సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 26


  • ఆదర్శాలు నక్షత్రాల లాంటివి. మనం వాటిని చేరలేము. కాని వాటిని అనుసరించి మనం ఒక ప్రణాళికను తయారు చేసుకోగలం.
  • మనం ఇతరులకు యిచ్చే సంతోషమే మనం నిజంగా అనుభవించే ఏకైక సంతోషం.
  • మూర్ఖులు విజయాన్ని, యోగ్యులు కీర్తిని పొందుతారు.
  • తాను లూటీ చేసిన పుష్పాన్నే తేనెటీగ ఫలవంతం చేస్తుంది.
  • అవివేకి హృదయం అతని నోటిలో ఉంటే, వివేకి నోరు అతని హృదయంలో ఉంటుంది.
  • అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు.
  • ఇచ్చువారికి దేవుడు ఇవ్వకమానడు.
  • ఆలోచన లేని చదువు వృధాగా శ్రమించడం లాంటిది.
  • వయసులో రోజులు పొట్టి, ఏళ్ళు పొడవు, పెద్దయ్యాక ఏళ్ళు పొట్టి, రోజులు పొడవు.
  • చీకటిలో మీరు వ్యవహరించే తీరే మీ గుణశీలాలు.
  • విరగడం కంటే వంగడం మంచిది.
  • పరిపూర్ణత మానవునకు ఆదర్శం మాత్రమే సిద్దించుకోలేడు. అపరిపూర్ణుడు కాబట్టి. - గాంధీజీ
  • ఉపదేశం తేలిక. ఆచరణ అతి కష్టం.
  • అపాయంను చూసి భయపడేవారికి ఈ ప్రపంచంలో అపాయం భయం ఎప్పుడూ ఉంటుంది.
  • ఇంటిలో శాంతి నెలకొల్పాలన్నప్పుడు పక్కింటి తలుపులను బాది ప్రయోజనం లేదు.
  • తీసిన కొద్దీ చెలమలో నీరు ఊరినట్టు చదివిన కొద్దీ మనిషి వివేకం పెరుగుతుంది.
  • విద్య ఐశ్వర్యంలో ఆభరణము వంటిది; దారిద్ర్యంలో ఆశ్రయం వంటిది.
  • నెరసిన జుట్టు వయస్సుకు చిహ్నమే కాని, వివేకానికి కాదు.
  • సరిగా ఉండటం కంటే విమర్శించటం అతి తేలిక.
  • ఉజ్వల భవిష్యత్తు పై అచంచల విశ్వాసమే ఆస్తికత్వం.
  • మంచి ఉదాహరణే మనం ఇతరులకు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి.
  • మనలో తప్పులు లేకుండా ఉంటే ఇతరులలో తప్పులను చూసినప్పుడు మనకు ఆనందం కలుగదు
  • సంతృప్తి కలవాడే ధనవంతుడు.
  • తన జానెడు పొట్టకు బానిస అయిన వ్యక్తి భగవంతుణ్ణి ససేమిరా పూజించలేడు.
  • ఏ దేశానికైన ఆ దేశ సంస్కృతి అనేది ఆత్మలాంటిది.
  • మంచి చెడులను ఎంచగలిగే వివేకమే మానవాళి మనుగడుకు రక్ష.
  • కలసి ఎదగడం అన్నదానికంటే ఎదగడం అన్నది అంత మంఖ్యమైనది కాదు.
  • మంచి ఆరోగ్యం, మంచి తెలివి అన్నవి జీవితపు అతి గొప్ప వరాలు.
  • ఆంతరంగిక అనుభవంలోనే నిజమైన ఆనందం దాగుంది.
  • ఆరోగ్యానికి, ఆనందానికి నీతిసూత్రాలే బలమైన పునాదులు.
  • మతం భయాన్ని జయిస్తుంది. అది అపజయానికీ, మరణానికీ కూడా విఱుగుడు మందు.
  • ఏ ఆదర్శాలూ లేనివాళ్ళు తెడ్డులేని పడవలాంటి వారు.
  • దైవకార్యంలో పాల్గొనే అవకాశం కలిగిన వాడే అందరినీ మించిన అదృష్టవంతుడు.
  • స్వర్గం - నరకం రెండూ మనలోనే ఉన్నాయి.
  • చెడిపోయిన పాలను గురించి చింతించకు.
  • శుభ్రత దైవత్వానికి తరువాతది.
  • భయం నుండీ ద్వేషానికి దారి తీసే రోడ్డు అతి చేరువలో ఉంటుంది.
  • తెలివి తేటలన్నవి వివేకం అనిపించుకోవు.
  • ఏ దేశానికైన ఆ దేశ సంస్కృతి అనేది ఆత్మలాంటిది.
  • నిగ్రహించడమే ఆత్మ నిగ్రహం బాటపై మనం వేసే మొదటి అడుగు అవుతుంది.
  • విత్తొకటి నాటిన మొక్కొకటి రాదు.
  • అప్పుడప్పుడు అవకాశం అన్నది మారువేషంలో వస్తుంది. ఇదే దానితో వచ్చిన పెద్ద చిక్కు.
  • పరిచయం అవమానాన్ని పొందితే అపురూపత ప్రశంసలను గెలుచుకుంటుంది.
  • ఇద్దరు పోట్లాడుకుంటే ఆ యిద్దరు ఎల్లప్పుడూ తప్పుగా ఉంటారు.
  • ఏదైనా ఒక అవకాశం చేజారిపోయినప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా మరొక అవకాశం చేజారిపోకుండ జాగ్రత్తపడాలి.

No comments:

Post a Comment