సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 14


  • ఉత్తమమైన పుస్తకాలను మొదట చదవండి. లేకపోతే అవి చదివే అవకాశమే దొరక్కపోవచ్చు.
  • కరుణ మన జీవిత విధానం కావాలి. నిర్బంధం కాదు.
  • సంపదను కలిగి ఉండడంలో ఏమాత్రం తప్పులేదు. సంపద మీపై పెత్తనం చలాయించినప్పుడే తప్పు ప్రవేశిస్తుంది.
  • నిజాన్ని ఆమోదించని వారితో ఏం వాదించి లాభం ఉండదు.
  • గాలులు అలలు ఈ రెండూ ఉత్తముడైన నావికుడి పక్షాన్నే ఉంటాయి.
  • ఇతరుల తప్పుల వైపు ఎక్కువగా దృష్టిన్ని సారించేవారికి సొంత తప్పులను పరీక్షించేందుకు తీరిక లభించదు
  • మూర్ఖత్వంతో ప్రారంభమైన కోపం పశ్చాత్తాపంతో ముగుస్తుంది.
  • మనసునిండా నిజాయతీ పెల్లుబకాలే కాని, అటువంటి మనిషి తక్కిన ఎంతోమందికన్నా మిన్నగా దేశానికి సేవలు అందించగలుగుతాడు - పండిట్ మోతీలాల్ నెహ్రూ.
  • నాగరికత అన్నది ఒక ఉద్యమం.నిబంధన కాదు అది సముద్రయానమే కానీ ఓడరేవు కాదు.
  • క్షణిక కోపాన్ని అణుచుకోగల వ్యక్తి ఒక రోజు దు:ఖాన్ని దూరం చేసుకోగలడు.
  • దేవుడు సత్యం. దేవుడు బ్రహ్మానందం. దేవుడు సౌందర్యం.
  • మీ వ్యవహారాలలో మెదడును ఉపయోగించి ఇతరుల వ్యవహారాలలో మీ హృదయాన్ని వాడండి.
  • కలసి ఎదగడం అన్నదానికంటే ఎదగడం అన్నది అంత మంఖ్యమైనది కాదు.
  • బాధలను తట్టుకోగల అనంత సామర్ధ్యాన్నే ప్రతిభ అంటారు.
  • పంతులు లేని బడి, దేవుడు లేని గుడి, మనసులేని మనిషి ఒకటే -బాబా.
  • కోపం పాపానికి ధూపం. రోషం దోషానికి మూలం.
  • సతత ప్రయత్నం నైపుణ్యాన్ని కూడా అధిగమిస్తుంది.
  • తృప్తితో నిన్ను నీవు బలపరచుకో, అది ఎవరూ జయించలేని కోట.
  • యుద్ధ భూమిలో విజయాన్ని సాధించిన వారికి మాత్రమే కాకుండా ప్రశాంతతను శాంతిని కాపాడిన వారికి కుడా కీర్తి దక్కుతుంది.
  • తనను తాను తెలుసుకోవడమే ఈ ప్రపంచంలోని అతి కష్టమైన పని.
  • సంతృప్తి పేదవానికి సంపద ఇస్తుంది. అసంతృప్తి ధనవంతుణ్ణి పేదవానిగా చేస్తుంది.
  • మీ లక్ష్యం నుండీ మీ దృష్టిని మరలించినప్పడు అడ్డంకులనే భయాలను మీరు చూస్తారు.
  • తెలివితేటలంటే విన్నదాంట్లో సగాన్ని మాత్రం విశ్వసించడం.
  • పుస్తకాలు లేని పక్షంలో్ ఈ ప్రపంచం తప్పుకుండా నిర్మానుష్యం అయిన ఎడారి ప్రాంతం అవుతుంది.
  • ఆశావాది గులబీను చూస్తే నిరాశావాది ముల్లును చూస్తాడు.
  • నేను యుద్ధాన్ని కోల్పోవచ్చును. కానీ ఒక నిమిషాన్ని మాత్రం పోగొట్టుకోలేను.
  • సంతృప్తి కలవాడే ధనవంతుడు.
  • అక్కరకు మించిన తెలివి వివేకం అనిపించుకోదు.
  • బాధపడటం అనేది సోమరి లక్షణం దాన్ని వదిలేయండి.
  • ఇతరుల పట్ల స్నేహంగా ఉండండి. అప్పుడే స్నేహితులు మీ చుట్టూ చేరుతారు.
  • ఇతురుల తప్పులను క్షమించడం, మరచిపోవడం అనేవి మంచితనానికి అసలు సిసలైన నిదర్శనాలు.
  • బావి లోతుకన్న మనసు లోతు మిన్న.
  • తనకు తానుగా నచ్చచెప్పుకునే వ్యక్తే మంచి వక్త.
  • మృదువైన సమాధానం ఆగ్రహాన్ని పోగొడుతుంది.
  • కార్యశూరుడి వలె ఆలోచించు, అలోచనాపరుడిగా వ్యవహరించు.
  • అభిప్రాయానికి, ఆచరణకి మధ్య ఉన్న విరామం, కాలం.
  • గొప్పవారి యొక్క గొప్పతనం, వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది.
  • ఎప్పుడూ జయమే సాధించే ఎదురులేని అస్త్రం ప్రేమ.
  • అఙ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువవుతుంది. నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది.
  • మీరు మంచి వారు మాత్రమే కాదు మంచికి కూడా కారకులు.
  • రోజులు తెలుసుకోలేనిదాన్ని సంవత్సరాలు ఎక్కువగా బోధిస్తాయి.
  • మీరు మీరుగా ఉండండి. పక్షపాత రహితంగా సీదాసాదాగానూ, నిజాయితీతోనూ ఉండండి.
  • మంచి చెడులను ఎంచగలిగే వివేకమే మానవాళి మనుగడుకు రక్ష.
  • సుగుణం వెలకు అతీతమైనది.
  • పోరాడక పోవడం కన్నా, పోరాడి ఓడిపోవడమే గొప్పతనం.

No comments:

Post a Comment