సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 6

  • పొరపాట్లను సరిదిద్దుకోవడం వివేకానికి గుర్తు.
  • తన కోరుకలనూ, వాంఛలనూ జయించిన వ్యక్తి తన అతి పెద్ద శత్రువును జయించిన వ్యక్తి అవుతాడు.
  • పతకాన్ని గెలుచుకోవడంలో కాదు పందెంలో పాల్గొనడంలోనే గెలుపు ఉంది.
  • అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరేవరకూ శ్రమించండి.
  • నివసిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల ప్రేమను పూర్తిగా అందించబడే చోటే గృహం అవుతుంది.
  • ఒకచోట ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో గడపలేకపోవడం చేతనే అందరూ బాధలకు గురి అవుతున్నారు.
  • తమకు తామే సహాయాన్ని చేసుకునేవారికే దేవుడు సహాయపడతాడు.
  • ఒంటరిగా ఉండగల సామర్ధాన్ని పొందండి. ఏకాంతపు లాభాలను పోగొట్టుకోకండి.
  • విచక్షణ రాహిత్యం మానసిక అంధత్వం.
  • గొప్ప పనుల సుగంధమే పేరు ప్రతిష్టలు.
  • శోకస్య కారణం మోహం మీలో దుర్గణాలన్నీ మోహాలే. వాటి ఫలితం ధుఃఖం. వాటిని వదిలించుకోండి.
  • మనం ఉన్న తీరు మన ఆలోచనల ఫలితమే.
  • పుస్తకాలు లేని పక్షంలో్ ఈ ప్రపంచం తప్పుకుండా నిర్మానుష్యం అయిన ఎడారి ప్రాంతం అవుతుంది.
  • పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే, మనుషులు నాలుకలు కారణంగా చిక్కుల్లో పడతారు.
  • ప్రతి ఒక్కరికి చెవి వొగ్గండి. కొంతమందికి మాత్రమే మాటివ్వండి.
  • జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశే మిగులుతుంది. అందుకే జీవితాన్ని శాసించటం నేర్చుకో.
  • సంతృప్తి కలవాడే ధనవంతుడు.
  • నిస్వార్ధంగా తన జీవితాన్ని ఇతరులకు అంకితం చేయగలిగిన వాడికి ఏ నాడూ ఏ లోటూ ఉండదు.
  • సరైనదేదో తెలుసుకుని దాన్ని చేయకపోవడం అన్నది పిరికితనం అవుతుంది.
  • కుంటివాని వద్ద నడక, మూగవాని వద్ద మాటలు నేర్వడం కుదరదు.
  • జీవిత పర్యంతం ప్రేమను అనుభవించేందుకు మిమ్మల్ని మీరే ప్రేమించుకోవాలి.
  • అంతరాత్మకు సంబంధించినంత వరకు అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి తావులేదు.
  • చదివిన పుస్తకాల నుండి జ్ఞానాన్ని పొంది పాఠాలను నేర్చుకోవడమే చదువు ఉద్దేశ్యం.
  • చెప్పకోదగ్గ విజయానికి మంచి గుణం పునాది అవుతుంది.
  • లెక్కించేందుకు ఇంకేమీ లేనప్పుడు, మనిషి తన వ్రేళ్ళను లెక్కిస్తాడు.
  • బాగా బతకాలని కోరుకో. ఎక్కువ రోజులు బతకాలని కోరుకోకు.
  • ఎల్లప్పుడు కాంతివంతమైన పక్షాన్ని చూస్తూ మీ ఆశీస్సులను లెక్కపెడుతూ ఉండండి.
  • గర్వం సమృద్దికి అవరోధం.
  • మనం సమాధానంలో భాగం కావాలి కాని, సమస్యలో భాగం కాకూడదు.
  • ఎలా చదవాలో తెలియాలే కాని ప్రతి మనిషీ ఒక మహా గ్రంధమే.
  • విద్య యొక్క అర్ధం, పరమార్ధం రెండూ వ్యక్తిని ఉత్తమమైన వానిగా రూపొందింపచేయడమే.
  • వివేకవంతులతో సాహచర్యం నిన్నుకూడా వివేకవంతుణ్ణి చేస్తుంది - మినాండర్.
  • చదువు సారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది.
  • గుడ్డివాడికి మరో గుడ్డివాడు దారి చూపితే ఇద్దరూ గోతిలో పడతారు.
  • అదుపులో ఆనందం, పొదుపులో భాగ్యం.
  • అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక.
  • ప్రేమతో సంరక్షణా భావంతో కూడిన మాటలు కలకాలం నిలిచిపోయే సార్ధకతను పొందుతాయి.
  • చెదరిపోయిన మనసు సంపూర్ణంగా దర్శించ లేదు.
  • ఎప్పుడూ నిజాయితీపై విశ్వాసం ఉన్నవారే అందరిచేత గౌరవింపబడుతారు.
  • పేదరికం నేరాలకు తల్లి.
  • మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు.
  • బాగా బతకాలని కోరుకో. ఎక్కువ రోజులు బతకాలని కోరుకోకు.
  • ఉపదేశం తరువాత మీరు చేసేదే మీ మతం.
  • త్వరగా పడుకోవడం త్వరగాలేవడం అన్న అలవాటు మనిషికి ఆరోగ్యాన్ని, సంపదనూ, వివేకాన్ని ప్రసాదిస్తుంది.
  • జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశే మిగులుతుంది. అందుకే జీవితాన్ని శాసించటం నేర్చుకో.

No comments:

Post a Comment