సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 5

  • సరైన పనిని చూసి ఆ పనిని చేయకపోవడం అన్నది ధైర్యం లేమివల్లే జరుగుతుంది.
  • గొప్పవాడిగా ఉన్నందువల్ల నింద అన్నది ప్రజలకు కట్టే పన్ను అవుతుంది.
  • అజ్ఞానం అన్నది మనస్సు యొక్క చీకటి.
  • నిమిషాలను జాగ్రత్తగా వాడుకోండి. గంటలు తమ జాగ్రత్తని తాము చూసుకోగలవు.
  • పగ - ప్రతీకారం - ఈర్ష్య అసూయ - అసహ్యం విజయానికి శత్రువులు.
  • సత్ర్పవర్తన లేని అందం అంత్యప్రాసలేని కవిత లాంటిది.
  • ఓర్పుకు మించిన తపస్సు లేదు.
  • మూర్ఖత్వంతో ప్రారంభమైన కోపం పశ్చాత్తాపంతో ముగుస్తుంది.
  • మనం ఎంత చదివితే మన అజ్ఞానం అంత బయటపడుతుంది.
  • సంపదను కూడబెట్టడం తరచుగా అనారోగ్యానికి కారణం అవుతుంది.
  • సకాలంలో కావలసినంత వరకు సరైన వ్యక్తులపైన, సరైన విషయంలో కోపం చేసుకునే వ్యక్తి ప్రశంసింపబడతాడు.
  • మూగవాడు మాట్లాడగల భాష చెవిటివాడు వినగల భాషే దయ.
  • ఒక పౌండు ధైర్యం ఒక టన్ను అదృష్టంతో సమానం.
  • కర్తవ్యం మన చేత పనులను బాగా చేయిస్తుంది. కానీ ప్రేమ ఆ పనులను అందంగా చేయడంలో సహాయపడుతుంది.
  • మనం మరణించడం లేదన్నంత ధీమాగా బ్రతికినప్పుడే మనం జీవితంలో గొప్పగా సాధించగలము.
  • గొప్ప వంశంలో పుట్టడం కన్నా గొప్పగా ప్రజలచేత గుర్తుచేసుకోబడడం మెరుగైనది.
  • ప్రేమ పొందే వారిని, పంచే వారిని - ఇద్దరినీ బాగుపరుస్తుంది - డా. కార్ల్ మెన్నింజర్.
  • లోతులేని మనుషులు అదృష్టంను విశ్వసిస్తారు. బలమైన మనుషులు కారణ కార్యములలో విశ్వాసాన్ని కలిగి ఉంటారు.
  • ప్రేమ కలిగిన వ్యక్తి దేవునికి సన్నిహితుడు. ఎందుకంటే - దేవుడే ప్రేమ.
  • తుఫానులో చేసిన ప్రమాణాలను ప్రశాంతంలో మరచిపోతాం.
  • మార్పు తప్ప ఈ ప్రపంచంలో శాశ్వతమైనది మరేదీ లేదు.
  • పొదుపు చేయగలిగినవాడు వేదనకు గురికాడు.
  • బాకీ లేకుండా, అప్పు ఇవ్వకుండా ఉన్నప్పుడే మీ స్నేహం కలకాలం నిలుస్తుంది.
  • వంతెనలను కాకుండా గోడలను కట్టుకునేందువల్ల ఒంటరితనానికి ప్రజలు లోనవుతున్నారు.
  • మీ చేతి గడియారాన్ని మీ మణికట్టు నుండీ తీసుకుని మీకు సరైన సమయాన్ని చెప్పగల వ్యక్తినే సలహాదారుడు అంటారు.
  • న్యాయం గెలుస్తుందన్న మాట నిజమేకాని గెలిచేదంతా న్యాయం కాదు.
  • తాను చేయగలిగింది మనిషి చేస్తే తాను అనుకున్నది దేవుడు చేస్తాడు.
  • దైన్యం రకరకాల వ్యక్తులతో పరిచయం కలిగిస్తుంది.
  • సజ్జనులతో మైత్రి చిరకాలం నిలిచి ఉంటుంది.
  • చక్కగా తీర్చిదిద్దబడిన ఒక మంచి వ్యక్తి జీవితమే ఈ ప్రపంచంలో అతి పరిపూర్ణం అయిన అందమైన వస్తువు.
  • వివేకానికి మొదటి అడుగు ఏది అసత్యమో తెలుసుకోవడమే.
  • అదృష్టం మూర్ఖుడి వద్దకు రానైతే వస్తుంది. కానీ అతడితో తిష్టవేసుకుని కూచోదు.
  • విస్తరించడం జీవితం అవుతుంది, ముడుచుకుని పోవడం మరణం అవుతుంది.
  • గొప్పవారిలోని గొప్పగుణాలు గుర్తించండి. వాటి గురించి రోజూ కాసేపు మననం చేసుకోండి.
  • ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
  • మనకు జరిగేది కాదు మనలో జరిగే మార్పు గొప్పది.
  • ఇతరులకు సహాయం చేసే మీరు మీకే సహాయం చేసుకుంటారు.
  • కోపం పాపానికి ధూపం. రోషం దోషానికి మూలం.
  • ఉన్నత భావాలు తోడుగా ఉన్నవారికి ఒంటరితనమంటూ లేదు.
  • ఒక మనిషికి సహనం కనుక ఉంటే అతను ఏమి అనుకున్నా దానిని సాధించుకొంటాడు.
  • ఇతరులను గౌరవించడం ద్వారానే గౌరవింపబడే హక్కును పోందగలము.
  • నీవు ఎలా కావాలనుకుంటే అలాంటి భావాలను, నీ మనస్సులో నాటుకో.
  • పొదుపు చేయగలిగినవాడు వేదనకు గురికాడు.
  • క్రియ ఆలోచనల కారణంగా రూపుదిద్దుకోదు. అది బాధ్యతలను స్వీకరించడానికి తయారుగా ఉన్నప్పుడే రూపుదిద్దుకుంటుంది vక్రియ ఆలోచనల కారణంగా రూపుదిద్దుకోదు. అది బాధ్యతలను స్వీకరించడానికి తయారుగా ఉన్నప్పుడే రూపుదిద్దుకుంటుంది
  • ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపితే ఇద్దరూ గోతిలో పడతారు.

No comments:

Post a Comment