సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 18

  • చాలా తక్కువగా తినిన వారికంటే చాలా ఎక్కువగా తిన్నవారే ఎక్కువ మంది చనిపోయారు.
  • స్నేహితులను ఆకట్టుకోవాలనుకుంటే, ఆసక్తికరమైన వ్యక్తులలో మన చోటును పదిలం చేసుకోవాలంటే ఇతరులు మీ పట్ల ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో అలా మీరు ఇతరులపట్ల వ్యవహరంచండి.
  • జనన మరణాల మధ్యంతర కాలం జీవితం.
  • నేడు మీదగ్గర ఉన్న ఉత్తమమైన దాన్ని అందివ్వండి. అది రేపటి మంచి చిట్కాగా మారుతుంది.
  • లక్ష్యం పట్ల ఉన్న స్ధిరత్వం పైనే గెలుపు రసహ్యం దాగుంటుంది.
  • శుభ్రత దైవత్వానికి తరువాతది.
  • ధనవంతుడి జోకులు ఎల్లప్పుడూ తమాషాగానే ఉంటాయి.
  • క్రియ సామర్ధ్యానికి సంబంధించిన ఏకైక మార్గం.క్రియ సామర్ధ్యానికి సంబంధించిన ఏకైక మార్గం.
  • సరిగా ఉండటం కంటే విమర్శించటం అతి తేలిక.
  • ఉత్తమ మానవుని యొక్క లక్షణం నీతి గడించి, నియమంగా జీవించటమే .
  • నిజం ఉన్నతమైనది కాని నిజాయితీతో జీవించడం అన్నది అంతకంటే ఉత్తమమైనది.
  • నవ్వగలిగినంత వరకూ మనిషి పెదవాడు కనేకారు.
  • మనలను మనం జయించగలగడం మాత్రమే చిరకాలం నిలుస్తుంది. ఈ విజయం ఎలాంటి విచారాన్ని కలిగించదు.
  • సహజత, సరళత జీవితాన్ని తియ్యగా చేస్తాయి.
  • ఆకలే అన్నానికి పనికొచ్చే అతి మంచి పచ్చడి.
  • మూర్ఖత్వంతో ప్రారంభమైన కోపం పశ్చాత్తాపంతో ముగుస్తుంది.
  • దేన్ని చూసైనా సరే భయపడవద్దు! మీరు అద్భుతాలు సాధిస్తారు! భయపడిన మరుక్షణo, మీరు ఎందుకూ కొరగాని వారయిపోతారు.
  • నిన్నటి గురించి మదనపడకుండా రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన మనిషికి విజయసోపానాలు అందినట్లే.
  • సత్యానికి దూరంగా ఉండడం అంటే శాంతి నుండి దూరంగా ఉండడం.
  • గెలుపు అన్నది ప్రయాణం, లక్ష్యం కాదు.
  • వాత్సల్యం బుద్దిని మందగిస్తుంది.
  • మనకు ఎదురయ్యే అపజయాలన్నింటికీ ప్రధాన కారణం మనలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే.
  • ఇతరులపై ఆధారపడకుండా మీమీద మీరే ఆధారపడండి.
  • ఆవేశం వల్ల కలిగే ఫలితం మనల్ని తప్పుదారి పట్టించడమే - ఆస్కార్ వైల్డ్.
  • సాహసం అన్నది శారీరిస గుణం కాదు. ఆత్మగుణం.
  • కాంతిని కోరేవారు చీకట్లను జయించేందుకు సంసిద్ధులై ఉండాలి.
  • ఇచ్చువారికి దేవుడు ఇవ్వకమానడు.
  • విద్యను పొందడం సులభమే కాని వివేకం పొందడం కష్టతరమైన కార్యం.
  • ఒకరి పొరపాటు ఇంకొకరికి గుణపాఠం.
  • పనిచేసే హక్కు నీకుందికానీ దాని ఫలితంపై హక్కులేదు.
  • సంఘటనలు కావు కాని వాటి వెనుకనున్న కారణాలు ఆసక్తికరంగా ఉంటాయి.
  • నిఘంటువులో మాత్రమే విజయం, సాధనకు ముందు వస్తుంది.
  • మనకు తెలిసినది స్వల్పమని తెలుసుకునే వారెందరు?
  • తన కోసం ఎలాంటి కోరిక లేనివాడు అందరిచేత గౌరవాన్ని పొందుతాడు.
  • చాలా అపురూపమైనదీ,చాలా సున్నితమైనదీ, సామర్ధ్యం కంటే అరుదైనదీ ఒకటుంది. అదే సామర్ధ్యాన్ని గుర్తించగల సామర్ధ్యం.
  • మనస్సు గాలిగొడుగు లాంటిది. తెరచినప్పుడే అది పనిచేస్తుంది.
  • ఎదుటి వారిని సంతోషింపజేయడంలోనే సంతోషం ఉంది.
  • ఆవిష్కారాలు దుస్సంఘటనలు కావు. అవి విసుగు చెందని శ్రమకు లభించే బహుమతులు.
  • ఒక శిశు హృదయాన్ని కోల్పోనివాడే గొప్పవాడు.
  • పని అన్నివేళలా ఆనందాన్ని ఇవ్వకపోవచ్చును. కానీ పని చేయకుండా మాత్రం మనం ఆనందాన్ని పొందలేము.
  • మంచి పనే మంచి ప్రార్ధన.
  • ఆపదలు ప్రతిభను వెలుగులోకి తెస్తే సంపద దాని కప్పి పుచుతుంది.
  • పూచిన పువ్వులన్నీ కాయలైతే పట్టడానికి స్థలం ఉండదు.
  • సోమరి మెదడు దెయ్యాల కార్ఖానాలాంటిది.
  • వివిధ విషయాలకు సంబంధించినంతవరకూ అందరూ అవివేకులే.

No comments:

Post a Comment