స్వామి వివేకానంద సూక్తులు

గుడ్డిగా నమ్మడం పెద్ద తప్పిదం.

ఆధునిక ప్రపంచంలో పనిని గురించి మాట్లాడినంతగా ఆలోచనల్ని గురించి మాట్లాడటం లేదు.

బద్దకమే అసలు పాపం, అదే పేదరికానికి కారణం.

స్వర్గంలో జీవించడానికి,ఈ ప్రపంచంలో జీవించడానికి తేడా లేదు.

మూర్ఖులకు సెలవు దినం సోమరితనం,మన పేదరికానికి అసలు మూలం సోమరితనం.

వైవిద్యమే జీవితపు ఆత్మ.

ధనం శక్తి కాదు.మంచితనమే శక్తి.

పరిస్థితులకు ఆత్మ, ప్రజలకు మత్తు మందు, భౌతికంగా అనారోగ్యవంతుడికి ఏ మతము అంగీకారం కాదు.

మనం జీవితంలోనూ,అదృష్టంలోనూ,మతంలో కూడా వ్యాపారస్తులమే.

మనల్ని కౄరులగా మార్చేది మతమే, అత్యంత సాత్వికులుగా మార్చేది మతమే.

ప్రపంచంలో కోర్కెలే లేని మూర్ఖులు ఉంటారు. దానికి కారణం వాళ్ల మెదడు లోభభూయిష్టం కావడమే.

నిరుపేదల కష్టాలను చూచీ ద్రవించే హృదయం కలవాడే మహాత్ముడు.

ప్రతి జాతి,ప్రతి స్త్రీ,ప్రతి పురుషుడు తమ మోక్షసిద్ధికి తామే ప్రయత్నించాలి.

చాలా మందికి మోక్షం కావాలా అంటే అవునంటారు. కాని కొందరే పొందగలరు.

మనం గ్రహించాల్సింది సమాజానికి మోక్షం లభించనిదే వ్యక్తిగా మోక్షం కలుగదు.

జీవితపు రహస్యం సంతోషం కాదు. అనుభవం ద్వారా విద్య.

చరిత్ర మొదలైనప్పటి నుండి మనిషి రక్షణ కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు.

ధనం,సంపాదన తప్పనిసరిగా సామాన్య ప్రజల పేదరికాన్ని తగ్గిస్తాయి.

మనిషి లక్ష్యం న్యాయం కంటే మించినది.

వికాసానికి కారణం? కోరిక.

విచక్షణ కంటే భావావేశం గొప్పది. అయితే భావావేశం విచక్షణకు విరుద్ధంగా ఉండకూడదు.

మన అదృష్టానికి మనమే కర్తలం.

మొత్తం ప్రపంచ సంపద కంటే మానవులే విలువైనవారు.

నాగరకుడి వివేచనతో పని చేయడానికి విశ్రాంతి అవసరం.

ఈ దేశానికి వీరుల అవసరం వుంది.అందుకే వీరులుకండి.

పరతత్వాన్ని దాన్ని గూర్చి చెప్పే తత్వశాస్త్రమే వేదాంతం.

ప్రతి విజ్ఞాన శాస్త్రానికి దాని విధానం దాని కుంది.

మనం సంతోషపడే విషయాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి.

ప్రతి మానవజీవికి అనంతమైన సంతోష భావన వుంటుంది.

మతానికి కులం లేదు,కులం ఒక సామాజిక వ్యవస్థ.

సత్యాన్ని,స్వచ్ఛతను, అదృష్టాన్ని నాశనం చేయలేము.

మానవుడు స్వార్ధపు మోపు.

No comments:

Post a Comment