపడు.
- మాటల కంటే చేతలు బిగ్గరగా మాట్లడతాయి.
- మాటలు కాదు మనసు ముఖ్యం.
- మానవుని ప్రయత్నం దైవ విశ్వాసం కార్యసాధనకు మార్గం.
- మానసిక శక్తి క్షీణిస్తే మనిషి యొక్క పవిత్రత క్షీణిస్తుంది.
- మారణాయుధాలు మనల్ని నాశనం చేయకముందే మనం వాటిని నాశనం చేయటం అవసరం.
- మార్పు అన్నది జీవితానికి రుచినిచ్చే మసాలా లాంటిది.
- మార్పు తప్ప ఈ ప్రపంచంలో శాశ్వతమైనది మరేదీ లేదు.
- మితము తప్పితే అమృతమైనా విషమే.
- మితిమీరిన అభిలాష కలిగిన వాడే దరిద్రుడు.
- మిత్రుడిని ఎన్నుకున్నట్లే రచయితను కూడా ఎన్నుకోండి.
- మిత్రులకు పరస్పర విశ్వాసం ఉంటే చావు బ్రతుకులు ఆలోచించరు. మిక్కిలి ఒంటరిగా నిలబడే వాడే మిక్కిలి బలశాలి - ఇబ్బెన్.
- మిమ్మల్ని మీరు నిందించికోవడం మహాపాపం.
- మీ ఆలోచనా సరళి మార్చుకుంటే ఆ మీ జీవన సరళి తానుగా మారుతుంది - డా. నార్మన్ విన్సెంట్ పీలే.
- మీ కళ్ళద్దాలు సరిగ్గా తుడుచుకోక ఈ ప్రపంచం మురికిగా ఉందని అనకండి.
- మీ కష్టాలను కాదు మీ దీవెనలను లెక్కపెట్టుకోండి.
- మీ కొడుకుకు మీరు ఇవ్వగలిగిన ఒకే ఒక కానుక ఉత్సాహం.
- మీ కోరికలు అంతులేనివైతే, మీ చింతలూ, భయాలూ కూడా అంతులేనివే - థామస్ పుల్లర్.
- మీ తప్పులను ఇతరులు అతిశయోక్తిగా చెప్పేముందే మీరు ఒప్పుకోండి.
- మీ తప్పులు మీ విజయానికి కావల్సిన కొత్త పాఠాలు.
- మీ పట్ల మీ అభిప్రాయం గొప్పదై వుండాలి. ఈ ప్రపంచంలో మీ గురించి ఆలోచించే మొదటి వ్యక్తి మీరే.
- మీ పెదవుల ద్వారా కంటే మీ జీవితం ద్వారానే మీరు ఒక మేలైన నీతివాక్యాన్ని బోధించవచ్చు.
- మీతోటి వారి కష్టాలను గట్టెక్కించండి. మీ కష్టాలు తాముగా గట్టెక్కుతాయి.
- మీరు ఆపలేని పనిని ప్రారంభించకండి.
- మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థిలో ఉన్నప్పుడు మౌనం అన్నది అతి సురక్షమైన నీతి.
- మీరు మంచి వారు మాత్రమే కాదు మంచికి కూడా కారకులు.
- మీరు మీరుగా ఉండండి. పక్షపాత రహితంగా సీదాసాదాగానూ, నిజాయితీతోనూ ఉండండి.
- మీలోని మంచితనం మరింత మంచితనంగా, మరింత మంచితనం అతి మంచితనంగా మారనంత వరకు విశ్రమించండి.
- మూగవాడు మాట్లాడగల భాష చెవిటివాడు వినగల భాషే దయ.
- మూర్ఖుడితో స్నేహం కన్నా బుద్దిమంతుడితో విరోధం మంచిది.
- మూర్ఖుడు కూడా శాంతంగా ఉంటే వివేకి క్రిందే లెక్క - ఓల్డ్ టెస్ట్ మెంట్.
- మూర్ఖుడు చివర చేసేదాన్ని వివేక వంతుడు వెంటనే చేస్తాడు.
- మూర్ఖుల వల్ల వివేకులకు లాభమే మూర్ఖులు చేసే తప్పులు తాము చేయకుండా వారు జాగ్రత్తపడతారు.
- మూర్ఖులు విజయాన్ని, యోగ్యులు కీర్తిని పొందుతారు.
- మృదువైన సమాధానం ఆగ్రహాన్ని పోగొడుతుంది.
- మేథశక్తిని చూపగానే సరికాదు. హృదయ వైశాల్యం కూడా కనబరచాలి.
- మౌనం మనిషికి ఉత్తమోత్తమ ఆభరణం.
- యదార్థవాది లోకవిరోధి.
- యధార్థం తెలియని వారితో వాదించి ప్రయోజనం లేదు.
- యుద్ధ భూమిలో విజయాన్ని సాధించిన వారికి మాత్రమే కాకుండా ప్రశాంతతను శాంతిని కాపాడిన వారికి కుడా కీర్తి దక్కుతుంది.
- యుద్ధానికి ఏమాత్రం తీసిపోని గొప్ప జయాలను శాంతి కూడా సాధించింది - జాన్ మిల్డన్.
- యౌవనంలో కూడబెట్టు వార్ధక్యంలో వాడుకో.
- రహస్యంగా ద్వేషించటం కంటే బహిరంగముగా చివాట్లు పెట్టటం ఉత్తమం.
- రాజకీయాల్లో మతం ఉండదు - లెబనీస్.
- రుజువులతో నిమిత్తం లేకుండా ఒక విషయాన్ని సత్యంగా భావించడం నమ్మకం.
- రూపొందిచబడిన మనిషి దేవుడు అయితే చిక్కుకున్న దేవుడు మనిషి అవుతాడు.
- రెండు దుఃఖముల మధ్య విరామమే సుఖం.
- రేపన్నది సోమరులు ఎక్కువగా పని చేయవలసిన రోజు.
- రోజుకు 5 ముఖ్యమైన పనులు నిర్ణయించుకొని వాటిని పూర్తి చేసేందుకు పట్టుదల వహించండి.
- రోజూ తాను చేస్తున్న పనితో సంతృప్తి పొందినవాడే గొప్ప ధనవంతుడు.
- లక్ష్యం పెద్దదైతే త్యాగమూ పెద్దదే కావాలి.
- లెండి! మేల్కొండి! గమ్యాన్ని చేరుకునే వరకూ విశ్రమించకండి! - స్వామి వివేకానంద.
- లోకమనే ఉద్యానవనంలో పూచిన పువ్వులు పిల్లలు.
- లోకానికి అవసరమైనవి చేతలే కాని, మాటలు కావు.
- లోభికి నాలుగు దిక్కులా నష్టం.
- వంతెనలను కాకుండా గోడలను కట్టుకునేందువల్ల ఒంటరితనానికి ప్రజలు లోనవుతున్నారు.
- వంద ఉదార భావాల కన్న ఒక్క అందమైన పని మిన్న - జేమ్స్ రసెల్ లోవెల్.
- వయసు మళ్ళిన వారివి వెనుకటి కాలపు గాధలు, వయసులో ఉన్న వారివి ముందున్న స్వప్నాలు.
- వయసు వివేకం ఈ రెండూ కలిసి సంచరించవు.
- వయసులో రోజులు పొట్టి, ఏళ్ళు పొడవు, పెద్దయ్యాక ఏళ్ళు పొట్టి, రోజులు పొడవు.
- వయస్సులో నేర్చుకున్నది రాతి మీద చెక్కిన చెక్కడంతో సమానం.
- వస్తువ విలువ అవసరాన్ని బట్టితెలుస్తుంది.
- వస్తువుకాదు వస్తువు పరమైన ఆలోచనే దాన్నిమంచిగానూ లేదా చెడ్డగానూ మారుస్తుంది.
- వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్దకం మెదడును నిస్తేజం చేస్తుంది.
- వాడి అయిన ముళ్ళే తరచుగా నాజూకైన గులాబీని ఇస్తాయి.
- వాత్సల్యం బుద్దిని మందగిస్తుంది.
- వాయిదా వేయడం అన్నది కాలాన్ని హరించే దొంగ.
- వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయండి.
- వికారమైన మనస్సు కంటే వికారమైన ముఖమే మంచిది.
- విచక్షణ రాహిత్యం మానసిక అంధత్వం.
- విజయం అన్నది ఒక మనోభావన, అది మీ మనోబలంతో ప్రారంభమవుతుంది.
- విజయం గురించే ఎక్కువగా ఆలోచించండి.
- విజయాల నుండి వినయాన్ని, పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకొన్నవాడే గొప్పవాడు.
- విజేత ఎన్నడూ విడిచిపెట్టడు, విడిచి పెట్టేవాడు ఎన్నడూ జయించడు.
- విత్తొకటి నాటిన మొక్కొకటి రాదు.
- విద్య ఇచ్చిన తేజస్సు అందరినీ ఆకర్షిస్తుంది.
- విద్య ఐశ్వర్యంలో ఆభరణము వంటిది; దారిద్ర్యంలో ఆశ్రయం వంటిది.
- విద్య యొక్క అర్ధం, పరమార్ధం రెండూ వ్యక్తిని ఉత్తమమైన వానిగా రూపొందింపచేయడమే.
- విద్య యొక్క నిజమైన పరమార్ధం ఉత్తమ వ్యక్తిని రూపొందింప చేయడమే.
- విద్య లేని వారికి కీర్తి లేదు.
- విద్య సౌభాగ్యానికి ఒక ఆభరణం మరుయు ప్రతి కూలతలో ఒక అభయస్ధానం.
- విద్యను ఆర్జించడం కంటే కూడా అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడం చాలా కష్టం
- విద్యను పొందడం సులభమే కాని వివేకం పొందడం కష్టతరమైన కార్యం.
- విద్యాధికుడై, తన పాండిత్యాన్ని ఉపయోగించుకోని మనిషి - పుస్తకాల బరువు మోసే మృగం.
- విధేయత మాత్రమే ఆజ్ఞాపించే హక్కు ఇస్తుంది.
- వినయం గొప్పతనాన్ని ప్రకటిస్తుంది.
- వినయం నీవు ధరించే విలువైన వజ్రం.
- వినయం ప్రతిష్ఠకు సులభ మార్గం.
- విమర్శలను చూసి భయపడకూడదు. గాలిపటం ఎప్పుడూ ఎదురు గాలిలోనే పైకి లేస్తుంది.
- విరగడం కంటే వంగడం మంచిది.
- వివేకవంతులతో సాహచర్యం నిన్నుకూడా వివేకవంతుణ్ణి చేస్తుంది - మినాండర్.
- వివేకవంతులైన వారెప్పుడూ గతంలో కాకుండా వర్తమానంలో జీవిస్తారు.
- వివేకానికి మొదటి అడుగు ఏది అసత్యమో తెలుసుకోవడమే.
- వివేకాన్ని పాటించే చోట శాంతి పుష్కలంగా లభిస్తుంది.
- విశ్వాసం పరమ బంధువు.
- విశ్వాసం వ్యక్తిత్వాన్ని వైభవోజ్వలం చేస్తుంది.
- విశ్వాసం, అఖండ విశ్వాసం, మనమీద మనకే విశ్వాసం, దేవుడి మీద కూడా అంతే విశ్వాసం. ఇవే గొప్పతనంలోని రహస్యాలు.
- విషయం సమగ్రంగా తెల్సుకోకుండానే తృణీకరించకండి. నిర్ణయించకండి.
- విస్తరించడం జీవితం అవుతుంది, ముడుచుకుని పోవడం మరణం అవుతుంది.
- వెంట వచ్చేది సంసారం కాదు, సంస్కారం.
- వెయ్యి మంది మిత్రులున్న వ్యక్తి ఒక్కరిని కూడా వదులుకోలేడు. ఒకే ఒక శత్రువున్న వ్యక్తి అతన్ని ప్రతిచోట కలుస్తాడు.
- వెలుతురు వైపు చూడడం నేర్చుకో. ఇక నీకు నీలినీడలు కనిపించవు.
- వేగంగా వాగ్ధానం చేసేవారు నిదానంగా నెరవేరుస్తారు.
- వేదన అనేది రానున్న కష్టానికి చెల్లించే ముడుపు.
- వేదనలకు కుంగిపోక చేతినిండా పని కల్పించుకుంటే ఆనందసుమం దానంతటదే వికసిస్తుంది.
- వ్యక్తి శీలం నిర్ణయించేది అతని నడవడిక గానీ, వేషంకాదు.
- శక్తి అన్నిటిని జయిస్తుంది. కానీ ఆవిజయాలు కొద్దికాలం మాత్రమే ఉంటాయి.
- శతృత్వం అన్నది మూర్ఖుల వృత్తి.
- శాంతంగా ఉండండి. అప్పుడు ప్రతివారిని అదుపు చేయగల్గుతారు.
- శాంతి కొరవడినప్పుడు సమాజంలో ప్రగతి ఉండదు.
- శాంతిని ఎవ్వరూ దానం చేయరు, ఎవరికి వారు సాధించుకోవాలి.
- శారీరక రోగాల కంటే మానసిక రుగ్మతలు ఎక్కువ హానిని కలిగిస్తాయి.
- శోకస్య కారణం మోహం మీలో దుర్గణాలన్నీ మోహాలే. వాటి ఫలితం ధుఃఖం. వాటిని వదిలించుకోండి.
- శ్రద్ధగా వినడం అలవాటు చేసుకో. బాగా మాట్లాడలేనివారి నుండి కూడా మీరు లాభం పొందుతారు.
- శ్రమ శరీరాన్ని బలపరచినట్లే కష్టాలు మనస్సును బలపరుస్తాయి.
- శ్రమకు ఫలితంగా పొందే గొప్ప పారితోషికం మనిషిలో వచ్చే మార్పే కాని అతనికి వచ్చే ప్రతిఫలం కాదు.
- శ్రమవల్ల లభించేది గొప్ప బహుమానం కానే కాదు. శ్రమవల్ల వచ్చే మార్పే గొప్ప బహుమానం.
- శ్రమించు, అన్వేషించు, గ్రహించు కానీ, లోబడకు.
- సంకల్పబలం ఉన్న హృదయానికి సంభవం కానిదంటూ ఏదీ ఉండదు.
- సంఘటనలు కావు కాని వాటి వెనుకనున్న కారణాలు ఆసక్తికరంగా ఉంటాయి.
- సంతృప్తి పేదవానికి సంపద ఇస్తుంది. అసంతృప్తి ధనవంతుణ్ణి పేదవానిగా చేస్తుంది.
- సంతృప్తి శత్రువులు దాడిచేసి వశపరచుకోలేని కోటలాంటిది. మీలో ఈ సంతృప్తిని బలపరుచుకోండి.
- సంతోషం అన్నది మీరు పొందే వస్తువుపై కాకుండా మీరు ఇచ్చే వస్తువుపై ఆధారపడి ఉంటుంది.
- సంతోషం మనిషి తీరు అవుతుందేకాని మనిషి దగ్గరున్న వస్తువు ఏమాత్రం కాదు
- సంతోషం మిత్రుల సంఖ్యలో కాదు వారి యోగ్యతలో మరియు ఎన్నికల్లో ఉంది
- సంపద ఉప్పు నీటి లాంటిది ఎంత తాగితే అంత దప్పిక పెరుగుతుంది.
- సజీవమైన నమ్మకం లేనిదే ఈ ప్రపంచంలో మనం ఏమి సాధించలేము.
- సజ్జనులతో మైత్రి చిరకాలం నిలిచి ఉంటుంది.
- సత్యం అంతా శాశ్వతమైనది. సత్యం ఎవరిసొత్తూ కాదు. ఏ జాతికి, ఏ వ్యక్తికి సత్యంపై ప్రత్యేక హక్కు లేదు.
- సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, క్షమ - ఈ ఆరే ఆప్తులైన బంధువులు.
- సత్యదేవతకు మనం చూపగల భక్తి, ఆ వెలుగులో నడవగలగడమే.
- సత్యమే జయిస్తుంది కానీ అసత్యం కాదు.
- సత్యమే సర్వరక్ష దానికి మించిన రక్ష వేరొకటి లేదు.
- సత్యానికి దూరంగా ఉండడం అంటే శాంతి నుండి దూరంగా ఉండడం.
- సత్యాన్ని గూర్చిన సిద్దాంతాలు మారిన అసలు సత్యం ఎప్పటికీ మారదు.
- సత్యాన్ని మించిన ధర్మం లేదు, పరోపకారాన్ని మించిన దైవప్రార్థన లేదు.
- సమదృష్టి గల మనస్సు అన్ని దు:ఖాలకు ఉత్తమ ఔషధము.
- సమదృష్టి గల మనస్సు అన్ని దుఃఖాలకు ఉత్తమ ఔషధము.
- సమన్వయం నుండి నిజమైన ఆనందం పుట్టుకొస్తుంది.
- సమయాన్ని వ్యర్థం చేయడం చాలా సర్వసాధారణమైన నేరం.
- సమాజం నేరాన్ని తయారుచేస్తుంది, దాన్ని నేరస్తుడు చేస్తాడు.
- సరి క్రొత్త అవకాశానికి కాలంతో నిమిత్తం ఉండదు.
- సరిగా ఉండటం కంటే విమర్శించటం అతి తేలిక.
- సరివారితో స్నేహం చేసి, తక్కువ వారిపై కరుణ చూపి, అధికులతో ఆనందించి, చెడ్డవారికి దూరంగా ఉండాలి.
- సరైనదేదో తెలుసుకుని దాన్ని చేయకపోవడం అన్నది పిరికితనం అవుతుంది.
- సర్వేజనా సుఖినో భవంతు అని ప్రార్ధించండి, మనకు ఏది మంచిదో భగవంతుడికి బాగా తెలుసు.
- సహజత, సరళత జీవితాన్ని తియ్యగా చేస్తాయి.
- సహనం అందరికి అవసరం. మొదట మనకు అవసరం.
- సహనం ప్రతిభకు అవసరమైన ముడి పదార్ధం.
- సహించగలిగిన వ్యక్తే సంపదలను పొందగలడు.
- సాధించిన విజయం కంటే అభిలాష ఎంతో గొప్పది.
- సాహసించని వాడు గెలుపును సాధించలేడు.
- సిద్దమైన వ్యక్తి సగం యుద్దం జయించినట్లే.
- సుఖదుఃఖాల బంగారు ఇనుప తీగలు మన జీవితంలో విడదీయలేనంతగా కలిసిపోయి ఉన్నాయి.
- సుగుణమే నిజమైన గొప్పదనం.
- సులభంగా నేర్చుకున్న పాఠాలు సులభంగా మరచిపోబడతాయి.
- సూర్య కిరణాల లాగా మంచి నడవడిక కాంతిని నలుమూలలా ప్రసరింపజేస్తుంది.
- సూర్యకాంతి వైపు మీ ముఖాన్ని పెట్టుకోండి, నీడలు మీ వెనుక ప్రక్కపడతాయి.
- సూర్యుడి వైపు ముఖం చేయండి. అప్పుడు చెడు మీకు కనిపించదు.
- సోమరి తనం మూర్ఖుల సెలవు రోజు.
- సోమరితనం, దుబారాగుణం, చెడు ప్రవర్తనలే మనుషుల అనేక దురదృష్టాలకు కారణాలు.
- స్ధిరమైన మీ న్యాయబుద్ది మీ ప్రతి వ్యవహారంపై తన చెరగని ముద్రను వేస్తుంది
- స్నేహాన్ని క్రమం తప్పకుండా నిరంతరంగా మరమ్మత్తు చేస్తూ ఉండాలి.
- స్వతంత్రంగా ఆలోచించడాన్నీ, స్వతంత్రంగా బ్రతకడాన్ని నేర్పేదే విద్య.
- స్వర్గం - నరకం రెండూ మనలోనే ఉన్నాయి.
- స్వార్ధం చిట్టచివర్లో ఉన్నప్పుడే సేవ ఉత్తమంగా ఉంటుంది.
తెలుగు సూక్తులు - మంచి మాటలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment