సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 17


  • విజయం అన్నది ఒక మనోభావన, అది మీ మనోబలంతో ప్రారంభమవుతుంది.
  • పరులకు సౌభాగ్యం సాధించడంలో సాయపడేవాడే ఆదర్శవాది - హెన్రీ ఫోర్డ్
  • విలాస వస్తువులను పొందడంలో కాదు కోరికలను తగ్గించుకోవడంలోనే ఆనందం ఉంది.
  • ఒక వస్తువు వినాశనం మరో ఉత్పత్తికి ఆలంబం.
  • శత్రువుల సంఖ్యను పెంచుకోదల్చుకున్నారా? అయితే కోంత మార్పును తీసుకుని వచ్చేందుకు ప్రయత్నించండి.
  • సమన్య అమావాస్యలా వున్నా, మది కౌముదిలా వుంచాలి.
  • చూస్తున్న పొరుగువాణ్ణి ప్రేమించలేనివాడు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు?
  • మరొకరి జీవితంలో సంభవిస్తున్నంత వరకు ప్రతి ఒక్కటి తమాషాగానే ఉంటుంది.
  • ప్రార్ధన వల్ల దేవుడు మారడు; ప్రార్ధించే వాడే మారుతాడు.
  • మన మాటలు చెప్పేదానికన్న మన జీవితం చెప్పేది ఉత్తమమైనది.
  • శాంతిని ఎవ్వరూ దానం చేయరు, ఎవరికి వారు సాధించుకోవాలి.
  • ఎన్ని సంవత్సరాలు జీవించారని కాదు. మీ జీవితానికి ఎంత ప్రాణం పోశారన్నదే ముఖ్యం.
  • ఈ రోజు మీకు నచ్చకపోయినాసరే, మిమ్మల్ని ప్రేమించేవారి సలహాను రాసిపెట్టుకోండి.
  • నోరు తెరవనంతవరకు మూర్ఖుడు నెగ్గుకొస్తుంటాడు.
  • ఒక అబద్దపు మిత్రుడు నూరుమంది శత్రువులకంటే కూడా ఎక్కువ హాని చేయగలడు.
  • తన కోసం ఎలాంటి కోరిక లేనివాడు అందరిచేత గౌరవాన్ని పొందుతాడు.
  • సాంకేతిక నిపుణత్వాన్ని మాత్రమే కాదు. ఆత్మ గొప్పతనాన్ని కూడా సాధించాలి.
  • వివిధ విషయాలకు సంబంధించినంతవరకూ అందరూ అవివేకులే.
  • మనం నిజంగా ఏమో అదే మన గుణం. మనం ఇతరులకు ఎలా కనిపిస్తామో అదే మన నడత.
  • దేని స్థానంలో అది ఉంటేనే ఉపయోగం ఉద్యానవనంలో ఆవు ఉండడం వల్ల ఏం లాభం?
  • మాటలను వ్యక్తపరచడంలో పాండిత్యాన్ని కనబరచే సామర్ధ్యాన్నే నిపుణత అంటారు.
  • నాలుకా, నాలుకా వీపుకు దెబ్బలు తేకు.
  • కార్యశూరుడి వలె ఆలోచించు, అలోచనాపరుడిగా వ్యవహరించు.
  • సర్వసంగ పరిత్యాగం చేయనిచే మనిషి తన హృదయాన్ని ఇతరుల కోపం పని చేయడంలో లగ్నం చేయలేడు.
  • మార్పు అన్నది జీవితానికి రుచినిచ్చే మసాలా లాంటిది.
  • తప్పులు ఎవరైనా చేస్తారు. కానీ మూర్ఖుడు తప్పులు చేస్తూనే ఉంటాడు.
  • ఆరోగ్యానికి, ఆనందానికి నీతిసూత్రాలే బలమైన పునాదులు.
  • ప్రతి పువ్వు ద్వారా శాంతినీ, పవిత్రతనూ, పరిపూర్ణతనూ ఇస్తానని దేవుడు వాగ్ధానం చేస్తున్నాడు.
  • కృతజ్ఞత అనేది ఒకరిపట్ల చూపవలసిందే కాని ఒకరి నుండి ఆశించవలసింది కాదు.
  • సత్యం అంతా శాశ్వతమైనది. సత్యం ఎవరిసొత్తూ కాదు. ఏ జాతికి, ఏ వ్యక్తికి సత్యంపై ప్రత్యేక హక్కు లేదు.
  • అన్ని విషయాలలో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం మంచిది.
  • తెలుసుకోడం కాదు, ఆచరించడమే కష్టం - షూకింగ్.
  • నీతిగల వానికి నిందాభయం లేదు.
  • నిజాయితీని కోల్పోయిన వ్యక్తి వద్ద కోల్పోవడానికి మరేమీ మిగిలి ఉండదు.
  • రాజును , పేదను మరణం మాత్రమే సమానంగా చేస్తుంది.
  • బాధలలో సుఖమయమైన రోజులను గుర్తు చేసుకోవడానికి మించిన గొప్ప దుఃఖం లేదు.
  • అరకొఱగా ఏ పనినీ చేయవద్దు.
  • శాంతంగా ఉండండి కానీ సోమరిగా మాత్రం కాదు.
  • మీపట్ల మీరు శాంతంగా వ్యవహరిస్తే ఇతరులతో మీరు ఎప్పుడూ ఘర్షణ పడలేరు.
  • నష్టంలో కష్టంలో దేవుడు గుర్తొస్తాడు.
  • మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చుకాని, ఏ పనీ చెయ్యకుండా మాత్రం మనం ఆనందం పొందలేం.
  • నిజమైన నమ్రతే గొప్పతనపు గుర్తు.
  • ఆత్మ బలం లోపించిన వ్యక్తిలో శ్రద్ద స్థిరపడదు.
  • జీర్ణించుకోలేనన్ని నమ్మకాలు మింగకూడదు.
  • వినయ విధేయతలున్నప్పుడు మీరు పూర్తిగా బీదవారు కాలేరు. వినయ విధేయతలు లేని పక్షంలో మీరు నిజంగా ధనవంతులు కాలేరు.

No comments:

Post a Comment