సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 11


  • మనసు భగవంతుడికి అప్పగించి హస్తాలను పనికి అప్పగించెయ్ - స్వామి ఓంకార్.
  • మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడాని కంటే కూడా ఎక్కువగా భూమిపైన మిమ్మల్ని ప్రేమించే ఏకైక జంతువు కుక్క.
  • అర్ధం చేసుకోగలిగితే జీవితం ఉచితమైనది. ఆపార్ధం చేసుకుంటే మాత్రం జీవితం తెవులు అవుతుంది.
  • ఒక మేలైన మానవుడు తన మాటల్లో నమ్రతగా ఉంటాడు, కానీ తన పనుల్లో అధికంగా ఉంటాడు.
  • మీకు విశ్రాంతి తీసుకోవడానికి కూడా తీరికలేని సమయమే విశ్రమించే సమయం అవుతుంది.
  • పేరు ప్రఖ్యాతులన్నది మీరు ఉన్న దానిని బట్టి ప్రజల ఆలోచన అవుతుంది. మీరు నిజంగా ఏమో అది మీ గుణగణాలు తెలియజేస్తాయి.
  • సమకాలికులు మనిషి అర్హతను కాదు మనిషిని ప్రశంసిస్తారు. కానీ భావితరాలు మనిషిని కాదు మనిషి అర్హతను ప్రశంసిస్తాయి.
  • ముందుకు ఎదగనిది వెనక్కు ఎదిగి కుళ్ళిపోతుంది.
  • కష్టసుఖాలు మానసిక స్ధితులు.
  • అభిమానం అనేది అసాధారణ ధర్మంగా పరిణమిస్తే అహంకారం అవుతుంది.
  • మిమ్మల్ని బాగా ఆలోచించేలా చేయగల పుస్తకాలే మీకు బాగా సహాయం చేయగల పుస్తకాలు అవుతాయి.
  • మీ గురించి గభీరంగా ఆలోచించడం మొదలు పెడితే మీరు గొప్ప అపాయానికి గురికాగలరు.
  • తాను కోరుకున్న దానిని పొందడం అన్నది కేవలం సంతృప్తి మాత్రమే. ఇతరులు కోరేదాన్ని ఇవ్వడంలోనే ఆనందం ఉంది.
  • రెండు దుఃఖముల మధ్య విరామమే సుఖం.
  • చదువు సారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది.
  • పనిలేని మంగలి పిల్లి తల గొరిగెనంట.
  • గొప్ప విషయాలలో మనిషి తలదూర్చడం అన్నది గొప్ప అవుతుంది.
  • ఉదయం దినాన్ని సూచించినట్లే బాల్యం మనిషిని సూచిస్తుంది.
  • సిరి సంపదలతో తులతూగుతున్నప్పుడు స్నేహితుల మనల్ని తెలుసుకుంటారు. కష్టాలలో మనం స్నేహితులను తెలుసుకుంటాము.
  • మాట్లాడే ముందు ఆలోచించండి. దుమికే ముందు చూడండి.
  • నాలో ఎలాంటి లోపం లేదని ఉహించుకోవడమే తప్పులలో అతి పెద్ద తప్పు.
  • ఈ రోజు దొరికే గుడ్డుకంటే రేపు దొరికే కోడి మంచిది.
  • వయసు పెరిగే కొద్దీ అందం లోపలి వైపు అపహరించబడుతుంది.
  • ధనవంతుడిగా మరణించడం కంటే ధనవంతుడిగా జీవించడం హాయి.
  • యాభై మంది స్నేహిరులున్నారా? అది సరిపోదు. ఒక్క శత్రువున్నాడా? అది మరీ ఎక్కువ.
  • చాలాకాలం వరకు కొనసాగే అలవాటే మనిషి గుణం అవుతుంది.
  • రూపొందిచబడిన మనిషి దేవుడు అయితే చిక్కుకున్న దేవుడు మనిషి అవుతాడు.
  • జీవితంలో విజయాలు సాధించటానికి ఏకాగ్రత, తదేకదీక్ష అత్యంత అవసరం.
  • మంచి సలహాకూ, చెడు సలహాకూ మధ్యనున్న వ్యత్యాసాన్ని చెప్పగలిగితే సలహా అవసరమే మీకుండదు.
  • పరీక్షలకు గురికాకుండా మనిషి రాణించనట్లే రాపిడికి గురికాకుండా వజ్రం రాణించలేదు.
  • నలుగురి ముందు ఇవ్వబడిన స్నేహపూర్వకమైన హెచ్చరిక బహిరంగ మందలింపుతో సమమైంది.
  • చెడు అలవాట్లు అన్నవి మెత్తటి పరుపులాంటిది. పరుపు నెక్కడం సులభమే కానీ దాని నుండి కిందకు దిగడం కష్టం అయిన పని అవుతుంది.
  • పాపం అనేది వేరే ఒకచోట ఆవిర్భవించదు. చేసే దుష్కర్మలోనే పొంచి ఉంటుంది.
  • ప్రేమ కలిగిన వ్యక్తి దేవునికి సన్నిహితుడు. ఎందుకంటే - దేవుడే ప్రేమ.
  • ధైర్య సాహసాలున్న ఒక వ్యక్తి మెజారిటీ అవుతాడు.
  • జూదంతో పోగొట్టుకున్న డబ్బు జూదరిని ఆటతో ఎలా కట్టిపడేస్తుందో అదేవిధంగా అనారోగ్యం ,దుఃఖం అన్నవి జీవితం పట్ల ప్రేమను పెంచుతాయి.
  • ఏ పనిలోనైనా విజయం సాధించాలి అని అనుకుంటే అందుకు పద్దతిగా వ్యవహరించడం చాలా ముఖ్యం.
  • శాంతంగా ఉండండి కానీ సోమరిగా మాత్రం కాదు.
  • ఎదుటి వారిని సంతోషింపజేయడంలోనే సంతోషం ఉంది.
  • మనసన్నది బంగారం గనితోపాటు ఒక చెత్తకుండి కూడా.
  • మనిషి స్వతంత్రంగా పుట్టాడు. కాని అతడు అన్నిచోట్లా బంధాలతో బంధింపబడి ఉన్నాడు.
  • మీ తప్పులను ఇతరులు అతిశయోక్తిగా చెప్పేముందే మీరు ఒప్పుకోండి.
  • ప్రేమ గాఢమైతే తప్పులు పలుచనౌతాయి.
  • మాటలను వ్యక్తపరచడంలో పాండిత్యాన్ని కనబరచే సామర్ధ్యాన్నే నిపుణత అంటారు.
  • నమ్మకం అన్నది మనకు వెలుగు నివ్వడమే కాకుండా చుట్టుపక్కల కాంతిని ప్రసరింపజేసే అఖండ దీపంగా ఉండాలి.

No comments:

Post a Comment