యండమూరి వీరేంద్రనాథ్ కొటేషన్లు

సంతృఫ్తి కోసం బ్రతకవద్దు. సంతృప్తితో బ్రతకాలి.

ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవటం కాదు. నువ్వులేనప్పుడు నవ్వుని,నువ్వున్నప్పుడు కాలాన్నీ పారేసుకోవడం.

పెళ్లయిన తర్వాత జీవిత భాగస్వామిని ప్రేమించటం అన్నిటికన్నా ఆరోగ్యకరమైన ప్రేమ.

ఎక్కడయితే  శత్రుత్వం వుంటుందో అక్కడ ప్రతి మనిషి తనకంటూ ఒక రీజన్ ఏర్పరచుకొని వాదించటం ప్రారంభిస్తాడు. ఎక్కడ 'ప్రేమ' ఉంటుందో అక్కడ రీజన్ వుండదు.

ప్రేమ ఒక లెక్క లాంటిది. సంతోషం గుణకారం,దుఖం భాగహారం,స్నేహం కూడిక,శత్రుత్వం తీసివేత.

ఒకరి అందం,అర్హతల వాళ్ళ మొదట ఆకర్షణ ఏర్పడి, వారి ప్రవర్తనవల్ల అది స్నేహంగా మారి వ్యక్తిత్వం వల్ల ప్రేమగా మారుతుంది.

ప్రేమించటానికి హృదయం ఉండాలి. ప్రేమింపబడటానికి వ్యక్తిత్వం ఉండాలి.

ప్రేమకు మొదటి స్టెప్పు ఆసక్తే.

ప్రేమనీ,ఆకర్షణనీ ఏ పాయింటు దగ్గర విడగొట్టలన్నది  ఏ  ఐన్ స్టీను కనుక్కోలేదు.

ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.

ప్రేమ ఇంద్రధనుస్సు అయితే ఆ ఏడు రంగులూ- ఆకర్షణ,అవగాహన,ఇష్టం,తాదాత్మ్యత ,స్పర్శ,కామం,ఓదార్పు.

ప్రేమ అన్న ఒక్క అర్హతవల్లె మనిషి మిగతా జీవాల్నుంచి విడివడ్డాడు.

ప్రేమంటే సృతిమించినప్పుడు,శుష్కించినప్పుడు  ఒకేలా వుండేది.

ఏ దూరదేశాల్లో నీవుంటావో నాకు తెలియదు నేస్తం! కానీ, ఏదో ఒకరోజు రాత్రి ఎప్పటికన్నా చంద్రుడు ఆరోజు మరింత ప్రకాశవంతంగా ఉన్నట్టు నీకనిపిస్తే... ఏ దూరదేశపు పాత స్నేహితురాలు నిన్ను తలుస్తున్నదనడానికి సంకేతంగా దాన్ని గ్రహించు... చాలు!

ప్రేమంటే మనిషి తర్కాన్ని వదిలిపెట్టడమే కదా! తన ప్రవర్తన తనకి అంతుపట్టకపోవడం కూడా ప్రేమే!

నోరుజారి అవతలివాళ్ళు ఒక మాటంటే దాన్ని పట్టుకొని వాదనలో గెలవడం, అవతలివారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవటం గొప్పవాళ్ళ లక్షణమైతే అయ్యుండవచ్చు. కానీ, అవతలివాళ్ళు మాటజారితే మనం దాన్ని గుర్తించలేదన్నట్టు ప్రవర్తించడం మహోన్నతుల లక్షణం.

మరణం అంటే ఏమిటి? లేకపోవడమేగా? మనం ఉండం. అంతా ఉంటుంది. మందాకినీ గలగలలు, నీహారికా బిందు సందోహాలు, దూకే జలపాతాలు, గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు, మలయ మారుతాలూ, మయూర నృత్యాలూ...అన్నీ ఉంటాయి.

వినేవాళ్ళుంటే మనిషికి తన ఫ్లాష్ బేక్ లు చెప్పడంకన్నా ఆనందం ఇంకేముంటుంది?

దేవుడికి దీపం అవసరంలేదు, చీకట్లో మగ్గుతున్న మీ అంతరాత్మలో దీపం వెలిగించి భగవంతుడి ముందు ఆత్మ విమర్శ చేసుకోండి. అప్పటికీ మీలో కళంకం లేదనిపిస్తే అప్పుడు మీరు నిజమైన దైవభక్తులు.

దేశ సరిహద్దులు మనిషి నిర్మించుకున్నవి. ఒక గీత కి కేవలం అటూ ఇటూ ఉండటం వల్ల ఇద్దరు వ్యక్తులు శత్రువులవటం దురదృష్టకరం.

కన్నీరా! క్రిందకు జారకే! ఋతువుకాని ఋతువులో గోదావరికి వరదొచ్చిందేమిటి అని భయపడతారే!!

జీవితం అంటే తాళం చెవుల గుత్తికాదు- మరొకళ్ళ చేతుల్లో పెట్టి హాయిగా నిద్రపోవడానికి. ముందు మిమ్మల్ని సంస్కరించుకోండి. దాని వల్ల మీ వ్యక్తిత్వం పెరుగుతుంది.

ప్రపంచంలో గొప్పవాళ్ళందరూ కీర్తి శిఖరాలను ఒక్క అంగలో గెంతి అధిరోహించలేదు. భార్యతో సహా ప్రపంచం అంతా గాఢనిద్రలో విశ్రాంతి తీసుకుంటున్న సమయాన ఒక్కొక్క అడుగు కష్టపడుతూ పైకి పాకారు.

విజయమా, విజయమా! వెళుతూ వెళుతూ అధఃపాతాళానికి తోస్తావు, వస్తూ వస్తూ అందలాన్నెక్కిస్తావు-నీకిది న్యాయమా?

దెయ్యాలు శ్మశానంలో ఉండవు, మనిషి మనసులోనే ఉంటాయి, భయం అన్న పేరుతో.

అపనమ్మకంతో గెలిచిన గెలుపుకంటే, నమ్మకంతో వచ్చిన ఓటమే గొప్ప సంతృప్తి నిస్తుంది.

No comments:

Post a Comment