అబ్దుల్ కలాం సూక్తులు / కొటేషన్లు

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి.

మనం కేవలం విజయాల మీంచే పైకి రాలేము. అపజయాల మీంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి.

నీ ధ్యేయంలో నువ్వు నెగ్గాలంటే నీకు ఏకాగ్రచిత్తంతో కూడిన అంకితభావం ఉండాలి.

మనిషికి కష్టలెందుకు కావాలంటే  అవే అతనికి విజయాన్నిఆనందించే మనస్థితినిస్తాయి.

మనుషులు రకరకాల శక్తి సదుపాయాలతో జన్మిస్తారు. తొందరగా శక్తిని ఖర్చు చేసుకుని అలసిపోయినవాడికే అందరికన్నా ముందుగా బలాన్ని పుంజుకునే అవకాశం చిక్కుతుంది.

మనమందరమూ మనలో ఒక పరమజ్ఞానాన్ని మోసుకు తిరుగుతున్నాం. మన గహనాతి గహనమైన ఆలోచనల్నీ,ఆకాక్షల్నీ,నమ్మకాల్ని  పరీక్షించుకోవడానికి దాన్ని ఉత్తేజిత పరుద్దాం.

శక్తివంతుడైన మనిషికీ, తత్తరపాటు మనిషికీ తేడా వాళ్లు వాళ్ల అనుభావాల్ని అందుకొనే తీరులో ఉంది.

విజయవంతులైన స్త్రీ పురుషులందరికీ పూర్తి అంకితభావమనేది ఉమ్మడి ధర్మం.

నీకో లక్ష్యముండటమే కాదు దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి.

పూర్తి అంకితభావమంటే పూర్తిగా కష్టపడటం కాదు. అది పూర్తిగా నిమగ్నమవడం.

ఒక సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలోనే మన ప్రతిభ మనకు తెలిసేది.

ఒక నాయకుడు తనచుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగినప్పుడే తన బృందాన్ని స్వేచ్చగా నడిపించగలడు.నాయకత్వమంటే నిరంతర అభ్యసనమే.

మనని అణచడానికి చూస్తున్నప్రతికూల శక్తుల్ని మనం ఎదిరించి నిలవగలం. మన వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని పెంపొందించే గుణాల్తో, పరిస్థితులతో మనం మనని బలోపేతుల్ని చేసుకోగలం. బలపర్చుకోవడం ద్వారా మనం అపూర్వమైన విజయాల్ని సాధించగలం.

నా ఉద్దేశ్యంలో ప్రాజక్టు నాయకుడెప్పుడు తన వ్యవస్థల్లో అప్పటికే నిరుపితమైన పరిజ్ఞానంతోనే పని చెయ్యాలి. బహుళ వనరులున్నప్పుడే ప్రయోగాలకి పూనుకోవాలి.

సైన్స్ స్వభావరీత్యా పరిశోధక శీలి. దాని తలుపులెప్పుడూ తెరిచే ఉంటాయి. సాంకేతికాభివృద్ధి అనేది ఒక మూసిన మడత. సాంకేతికాభివృద్ధిలో పొరపాట్లనేవి తప్పనిసరి. అవి రోజూ జరుగుతుంటాయి.

ఏదైనా ప్రణాళిక బాధ్యతలు చేపట్టినవారు అనుకున్నది సాధించాలంటే స్వాతంత్ర్యం, తగినన్ని అధికారాలు, ప్రాబల్యం ఉండి తీరాలి. ఇది వ్యక్తిగత ఆనందానికి కూడా వర్తిస్తుంది.

వ్యక్తిగత సంతోషానికి రాచమార్గమేమిటంటే నిన్ను నిర్దేశిస్తున్న శక్తులకీ నీ నిర్దేశలతో సహకరించడమే. చురుగ్గా ఉండు. బాధ్యత తీసుకో,నువ్వు నమ్మిన వాటి కోసం కృషి చెయ్యి. అలా చెయ్యడం లేదంటే నీ విధిని ఎవరికో అప్పగిస్తున్నావన్నమాటే.

ప్రార్ధనల ముఖ్య ధర్మం మనలోని సృజనాత్మక భావాల్ని మేల్కొల్పడమని నేననుకుంటాను.

జయప్రదమైన జీవితాన్ని జీవించడనికి అవసరమైందంతా మనిషి మనసులోనే ఉంది.

మనిషి తన చైతన్యంలో ఉన్న ఆలోచనలకి ఎదగడానికీ,రూపం దిద్దుకోవడానికీ అవకాశమిస్తే అవి విజయాలకి దారి తియ్యగలవు.

మన సృష్టికర్త మన మనసుల్లో,వ్యాక్తిత్వల్లో అపారమైన శక్తిసామర్ధ్యాల్ని నిక్షిప్తం చేసాడు. వాటిని తరచి వెలికి తీసి వృద్ధి చెందించుకోవడానికి ప్రార్ధన సహకరిస్తుంది.

నువ్వొక మనిషిని అవమానిస్తూ అతన్నించి ఫలితాలు రాబట్టుకోలేవు. అతన్ని ద్వేషిస్తూ,దూషిస్తూ అతనిలోని సృజనాత్మకతను వెలికి తియ్యలేవు.

ధృడంగా ఉండటానికీ,మోటుగా ఉండడానికీ,పఠిష్టమైన నాయకత్వానికీ, పెత్తనం చెయ్యడానికి, క్రమశిక్షణకీ తప్పులు పట్టడానికీ మధ్య విభజన రేఖ చాలా సున్నితం. కానీ దాన్ని గుర్తించవలసిందే.

దురదృష్టవశాత్తూ నేడు మన దేశంలో ప్రముఖంగా గీయబడ్డ ఏకైక విభజన రేఖ హీరోల్ని జీరోల్ని వేరు చేసేది మాత్రమే. ఒక వైపు కొన్ని వందల మంది హీరోలు మరొకవైపు తొంభై అయిదుకోట్ల మంది ప్రజల్ని తొక్కిపెడుతుంటే ఈ పరిస్థితి మారాలి.

హృదయాలతో పనిచెయ్యని వాళ్ళ విజయం బోలుగా ఉండటమే కాక అది తన చుట్టూ వెగటుతనాన్నే వ్యాపింప చేస్తుంది. నువ్వు డాక్తర్ వో లాయర్ వో  కావాలని రహస్యంగా తపిస్తూ పైకి మాత్రం రచయితగా రచనలు చేస్తున్నావనుకో నీ అక్షరాలు నీ పాఠకుల ఆకలిని సగమే తీర్చ గలుగుతాయి. నువ్వు ఒక వ్యాపారివి కాలేక ఒక ఉపాధ్యాయుడివి అయ్యావనుకో నీ పాఠాలు నీ విద్యార్ధుల జ్ఞానతృష్ణని సగమే తృప్తి పరచగలుగుతాయి. నువ్వు సైన్స్ ను ద్వేషిస్తూ ఒక సైంటిస్టుగా పనిచెయ్యవలసి వచ్చిందనుకో నీ కృషి నీ లక్ష్యాన్ని సగమే నెరవేరుస్తుంది.
నీ లక్ష్యాల్నీ, నీ స్వప్నాల్నీ సాధించుకోవడానికి, సహకరించుకోవడానికి దేవుడి రాజ్యం నీలోనే ఈ శక్తి రూపంలో ఉందని నేను నిశ్చయంగా చెప్పగలను.

ఒక నాయకుడు ఏ మేరకు సమర్ధుడు? తన సహచరుల కన్నా, వాళ్ల నిబద్ధత,భాగస్వామ్యాలకన్నా మించి మాత్రం కాదు.

సమస్యల్ని ఎదుర్కొని వాటిని పరిష్కరించాల్సిన ప్రక్రియ ఎంతో శ్రమ పెట్టడమే కాక బాధని కూడా కలిగిస్తుంది.కనుక మనం ఆ పరిష్కారాన్ని నిరవధికంగా వాయిదా వేస్తుంటం. విజయం నుంచి వైఫల్యాన్ని వేరు చెయ్యగలిగేది సమస్యలే. అవి మన లోపల దాగివున్న సాహసాన్ని,వివేకాన్ని బయటకు తెస్తాయి.


No comments:

Post a Comment