స్వామి వివేకానంద సూక్తులు

సముద్రం లోతు, ఆకాశమంత వైశాల్యం.అలాంటి హృదయమే కావాలి.

మాటలలో నీ శక్తి వ్యయపరచవద్దు...నిశ్శబ్దంగా ధ్యానం చేయి.

నాయకుడు శీలవంతుడు కాకపొతే అనుచరులు విధేయులు కావడం సాధ్యం కాదు.నాయకుని శీలం పవిత్రమైనకొద్దీ అనుచరులు విశ్వాసం,విధేయత పెంపొందుతాయి.

సర్వ దేవతలకన్నా మానవుడు అధికుడు, మానవునికన్నా అధికులెవ్వరు లేరు.

పరిస్థితులు మనిషి అదుపులో వుండవు కాని అతని ప్రవర్తన అతని ఆధీనములోనే వుంటుంది.

ప్రతి మనిషిలోని మంచిని చూడటం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది.

గమ్యం స్థిరంగా ఉండాలి, మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి , ప్రయత్నం రాజీలేని ధోరణిలో సాగాలి అపుడే విజయం మనదవుతుంది.

మానవునిలోని పరిపూర్ణతను వ్యక్తపరచడమే విద్య, అతనిలో దివ్యత్వాన్ని వ్యక్తపరచడమే మతము.

వివేకవంతుడు ఎప్పుడూ వర్తమానములోనే జీవిస్తాడు.

జీవితము చిన్నది ధైర్యముగా పోరాడు, ఉదాత్తమైన లక్ష్యం కోసం దానిని త్యాగం చేయడానికి వెనుకాడకు.

ప్రతి జీవిలోనూ దివ్యత్వం గర్భితంగా వుంది. అంతర్గతముగా ఉన్న ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే జీవిత పరమావధి.

ఇనుప కండరాలు, ఉక్కు నరాలతో ఎదిగిన మనిషికే వజ్రసంకల్పం సాధ్యపడుతుంది.

లేవండి, మేల్కొనండి గమ్యం చేరేంత వరకు విశ్రమించకండి.

ఓర్పు, ప్రేమ, నిజాయితి మన అస్త్రసస్త్రాలైనప్పుడు ఈ ప్రపంచములో ఏ శక్తి మనలను అడ్డుకోలేదు.

మన దేహాన్ని కాని మన మనసును కాని బలహీన పరిచే ఎంతటి కోరికలైనా నిర్ద్వందముగా త్యాగము చేయాలి.

ఎక్కడెక్కడ పోరాటం , తిరుగుబాటు ఉద్భావిస్తాయో అక్కడే జీవముంది,సత్యముంది,చైతన్యముంది. ప్రతీ గొప్పకార్యము అవహేళన, ప్రతిఘటన ఆ తరువాత అంగీకారము అనే మూడు మజిలీల గుండా సాగిపోతుంది.

ఈ ప్రపంచములో మన ఘనత మూన్నాళ్ళ ముచ్చటే ... సంపదలు, కీర్తిప్రతిష్టలు నశించిపోయేవే. పరుల కోసం జీవించేవారే మనుషులు, మిగిలినవారంతా జీవన్మ్రుతులు.

ప్రస్తుతం మనం శరీరాన్నే నేను అనుకుంటున్నాము. ఈ శరీర స్పృహ అధికంగా ఉన్నంత వరకు ధ్యానం, ఏకాగ్రతలు సాధ్యం కావు. కాబట్టి ప్రస్తుతం మన పూర్తి పోరాటం శరీరంతోనే.

శ్రీ రామకృష్ణుల సందేశం దేశమంతా వ్యాప్తి చెందిననాడే భారతదేశం ఉన్నత స్థితికి చేరుకోగలదు.

మానవ చరిత్రనంతటిని పరికిస్తే ఘనకార్యాలు చేసినవారి జీవితాల్లో అన్నింటికన్నా ఎక్కువ సామర్ధ్యమిచ్చిన మూలశక్తి వారి ఆత్మవిశ్వాసమే. మనిషికి, మనిషికి మధ్య ఉన్న తేడా ఆత్మవిశ్వాసమే, ఆత్మవిశ్వాసం అన్నింటిని సాధించగలదు.

అసహాయత నుండి ఆధారపడే ధోరణిలో నుంచి స్త్రీలు బయటపడాలి. ఏ చిన్న కష్టం వచ్చినా ఒదిగిపోయి భోరున విలపించేదుకు మరో ఒడి కోసం ఎదురు చూడటం మానుకోవాలి . మానసికంగా శక్తిమంతులై ఎంతటి విపత్కర పరిస్తితులైనా ఒంటరిగా ఎదుర్కోవాలి. 

No comments:

Post a Comment