సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 15


  • మంచిమనుషుల మనసులు వెన్నలా ఉంటాయి - తులసీదాసు.
  • తలవంపులు తెచ్చుకోవడం కంటే కలవరపడడం మెరుగైనది.
  • మీ దగ్గరున్న పరికరం సుత్తి మాత్రంమే అయితే ప్రతి ఒక్కదాన్ని మీరు మేకుగా భావించవలసి వస్తుంది.
  • కష్టాలను తప్పించుకోవడం కాదు, వాటిని అధిగమించడమే నిజంగా గొప్పదనం.
  • ప్రకృతిలో బహుమతులు లేవు, దండనలూ లేవు. ఉన్నవన్నీ ఫలితాలే - ఆర్.జి. ఇంగర్‌సాల్.
  • ఒక వస్తువు మరో ఉత్పత్తికి ఆలంబం.
  • చేయూతనందించే చేతులలోనే గెలుపు తాళం చెవి ఉంటుంది.
  • పెండ్లికి ముందు కండ్లను పెద్దవి చేసుకుని ఉంచుకోవాలి. పెండ్లి తరువాత వాటిని సగం మూసుకోవాలి.
  • ప్రారంభ వస్తువులన్నీ (విషయాలన్నీ) ఉత్తమంగానే ఉంటాయి - లార్డ్ ఛెస్టర్‌ఫీల్డ్.
  • ఒకరు మరొకరికి జీవితాన్ని. తక్కువ కష్టాలతో కూడిన దానిగా చేయడం కోసం కాకుండా మనం మరి దేనికోసం జీవించగలము?
  • కొద్ది కోరికలతో, చిన్న విషయాలతో తృప్తి పడటమే ఉత్తముని లక్షణం.
  • ఆశలేని వాని కగచాట్లులేవు.
  • అంతరాత్మకు సంబంధించినంత వరకు అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి తావులేదు.
  • తలమీద జుట్టు అందాన్నిస్తుంది. తలలోని జ్ఞానం గొప్పదనాన్ని కలిగిస్తుంది.
  • అడిగిన వెంటనే ఇవ్వబడిన దానం గొప్పది.
  • దిగులు, దౌడు తీసే గుర్రంలాంటిది. దౌడు తీస్తూనే ఉంటుందే కాని అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకవెళ్ళదు.
  • మనకు తెలిసినది స్వల్పమని తెలుసుకునే వారెందరు?
  • మనసు భగవంతుడికి అప్పగించి హస్తాలను పనికి అప్పగించెయ్ - స్వామి ఓంకార్.
  • ఉదారత గౌరవాన్ని ముందుకు చొచ్చుకుని వచ్చేలా చేస్తుంది.
  • చదవకుండా ఉండడం కంటే పుట్టకుండా ఉండడమే మేలు కారణం అజ్ఞానమే దురదృష్టానికి మూలం.
  • కోరిక ముగించిన చోట శాంతి ప్రారంభిస్తుంది.
  • గొప్పవారు లేనిదే మనం ఏ గొప్పదాన్ని సాదించలేము. తాను గొప్పవారం కావాలని నిర్ణయించుకున్నప్పుడే మనుషులు గొప్పవారౌతారు.
  • సత్యం అంతా శాశ్వతమైనది. సత్యం ఎవరిసొత్తూ కాదు. ఏ జాతికి, ఏ వ్యక్తికి సత్యంపై ప్రత్యేక హక్కు లేదు.
  • ఎప్పుడూ క్రొత్తనే కోరుకుంటుంది మానవత.
  • మతం అన్నది చదవడంలో కాదు చేయడంలోఉంది.
  • మీ తప్పులు మీ విజయానికి కావల్సిన కొత్త పాఠాలు.
  • అతి జాగ్రత్తగా ఉన్న వ్యక్తి జీవితంలో కొద్దిగానే సాధిస్తాడు.
  • వేదన అనేది రానున్న కష్టానికి చెల్లించే ముడుపు.
  • జీవించడం అన్నది ముఖ్యంకాదు. ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేసామన్నదే ముఖ్యం.
  • పైసాకు కొరగాని పనులతో సతమతమవడం కంటే ఏమీ చేయకుండా ఉండడమే నయం.
  • ఆత్మను కోల్పోయాక లోకాన్నంతా జయించినా శాంతి సమకూరదు.
  • చాలామంది సలహాలు తీసుకుంటారు, కానీ వివేకవంతులే దాని నుంచి లాభం పొందుతారు.
  • చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా.
  • మంచి జ్ఞాపకశక్తి మంచిదే, కాని ఇతరులు మీకు కలిగించిన హానిని మరచిపోయే సామర్ధ్యం అన్నదే గొప్పతనపు పరీక్ష అవుతుంది.
  • దొంగను పట్టుకునేందుకు ఒక దొంగను నియమించండి.
  • ఈ ప్రపంచలో సేవ ఉత్తమమైన ప్రార్ధన. మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించడమే ఉత్తమమైన ఆరాధన.
  • ఆత్మవిశ్వాసం అన్నది దాని కలిగి ఉన్న వ్యక్తికి అద్భుతమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
  • ధనవంతుడిగా మరణించడం కంటే ధనవంతుడిగా జీవించడం హాయి.
  • దూర ప్రాంతమం పాత స్నేహితుడిని కలవడం అన్నది సుధీర్గమమైన కరువు తరువాత వచ్చే వానంత ఆనందాన్ని ఇస్తుంది.
  • మీపట్ల మీరు శాంతంగా వ్యవహరిస్తే ఇతరులతో మీరు ఎప్పుడూ ఘర్షణ పడలేరు.
  • ప్రతి పరాజయం విజయాన్ని మరి కాస్త సన్నిహితం చేస్తుంది.
  • మనస్సు గాలిగొడుగు లాంటిది. తెరచినప్పుడే అది పనిచేస్తుంది.
  • నిజం కోసం మనం అన్నింటిని త్యజించవచ్చును. కానీ దేనికైనా సరే నిజాన్ని మాత్రం త్యజించకూడదు.
  • ఆనందం సుగంధం లాంటిది. మీపైన కొన్ని చుక్కలు పడకుండా ఇతరులపై చల్లలేరు.
  • అవకాశం అనేది రాదు. అది ఇక్కడే ఉంటుంది.

No comments:

Post a Comment