- విద్య ఇచ్చిన తేజస్సు అందరినీ ఆకర్షిస్తుంది.
- మంచివారితో కలిసి ఉండండి. కానీ ఇతరులను ఇష్టపడకున్నా వారిని ద్వేషించడం మాత్రం చేయకండి.
- సకాలంలో కావలసినంత వరకు సరైన వ్యక్తులపైన, సరైన విషయంలో కోపం చేసుకునే వ్యక్తి ప్రశంసింపబడతాడు.
- కామంనకు మించిన వ్యాధీ, బ్రాంతికి మించిన శత్రువూ, కోపానికి మించిన అగ్నీ, విద్యకు మించిన ఆనందం వేరొకటి లేదు.
- తృప్తితో నిన్ను నీవు బలపరచుకో, అది ఎవరూ జయించలేని కోట.
- అనుభవమే అన్ని విజయాలకూ మూలం.
- చిన్న పాఠకుడిగానే ప్రతి పెద్ద రచయిత ప్రారంభిస్తాడు.
- రహస్యమనేది మీలో మీరు దాచుకున్నంతసేపూ అది మీకు బానిస; బయటకు వొదిలారా, అది మీకు యజమాని.
- మీరు తప్పనిసరిగా చేయాల్సిన పనిని చిరునవ్వుతో చేయడం అన్నది సహకారం అవుతుంది.
- నిజాయితీని కోల్పోయిన వ్యక్తి వద్ద కోల్పోవడానికి మరేమీ మిగిలి ఉండదు.
- క్షమతో కోపాన్నీ, వినయంతో గర్వాన్నీ, ముక్కుకు సూటీగా పోయే గుణంతో మోసాన్నీ, సంతృప్తితో దురాశను జయించండి.
- జీవించడం అన్నది ముఖ్యంకాదు ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేసామన్నది ముఖ్యం.
- దిగులు, దౌడు తీసే గుర్రంలాంటిది. దౌడు తీస్తూనే ఉంటుందే కాని అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకవెళ్ళదు.
- మనిషిపట్ల మనిషికున్న అమానుషత్వం లెక్కలేనంత వేల మందిని విచారపడేలా చేస్తుంది.
- కళ పొడవైనది జీవితం కురచైనది.
- విశ్వాసం. ఉత్సాహం అన్నవి గెలుపు రెక్కలవుతాయి.
- అజ్ఞానం నుండే భయం అన్నది ఎల్లప్పుడూ మొలకెత్తుతుంటుంది.
- చేసిన తప్పుడు పనులను గురించి చెప్పి పశ్చ్యాత్తాప పడటం అన్నది మంచి పనికి శ్రీకారం చుట్టే మంచి పని అవుతుంది.
- మీ హృదయాన్ని కరుణ, ప్రేమతో ఉప్పొంగించుకోండి.
- ఒంటరిగా నిలబడిన మనిషే ప్రపంచంలో దృఢమైన వ్యక్తి.
- శారీరక రోగాల కంటే మానసిక రుగ్మతలు ఎక్కువ హానిని కలిగిస్తాయి.
- పుస్తకాలను చదవాలనే కోరిక ఉన్నవారు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండగలుగుతారు.
- రాబోయే కష్టాన్ని దర్శించండి, అదే దానిని సగం దూరం చేసుకోవడం అవుతుంది.
- వినయం గొప్పతనాన్ని ప్రకటిస్తుంది.
- వివిధ విషయాలకు సంబంధించినంతవరకూ అందరూ అవివేకులే.
- నూనె లేని దీపం వెలగనట్లే భగవంతుడు లేని మనిషి జీవించలేడు.
- పుస్తకం విలువను ధరకాదు దాని ఉపయోగం నిర్ణయిస్తుంది.
- చెడ్డను నాటితే దక్కేది దుఃఖమే.
- ఈ రోజు దొరికే గుడ్డుకంటే రేపు దొరికే కోడి మంచిది.
- మీరు మంచి వారు మాత్రమే కాదు మంచికి కూడా కారకులు.
- మంచివాడు బతకడానికి తింటే చెడ్డవాడు తినడానికి బతుకుతాడు.
- నిరాడంబరమైన,.యదార్థమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి.
- మనిషి వలన దేవుడు ఇంకా నిరుత్సాహపడలేదన్న దేవుడి సందేశాన్ని ప్రతి శిశువు తనతో తీసుకవస్తుంది.
- అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు - మహాత్మాగాంధి.
- విజయం గురించే ఎక్కువగా ఆలోచించండి.
- దారి మాత్రం తెలిసి వాహనం నడిపే కళతెలియని వ్యక్తిని విమర్శకుడు అంటారు.
- కొద్ది కోరికలతో, చిన్న విషయాలతో తృప్తి పడటమే ఉత్తముని లక్షణం.
- ఓటమి అన్నది గెలుపుకు మీరు చెల్లించే ట్యూషన్ ఫీజు.
- తుఫానులో చేసిన ప్రమాణాలను ప్రశాంతంలో మరచిపోతాం.
- ఆశావాది గులబీను చూస్తే నిరాశావాది ముల్లును చూస్తాడు.
- అనుభవమే అన్ని విజయాలకూ మూలం.
- అలవాటు మానవ స్వభావాన్ని నియత్రించే చట్టం - కార్లెయిల్.
- మనలో తప్పులు లేకపోతే ఇతరుల తప్పులను ఎత్తిచూపడానికి అంత ఉత్సాహపడము
- లోభికి నాలుగు దిక్కులా నష్టం.
- సమకాలికులు మనిషి అర్హతను కాదు మనిషిని ప్రశంసిస్తారు. కానీ భావితరాలు మనిషిని కాదు మనిషి అర్హతను ప్రశంసిస్తాయి.
సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 2
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment