సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 25


  • కోపం యమధర్మరాజు లాంటిది.తృష్ణ వైతరణిలాంటిది. విద్య కామధేనువులాంటిది. ఇక సంతృప్తి దేవరాజైన ఇంద్రుడి నందనవనం లాంటిది.
  • అందరిని సంతోష పరచాలని ప్రయత్నం చేసే మనిషి ప్రయత్నాలు వ్యర్ధమైనవి.
  • మిత్రులకు పరస్పర విశ్వాసం ఉంటే చావు బ్రతుకులు ఆలోచించరు. మిక్కిలి ఒంటరిగా నిలబడే వాడే మిక్కిలి బలశాలి - ఇబ్బెన్.
  • యౌవనంలో కూడబెట్టు వార్ధక్యంలో వాడుకో.
  • మొక్కగా ఉన్నప్పుడు వంచితేనే మంచిది. మాను అయిన తరువాత వీలుకాదు.
  • మానవ చరిత్ర రోజురోజుకూ చదువుకూ. దుర్గతికీ మధ్య నడిచే పరుగుపందెంగా తయారవుతోంది.
  • ఈ రోజు మీకు నచ్చకపోయినాసరే, మిమ్మల్ని ప్రేమించేవారి సలహాను రాసిపెట్టుకోండి.
  • పని చేసే వేళలో పని, ఆటలు ఆడే సమయంలో ఆటలు ఆడండి.
  • ఆత్మను కోల్పోయాక లోకాన్నంతా జయించినా శాంతి సమకూరదు.
  • ప్రశంస అనేది మనిషి ప్రగతికి శత్రువు.
  • జిజ్ఞాస చదువు అనే కొవ్వొత్తి అవుతుంది.
  • అసూయ ఆత్మకు పచ్చకామర్లు.
  • పోరాడక పోవడం కన్నా, పోరాడి ఓడిపోవడమే గొప్పతనం.
  • అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు.
  • ప్రేమ గాఢమైతే తప్పులు పలుచనౌతాయి.
  • విశ్వాసం వ్యక్తిత్వాన్ని వైభవోజ్వలం చేస్తుంది.
  • నాలో ఎలాంటి లోపం లేదని ఉహించుకోవడమే తప్పులలో అతి పెద్ద తప్పు.
  • ప్రేమకు కట్టుపడి ఉన్న ప్రతి ఇల్లూ, స్నేహాన్ని అతిధిగా స్వీకరించిన ఇల్లూ నిజంగానే స్వర్గసీమ. కారణం అక్కడ హృదయం నివసిస్తుంది.
  • అనుబంధం లేకుండా ఏ అనుభవం రాదు.
  • మనోబలం లేకుండా గణనీయమైనదేదీ మనం సాధించలేము.
  • బాధ మనిషిని ఆలోచింపజేస్తుంది. ఆలోచనలు మనిషిని బుద్దిమంతుణ్ణి చేస్తాయి. వివేకం జీవితాన్ని ఓర్చుకునేలా చేస్తుందు.
  • పగ - ప్రతీకారం - ఈర్ష్య అసూయ - అసహ్యం విజయానికి శత్రువులు.
  • ఆశ జీవితం జీవితమే ఆశ.
  • మనలో ప్రశాంతతను కనుగొనలేని పక్షంలో దానికోసం ఇతర చోట్ల వెతకడం వ్యర్ధం.
  • అన్నీ భగవంతుడిపైనే ఆధారపడ్డాయన్నట్లు ప్రార్ధించు. అన్నీ నీపైనే ఆధారపడ్డాయన్నట్లు శ్రమించు.
  • సిరి సంపదలతో తులతూగుతున్నప్పుడు స్నేహితుల మనల్ని తెలుసుకుంటారు. కష్టాలలో మనం స్నేహితులను తెలుసుకుంటాము.
  • అవకాశాలు గ్రుడ్లలాంటివి. ఒకసారి ఒకటే వస్తుంది.
  • విశ్వాసం ఉన్నవాడు బలవంతుడు. సందేహాల పుట్ట బలహీనుడు. గొప్ప కార్యాలు గొప్ప దృఢ విశ్వాసాన్ని అనుసురిస్తాయి.
  • యుద్ధ భూమిలో విజయాన్ని సాధించిన వారికి మాత్రమే కాకుండా ప్రశాంతతను శాంతిని కాపాడిన వారికి కుడా కీర్తి దక్కుతుంది.
  • బాగా ఆలోచించడం మంచిది. దానికి ఒక ప్రణాళికను తయారు చేసుకోవడం మెరుగైనది. పనిని బాగా చెయ్యడం అన్నది ఉత్తమమైనది.
  • బలమే ప్రధానమైతే తేలును చూసి పులి భయపడవలసిన అవసరం లేదు.
  • కార్యశూరుడి వలె ఆలోచించు, అలోచనాపరుడిగా వ్యవహరించు.
  • అక్కరకు మించిన తెలివి వివేకం అనిపించుకోదు.
  • అపాయంను చూసి భయపడేవారికి ఈ ప్రపంచంలో అపాయం భయం ఎప్పుడూ ఉంటుంది.
  • అన్నింటినీ నమ్మేవాడూ నష్టపోతాడు ఏదీ నమ్మనివాడూ నష్టపోతాడు.
  • పుస్తక పఠనం వల్ల కలిగే అమితానందం, లాభలు మనకు జీవిత చరిత్రలను చదవటం వల్లే సాధరణంగా మనకు లభిస్తుంది.
  • మంచివాడు బతకడానికి తింటే చెడ్డవాడు తినడానికి బతుకుతాడు.
  • మనిషి పనులే అతడి ఆలోచనల ఉత్తమ వ్యాఖ్యాతలు.
  • దీపపు వెలుగు నూనెపై ఆధారపడి ఉంటుంది.
  • అడగడానికి భయపడేవాడు తెలుసుకోవడానికి సిగ్గుపడేవాడు అవుతాడు .
  • పుష్పానికి సుగంధం - మనిషికి వ్యక్తిత్వం.
  • మంచితనం ఉన్నవారు తమ బాధ్యతలను నిర్వహిస్తారు. మంచితనం లేనివారు తమ హక్కులపై దృష్టిని నిలుపుతారు.
  • మాటలు కంటే చేతలు మెరుగైనవి. గొప్పలు చెప్పుకోవడం కంటే పనులు చాలా గొప్పవి.
  • పేరు ప్రఖ్యాతులన్నది మీరు ఉన్న దానిని బట్టి ప్రజల ఆలోచన అవుతుంది. మీరు నిజంగా ఏమో అది మీ గుణగణాలు తెలియజేస్తాయి.
  • ఎప్పుడూ నిజాయితీపై విశ్వాసం ఉన్నవారే అందరిచేత గౌరవింపబడుతారు.

No comments:

Post a Comment