స్వామి వివేకానంద సూక్తులు

ఆకలితో అలమటిస్తున్న ఈ దేశ ప్రజలను హృదయపూర్వకంగా ప్రేమించిన నాడే మన భారతదేశం జాగృతమవుతుంది.

ప్రజలకు నాయకత్వం వహించేటప్పుడు వారికీ సేవకులలా మనం ప్రవర్తించాలి. స్వార్ధాన్ని విడనాడి కృషి చేయాలి.

నువ్వు స్వార్ధరహితుడవైతే ఒక్క పారమార్ధిక గ్రంధాన్నైనా చదవకుండానే, ఒక్క దేవాలయాన్నైనా దర్శించకుండానే పరిపూర్ణుడవుతావు.

ప్రజల పట్ల వాత్సల్యాన్ని చూపించాలి. పేదల సేవకన్నా మించిన భగవారాధన లేదు.

యువకులారా ! లెండి మేల్కొనండి! ఈ ప్రపంచం మిమ్మల్ని ఎలుగెత్తి పిలుస్తుంది. ఉత్సాహ భరితులై రండి.

ఒక మనిషి శీలాన్ని తెలుసుకోవాలంటే అతడు చేసే అతి సాధారణమైన పనుల్ని చుడండి, అసాధారణమైన కార్యాలను కాదు.

ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి ఆద్యాత్మిక విద్య ఒక్కటే శరణ్యం.

నువ్వు భగవంతుని కోసం ఎక్కడ వెతుకుతున్నావు? పేదలు,దుఃఖితులు,బలహీనులు అందరు దైవాలు కాదా ముందుగా వారినెందుకు పూజించకూడదు. గంగ తీరంలో బావి తవ్వడం ఎందుకు? ప్రేమకున్న అనంత శక్తిపై నమ్మకం ఉంచు.

పిరికివాడు మాత్రమే 'ఇది నా తలరాత' అని అనుకుంటాడు.

సిద్ధాంతాలు మతం కాదు. మంచిగా ఉంటూ మంచిని పెంచడమే మత సారాంశం.

యువకులారా! నా ఆశలన్నీ మీ మీదే ఉన్నాయి.నా మాటను విశ్వసించే సాహసం మీకు ఉంటే మీ అందరికి ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉంది.

ఈ లోకంలో సత్సాంగత్యం కంటే పవిత్రమైనది వేరొకటి లేదు.

సేవ చెయ్యి,ఏ స్వల్పమైనా ఇవ్వు, కాని బేరమాడ వద్దు.

ఎట్టి పరిస్థితులలోను నీవు శారీరకంగా కాని, మానసికంగా కాని, నైతికంగా కాని లేక ఆధ్యాత్మికంగా కాని బలహీనుడవు కాబోకు.

నీవు సదా విగ్రహమే దేవుడని భావించవచ్చు. కానీ దేవుడు విగ్రహమనే భ్రాంతి విడవాలి.

మహిళల స్థితి గతులను మెరుగు పరచకుండా ప్రపంచ సంక్షేమానికి ఎలాంటి ఆస్కారము లేదు. పక్షి ఒక్క రెక్కతో ఎగరడం సాధ్యం కాదు.

ఏదీ కోరని వారే ప్రకృతిని జయించినవారు.

ప్రయత్నం చేయని వాడి కంటే పాటు పడేవాడు ఉత్తముడు.

తన సంతానంలో ఏ ఒకరినైనా సేవించు అధికారమును భగవంతుడు నీకు ప్రసాదించినచో నిజంగా నీవు ధన్యుడవే. ఇతరులకు లేని సేవాభాగ్యం నీకు కలుగుట చేత ధన్యుడవైతివి. ఈ సేవనే ఆరాధనముగా భావించు.

నీ పురోభివృద్ధి కోసం, ఈ ప్రపంచం అనే ఒక వ్యాయామశాలను కల్పించినందుకు భగవంతున్ని కొనియాడు. నువ్వు ఈ ప్రపంచానికి సహాయం చేయగలనని ఎన్నడూ తలంచవద్దు.

స్వార్ధ చింతన లేనప్పుడే మనం ఘనకార్యాలు సాధిస్తాం. మన ప్రభావం ఇతరులపై పడుతుంది.

పుణ్యపురుషులు ఇతరుల కొరకే జీవిస్తారు. జ్ఞానులు ఇతరుల కొరకు తమ జీవితాన్నే అంకితమిస్తారు.

త్యాగమూ, సేవ భారతదేశ ఆదర్శములు.వీటిని పటుతరం చేస్తే అంతా బాగుంటుంది.

మానవుణ్ణి అధ్యయనం చేయి, అతడే సజీవ కావ్యం.

మీరు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే ఆత్మగౌరవం.

ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవద్దు. నీకు ఈ లోకంలో అసాధ్యమేమి లేదు.

పలువురి హితం కోసం అందరి సుఖం కోసం ఈ లోకంలో ధైర్య స్తైర్యాలు మెండుగా కలవారు తమను త్యాగం చేసుకునే తీరాలి. ఎప్పటికి తరగని శాశ్వతమైన ప్రేమ,కరుణాకటాక్షాలు కలిగిన బుద్ధులు నేటికి అవసరం. 

No comments:

Post a Comment