- ఊరికే దొరికిన పుస్తకాన్ని సాధారణంగా చదవరు. డబ్బు పెట్టికొంటే తప్పకుండా చదువుతారు - శామ్యూల్ జాన్సన్.
- కఠిన పరిశ్రమకు ప్రత్యామ్నాయం అన్నది లేదు.
- ధైర్యంగా ఉంటూ నిజం వివేకంల మార్గాన్ని అనుసరించండి. అప్పుడు ధర్మదేవత మిమ్మల్ని సంరక్షిస్తుంది.
- మనోబలం లేకుండా గణనీయమైనదేదీ మనం సాధించలేము.
- సమన్వయం నుండి నిజమైన ఆనందం పుట్టుకొస్తుంది.
- ఇచ్చువారికి దేవుడు ఇవ్వకమానడు.
- దూరం సోందర్యంనూ, దృశ్యాన్నీ మరింత సుందరం చేస్తుంది.
- ఒక వస్తువు వినాశనం మరో ఉత్పత్తికి ఆలంబం.
- నిజాయితీపరుడైన వ్యక్తి భగవంతుడి భవ్యసృష్టి.
- ప్రపంచానికి మీ అవసం ఉండేలా చూసుకోండి. అప్పుడు ప్రపంచం మీకు ఆహారాన్ని ఇస్తుంది.
- ఆశతో కూడా నిరాశ వస్తుంది
- మంచి మిత్రుడు రెండు శరీరాలలో నివశించే ఒక ఆత్మ.
- పని మనల్ని విసుగుదల, చెడ్దతనం, అవసరాలనే మూడు దుష్టశక్తుల నుండీ కాపాడుతుంది.
- సాహసం అన్నది శారీరిస గుణం కాదు. ఆత్మగుణం.
- పరిస్థితులు బలహీనుణ్ణి శాసిస్తాయి. కాని అవే వివేకి విజయానికి సాధనాలవుతాయి.
- ప్రేమ పొందే వారిని, పంచే వారిని - ఇద్దరినీ బాగుపరుస్తుంది - డా. కార్ల్ మెన్నింజర్.
- మూర్ఖుడి హృదయం నోటిలో ఉంటుంది. కానీ వివేకవంతుడి హృదయంలో నోరు ఉంటుంది.
- గొప్ప హృదయం లేనప్పుడు సంపద. వికారమైన బిక్షగాడు అవుతుంది.
- ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
- బాధ మనిషిని ఆలోచింపజేస్తుంది. ఆలోచనలు మనిషిని బుద్దిమంతుణ్ణి చేస్తాయి. వివేకం జీవితాన్ని ఓర్చుకునేలా చేస్తుందు.
- పక్షపాత భావన అజ్ఞానపు శిశువు.
- అన్ని ఆశలు అడియాసలైనప్పుడు మన ముందు భవిష్యత్తు అలానే స్థాణువుగా ఉంటుంది.
- పాపం అనేది వేరే ఒకచోట ఆవిర్భవించదు. చేసే దుష్కర్మలోనే పొంచి ఉంటుంది.
- సృష్టిలో ఎన్నో అందమైన వస్తువులు ఉన్నాయి. కాని అవన్నీ శిశువంత తియ్యనివి కావు.
- సంతోషం మనిషి తీరు అవుతుందేకాని మనిషి దగ్గరున్న వస్తువు ఏమాత్రం కాదు
- మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు.
- మనసా వాచా కర్మణా పరిశుద్ధంగా ఉన్నప్పుడే మీరు మీ మనసును భగవంతుడి స్వరంతో ఏకం చేసుకోగలుగుతారు.
- ఆశావాది గులబీను చూస్తే నిరాశావాది ముల్లును చూస్తాడు.
- అన్ని విషయాలలో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం మంచిది.
- కొన్ని పట్టులాంటి ముఖాల వెనుక ముతక గుడ్డ ఉంటుంది.
- గొప్పవాడిగా ఉన్నందువల్ల నింద అన్నది ప్రజలకు కట్టే పన్ను అవుతుంది.
- తెలుసు కోవటం కంటే తెలుసుకున్న దానిని జీర్ణించుకోవటం ముఖ్యం.
- పూజ, ఉపవాసాలు ఆత్మబలాన్ని పెంచే ఆధ్యాత్మిక వ్యాయామాలు.
- అన్నింటికి సహనమే మూలం. గుడ్డును పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది కానీ పగులగొడితే కాదు.
- తన దోషాలను గుర్తించకపోవటాన్ని మించిన పొరపాటు లేదు.
- మీ తప్పులు మీ విజయానికి కావల్సిన కొత్త పాఠాలు.
- పుష్పానికి సుగంధం - మనిషికి వ్యక్తిత్వం.
- హంస అసమర్ధుడి ఆఖరి ఆశ్రయం.
- ఙ్ఞానాన్ని మించిన శక్తి ప్రపంచంలో మరేదీ లేనే లేదు
- చూస్తున్న పొరుగువాణ్ణి ప్రేమించలేనివాడు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు?
- లోటు అనే పాఠశాలలో నిజం రోజు రోజుకూ బలం పుంజుకుంటుంది.
- సమన్వయం నుండి నిజమైన ఆనందం పుట్టుకొస్తుంది.
- పనిచేసే హక్కు నీకుందికానీ దాని ఫలితంపై హక్కులేదు.
- ఆరోగ్యం నమ్మకాన్ని ఇస్తుంది. నమ్మకం అన్నింటినీ ప్రసాదిస్తుంది.
- నేను యుద్ధాన్ని కోల్పోవచ్చును. కానీ ఒక నిమిషాన్ని మాత్రం పోగొట్టుకోలేను.
సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 8
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment