- జీవితపు గొప్ప విజయాలన్నవి తరచుగా బాజాలతో కాక ప్రశాంతంగా సాధించినవే అవుతాయి.
- ఇంద్రియాలను తన వశంలో పెట్టుకున్నవాడే వివేకి.
- ఎవ్వరికీ తెలియని విషయంను గురించి కొంత తెలుసుకోవడలోనే విజయవంతమైన వ్యాపార రహస్యం దాగుంది.
- బాధ మనిషిని ఆలోచింపజేస్తుంది. ఆలోచనలు మనిషిని బుద్దిమంతుణ్ణి చేస్తాయి. వివేకం జీవితాన్ని ఓర్చుకునేలా చేస్తుందు.
- ఇతరుల సంక్షేమంలో ఆనందాన్ని పొందేవాడు మనుషుల చేత ఎన్నుకోబడిన విశిష్ట వ్యక్తి అవుతాడు.
- నవ్వండి మీతో ప్రపంచం కూడా నవ్వుతుంది. ఏడవండి మీరు మాత్రమే ఏడవాలి.
- సమదృష్టి గల మనస్సు అన్ని దు:ఖాలకు ఉత్తమ ఔషధము.
- చదివిన దానిని, విన్న దానిని ఆచరించడం సాధన.
- ఆవిష్కారాలు దుస్సంఘటనలు కావు. అవి విసుగు చెందని శ్రమకు లభించే బహుమతులు.
- ఈ ప్రపంచలో సేవ ఉత్తమమైన ప్రార్ధన. మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించడమే ఉత్తమమైన ఆరాధన.
- చేసిన తప్పుడు పనులను గురించి చెప్పి పశ్చ్యాత్తాప పడటం అన్నది మంచి పనికి శ్రీకారం చుట్టే మంచి పని అవుతుంది.
- పుస్తకాలను చదవాలనే కోరిక ఉన్నవారు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండగలుగుతారు.
- తెలివితేటలంటే విన్నదాంట్లో సగాన్ని మాత్రం విశ్వసించడం.
- ఒక మూర్ఖుడు తన పని మానుకుని ఇతరుల యొక్క (వ్యవహారపు) పని ఒత్తిడిలో ఉంటాడు.
- ప్రతి కష్టంలో గొప్ప లాభాలను ఆర్జించి పెట్టే విత్తులుంటాయి.
- నమ్మిన సిద్దాంతాలకోసం ప్రాణం బలిపెట్టడానికి సిద్దంగా ఉండేవారికి ఓటమి ఉండదు.
- సామాన్యులు ప్రార్ధించరు. యాచిస్తారు.
- ఆపదలందు ధైర్యం ప్రదర్శించే వాడే వీరుడు.
- మనుషుల చేతలు ఒక పుస్తకపు సూచికలాంటివి. పుస్తకంలో ఉన్న అతి చెప్పుకోదగ్గ విషయాన్ని అవి చాటి చెబుతాయి.
- నడవడిక అనబడే అద్దం ప్రతి ఒక్కరి ప్రతిబింబాన్ని ప్రతిబింబిస్తుంది.
- భుజబలం కంటే బుద్ధిబలం గొప్పది.
- జీర్ణించుకోలేనన్ని నమ్మకాలు మింగకూడదు.
- పవిత్రమైన మనస్సు గలవారికి, ప్రతిదీ పవిత్రంగానే కనిపిస్తుంది.
- రహస్యాన్ని కాపాడడం, తగిలిన గాయాన్ని మరచిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవదం- ఈ మూడూ చాలా కష్టతరమైన పనులు.
- ప్రతి కష్టంలో గొప్ప లాభాలను ఆర్జించి పెట్టే విత్తులుంటాయి.
- మనిషి మనసు గొడుగులాంటిది. తెరవబడినప్పడే గొడుగు బాగా పనిచేస్తుంది.
- కొన్ని పట్టులాంటి ముఖాల వెనుక ముతక గుడ్డ ఉంటుంది.
- పైన ఉన్న స్వర్గాన్నీ, క్రింద ఉన్న భూమినీ ప్రేమ నింపుతుంది. ప్రేమ ఒక్కటే కలకాలం నిలుస్తుంది.
- వినయ విధేయతలున్నప్పుడు మీరు పూర్తిగా బీదవారు కాలేరు. వినయ విధేయతలు లేని పక్షంలో మీరు నిజంగా ధనవంతులు కాలేరు.
- సుఖదుఃఖాల బంగారు ఇనుప తీగలు మన జీవితంలో విడదీయలేనంతగా కలిసిపోయి ఉన్నాయి.
- ఒక మనిషి మరొక మనిషి కోసం చేషే త్యాగంతోనూ, పదిమంది కోసం పడే కష్టంతోను ఈ సమాజం నిర్మతమవుతోది.
- ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చేసే పనులు అనర్ధహేతువులు.
- కళ్ళద్దాలు తుడుచుకోవటం మర్చిపోయి, ఈ ప్రపంచం మురికిగా ఉందని ఫిర్యాదు చేయవద్దు.
- జీవితం నాకు ఆలోచించడం నేర్పింది. కానీ ఆలోచనలు ఎలా జీవించాలో తెలియజేయలేదు.
- జీవితాన్ని విఫలం చేసే ప్రమాదకర లక్షణం తొందరపాటు.
- తన కోరుకలనూ, వాంఛలనూ జయించిన వ్యక్తి తన అతి పెద్ద శత్రువును జయించిన వ్యక్తి అవుతాడు.
- బలహీనులు అవకాశం కోసం ఎదురుచూస్తే బలవంతులు అవకాశాన్ని సృష్టించుకుంటారు .
- సరి క్రొత్త అవకాశానికి కాలంతో నిమిత్తం ఉండదు.
- మానవుని ప్రయత్నం దైవ విశ్వాసం కార్యసాధనకు మార్గం.
- తినుటకై జీవించు వాడు బుద్దుడు. జీవించుటకై తినువాడు ముక్తుడు.
- ఆలస్యంగా చెప్పబడే న్యాయం న్యాయం కాదు.
- మంచి సలహాకూ, చెడు సలహాకూ మధ్యనున్న వ్యత్యాసాన్ని చెప్పగలిగితే సలహా అవసరమే మీకుండదు.
- విశ్వాసం పరమ బంధువు.
- ఐకమత్యం లేని బహుసంఖ్యాకులకు వ్యతిరేకంగా అల్పసంఖ్యాకులు కలిసికట్టుగా పనిచేస్తారు కాబట్టే రాజకీయ యంత్రాంగం గెలుస్తుంది.
- సత్యానికి దూరంగా ఉండడం అంటే శాంతి నుండి దూరంగా ఉండడం.
సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 12
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment