సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 7

  • జూదంతో పోగొట్టుకున్న డబ్బు జూదరిని ఆటతో ఎలా కట్టిపడేస్తుందో అదేవిధంగా అనారోగ్యం ,దుఃఖం అన్నవి జీవితం పట్ల ప్రేమను పెంచుతాయి.
  • త్వరగా పడుకోవడం త్వరగాలేవడం అన్న అలవాటు మనిషికి ఆరోగ్యాన్ని, సంపదనూ, వివేకాన్ని ప్రసాదిస్తుంది.
  • శ్రమించు, అన్వేషించు, గ్రహించు కానీ, లోబడకు.
  • గతం నుండి నేర్చుకోండి, కాని దాని కారణంగా దిగులుపడకండి.
  • ఆలోచనల,మాటల,చేతల ద్వారా సంస్కృతి అభివ్యక్తీకరించబడుతుంది.
  • ఇంటిలో శాంతి నెలకొల్పాలన్నప్పుడు పక్కింటి తలుపులను బాది ప్రయోజనం లేదు.
  • మీ పట్ల మీ అభిప్రాయం గొప్పదై వుండాలి. ఈ ప్రపంచంలో మీ గురించి ఆలోచించే మొదటి వ్యక్తి మీరే.
  • గొప్ప వంశంలో పుట్టడం కన్నా గొప్పగా ప్రజలచేత గుర్తుచేసుకోబడడం మెరుగైనది.
  • యుద్ధానికి ఏమాత్రం తీసిపోని గొప్ప జయాలను శాంతి కూడా సాధించింది - జాన్ మిల్డన్.
  • ధనవంతుడి జోకులు ఎల్లప్పుడూ తమాషాగానే ఉంటాయి.
  • పొదుపు చేయగలిగినవాడు వేదనకు గురికాడు.
  • మనల్ని ద్వేషంగలవారిగా చేయడానికి కావలసినంత మతం మన వద్ద ఉందే కాని పరస్పరం ప్రేమించుకునేలా చేసేంత మతం లేదు.
  • మంచి పనే మంచి ప్రార్ధన.
  • చలువరాతికి శిల్పం ఎలాగో ఆత్మకు విద్య అలాగు.
  • ప్రేమ పొందే వారిని, పంచే వారిని - ఇద్దరినీ బాగుపరుస్తుంది - డా. కార్ల్ మెన్నింజర్.
  • ఉపదేశం తరువాత మీరు చేసేదే మీ మతం.
  • ఏమి జరిగినా ఏమి జరగనట్లే ఎప్పుడూ ప్రవర్తించు.
  • విమర్శలు కంటే కూడా పిల్లలకు ఆదర్శవంతుల అవసరం ఎక్కువగా ఉంటుంది.
  • ఇతరులను గురించి ఎక్కువగా ఫిర్యాదు చేసేవారు ఫిర్యాదు చేయబడే వారౌతారు.
  • గెలుపుకు అనేకమంది తండ్రులుంటారు. కానీ ఓటమికి ఏ ఒక్కరూ ఉండరు.
  • తాను కోరుకున్న దానిని పొందడం అన్నది కేవలం సంతృప్తి మాత్రమే. ఇతరులు కోరేదాన్ని ఇవ్వడంలోనే ఆనందం ఉంది.
  • పనిచేసే చేతులు ప్రార్ధన చేసే చేతులకంటే ఎంతో అమూల్యమైనవి.
  • అందర్ని తృప్తి పరచాలని అనుకుంటే మీరు ఎవర్నీ తృప్తిపరచలేదు.
  • త్వరగా పడుకుని త్వరగా లేవడం వల్ల మనిషి ఆరోగ్యవంతుడిగా,భాగ్యవంతుడిగా,వివేక సంపన్నుడిగా తయారవుతాడు.
  • కృతజ్ఞత అనేది ఒకరిపట్ల చూపవలసిందే కాని ఒకరి నుండి ఆశించవలసింది కాదు.
  • ఊరటను కలిగించే సానుభూతితో కూడిన మాటలు బాధ, దుఃఖాల గాయాన్ని తగిస్తాయి.
  • వెయ్యి మంది మిత్రులున్న వ్యక్తి ఒక్కరిని కూడా వదులుకోలేడు. ఒకే ఒక శత్రువున్న వ్యక్తి అతన్ని ప్రతిచోట కలుస్తాడు.
  • ప్రేమ సూర్యుడి లేత కిరణాలలాగా రోజంతా వెచ్చదనాన్ని అందజేస్తుంది.
  • అవకాశం అనేది రాదు. అది ఇక్కడే ఉంటుంది.
  • బాకీ లేకుండా, అప్పు ఇవ్వకుండా ఉన్నప్పుడే మీ స్నేహం కలకాలం నిలుస్తుంది.
  • మంచి సభ్యత అన్నది చిన్న త్యాగాల ఫలితమే.
  • ధనవంతుడిగా మరణించడం కంటే ధనవంతుడిగా జీవించడం హాయి.
  • అనుభవం అన్నది తల వెంట్రుకలు రాలిపోయిన తరువాత జీవితం మీకిచ్చే దువ్వెన.
  • ఒక వ్యక్తి యొక్క జయాపజయాలు అతను సమయాన్ని ఎలా ఖర్చు చేస్తాడన్న విషయం పైనే ఆధారపడి ఉంటాయి.
  • రహస్యంగా ద్వేషించటం కంటే బహిరంగముగా చివాట్లు పెట్టటం ఉత్తమం.
  • నిజాయితీని మించిన వంశపారంపర్య ఆస్తి మరొకటి లేదు.
  • వంతెనలను కాకుండా గోడలను కట్టుకునేందువల్ల ఒంటరితనానికి ప్రజలు లోనవుతున్నారు.
  • జీవిత పరిజ్ఞానంలేని గ్రంధాలు నిష్ప్రయోజనాలు.
  • మూగవాడు మాట్లాడగల భాష చెవిటివాడు వినగల భాషే దయ.
  • తృప్తి కలిగినప్పుడే మానవునికి సంతోషం లభిస్తుంది.
  • ఉత్సాహం లేనిదే ఏగొప్ప పనిని సాధించలేము.
  • కష్టాల నుండి గట్టెక్కే ఉత్తమ మార్గం కష్టాలను భరించడమే.
  • ప్రతి మనిషిలోను దివ్యత్వం గర్భితంగా ఉంది. ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే జీవిత పరమావధి.
  • వ్యసనం, కోపం, పేరాశ- ఈమూడు దయ్యాలను తరిమి కొట్టండి.
  • మీరు మాట్లాడే విషయాన్ని గురించి ఆలోచించండి. అంతేకాని మీరు ఏమి ఆలోచించారో దాన్ని గురించి మాట్లాడకండి.

No comments:

Post a Comment