సూక్తులు - మంచి మాటలు - నీతి వాక్యాలు : భాగం - 24


  • మనస్సు గాలిగొడుగు లాంటిది. తెరచినప్పుడే అది పనిచేస్తుంది.
  • ఎన్ని సంవత్సరాలు జీవించారని కాదు. మీ జీవితానికి ఎంత ప్రాణం పోశారన్నదే ముఖ్యం.
  • ఆలోచన లేని చదువు వృధాగా శ్రమించడం లాంటిది.
  • మనం సమాధానంలో భాగం కావాలి కాని, సమస్యలో భాగం కాకూడదు.
  • మనం దయను అర్ధించేంత నిజాయితీతో, దయను పొందినప్పుడు కూడా అంతే నిజాయితీతో దయకు ధన్యవాదాలు తెలియజేయాలి.
  • మరణ భయం మనల్ని మన పూర్తి జీవితాన్ని జీవించకుండా అడ్డగిస్తుంది.
  • ఆలోచన అనేది - ఒక మొగ్గ, భాష అనేది - చిగురు, కార్యం అనేది - దాని వెనుకనున్న ఫలం.
  • మన మాటలు చెప్పేదానికన్న మన జీవితం చెప్పేది ఉత్తమమైనది.
  • మనస్సును చెదిరించడం బలహీనత, మనసు లగ్నం చేయడమే శక్తి.
  • మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడాని కంటే కూడా ఎక్కువగా భూమిపైన మిమ్మల్ని ప్రేమించే ఏకైక జంతువు కుక్క.
  • అదృష్టం సాహసవంతులను వరిస్తుంది.
  • బాధలను తట్టుకోగల అనంత సామర్ధ్యాన్నే ప్రతిభ అంటారు.
  • అంకెలతో దేన్నయినా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప.
  • సూర్యుడి వైపు ముఖం చేయండి. అప్పుడు చెడు మీకు కనిపించదు.
  • సామెత, బహు గొప్ప అనుభవంపై ఆధారపడిన చిన్న వాక్యం.
  • ఏదైనా ఒక అవకాశం చేజారిపోయినప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా మరొక అవకాశం చేజారిపోకుండ జాగ్రత్తపడాలి.
  • గాలులు అలలు ఈ రెండూ ఉత్తముడైన నావికుడి పక్షాన్నే ఉంటాయి.
  • మంచివాడు బతకడానికి తింటే చెడ్డవాడు తినడానికి బతుకుతాడు.
  • సంతృప్తి ఉన్నప్పుడు ఏమీ లేనిదాంట్లో కూడా మనం సర్వస్వంను చూడగలం.
  • ఏ గొప్పవ్యక్తి వ్యర్ధంగా జీవించడు. ప్రపంచ చరిత్ర అంతా గొప్ప వ్యక్తుల జీవిత (ఆత్మ) కథలే - థామస్ కార్లెల్.
  • శోకస్య కారణం మోహం మీలో దుర్గణాలన్నీ మోహాలే. వాటి ఫలితం ధుఃఖం. వాటిని వదిలించుకోండి.
  • జీవితంలో విజయాలు సాధించటానికి ఏకాగ్రత, తదేకదీక్ష అత్యంత అవసరం.
  • ఈ రోజు దొరికే గుడ్డుకంటే రేపు దొరికే కోడి మంచిది.
  • సమన్య అమావాస్యలా వున్నా, మది కౌముదిలా వుంచాలి.
  • ప్రారంభ వస్తువులన్నీ (విషయాలన్నీ) ఉత్తమంగానే ఉంటాయి - లార్డ్ ఛెస్టర్‌ఫీల్డ్.
  • మనుషులు పాలించడాన్ని సులభమైనదానిగా కనుగొన్నారు. తమను తాము హద్దులో పెట్టుకోవడమే వారికి కష్టమైంది.
  • జీవితం నాకు ఆలోచించడం నేర్పింది. కానీ ఆలోచనలు ఎలా జీవించాలో తెలియజేయలేదు.
  • బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడు ముందుగా నిద్రపోడు, అలాగే ఆలస్యంగా సైతం నిద్రలేవడు.
  • మూర్ఖులు వివేకవంతులను చూసి నేర్చుకోవడం కంటే కూడా ఎక్కువగా వివేకవంతులు మూర్ఖులను చూసి నేర్చుకుంటారు.
  • తన తోటివారికి చేసిన మంచే మనిషి నిజమైన సంపద.
  • మీ పెదవుల ద్వారా కంటే మీ జీవితం ద్వారానే మీరు ఒక మేలైన నీతివాక్యాన్ని బోధించవచ్చు.
  • క్షణిక కోపాన్ని అణుచుకోగల వ్యక్తి ఒక రోజు దు:ఖాన్ని దూరం చేసుకోగలడు.
  • చేసిన తప్పును సమర్ధించుకోవడంతో అది రెండింతలు అవుతుంది.
  • వివిధ విషయాలకు సంబంధించినంతవరకూ అందరూ అవివేకులే.
  • మనోబలం లేకుండా గణనీయమైనదేదీ మనం సాధించలేము.
  • వాత్సల్యం న్యాయాన్ని గుడ్డిదానిగా మారుస్తుంది.
  • సాధువులూ, భగవంతుడూ వేరు వేరు కాదు.
  • పాపం అనేది వేరే ఒకచోట ఆవిర్భవించదు. చేసే దుష్కర్మలోనే పొంచి ఉంటుంది.
  • పని కంటే కూడా ఎక్కువ ప్రజలు చింత కారణంగా చనిపోవడం అన్నది పనిచేయకుండా చింతించడం వల్లే జరుగుతోంది.
  • పూచిన పువ్వులన్నీ కాయలైతే పట్టడానికి స్థలం ఉండదు.
  • మీ డబ్బును ఎలా జాగ్రత్తగా వాడుకుంటారో మీ సమయాన్ని కూడా అలాగే వాడుకోండి.
  • మనకు ఉన్నదాన్నే ఉత్తమంగా రూపొందించుకుంటామని తీర్మానించుకుందాము.
  • విద్య యొక్క అర్ధం, పరమార్ధం రెండూ వ్యక్తిని ఉత్తమమైన వానిగా రూపొందింపచేయడమే.
  • మనం అభ్యుదయాన్ని పొందాలంటే చరిత్ర తిరిగి రానివ్వకుండా కొత్త చరిత్రను సృష్టించాలి.
  • సహనం అందరికి అవసరం. మొదట మనకు అవసరం.

No comments:

Post a Comment