స్వామి వివేకానంద సూక్తులు

ముందు స్వచ్ఛంగా ఉండు, అప్పుడు అధికారం వస్తుంది.

అనుభవాల క్రమమే జీవితం.అనుభవమే గురువు..

అవివేకం మనల్ని మందలిస్తుంది.జ్ఞానం మనల్ని అందులోంచి విడిపిస్తుంది.

నన్ను తాకవద్దు అనడం ఓ మానసిక వ్యాధి, వ్యాప్తియే జీవనం,సంకుచితమే మరణం, ప్రేమ ద్వారా అందరిని నీలో ఇముడ్చుకో.

మతం ఒకరకంగా గొప్ప అనుభవమని మనం మర్చిపోకూడదు.

జీవితానుభవానికి చదువు బాలికల్లో ప్రభావం చూపడం లేదనే భావన ఇప్పటికి అలానే వుంది.
కులం,సామాజిక ఆచారం.ఎందరో మేధావులు దానిని కూలద్రోయడానికి ప్రయత్నించారు.

ఆత్మను గురించి తెలియకుండా దేవుణ్ణి గురించీ తెలుసుకోలేమని మన పురాతన గ్రంథాల భాష్యం.

ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే.

ఆలోచనలు జీవిస్తాయి,సుదూరం ప్రయాణం చేస్తాయి.

నీ ఆశయ సాధనలో వెయ్యిసార్లు విఫలం చెందినా ప్రయత్నం విరమించకు.

ప్రేమ,కోపం ఒకదాని కొకటి వ్యతిరేకం.

ఐశ్వర్యానికి తమ్ముడు అహంకారం.

చెడు తలచేవారు,కీడు తలపెట్టేవారు ప్రశాంతత కోల్పోతారు.వెలుగు చూడరు.

అదృష్టవంతునికి జాగ్రత్త తోడైతే ఎడారిని కూడా స్వర్గతుల్యం చేయగలడు.

గొప్ప కార్యాలెప్పుడు గొప్ప త్యాగాలవల్లే సాధించబడతాయి.

ఈ లోకాన్ని ఏ ఇద్దరు ఒకే మాదిరిగా చూడరు.

దానం చేయడం మన భాగ్యం. అది తెలుసుకోవడం వలనే మనం అభివృద్ది చెందుతున్నాం.

దేవుడొక్కడే,మనుషులు వేర్వేరు పేర్లతో పిలుస్తారు.

తమ మనుగడకై ఇతర దేశాలపై అధారపడే దేశాలు పతనం కాక తప్పదు.

మనిషైనా,జాతైనా ఇతరులను ద్వేషించి జీవించలేదు.

పొందాలనే కాంక్ష స్వార్ధం,స్వార్ధం దురవస్థకు దారి తీస్తుంది.

ధ్యానం మన ఊహను రూపొదించుకోవడం వల్ల సాధ్యమవుతుంది.

ఇంతకు ముందుకంటే ప్రపంచం నేడు జ్ఞానసముపార్జనలో మరింత ఐక్యమత్యంతో వుంది.
నాటకం అన్ని కళలలోకి కష్టతరమైంది.

No comments:

Post a Comment