సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 16


  • దైన్యం రకరకాల వ్యక్తులతో పరిచయం కలిగిస్తుంది.
  • దృఢనిర్ణయం అన్నది విజయపథంపై మనం మొదటి అడుగు అవుతుంది.
  • ఓపిక ఉత్తమోత్తమమైన ఔషధం.
  • అసాధారణమైన ప్రతిభ ఎప్పటికైనా తాను చేయవలసిన దానిని చేసి తీరుతుంది.
  • ధైర్యంగా ఉంటూ నిజం వివేకంల మార్గాన్ని అనుసరించండి. అప్పుడు ధర్మదేవత మిమ్మల్ని సంరక్షిస్తుంది.
  • విజయవంతమైన జట్టుకు చేతులనేకం, కానీ మనసుమాత్రం ఒకటే
  • గొప్పవారి యొక్క గొప్పతనం, వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది.
  • గంపెడు చదువుకంటే పిడికెడు లోకజ్ఞానం విలువైనది.
  • పుస్తకాలు లేని ఇల్లు కిటికీలు లేని గదిలాంటిది.
  • చిన్న చిన్న త్యాగాలు కలిసి మంచి అలవాట్లుగా తయారవుతాయి.
  • మంచితనాన్ని మించిన గుణం లేదు. మంచితనంలోనే మర్యాద, మమత.
  • మనోబలం లేకుండా గణనీయమైనదేదీ మనం సాధించలేము.
  • మానవుని ప్రయత్నం దైవ విశ్వాసం కార్యసాధనకు మార్గం.
  • నవ్వుతూ ఓడిపోయే వాడే గెలుపును సాధించే వ్యక్తి.
  • కీర్తి పొందని పుట్టుక నిష్ఫలము.
  • దేవుని ప్రేమించటం జీవిత లక్ష్యం, దేవునితో ఐక్యం చెందటం జీవిత గమ్యం.
  • మంచి దస్తూరి అలవాటు చేసుకోవటం విద్యాభ్యాసంలో ఒక భాగం.
  • ఎప్పుడు చిరునవ్వు నవ్వుతుంటే భగవంతునికి సన్నిహితముగా ఉంటావు.
  • అందరి సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కో.
  • శత్రువుల సంఖ్యను పెంచుకోదల్చుకున్నారా? అయితే కోంత మార్పును తీసుకుని వచ్చేందుకు ప్రయత్నించండి.
  • ప్రతి కష్టంలో గొప్ప లాభాలను ఆర్జించి పెట్టే విత్తులుంటాయి.
  • నీవు ఎలా కావాలనుకుంటే అలాంటి భావాలను, నీ మనస్సులో నాటుకో.
  • జనన మరణాల మధ్యంతర కాలం జీవితం.
  • మారణాయుధాలు మనల్ని నాశనం చేయకముందే మనం వాటిని నాశనం చేయటం అవసరం.
  • మీరు గెలవాలని ఆశపడుతున్నప్పుడు ముగ్గురు పెద్దవారిని సంప్రదించండి.
  • జీవితాన్ని విఫలం చేసే ప్రమాదకర లక్షణం తొందరపాటు.
  • కొన్ని పట్టులాంటి ముఖాల వెనుక ముతక గుడ్డ ఉంటుంది.
  • గౌరవ మర్యాదలతో కూడిన జీవితం ను గడపడానికి అదృష్టం అన్నది ఉండాలి.
  • సమదృష్టి గల మనస్సు అన్ని దు:ఖాలకు ఉత్తమ ఔషధము.
  • పాపం అనేది వేరే ఒకచోట ఆవిర్భవించదు. చేసే దుష్కర్మలోనే పొంచి ఉంటుంది.
  • అవసరంలో ఆదుకునేవాడే అసలైన స్నేహితుడు.
  • వయసు మళ్ళిన వారివి వెనుకటి కాలపు గాధలు, వయసులో ఉన్న వారివి ముందున్న స్వప్నాలు.
  • కామంనకు మించిన వ్యాధీ, బ్రాంతికి మించిన శత్రువూ, కోపానికి మించిన అగ్నీ, విద్యకు మించిన ఆనందం వేరొకటి లేదు.
  • ప్రేమను ఇవ్వడం అన్నది పరిశుద్ధమైన స్వాతంత్ర్యం. ప్రేమను కోరడం అన్నది పరిశుద్ధమైన బానిసత్వం.
  • వినయం ప్రతిష్ఠకు సులభ మార్గం.
  • మొత్తం విషయాన్ని అపార్ధం చేసుకోవడం కన్నా కొంత విషయాన్ని అర్ధం చేసుకోవడం మంచిది.
  • సోమరి తనం మూర్ఖుల సెలవు రోజు.
  • మనం ప్రేమించే దాన్నిబట్టి మనం తీర్చిదిద్దబడతాము, రూపు దిద్దుకుంటాము.
  • మనకు తక్కువ జ్ఞానం ఉన్నప్పుడే విషయాలు బాగా అర్థం అవుతాయి. అధికజ్ఞానంతో పాటు సందేహం కూడా పెరుగుతుంది.
  • పాపం అనేది వేరే ఒకచోట ఆవిర్భవించదు. చేసే దుష్కర్మలోనే పొంచి ఉంటుంది.
  • ఆగ్రహం అనేది ఎప్పుడూ తప్పిదంతో ఆరంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది.
  • స్వార్ధం చిట్టచివర్లో ఉన్నప్పుడే సేవ ఉత్తమంగా ఉంటుంది.
  • ఈ రోజు మనం గతం శిఖరాలపై నిలుచుంటాము. కానీ ఇవి రేపటి పర్వత పద ప్రాంతాలవుతాయి.
  • తన జానెడు పొట్టకు బానిస అయిన వ్యక్తి భగవంతుణ్ణి ససేమిరా పూజించలేడు.
  • ఈ రోజన్నది నిన్నటి రోజును గురించి దిగులుపడిన రేపు అవుతుంది.

No comments:

Post a Comment