- కష్టాల నుండి గట్టెక్కే ఉత్తమ మార్గం కష్టాలను భరించడమే.
- క్రమశిక్షణ అన్నది ఆపద అనే పాఠశాలలో నేర్చుకోబడుతంది.
- క్రమబద్దతను పాటించకుండా సంపద, పరాక్రమం లేకుండా విజయం, ఉపకార గుణం లేకుండా పేరు, ఆధ్యాత్మిక ఙ్ఞానం లేకుండా ముక్తి లభించవు.
- కృతజ్ఞత అనేది ఒకరిపట్ల చూపవలసిందే కాని ఒకరి నుండి ఆశించవలసింది కాదు.
- గొప్పవాటినీ,చిన్నవాటిని- ఇలా రెండింటిని ప్రేమించేవాడే ఉత్తమమైన ప్రార్ధన చేసేవాడు.
- పక్షపాత భావన అజ్ఞానపు శిశువు.
- ప్రతికారం ద్వారా పగ నిర్మూలనం కాదు -రాజాజీ.
- ప్రేమింపబడడం కంటే కూడా నమ్మకస్తుడిగా ఉండడం అన్నదే ప్రశంసనీయం.
- పుస్తకం విలువను ధర కాదు దాని ఉపయోగం నిర్ణయిస్తుంది.
- పూజ, ఉపవాసాలు ఆత్మబలాన్ని పెంచే ఆధ్యాత్మిక వ్యాయామాలు.
- మదలింపు తరువాత ప్రోత్సహించడమన్నది వాన తరువాత వచ్చే ఎండలాంటిది.
- మన అవసరాలు ఎంత తగ్గితే దేవుడికి మనం అంత చేరువ అవుతాము.
- మంచి సంకల్పాలు మంచి ప్రవర్తనకు బీజాలు.
- మరొకరి జీవితంలో సంభవిస్తున్నంత వరకు ప్రతి ఒక్కటి తమాషాగానే ఉంటుంది.
- మీ మనసుకు శిక్షణనిచ్చి అభివృద్ధి పరచడం అన్నది మీ కర్తవ్యం.
- దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు.
- ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న.
- ఏమాత్రం ఉత్పత్తి చేయకుండా ఆరగించే జీవి మనిషి మాత్రం.
- జీవిత పరిజ్ఞానంలేని గ్రంధాలు నిష్ప్రయోజనాలు.
- రహస్యాన్ని కాపాడడం, తగిలిన గాయాన్ని మరచిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవదం- ఈ మూడూ చాలా కష్టతరమైన పనులు.
- విద్యను ఆర్జించడం కంటే కూడా అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడం చాలా కష్టం
- మనం సమాధానంలో భాగం కావాలి కాని, సమస్యలో భాగం కాకూడదు.
- గతం నుండి నేర్చుకోండి, కాని దాని కారణంగా దిగులుపడకండి.
- మరమ్మత్తు చేయలేని దాన్ని గురించి బాధపడరాదు.
- మంచి చెట్టు చెడుఫలాన్ని ఇవ్వనట్లే కుళ్ళిన చెట్టు మంచి ఫలాన్ని ఇవ్వదు.
- ధైర్యం కేవలం పురుషుడి సొత్తు కాదు. మగవారిలాగా స్వతంత్రులం అని స్త్రీలు భావించాలి.
- కవి అన్నవాడు ఎప్పుడూ ఆకలితో అలమటించే వాడుగా గాని లేదా భగ్న ప్రేమికుడిగా గాని ఉండాలి.
- అదృష్టం సంసిద్దంగా ఉన్న మనస్సునే వరిస్తుంది.
- మీ మనసును లగ్నం చేసే ప్రయత్నాన్ని మీరు కొనసాగిస్తే మీరు అన్నింటిని సాధించవచ్చును.
- చెసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి. డబ్బును తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.
- నవ్వగలిగినంత వరకూ మనిషి పెదవాడు కనేకారు.
- జూదంతో పోగొట్టుకున్న డబ్బు జూదరిని ఆటతో ఎలా కట్టిపడేస్తుందో అదేవిధంగా అనారోగ్యం ,దుఃఖం అన్నవి జీవితం పట్ల ప్రేమను పెంచుతాయి.
- చదివిన పుస్తకాల నుండి జ్ఞానాన్ని పొంది పాఠాలను నేర్చుకోవడమే చదువు ఉద్దేశ్యం.
- ప్రేమ సన్నపడ్డప్పుడు తప్పులు బలపడతాయి.
- ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చేసే పనులు అనర్ధహేతువులు.
- గొప్ప అంశాలు రూపొందేదే కర్మాగారం.
- మనలో తప్పులు లేకుండా ఉంటే ఇతరులలో తప్పులను చూసినప్పుడు మనకు ఆనందం కలుగదు
- ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు.
- చిన్న చిన్న గొడ్డలి పెట్లే మహావృక్షాన్ని సహితం పడదోస్తాయి.
- నాకు గతాలు లేవు. కాలం వాటిని కబలించింది. రేపు అన్నది లేకపోవచ్చు. కానీ ఈ రోజు మాత్రం నా దగ్గరుంది.
- ఎప్పుడూ క్రొత్తనే కోరుకుంటుంది మానవత.
- పంచుకున్న రహస్యం అందరికి తెలుస్తుంది - అర్బిక్
- సొందర్యంతో కూడిన వస్తువు నిరంతరమైన ఆనందాన్ని ఇస్తుంది.
- సంతృప్తి పేదవానికి సంపద ఇస్తుంది. అసంతృప్తి ధనవంతుణ్ణి పేదవానిగా చేస్తుంది.
- మనిషిలో ఇదివరకు ఉన్న పరిపక్వతను వ్యక్తపరిచేదే విద్య.
సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 1
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment