స్వామి వివేకానంద సూక్తులు

పరాక్రమం, పోరాటతత్వం పురుషుల సొంతమనే భ్రమలనుంచి బయటపడాలి. ఆ కోణంలోను తమకు అడుగుజాడలను పరచిన ఝాన్సీరాణి, రుద్రమ దేవి వంటి నారీమణులను ఆదర్శంగా తీసుకోవాలి.

ఏ పనినైనా సాదించాలంటే దీక్ష,పట్టుదలతో పాటు ధ్రుడసంకల్పం అత్యావశ్యకం . నేని సముద్రాన్ని ఔపాసన పట్టేస్తాను , నేని కొండలను పిండి పిండి చేస్తాను అంటాడు పట్టుదల గల వ్యక్తి. అలాంటి వాళ్ళు ఏ లక్ష్యాన్ని అయినా సాధించగలుగుతారు.

నీకు మంచి జరగాలని కోరుకున్నట్లే ఇతరులకు కూడా మంచి జరగాలని కోరుకో.

ఇతరుల కోసం మనం తీసుకునే అత్యల్పమైన శ్రమ మనలో ఉన్న శక్తిని తట్టి లేపుతుంది. ఇతరుల శ్రేయస్సును గురించి ఏ కొంచెం ఆలోచించినా కూడా అది సింహానికి సమమైన శక్తిని మన హృదయానికి క్రమక్రమముగా ఇస్తుంది.
మనసా వాచా కర్మణా పవిత్రతను పాటించు.

భయమెరుగని సాహసంతో వ్యక్తి జీవించాలి. మత సిద్ధాంతాలతో వ్యక్తి మనసు పాడుచేసుకోకూడదు.

ఆత్మ విశ్వాసం,దేవుని యందు విశ్వాసం ఇవియే ఔన్నత్యానికి కీలకం.

ఏది తొందరపడి చేయకూడదు. పవిత్రత,ఓర్పు,ఎడతెగని ప్రయత్నం ఈ మూడు విజయానికి సోపానాలు. వీటన్నింటి కన్నా మఖ్యమైంది ప్రేమ. అనంతమైన కలం నీ ముందు వుంది,అనవసరమైన తొందరపాటు వద్దు.

పవిత్రత,సత్యసంధత నీలో నెలకొంటే అన్ని సవ్యంగా జరుగుతాయి. నీలాంటి వందల మంది మనకు కావాలి. వారు సమాజం మీదకు దూకి దానిని అదరగొట్టాలి.

ఎక్కడకు వెళ్ళినా నూతన జీవితాన్ని మహోన్నతమైన శక్తినీ అందించాలి.

ప్రపంచంలో నిస్వార్ధమైన , పవిత్రమైన ప్రేమ తల్లివద్ద నుండే పొందగలం. తల్లి సాక్షాత్తు ఈ భూమిపై అవతరించిన దైవం.

ఓర్పుతో అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చెయ్యవచ్చు.

ఆత్మ సందర్శమునకు తోడ్పడని జ్ఞానం అజ్ఞానం.

చావు బతుకులు ఎక్కడో లేవు. బలంలో బతుకుంది, బలహీనతలో చావుంది.

మన గురించి మనం ఆలోచించుకోవడమే స్వార్ధం. అదే మహాపాపం.

నేను నరకానికి వెళ్ళడం వాళ్ళ నా సోదరులకు ఉపయోగం ఉంటుందంటే, నరకానికి వెళ్ళడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నని అనగలిగిన వాడే నిస్వార్ధపరుడు.

పేదల కోసం, పీడిత ప్రజల కోసం ఎవరి హృదయం ద్రవిస్తుందో వారే మహాత్ములు.

బీదలు,నిరక్షరాస్యులు,అమాయకులు,భాధ పీడితులు వీరిలో మనం భగవంతున్ని చూడగలగాలి. వీరి సేవయే భగవంతునికి ప్రియమైనది.

ఏ కార్యాన్ని సాధించాలన్న పవిత్రత, సహనం,పట్టుదల,ప్రేమ అవసరం.

No comments:

Post a Comment