- బాగా బతకాలని కోరుకో. ఎక్కువ రోజులు బతకాలని కోరుకోకు.
- సమాజం నేరాన్ని తయారు చేస్తే నేరస్తుడు నేరం చేస్తాడు.
- ఏ సగాన్ని నమ్మాలో తెలుసుకోవడమే ప్రతిభ.
- తినుటకై జీవించు వాడు బుద్దుడు. జీవించుటకై తినువాడు ముక్తుడు.
- అన్ని సాక్షాలు కంటే ఆత్మ సాక్షం అధికం.
- ప్రారంభ వస్తువులన్నీ (విషయాలన్నీ) ఉత్తమంగానే ఉంటాయి - లార్డ్ ఛెస్టర్‌ఫీల్డ్.
- సుఖదుఃఖాల బంగారు ఇనుప తీగలు మన జీవితంలో విడదీయలేనంతగా కలిసిపోయి ఉన్నాయి.
- మన వద్ద ఉన్న వస్తువును పోగొట్ట్టుకోనంతవరకు ఆ వస్తువు విలువను మనం తెలుసుకోలేము.
- బాగా చెప్పడం కంటే బాగా చెయ్యడమే మెరుగైనది.
- గంపెడు చదువుకంటే పిడికెడు లోకజ్ఞానం విలువైనది.
- కష్టాలను తప్పించుకోవడం కాదు, వాటిని అధిగమించడమే నిజంగా గొప్పదనం.
- తాను పుట్టిన నేలనీ, దేశాన్ని ప్రేమించలేని వాడు దేనీని ప్రేమించలేడు.
- వస్తువుకాదు వస్తువు పరమైన ఆలోచనే దాన్నిమంచిగానూ లేదా చెడ్డగానూ మారుస్తుంది.
- ఒకచోట ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో గడపలేకపోవడం చేతనే అందరూ బాధలకు గురి అవుతున్నారు.
- పిడికెడు లోకజ్ఞానం తట్టెడు చదువుతో సమానం.
- అవకాశం అనేది రాదు. అది ఇక్కడే ఉంటుంది.
- పదిమంది దుర్మార్గులు కలిసికట్టుగా చేయగల హానికంటే మూర్ఖుడి మూఢవిశ్వాసం ఎక్కువ హాని చేయగలదు.
- కరుణే ఉత్తమమైన ఆవేశం.
- మృదువైన సమాధానం ఆగ్రహాన్ని పోగొడుతుంది.
- ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దాన్ని చేస్తాయి.
- ప్రేమగుణం కలిగిన వారు ఎదుటివారి నుంచి ఏమీ ఆశించరు.
- ఙ్ఞానాన్ని మించిన శక్తి ప్రపంచంలో మరేదీ లేనే లేదు
- పంతులు లేని బడి, దేవుడు లేని గుడి, మనసులేని మనిషి ఒకటే -బాబా.
- మతం అన్నది చదవడంలో కాదు చేయడంలోఉంది.
- ఆరోగ్య పోషణకు రోజూ కొంత సమయం వెచ్చించకపోతే జబ్బుపడి చాలా సమయం కోల్పోవలసి రావచ్చు.
- జూదంతో పోగొట్టుకున్న డబ్బు జూదరిని ఆటతో ఎలా కట్టిపడేస్తుందో అదేవిధంగా అనారోగ్యం ,దుఃఖం అన్నవి జీవితం పట్ల ప్రేమను పెంచుతాయి.
- వయసు మళ్ళిన వారివి వెనుకటి కాలపు గాధలు, వయసులో ఉన్న వారివి ముందున్న స్వప్నాలు.
- విజయవంతమైన వ్యక్తి కావడం కంటే విలువైన వ్యక్తి అవడానికి ప్రయత్నించండి.
- భావం, సాధన ఈ రెండూ చాలా దూరమైనవి.
- కఠినమైన పనులను తేలికగా చేయగల వాడు - విద్యాబోధకుడు.
- ఊరటను కలిగించే సానుభూతితో కూడిన మాటలు బాధ, దుఃఖాల గాయాన్ని తగిస్తాయి.
- ఒక కళాకారుడు ప్రతిచోట జీవిస్తాడు.
- ఒంటరిగా ఉండగల సామర్ధాన్ని పొందండి. ఏకాంతపు లాభాలను పోగొట్టుకోకండి.
- అన్నీ కళలలోకి గొప్ప కళ అందమైన నడవడి.
- వినయం నీవు ధరించే విలువైన వజ్రం.
- ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేనినీ నమ్మడు.
- సూర్యకాంతి వైపు మీ ముఖాన్ని పెట్టుకోండి, నీడలు మీ వెనుక ప్రక్కపడతాయి.
- చదవదగ్గ విషయాలు రాయండి లేదా రాయదగ్గ పనులను చేయండి.
- నవ్వండి, ప్రపంచం మీతో కలిసి నవ్వుతుంది.
- మనం దయను అర్ధించేంత నిజాయితీతో, దయను పొందినప్పుడు కూడా అంతే నిజాయితీతో దయకు ధన్యవాదాలు తెలియజేయాలి.
- భవిష్యత్తు పై నమ్మకం కలిగి ఉన్న వ్యక్తి భవిష్యత్తు ఎప్పుడూ ఉత్తమంగా ఉంటుంది.
- మనకు తెలిసినది చాలా స్వల్పమని తెలుసుకునేందుకు ఎంత తెలుసుకోవాలో.
- సర్వసంగ పరిత్యాగం చేయనిచే మనిషి తన హృదయాన్ని ఇతరుల కోపం పని చేయడంలో లగ్నం చేయలేడు.
- సుగుణం వెలకు అతీతమైనది.
- ఉద్రేకాలకు లొంగినవాడు అందరినీ మించిన బానిస.
సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 3
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment