సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 27


  • పోరాడక పోవడం కన్నా, పోరాడి ఓడిపోవడమే గొప్పతనం.
  • మనసా వాచా కర్మణా పరిశుద్ధంగా ఉన్నప్పుడే మీరు మీ మనసును భగవంతుడి స్వరంతో ఏకం చేసుకోగలుగుతారు.
  • మీ దగ్గరున్న పరికరం సుత్తి మాత్రంమే అయితే ప్రతి ఒక్కదాన్ని మీరు మేకుగా భావించవలసి వస్తుంది.
  • వినయం ప్రతిష్ఠకు సులభ మార్గం.
  • తమ సొంతం అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం.
  • మీరు మాట్లాడే విషయాన్ని గురించి ఆలోచించండి. అంతేకాని మీరు ఏమి ఆలోచించారో దాన్ని గురించి మాట్లాడకండి.
  • దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు.
  • మీ తప్పులు మీ విజయానికి కావల్సిన కొత్త పాఠాలు.
  • బాగా బతకాలని కోరుకో. ఎక్కువ రోజులు బతకాలని కోరుకోకు.
  • మనిషి ఎప్పుడైతే అధికంగా వినడం నేర్చుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు.
  • సంపద ఉప్పు నీటి లాంటిది ఎంత తాగితే అంత దప్పిక పెరుగుతుంది.
  • మూర్ఖులు విజయాన్ని, యోగ్యులు కీర్తిని పొందుతారు.
  • గుడ్డివాడికి మరో గుడ్డివాడు దారి చూపితే ఇద్దరూ గోతిలో పడతారు.
  • సాంకేతిక నిపుణత్వాన్ని మాత్రమే కాదు. ఆత్మ గొప్పతనాన్ని కూడా సాధించాలి.
  • ధనవంతుడి జోకులు ఎల్లప్పుడూ తమాషాగానే ఉంటాయి.
  • చదువు సారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది.
  • ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించి చూడాలంటే అతనికి అధికారం ఇచ్చి చూస్తే చాలు.
  • విజయవంతమైన జట్టుకు చేతులనేకం, కానీ మనసుమాత్రం ఒకటే
  • సూర్య కిరణాల లాగా మంచి నడవడిక కాంతిని నలుమూలలా ప్రసరింపజేస్తుంది.
  • చూస్తున్న పొరుగువాణ్ణి ప్రేమించలేనివాడు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు?
  • సుగుణమే నిజమైన గొప్పదనం.
  • దృఢనిర్ణయం అన్నది విజయపథంపై మనం మొదటి అడుగు అవుతుంది.
  • ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న.
  • పనిని బాగా ప్రారంభించినప్పుడే ఆ పని సగం పూర్తి అవుతుంది.
  • మహాపురుషుల జీవితాలే మానవాళికి ఉత్తమ ఉపాధ్యాలు
  • విమర్శకుల విమర్శనను పట్టించుకోకండి. విమర్శకుడి గౌరవార్ధం ఇంతవరుకు ఎక్కడా శిలా విగ్రహం ప్రతిష్ఠాపింపబడలేదు.
  • మీ సంతోషం కోసం ఆహారం తీసుకోండి. కానీ ఇతరుల సంతోషం కోసం దుస్తులు ధరించండి.
  • నవ్వుతూ ఓడిపోయే వాడే గెలుపును సాధించే వ్యక్తి.
  • చిత్తశుద్దిలేని విద్య ప్రమాద భరితమూ, భయానకమూ అవుతుంది
  • మితిమీరిన అభిలాష కలిగిన వాడే దరిద్రుడు.
  • పుస్తకాలను చదవాలనే కోరిక ఉన్నవారు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండగలుగుతారు.
  • నీవు ఒక పొరబాటు చేసి, మరో కొత్త పొరబాటు చేసేందుకు అనుభవం సంపాదించుకుంటావు.
  • పంతులు లేని బడి, దేవుడు లేని గుడి, మనసులేని మనిషి ఒకటే -బాబా.
  • మనకు ఉన్నదాన్నే ఉత్తమంగా రూపొందించుకుంటామని తీర్మానించుకుందాము.
  • అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక.
  • గెలుపు అన్నది ప్రయాణం, లక్ష్యం కాదు.
  • సున్నితంగా, సరదాగా మాట్లాడగలిగిన వారినే అందరూ ఇష్టపడతారు.
  • చేయూతనందించే చేతులలోనే గెలుపు తాళం చెవి ఉంటుంది.
  • చదువు చేత నిర్దేశింపబడి ప్రేమ ద్వారా ప్రోత్సహింపబడేదే మంచి జీవితం.
  • ఏమి జరిగినా ఏమి జరగనట్లే ఎప్పుడూ ప్రవర్తించు.
  • దారి మాత్రం తెలిసి వాహనం నడిపే కళతెలియని వ్యక్తిని విమర్శకుడు అంటారు.
  • చాలా తక్కువగా ఉన్నవాడు పేదవాడు. కానీ ఎక్కువకోసం ప్రాకులాడేవాడు అతి పేదవాడు.
  • చదివిన దానిని, విన్న దానిని ఆచరించడం సాధన.
  • కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడపకుండా జీవితాన్ని దాటలేడు.
  • విశ్వాసం, అఖండ విశ్వాసం, మనమీద మనకే విశ్వాసం, దేవుడి మీద కూడా అంతే విశ్వాసం. ఇవే గొప్పతనంలోని రహస్యాలు.

1 comment: