అబ్దుల్ కలాం సూక్తులు / కొటేషన్లు

నాకు తెలిసిందల్లా నేను నా లక్ష్యం పట్ల జాగరుకుడిగా దృష్టి కేంద్రికరించి ఉండాలని మాత్రమే.

భారతీయ అంతరిక్ష కార్యక్రమ ప్రయాణం యథార్ధంగా మొదలయ్యింది రోహిణీ ప్రయోగంతోనే.

విజయాన్ని సాధించాలనే లక్ష్యం నీకు ఉన్నప్పుడు.. ఆ లక్ష్యం పై పూర్తి ఏకాగ్రత సారించు.. నీ లక్ష్యం నెరవేరుతుంది.

ప్రతి శిశువూ కొన్ని సహజ లక్షణాలతో ఒక నిర్దిష్ఠ సాంఘిక ఆర్ధిక భావావేశ వాతావరణంలో జన్మిస్తాడు.

నాకు తెలిసినంత వరకూ భూమి అత్యంత శక్తివంతమైన గతిశీల గ్రహం.

కొంతమంది మనుషులు సైన్స్ అనేది వేరే ఒక అంశమనట్టుగా, అది మనిషిని భావంతుడినుంచి దూరం చేస్తుందన్నట్టుగా ఎందుకు మాట్లాడుతారో నాకర్ధం కాదు. విజ్ఞాన శాస్త్ర పథం మానవ హృదయ వీధుల్లోంచి సాగి పోయేదే. నాకయితే సైన్స్ ఎప్పుడూ ఆధ్యాత్మిక ఉన్నతికీ, ఆత్మ సాక్షాత్కారానికి మార్గంగేన్ ఉంటూ వచ్చింది.

ఆత్మాభిమానం అన్నది ఆత్మవిశ్వాసంతోనే వస్తుందన్నది మనం ఎందుకు అర్ధం చేసుకోము?

స్థిరంగా కనిపించే ప్రతిదానిలోనూ ఒక తీవ్ర చలనం నిబిడికృతమై ఉంటుంది.

బృంద నాయకత్వం వహించే వారిలో తరచూ రెండు రకాల ధోరణులు కానవస్తాయి. కొందరికి పని ముఖ్యం. కొందరికి పనికన్నా తమ సహచరులు ముఖ్యం. చాలామంది ఈ రెండు దృక్పథాల మధ్యలో ఎక్కడో ఒక చోట ఉంటారు.  
ఒక సారి నీ మనసు ఒక స్థాయిలో ఆలోచించడం మొదలయ్యాక తిరిగి పాత ప్రమాణల్లో ఆలోచించడం ఇంకెంత మాత్రం సాధ్యం కాదు.

ఇంతవరకు నేను ఆకాశమే సరిహద్దు అనుకున్నాను...కానీ ఇప్పుడర్ధమయ్యింది హద్దులు చాలా దగ్గరగానే ఉన్నాయని..జీవితాన్ని శాసించే సరిహద్దులున్నాయి. 'నువ్వింత బరువే మోయగలవు', 'నువ్వింత త్వరగానే నేర్వగలవు', 'నువ్వింత కష్టమే పడగలవు', 'నువ్వింత దూరమే పోగలవు' అంటూ.

తరగతిగదిలో నేర్చుకున్న సూత్రాన్ని వాడుకలో పెట్టి తెలుసుకోవడం విచిత్రమైన ఉద్వేగాన్ని కలగచేస్తుంది. అది అపరిచితుల నడుమ నీ పాత మిత్రుడిని పసిగట్టడం లాంటిది.

సంక్షోభం నుంచి,వేధన నుంచి, విషాదం నుంచి, వైఫల్యం నుంచి మనిషిని లేవనెత్తి అతన్ని సరైన మార్గానికి చేర్చే ఒక దివ్య శక్తి వుందని మనస్ఫూర్తిగా నమ్మాను.

మనిషి తన భౌతిక మానసిక బంధాలనుంచి బయట పడినపుడే అతడు స్వేఛ్ఛ, ఆనందం, మానసిక శాంతి దిశగా ప్రయణించగలడని తెలుసుకున్నాను.

అంతగా నిశితంగా చూడనివారికి మనం సుందరంగా ఆకర్షణీయంగా కనిపించవచ్చు . కానీ విమర్శనాత్మకంగా చూడగలిగిన వారికి మనం మన వివిధ రకాల నాయకుల వికృత అనుకరణలుగానే కనిపిస్తాం.

జీవితం ఒక కఠినమైన ఆట. కేవలం ఒక వ్యక్తిగా నీ జన్మహక్కును నిలబెట్టుకున్నపుడు మాత్రామే దాన్ని నువ్వు గెలవగలవు.

భారతదేశంలో మనం చదివేది కేవలం చావు,అనారోగ్యం, తీవ్రవాదం,నేరాల గురించే.
సమస్యలు నిన్ను ఆదేశించుటకు అనుమతించకు.

మనమందరం మనలో ఒక దివ్యాగ్నితో జన్మించాం. మన ప్రయత్నాలెప్పుడూ ఆ అగ్నికి రెక్కలిచ్చేలా ఉండాలి.తద్వారా ఈ ప్రపంచమంతా సత్ప్రకాశంతో వెలుగు పొందాలి.

ఆదరంగా సాహసంగా సత్యంగా క్షణ క్షణం సుదీర్ఘ దినాంత వేళ దాకా పనిచేసే హస్తాలే సుందరాలు.    

ఏ మతము ఇతరులను చంపమని ఆదేశించలేదు, దాని యొక్క ఆవశ్యకత సంరక్షణ లేక ఎదుగుదల కోసమే.

మనిషి అవసరాలు అతని యొక్క సమస్యలు, ఎందుకంటే అవి విజయాన్ని ఆనందించేదుకు అత్యావశ్యకం గనుక.
మనస్పూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు.

విజ్ఞానం పునాది లేని ఇంటిని సైతం నిలబెడుతుంది. కాని అజ్ఞానం ఎంతో దృఢంగా కట్టిన ఇంటిని కూడా పడగొడుతుంది.

నువ్వెప్పుడూ జ్ఞానమనే సముద్రంలో ముత్యంలా మెరవాలి.

పతి ఒక్కరూ అందంగానే పుడతారు. కాని కొందరు తమను వికృతంగా మార్చే అవకాశాన్ని ప్రపంచానికి ఇస్తూ ఉంటారు.

మీరు దేనినైనా కోరుకుంటే దాన్ని పొందేవరకు మీ ప్రయత్నాన్ని ఆపవద్దు. ఎదురుచూడటం కష్టంగానే ఉంటుంది. కాని దాన్ని పొందలేక పోయినప్పుడు కలిగే బాధను భరించటం మరింత కష్టంగా ఉంటుంది.

బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైనవారిని వదిలేయటం ఉత్తమం.

మీ అపజయాల్ని తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి. అవి తప్పులు కావు. భవిష్యత్తులో మీరేం చేయకూడదో తెలిపే పాఠాలు.

మంచి ఉద్దేశాలు కలవారు ప్రమాణాలు చేస్తారు. మంచి వ్యక్తిత్వం కలవారు మాత్రమే వాటిని నిలబెట్టుకుంటారు.

No comments:

Post a Comment