సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 28


  • ఇతరులు నడచిన బాటలో నడిచేవడు తనకాలి జాడలను వదలలేడు.
  • జాలి లేనివారే నిజమైన అంటరానివారు.
  • విమర్శకుల విమర్శనను పట్టించుకోకండి. విమర్శకుడి గౌరవార్ధం ఇంతవరుకు ఎక్కడా శిలా విగ్రహం ప్రతిష్ఠాపింపబడలేదు.
  • పసిబిడ్డ నింపవలసిన కలశం కాదు. వెలిగించ వలసిన నిప్పు.
  • మనం ఏ పని చేసినా సర్వశక్తులను, మనస్సును దానిపై స్థిరంగా కేంద్రీకరించినప్పుడే ఆ పనిని సక్రమంగా చేయగలుగుతాము.
  • ఉదయం రోజుకు అద్దం పట్టినట్లే బాల్యం మనషికి అద్దంపడుతుంది.
  • గెలుపు అందవిహీనతను మరుగుపరిచే అరుదైన రంగు.
  • అణుకువ అనేది లేకుంటే అందం అనేది కూడా అసహ్యంగా, వికారంగా కనిపిస్తుంది.
  • వ్యక్తి శీలం నిర్ణయించేది అతని నడవడిక గానీ, వేషంకాదు.
  • ఇతరుల అనుభవాల ద్వారా మనలో కొంతమంది మాత్రమే నేర్చుకుంటారు.
  • నిరాడంబరమైన, యదార్ధమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి.
  • వస్తువుకాదు వస్తువు పరమైన ఆలోచనే దాన్నిమంచిగానూ లేదా చెడ్డగానూ మారుస్తుంది.
  • అంతరాత్మను జయించిన వ్యక్తి అన్ని రకాల అవరోధాలను అవలీలగా జయించగలుగుతాడు.
  • నిజాయితీని మించిన వంశపారంపర్య ఆస్తి మరొకటి లేదు.
  • మనిషికి నాలుక ఒకటే చెవులు మాత్రం రెండు. దీనర్ధం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. అని - అబ్రహన్ హస్ దాయ్.
  • దిగులు, దౌడు తీసే గుర్రంలాంటిది. దౌడు తీస్తూనే ఉంటుందే కాని అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకవెళ్ళదు.
  • కొంచెం తెలిసినప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా తెలుసుకోగలం. తెలుసుకోవడం మొదలుపెట్టిన మన సందేహాలు పెరుగుతాయి.
  • జింకలను నడిపించే సింహం జింక నడిపించే సింహాలకంటే ఎక్కువ బలవత్తరమై ఉంటుంది.
  • ఇతరులకు మీరిచ్చే సలహాలను పాటించటమే అతి ఉత్తమంగా, జీవితంలో విజయాన్ని సాధించే ఉత్తమ మార్గం అవుతుంది.
  • ప్రతి ఒక్కరు ప్రపంచాన్ని మార్చాలని అనుకుంటారు. కానీ తనను తాను మార్చుకోవాలని ఆలోచించరు.
  • ధనాన్ని పొందడం వల్ల కాదు ఇవ్వడంతో మీరు మరింత ధనవంతులవుతారు.
  • నాకు గతాలు లేవు. కాలం వాటిని కబలించింది. రేపు అన్నది లేకపోవచ్చు. కానీ ఈ రోజు మాత్రం నా దగ్గరుంది.
  • మీ హృదయంలో తొంగి చూసుకోండి. లోపల ఒక స్నేహితుడు ఉన్నాడు.
  • హృదయం ఈ రోజు తెలుసుకున్న దాన్ని మెదడు రేపు అర్ధం చేసుకుంటుంది.
  • ఇతరులను జయించాలనుకోకు. నిన్ను నీవు జయించు. అప్పుడు ప్రపంచం నీచే జయింపబడుతుంది.
  • అడిగిన వెంటనే ఇవ్వబడిన దానం గొప్పది.
  • కష్టపడి పనిచేసేవారికి అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి.
  • మబ్బునవ్వితే చిరుజల్లు, ఏడుస్తే వడగళ్లు.
  • దైవ భక్తికి అర్ధం - ఆదర్శాల పట్ల ప్రేమ.
  • భగవంతుడి విషయం భక్తుడికి, భక్తుని విషయం భగవంతునికి మాత్రమే తెలుస్తాయి.
  • ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు.
  • తన కోసం ఎలాంటి కోరిక లేనివాడు అందరిచేత గౌరవాన్ని పొందుతాడు.
  • విద్య ఇచ్చిన తేజస్సు అందరినీ ఆకర్షిస్తుంది.
  • మీపట్ల మీరు శాంతంగా వ్యవహరిస్తే ఇతరులతో మీరు ఎప్పుడూ ఘర్షణ పడలేరు.
  • హృదయం ఈ రోజు తెలుసుకున్న దాన్ని మెదడు రేపు అర్ధం చేసుకుంటుంది.
  • ఒక పౌండు ధైర్యం ఒక టన్ను అదృష్టంతో సమానం.
  • సలహా ఆముదం లాంటిది. ఇవ్వడం సులభం తీసుకోవడమే కష్టం.
  • ఉపదేశం తరువాత మీరు చేసేదే మీ మతం.
  • జ్ఞాపకశక్తి మంచిది, కానీ తగిలిన గాయాన్ని మరచిపోవడం అన్నది మరింత గొప్పది.
  • కీర్తి పొందని పుట్టుక నిష్ఫలము.
  • చెప్పకోదగ్గ విజయానికి మంచి గుణం పునాది అవుతుంది.
  • చదువు సారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది.
  • వేదనలకు కుంగిపోక చేతినిండా పని కల్పించుకుంటే ఆనందసుమం దానంతటదే వికసిస్తుంది.
  • ఈరోజు నీవు చేస్తున్నదే రేపు నీకు రక్షణను ఇస్తుంది.
  • జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశే మిగులుతుంది. అందుకే జీవితాన్ని శాసించటం నేర్చుకో.

No comments:

Post a Comment