- కళ సుదీర్ఘం, జీవితం అల్పం.
- ఎదుటి వారిని సంతోషింపజేయడంలోనే సంతోషం ఉంది.
- లోభికి నాలుగు దిక్కులా నష్టం.
- పెద్ద విషయాలకు సంబధించి ప్రణాళికను తయారు చేసుకోవడం
- మనిషి వలన దేవుడు ఇంకా నిరుత్సాహపడలేదన్న దేవుడి సందేశాన్ని ప్రతి శిశువు తనతో తీసుకవస్తుంది.
- తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రతివ్యక్తి ఒక వాస్తుశిల్పే.
- సహనం తియ్యటి ఫలాన్నిచ్చే చేదు మొక్క.
- మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు.
- సంఘటన జరిగిన తరువాత తెలివిగా ప్రవర్తించడం తేలిక.
- ప్రవర్తన అనే అద్దంలో ప్రతి ఒక్కరి ప్రతిబింబం కనబడుతుంది. సమయాన్ని పాటించడం అన్న పునాది పైనే మీ వృత్తి ఆధారపడి ఉంటుంది.
- సాహసవంతుడి వరకూ అదృష్ట దురదృష్టాలు కుడి ఎడమల లాంటివి. అతడు రెండింటినీ వాడుకుంటాడు.
- సరివారితో స్నేహం చేసి, తక్కువ వారిపై కరుణ చూపి, అధికులతో ఆనందించి, చెడ్డవారికి దూరంగా ఉండాలి.
- గెలుపు అందవిహీనతను మరుగుపరిచే అరుదైన రంగు.
- కీర్తి పొందని పుట్టుక నిష్ఫలము.
- పరిస్ధితులు బలహీనులను ఏలుతాయి. కానీ అవే వివేకవంతుల పాలిటి పరికరాలవుతాయి.
- మనలో చాలామంది ఇతరులకంటే కూడా గొప్పగా చేయగలిగిన వారై ఉంటారు. అది తమ చేతివ్రాతను తామే చదవగలిగినవారై ఉంటారు.
- మీరు సరి అయినప్పుడు మీరు ఒప్పుకోని విషయాలకు సంబంధించిన చర్చను మానేయండి.
- మనం ప్రేమించే దాన్నిబట్టి మనం తీర్చిదిద్దబడతాము, రూపు దిద్దుకుంటాము.
- గెలుపు అందవిహీనతను మరుగుపరిచే అరుదైన రంగు.
- ఉపదేశం పూర్తి అయిన తరువాత మీ ప్రవర్తనను సూచించేదే మీ మతం.
- తృప్తి అమూల్యమైన ముత్యం. పదివేల కోరికలకు బదులుగా ఈ ముత్యాన్ని పొందినవాడు వివేకాన్ని, ఆనందాన్ని పొందుతాడు.
- ఏదైనా ఒక పనిని చేసే ముందు దాని పర్యవసానం ఏమిటో ఒక్క క్షణం ఆగి ప్రశ్నించుకొని అప్పుడు ఆ పనిని ప్రారంభించడం అత్యుత్తమం.
- సమయాన్ని వ్యర్థం చేయడం చాలా సర్వసాధారణమైన నేరం.
- దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి.
- ఎల్లప్పుడూ వెలుగుని చూడటం నేర్చుకొన్నవారికి అసలు చీకటనేదే కనిపించదు.
- ఆత్మ నియంత్రణకు మించిన సంపద ఈ ప్రపంచంలో మరేదీ లేదు.
- ఒకచోట ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో గడపలేకపోవడం చేతనే అందరూ బాధలకు గురి అవుతున్నారు.
- సందర్బోచితమైన మౌనం మాటలు కంటే ఎక్కువ వాగ్ధాటిని గలిగి ఉంటుంది.
- పుస్తకం నుండి మనం గ్రహించగల వాటిపైన పుస్తకం విలువ ఆధారపడి ఉంటుంది.
- పూజ, ఉపవాసాలు ఆత్మబలాన్ని పెంచే ఆధ్యాత్మిక వ్యాయామాలు.
- మనిషిలో జ్ఞానం అనేది పెరిగేకొద్ది తనలోని అజ్ఞానం తెలిసివస్తుంది.
- మనిషి చేసే అనేక తప్పులకు కారణం అతనిలోని అహంకారమే.
- ఒక కళాకారుడు ప్రతిచోట జీవిస్తాడు.
- లెక్కించేందుకు ఇంకేమీ లేనప్పుడు, మనిషి తన వ్రేళ్ళను లెక్కిస్తాడు.
- సత్ర్పవర్తనకు విలువలేని చోట పుట్టుక ఎందుకూ పనికిరానిదవుతుంది.
- కర్తవ్యం మన చేత పనులను బాగా చేయిస్తుంది. కానీ ప్రేమ ఆ పనులను అందంగా చేయడంలో సహాయపడుతుంది.
- శుభ్రత దైవత్వానికి తరువాతది.
- మిత్రుడిని ఎన్నుకున్నట్లే రచయితను కూడా ఎన్నుకోండి.
- మందగించక ముందు అడుగెయ్ వెనుకబడితే వెనకేనోయ్ - గురజాడ.
- తప్పు చేయడం తప్పుకాదు. దానిని మళ్ళీ చేయడమే తప్పు.
- ఆకలే అన్నానికి పనికొచ్చే అతి మంచి పచ్చడి.
- అహంకారం అఙ్ఞానానికి అనుంగు బిడ్డ.
- నిజమైన అందం పవిత్రమైన హృదయమై ఉంటుంది.
- వివేకం అన్నది మెదడులో ఉంటుంది. కానీ గడ్డంలో కాదు.
- అక్కరకు మించిన తెలివి వివేకం అనిపించుకోదు.
సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 10
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment