మదర్ థెరిసా సూక్తులు

మీరు ప్రేమ లేకుండా అద్భుతాలు చేసే కంటే ,ప్రేమతో తప్పులు చేయుటయే కోరుకుంటున్నాను.

"మౌనం యొక్క ఫలితం ప్రార్ధన
ప్రార్ధన యొక్క ఫలితం నమ్మకం
నమ్మకం యొక్క ఫలితం ప్రేమ
ప్రేమ యొక్క ఫలితం సేవ
సేవ యొక్క ఫలితం సంతృప్తి."

దేనినైనా ప్రేమతో చేసి చుడండి,అది మీ జీవితాన్ని సంతోషపరస్తుంది.

మనుష్యులలో తప్పొప్పులు చూస్తూవుంటే ఒకరోజు నీకు ప్రేమ చూపేందుకు అవకాశమే దొరకదు.

మీరు చేసే తప్పు కూడా పునీతమవుతుంది, ఆ తప్పను మీరు ఒప్పుకుంటే.

ప్రేమ అనేది మాటలలో వచ్చేది కాదు.

ఓ కుష్ఠు వ్యాధిగ్రస్తుని దేహాన్ని తాకేటప్పుడు దేవుణ్ణి తాకుతున్నట్లే భావిస్తున్నాను.

కరుణ గల మాటలు తేలికైనవి. మాట్లాడేందుకు అనువైనవి.

చిన్న విషయాలు కదా అని అలక్ష్యం చూపకు. ధృడనిశ్చయం అనేది అక్కడే నిద్రావస్థలో వున్నది.

పేదల యొక్క పేదరికపు రూపంలో దర్శనం ఇచ్చే యేసు ప్రభువుకు సేవను చేయండి.

నూనె వేస్తూ ఉంటేనే దీపం వెలుగుతుంది. మనం ప్రేమ చూపిస్తుంటేనే మనపైన ప్రేమ అనే ప్రకాశం పడేది.

మంచిని చెయ్యుట మీ ఇంట్లోనో,పాఠశాలలోనో,పనిలోనో చెయ్యనారంభించండి.

రొట్టెల కోసం పరితపించే వాడి కంటే, ప్రేమకోసం పరితపించే వాడి పరిస్థితే పరితపించదగినది.

మనకు ఒకరు సేవ చేసేకంటే, మనం ఇతరులకు సేవ చేయుటయే ఉన్నతమైనది.

ప్రేమను నిరంతరం అలసత్వం లేకుండా పంచడంలోనే దానిలో పరిపూర్ణత్వం,విజయము నిండియున్నది.

సంతోషమనేది చెంతన వుండే ఆత్మలను తనతోపాటు అల్లుకునేటటువంటి అద్భుతమైన వల.
దివ్యత్వపు కరుణ లేకుండా నా వల్ల బ్రతుక వీలుకాదు.

ఇతరులను నేసించుట వలన ఏర్పడే సంతోషం అమూల్యమైనది. ప్రేమను చూపించేందుకు,ప్రేమను పొందే ఒకే ఒక ఉద్దేశ్యంతోనే దేవుడు మనల్నందరిని సృష్టించియున్నాడు.

ప్రేమ శాంతిని ఏర్పరస్తుంది. ఎందుకంటే అది జాతికి,మతానికి అతీతమైనది. పరిపూర్ణమైన ప్రేమ మాత్రమే ఈ ప్రపంచంలో ఐక్యమత్యానికి దారి చూపగలదు.

పేదల కంటే పేద ఒకడు వస్త్రాలు లేకుండా వివస్త్రుడై ఉన్నాడంటే, అక్కడ మనుష్యకులం యొక్క గణ్యత నిర్వాణంగా యున్నది.

పిల్లలు తల్లిదండ్రులు తెలియని వారుగా ఉండిఉండొచ్చు. నేనో,మీరో ఉన్ననంతవరకు వారు అనాధలుగా మిగిలియుండరు.

ధనం,వస్తువులు లేనివారు పేదలు.మన ప్రేమకు పాత్రులైనవారైతే ధనం,వస్తువులు చేతిలో వుండి కుడా ప్రేమ కొరకు,స్వచ్ఛమైన ప్రేమ కొరకు పరితపించేవారు పరితపించదగునటువంటి పేదలు.

నేను మిమ్మలిని మార్చేందుకు వచ్చాను,మతాన్ని కాదు మీ మనసులను. హిందువులను మంచి హిందువులుగాను, క్రైస్తవులను మంచి క్రైస్తవులుగాను,మహమ్మదీయులను మంచి మహామ్మదీయులుగాను ఉండగా వారివారి మనసులను మార్చేందుకు వచ్చాను.

మన్నించే స్వభావాన్ని కలిగియుండండి. మంచిని చేయండి,మంచిని చేసేందుకు ప్రేరేపించండి.

"గర్భాన పెరిగే శిశువును దయచేసి ఎవరు చంపవద్దు.అది పుట్టిన పిదప మీకు అవసరం లేకపోతే,పెంచలేకపోతే వారిని నాకు అప్పగించండి,వారిని నేను పెంచుతాను."

పేదరికం,వ్యాధులు చంద్రుడిలో కూడా ఉంటే గనుక అక్కడకు వెళ్లికూడా సేవ చేసేందుకు సిద్ధంగా వున్నాను.
నిన్న అన్నది నా చేతిల్ని వీడిపోయినది.రేపు అనేది నా చేతిలోకి వస్తుందని చెప్పేందుకు అవకాశం లేదు. ఈ రోజే నా చేతిలో వున్నది. ఈ రోజు,ఈ దినం నా వల్ల పేదలకు, వ్యాధిగ్రస్తులకు ఏమి సహాయం చెయ్యగలనో దానిని చేసివేయాలి, ఆలస్యం చేయకూడదు.

తగ్గించుకొనుట అనే ఆశీర్వాదము నాకు ఉన్నది.

"నేను చేసే సేవ అనేది ఒక నీటి బిందువు అంతటిది మాత్రమే.కాని దాని ఆవశ్యకత ఒక సాగరమంత. ఆ ఒక బిందువును నేను చేర్చకపోతే సముద్రంలో ఒక నీటి బిందువు తగ్గిపోతుంది."

నేను ప్రతీ వ్యక్తిలోను దైవాన్ని దర్శిస్తాను. 

No comments:

Post a Comment