- ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం.
- పరిస్థితులను మన అదుపులో ఉంచుకోవడంలోనే మగతనం ఉంది.
- భక్తికున్న గొప్ప సుగుణం మనసును శుభ్రం చేయగలగడమే.
- చెడు చేయాలన్న గునం మనలో నిండి ఉన్నదువల్లే ఇతరులను గురించి అతి చెడుగా ఆలోచించడంను విశ్వసించే అవకాశాలు ఉన్నాయి.
- మానవ చరిత్ర రోజురోజుకూ చదువుకూ. దుర్గతికీ మధ్య నడిచే పరుగుపందెంగా తయారవుతోంది.
- అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలే ఉండాలి, కాని ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు - ఏ.జి. గార్డెనర్.
- గొప్ప అంశాలు రూపొందేదే కర్మాగారం.
- ఓర్పుకు మించిన తపస్సు లేదు.
- మనిషిలో ఉన్న పరిపక్వతకు బాహ్యరూపమే చదువు.
- ప్రేమకు కట్టుపడి ఉన్న ప్రతి ఇల్లూ, స్నేహాన్ని అతిధిగా స్వీకరించిన ఇల్లూ నిజంగానే స్వర్గసీమ. కారణం అక్కడ హృదయం నివసిస్తుంది.
- మీ దగ్గరున్న పరికరం సుత్తి మాత్రంమే అయితే ప్రతి ఒక్కదాన్ని మీరు మేకుగా భావించవలసి వస్తుంది.
- ముందుకు ఎదగనిది వెనక్కు ఎదిగి కుళ్ళిపోతుంది.
- ఇతురుల తప్పులను క్షమించడం, మరచిపోవడం అనేవి మంచితనానికి అసలు సిసలైన నిదర్శనాలు.
- నీ తప్పును ఒప్పుకోవడం వలన నిన్నటి కంటే నేడు నీవు వివేకవంతుడవని తెలుస్తుంది.
- అవసరంలో ఆదుకునేవాడే అసలైన స్నేహితుడు.
- తప్పులు ఎవరైనా చేస్తారు. కానీ మూర్ఖుడు తప్పులు చేస్తూనే ఉంటాడు.
- అవకాశాలు గుడ్ల లాంటివి. వాటిని తాజాగా ఉన్నప్పుడే పొదగాలి.
- చేటు కాలమునకు చెడు బుద్ది పుట్టును.
- మీ న్యాయనిర్ణేతగా మీరే వ్యవహరంచండి. అప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారు.
- ఎప్పుడైనా తనమీద తనకు విశ్వాసం ఉన్నవారు బలవంతులైతే, సందేహాలతో సతమతమయ్యేవారు బలహీనులు.
- తెలివితక్కువతనాన్ని తెలుసుకోలేనంత తెలివితక్కువతనం మరొకటి ఉండదు.
- ప్రేమకు కట్టుపడి ఉన్న ప్రతి ఇల్లూ, స్నేహాన్ని అతిధిగా స్వీకరించిన ఇల్లూ నిజంగానే స్వర్గసీమ. కారణం అక్కడ హృదయం నివసిస్తుంది.
- సోమరితనం మనదేశాన్ని పట్టి పీడిస్తున్న ప్లేగు.
- మీరు మంచి వారు మాత్రమే కాదు మంచికి కూడా కారకులు.
- మనిషిలో జ్ఞానం అనేది పెరిగేకొద్ది తనలోని అజ్ఞానం తెలిసివస్తుంది.
- భావం, సాధన ఈ రెండూ చాలా దూరమైనవి.
- కేవలం రెండు విషయాలను-తాను తాగిన విషయాన్ని. తాను ప్రేమలో పడ్డ విషయాన్నీ- మనిషి దాచుకోలేడు.
- ప్రజలు దుర్బలులు కారు - వారికి లేనిది సంకల్ప బలం -విక్టర్ హ్యూగో
- జీవితంలో అపూర్వ ఆభరణం వినయం.
- అదృష్టం మూర్ఖుడి వద్దకు రానైతే వస్తుంది. కానీ అతడితో తిష్టవేసుకుని కూచోదు.
- నవ్వగలిగినంత వరకూ మనిషి పేదవాడు కానే కాదు.
- మనం ఏ పని చేసినా సర్వశక్తులను, మనస్సును దానిపై స్థిరంగా కేంద్రీకరించినప్పుడే ఆ పనిని సక్రమంగా చేయగలుగుతాము.
- మందగించక ముందు అడుగెయ్ వెనుకబడితే వెనకేనోయ్ - గురజాడ.
- వాత్సల్యం న్యాయాన్ని గుడ్డిదానిగా మారుస్తుంది.
- తెలుసు కోవటం కంటే తెలుసుకున్న దానిని జీర్ణించుకోవటం ముఖ్యం.
- మీకున్న శత్రువులనే తన శత్రువులుగా ఉన్నవాడే మీ మిత్రుడు.
- లక్ష్యం పట్ల ఉన్న స్ధిరత్వం పైనే గెలుపు రసహ్యం దాగుంటుంది.
- మనసన్నది బంగారం గనితోపాటు ఒక చెత్తకుండి కూడా.
- భయం అనేది ఒక శారీరికమైన జబ్బు కాకపోవచ్చు. కానీ అది ఆత్మను చంపేస్తుంది.
- సిరి సంపదలతో తులతూగుతున్నప్పుడు స్నేహితుల మనల్ని తెలుసుకుంటారు. కష్టాలలో మనం స్నేహితులను తెలుసుకుంటాము.
- మన తప్పులను ఇతరులతో చూచినప్పుడు అవి మనకు కోపాన్ని తెప్పిస్తాయి.
- పొరపాటు సహజమే కాని అవివేకి అందులోనే విహరిస్తాడు.
- చిన్న గొడ్డలి పెట్లు మహా వృక్షాలను కూల్చగలవు.
- మీరు మాట్లాడే విషయాన్ని గురించి ఆలోచించండి. అంతేకాని మీరు ఏమి ఆలోచించారో దాన్ని గురించి మాట్లాడకండి.
- ఉదయం రోజుకు అద్దం పట్టినట్లే బాల్యం మనషికి అద్దంపడుతుంది.
సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 4
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment