- నలుగురి ముందు ఇవ్వబడిన స్నేహపూర్వకమైన హెచ్చరిక బహిరంగ మందలింపుతో సమమైంది.
- వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్దకం మెదడును నిస్తేజం చేస్తుంది.
- ప్రపంచంలోని ఏ వ్యక్తుల విజయాలను తీసుకున్నా, వాటికి కారణం ఆ వ్యక్తుల తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే.
- ఆశావాది గులబీను చూస్తే నిరాశావాది ముల్లును చూస్తాడు.
- శాంతగుణంతో కోపాన్నీ, చెడును మంచితో, పిసినిగొట్టుతనాన్ని ఉదార గుణంతో, అతి వాగుడుతనాన్ని నిజంతో అధిగమించండి.
- ప్రేమించిన వారే భగవంతుణ్ణి కనుగొనగలిగారు.
- వివిధ విషయాలకు సంబంధించినంతవరకూ అందరూ అవివేకులే.
- ఇచ్చువారికి దేవుడు ఇవ్వకమానడు.
- వివేకం అన్నది మెదడులో ఉంటుంది. కానీ గడ్డంలో కాదు.
- ప్రమాదానికి సిద్దపడితే తప్ప ప్రమాదాన్ని దాటలేరు.
- ప్రలోభాలకు లోనై ఏకాగ్రతను పోగొట్టుకుంటే లక్ష్యాన్ని సాధించలేరు.
- జాతికి సంపద వెండి, బంగారాలు కాదు - సజ్జనులు.
- చిన్న చిన్న పనులే విశిష్టతను దారి తీస్తాయి. కానీ విశిష్టత చిన్నది కాదు.
- ధనవంతుడిగా మరణించడం కంటే ధనవంతుడిగా జీవించడం హాయి.
- రోజులు తెలుసుకోలేనిదాన్ని సంవత్సరాలు ఎక్కువగా బోధిస్తాయి.
- 'అంతా తనదే' అన్నది మమకారము.'అంతా తనే' అన్నది అహంకారము.
- అన్నింటికీ మించిన నేరం అన్యాయంతోనూ, అక్రమాలతోనూ రాజీ పడటమే.
- ఏ విషయాన్నైనా స్పష్టంగా చూడగలిగిన వ్యక్తే నిజమైన మేధావి.
- ఓటమి లేనివాడికి అనుభవం రాదు. అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు.
- ఓడిపోయేవారు ఒక్కసారే ఓడిపోతారు.గెలిచేవారు తొంబైతొమ్మిదిసార్లు ఓడిపోతారు.వందసార్లు ప్రయత్నిస్తారు కాబట్టి.
- గమ్యం చేరుకోవటం కంటే, నమ్మకంతో ప్రయాణం చేయటమే మేలైనది.
- గెలిచినపుడు గెలుపును స్వీకరించు,ఓడినపుడు పాఠాన్ని స్వీకరించు.
- గౌరవాలు పొందడం కాదు గొప్ప - వాటికి తగిన అర్హత సాధించడం గొప్ప.
- తపన, పట్టుదల ఉన్న వారి దగ్గరికే విజయం వస్తుంది.
- నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే,నువ్వు తప్పు చేస్తునావని కాదు.నువ్వు చేస్తున్నపని వారికీ నచ్చలేదన్నమాట.
- బలీయమైన ప్రతిపక్షం లేనిదే ప్రభుత్వం ఎంతోకాలం సుస్థిరంగా వుండజాలదు.
- మన కష్ట సుఖాలకు తరచూ కారణమయ్యేది మన మాట తీరే.
- ''విజ్ఞానం అంటే తనకు అంతా తెలుసునన్న అహంకారం. వివేకం అంటే తనకు ఏమీ తెలియదన్న వినమ్రత''
- ప్రియంగా, హితంగా, సత్యంగా మాట్లాడటం ఓ తపస్సు.
- విజేత వెనుక ఉండేది అదృష్టమో మంత్ర దండమో కాదు. చక్కని ప్రణాళిక , కటిన శ్రమ , అంకిత భావం.
- శిఖరం అంచుకు చేరుకున్నాక కూడా పడదోసేవారుండచ్చు. కాని శిఖరం అంత ఎత్తుకు ఎదిగిన వారిని పడదోయడం ఎవరి తరమూ కాదు.
- మీ కష్టాలను ఇతరులతో ఏకరువు పెట్టుకోకండి. చాలామంది వాటిని పట్టించుకోరు. మిగతావారు మీ కష్టాలను విని సంతోషిస్తారు.
- నీ అంగీకారం అనేది లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ తగ్గించలేరు.
- మీరు శిఖరాన్ని చేరాలనుకుంటే మీ ప్రయాణాన్ని కింద నుండీ ప్రారంభించండి.
- వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయండి.
- దేశకాల పరిస్థితులకు అతీతమైనది సంస్కృతి.
- ప్రేమ పొందే వారిని, పంచే వారిని - ఇద్దరినీ బాగుపరుస్తుంది - డా. కార్ల్ మెన్నింజర్.
- దైవకార్యంలో పాల్గొనే అవకాశం కలిగిన వాడే అందరినీ మించిన అదృష్టవంతుడు.
- పతనానికి సోపానాలు మూడు - నిర్లక్ష్యం, అజాగ్రత్త, పొరపాటు.
- మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో మనిషి అంత గొప్ప వాడవుతాడు.
- ఆకలే అన్నానికి పనికొచ్చే అతి మంచి పచ్చడి.
- ఈ రోజు మనం గతం శిఖరాలపై నిలుచుంటాము. కానీ ఇవి రేపటి పర్వత పద ప్రాంతాలవుతాయి.
- మన తప్పులను ఇతరులతో చూచినప్పుడు అవి మనకు కోపాన్ని తెప్పిస్తాయి.
- పూలలో సువాసన, మనుష్యులలో యోగ్యత అనేవి దాచినా దాగని వస్తువులు.
సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 29
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment