సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 19


  • దైవకార్యంలో పాల్గొనే అవకాశం కలిగిన వాడే అందరినీ మించిన అదృష్టవంతుడు.
  • ప్రతి కష్టంలో గొప్ప లాభాలను ఆర్జించి పెట్టే విత్తులుంటాయి.
  • గొప్పతనానికి మించిన నిరాడంబరత మరొకటి లేదు. కానీ నిరాడబరత నిజంగానే గొప్ప విషయం
  • మనం ఎంత చదివితే మన అజ్ఞానం అంత బయటపడుతుంది.
  • సూర్యకాంతి వైపు మీ ముఖాన్ని పెట్టుకోండి, నీడలు మీ వెనుక ప్రక్కపడతాయి.
  • బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడు ముందుగా నిద్రపోడు, అలాగే ఆలస్యంగా సైతం నిద్రలేవడు.
  • దైవ భక్తికి అర్ధం - ఆదర్శాల పట్ల ప్రేమ.
  • ఒక మేలైన మానవుడు తన మాటల్లో నమ్రతగా ఉంటాడు, కానీ తన పనుల్లో అధికంగా ఉంటాడు.
  • ఒకే ఒక ముద్దొచ్చే బిడ్డ ఈ ప్రపంచంలో ఉంది. ఆ బిడ్డను ప్రతి అమ్మ కలిగి ఉంటుంది
  • సాహసించని వాడు గెలుపును సాధించలేడు.
  • చేయూతనందించే చేతులలోనే గెలుపు తాళం చెవి ఉంటుంది.
  • దేశకాల పరిస్థితులకు అతీతమైనది సంస్కృతి.
  • ఎక్కడైనా భయపడే వ్యక్తి ఎక్కడా సురక్షితంగా ఉండలేడు.
  • ఇతరుల పట్ల స్నేహంగా ఉండండి. అప్పుడే స్నేహితులు మీ చుట్టూ చేరుతారు.
  • పేరు ప్రఖ్యాతులన్నది మీరు ఉన్న దానిని బట్టి ప్రజల ఆలోచన అవుతుంది. మీరు నిజంగా ఏమో అది మీ గుణగణాలు తెలియజేస్తాయి.
  • ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం.
  • క్రోధాన్ని జయించిన వ్యక్తి అందరినీ జయిస్తాడు.
  • ఒక మనిషి అంతః సౌందర్యం అతను మంచి ఆలోచనలు కలిగి ఉండటమే.
  • కదలకుండా నిలిచిన వాడే ఎక్కువ అలసిపోతాడు.
  • గొప్ప పనుల సుగంధమే పేరు ప్రతిష్టలు.
  • కుక్కకు ఎముక వేయడం దానం కాదు. కుక్కకున్నంత ఆకలి నీకున్నప్పుడు ఆ కుక్కతో ఎముకను పంచుకోవడం నిజమైన దానం.
  • నిజంగా వినయగుణం లేని నిజమైన గొప్పవాడు ఇంతవరకు ఎవరూ పుట్టలేదు
  • పతకాన్ని గెలుచుకోవడంలో కాదు పందెంలో పాల్గొనడంలోనే గెలుపు ఉంది.
  • వ్యక్తిగతశాంతి విశ్వశాంతికి బాటను వేస్తుంది.
  • సమయాన్ని వ్యర్థం చేయడం చాలా సర్వసాధారణమైన నేరం.
  • గొప్పవాడిగా కనిపించేందుకు ప్రయత్నించే మనిషి మరీ అంత మరుగుజ్జుగా మరెప్పుడూ కనిపించడు.
  • అంతరాత్మను జయించిన వ్యక్తి అన్ని రకాల అవరోధాలను అవలీలగా జయించగలుగుతాడు.
  • తెలుసు కోవటం కంటే తెలుసుకున్న దానిని జీర్ణించుకోవటం ముఖ్యం.
  • ప్రతుకూల పరిస్ధితులలో సాధించిన విజయం ఎనలేని ఆనందాన్ని తెచ్చిపెడుతుంది.
  • గుణశీలాలు జీవితపు మకుటంతో పాటు యశస్సు కూడా.
  • గుప్తంగా ఉంచబడిన గొప్ప కార్యాలు చాలా ఆదరణీయమైనది.
  • అన్ని ఆశలు అడియాసలైనప్పుడు మన ముందు భవిష్యత్తు అలానే స్ధాణువుగా ఉంటుంది.
  • స్నేహితుడు లేని జీవితం సాక్షి లేని మరణం లాంటిది.
  • కలల స్ధానంలోకి శోకం, క్షోభ వచ్చేవరకు మనిషి వృద్ధుడు కాడు -జాన్ బారీమోర్.
  • విశ్వాసం ఉన్నవాడు బలవంతుడు. సందేహాల పుట్ట బలహీనుడు. గొప్ప కార్యాలు గొప్ప దృఢ విశ్వాసాన్ని అనుసురిస్తాయి.
  • మీ కోరికలు అంతులేనివి అయివుంటే మీ జాగ్రత్తలూ, మీ భయాలూ కూడా అంతులేనివిగా ఉంటాయి.
  • సాహసవంతుడి వరకూ అదృష్ట దురదృష్టాలు కుడి ఎడమల లాంటివి. అతడు రెండింటినీ వాడుకుంటాడు.
  • ఊరికే దొరికిన పుస్తకాన్ని సాధారణంగా చదవరు. డబ్బు పెట్టికొంటే తప్పకుండా చదువుతారు - శామ్యూల్ జాన్సన్.
  • నిస్వార్ధంగా తన జీవితాన్ని ఇతరులకు అంకితం చేయగలిగిన వాడికి ఏ నాడూ ఏ లోటూ ఉండదు.
  • ఎక్కువగా నమ్మడం వల్ల మోసపోవచ్చు, కానీ నమ్మకమే ఉంచకుండా బతకడం దుర్భరం.
  • భయం అనేది ఒక శారీరికమైన జబ్బు కాకపోవచ్చు. కానీ అది ఆత్మను చంపేస్తుంది.
  • పెట్టుబడి తానుగా చెడ్డది కాదు. దురుపయోగం అన్నదే చెడ్డది.
  • కాంతిని కోరేవారు చీకట్లను జయించేందుకు సంసిద్ధులై ఉండాలి.
  • విజయవంతమైన వ్యక్తి కావడం కంటే విలువైన వ్యక్తి అవడానికి ప్రయత్నించండి.
  • ఎప్పుడూ నిజాయితీపై విశ్వాసం ఉన్నవారే అందరిచేత గౌరవింపబడుతారు.

No comments:

Post a Comment