సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 13


  • వివేకం అన్నది మెదడులో ఉంటుంది. కానీ గడ్డంలో కాదు.
  • తీరిక లేకుండా పనిచేసే వ్యక్తే అతి సంతోషంగా ఉన్న వ్యక్తి.
  • ఎలా చదవాలో తెలియాలే కాని ప్రతి మనిషీ ఒక మహా గ్రంధమే.
  • ఒక వస్తువు వినాశనం మరో ఉత్పత్తికి ఆలంబం.
  • శ్రమించు, అన్వేషించు, గ్రహించు కానీ, లోబడకు.
  • బాకీ లేకుండా, అప్పు ఇవ్వకుండా ఉన్నప్పుడే మీ స్నేహం కలకాలం నిలుస్తుంది.
  • నోరు తెరవనంతవరకు మూర్ఖుడు నెగ్గుకొస్తుంటాడు.
  • చేయడానికి తయారుగా ఉన్న హృదయానికి అసంభవమైనదంటూ ఏదీ ఉండదు.
  • చిరునవ్వు ప్రతికూల పరిస్ధితులను కూడా అవకాశాలుగా మార్చగలదు
  • పొరపాటు సహజమే కాని అవివేకి అందులోనే విహరిస్తాడు.
  • ప్రశంస అనేది మనిషి ప్రగతికి శత్రువు.
  • క్రియ ఆలోచనల కారణంగా రూపుదిద్దుకోదు. అది బాధ్యతలను స్వీకరించడానికి తయారుగా ఉన్నప్పుడే రూపుదిద్దుకుంటుంది vక్రియ ఆలోచనల కారణంగా రూపుదిద్దుకోదు. అది బాధ్యతలను స్వీకరించడానికి తయారుగా ఉన్నప్పుడే రూపుదిద్దుకుంటుంది
  • చెదరిపోయిన మనసు సంపూర్ణంగా దర్శించ లేదు.
  • నమ్మకం అన్నది మనకు వెలుగు నివ్వడమే కాకుండా చుట్టుపక్కల కాంతిని ప్రసరింపజేసే అఖండ దీపంగా ఉండాలి.
  • అయిన గాయాలను గుర్తుపెట్టుకోకుండా మరచిపోవడమే నిజమైనా గొప్పతనం.
  • నమ్మక యోగ్యంగా ఉండడం అన్నదే గొప్ప సామర్ధ్యం అవుతుంది.
  • గుండెలోని భావాలను చెప్పని మాట వట్టి కళేబరం.
  • ధనవంతుడి జోకులు ఎల్లప్పుడూ తమాషాగానే ఉంటాయి.
  • మొత్తం విషయాన్ని అపార్ధం చేసుకోవడం కన్నా కొంత విషయాన్ని అర్ధం చేసుకోవడం మంచిది.
  • నిజమైన స్నేహం మంచి ఆరోగ్యం లాంటిది. పోగొట్టుకోనంతవరకూ దాని విలువ తెలుసుకోలేము.
  • నీవు ఒక పొరబాటు చేసి, మరో కొత్త పొరబాటు చేసేందుకు అనుభవం సంపాదించుకుంటావు.
  • భవిష్యత్తు పై నమ్మకం కలిగి ఉన్న వ్యక్తి భవిష్యత్తు ఎప్పుడూ ఉత్తమంగా ఉంటుంది.
  • దేశకాల పరిస్థితులకు అతీతమైనది సంస్కృతి.
  • గొప్ప గొప్ప కార్యాలను సాధించటానికి ఉత్సాహమే ప్రధాన కారణం.
  • చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా.
  • 20 ఏళ్ళ అనుభవం నేర్పే పాఠాలను ఏడాది గ్రంధ పఠనం నేర్పుతుంది.
  • క్షణిక కోపాన్ని అణుచుకోగల వ్యక్తి ఒక రోజు దు:ఖాన్ని దూరం చేసుకోగలడు.
  • ఇతరులను గౌరవించడం ద్వారానే గౌరవింపబడే హక్కును పోందగలము.
  • మీ గురించి గభీరంగా ఆలోచించడం మొదలు పెడితే మీరు గొప్ప అపాయానికి గురికాగలరు.
  • తనకు ఇష్టమైన పనిని గొప్ప మూర్ఖుడు కూడా పూర్తిచేయగలడు.కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు.
  • స్నేహితుడు లేని జీవితం సాక్షి లేని మరణం లాంటిది.
  • హేతువుతో కూడిన ఉత్సాహం. నిజాయితీ అవుతుంది.
  • నవ్వలేని వాడికి ప్రపంచమంతా పగలే చీకటిగా మారుతుంది.
  • సంపదను కూడబెట్టడం తరచుగా అనారోగ్యానికి కారణం అవుతుంది.
  • ధైర్యంతో పనులను చేపట్టేవారినే విజయలక్ష్మి వరిస్తుంది.
  • జీవితపు శీతల సంధ్యాకాలంలో స్నేహితులు అతి గొప్ప స్నేహపు వెచ్చదనాన్ని ఇస్తారు.
  • ఇతరుల సంక్షేమంలో ఆనందాన్ని పొందేవాడు మనుషుల చేత ఎన్నుకోబడిన విశిష్ట వ్యక్తి అవుతాడు.
  • జీవించడం అన్నది ముఖ్యంకాదు ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేసామన్నది ముఖ్యం.
  • తమకు తామే సహాయాన్ని చేసుకునేవారికే దేవుడు సహాయపడతాడు.
  • చెడు అలవాట్లు అన్నవి మెత్తటి పరుపులాంటిది. పరుపు నెక్కడం సులభమే కానీ దాని నుండి కిందకు దిగడం కష్టం అయిన పని అవుతుంది.
  • తమకాలాన్ని దుర్వినియోగం చేసేవారు కాలం తక్కువగా ఉన్నదని ఎక్కువగా ఫిర్యాదు చేస్తారు.
  • బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడు ముందుగా నిద్రపోడు, అలాగే ఆలస్యంగా సైతం నిద్రలేవడు.
  • మిత్రులకు పరస్పర విశ్వాసం ఉంటే చావు బ్రతుకులు ఆలోచించరు. మిక్కిలి ఒంటరిగా నిలబడే వాడే మిక్కిలి బలశాలి - ఇబ్బెన్.
  • ఒకటిగా చేరడం ప్రారంభం, ఒకటిగా ఉండడం ప్రగతి, ఒకటిగా పనిచేయడం విజయం.
  • పొరపాట్లను సరిదిద్దుకోవడం వివేకానికి గుర్తు.

No comments:

Post a Comment