ఆస్కార్ వైల్డ్ కొటేషన్లు

నిజంగా నువ్వు ప్రేమించాలని వుంటే అది నీ కోసం కాచుకొని వుంటుంది.          

ప్రతి మనిషి దేన్నయితే ప్రేమిస్తాడో  దాన్నే చంపుతాడు.

రూపాన్ని బట్టి తీర్పు చెప్పలేని వాళ్ళు వివేచానపరులు కాదు.

ఎల్లుండి చేయదగ్గ పని రేపటి వరకు కూడా ఆపను.

ఖచ్చితమైన వ్యక్తిత్వమంటే ఎదిరించడం కాదు, శాంతి.

విద్యాభ్యాసం గౌరవనీయమే కాని ఎల్లప్పుడూ ఒకటి గుర్తుంచుకోవాలి. ఉపయోగకరమైనదేది అక్కడ బోధించరని.

ఓ మానసిక రోగికి ప్రతి వస్తువు వెల తెలుసు కాని ఏ వస్తువు విలువ తెలియదు.

పిల్లల్ని మంచివాళ్ళుగా తీర్చిదిద్దాలంటే  వాళ్లను సంతోషపెట్టడమే.

గతించిన రోజుల్ని కొనేంత ధనవంతుడు లేడు.

ఒక్కోసారి నేను అనుకుంటాను "దేవుడు మనిషిని సృష్టించడంలో తన శక్తిని ఎక్కువగా అంచనా వేసుకున్నాడు."

పురుషుడు నీతిగా ఉండటం కపటత్వం. స్త్రీ నీతిగా ఉండటం సహజం.

అతన్ని గురించి  అతను ఆలోచించడం  స్వార్ధం కాదు. అతన్ని గురించి అతడు ఆలోచించనివాడు  ఆలోచించలేనేలేడు.

ఉదయం లేవగానే నిన్న చేసిన తప్పును గుర్తు చేసుకో.ఆ తప్పు ఇక పునరావృతం కాదు.

తన తప్పుకు ప్రతివాడు పెట్టుకొనే అందమైన పేరు అనుభవం.

వాదనలు నిష్ప్రయోజనమైనవి. వాటికీ దూరంగా ఉండండి.

మంచిగా వుండటం కన్నా, అందంగా ఉండటం మంచిది. అనాగరికంగా ఉండే కన్నా మంచిగా ఉండటం మంచిది.

మనలో ఏదో కోల్పోయాం,అదే ఆశ.

చరిత్రంతా భావనల యుద్ధక్షేత్రమే.

గొప్ప ఆలోచనలన్నీ ప్రమాదభరితమైనవే.

ఓ భావన విలువ అది వ్యక్తం చేసిన మనిషి స్వచ్చతను బట్టి ఉంటుంది.

ఆవేశం మనిషిని తప్పుదారి పట్టిస్తుంది.

అతి చెడ్డపని కూడా మంచి ఉద్దేశ్యంతోనే మొదలవుతుంది.

మంచికి ఆనందపు ముగింపు, చెడుకి భాధాకర ముగింపు అదే కధకు సరైన ముగింపు.

ద్వైదీభావంగా జీవించకు,చెడ్డవాడిగా కనిపిస్తూ అన్నివేళలా మంచి పనులే చేయకు,అదే కపటమంటే.

జాతీయత కల్పన యొక్క కోరిక.

ప్రేమలో పడటం గొప్ప కల్పన.

కల్పన యొక్క దారుణమేమంటే  మన కలల్ని బలహీనం చేస్తుంది.

కవి దేనికైనా తట్టుకుంటాడుగాని, పొరబాటు ముద్రణకు తట్టుకోలేడు.

ఓ కవితను  పరిహసించడం రెండు రకాలు ఒకటి పరిహసించడం రెండు పోప్ చదవడం.

ఏ కళాకారుడు దేన్నీ వున్నది వున్నట్లు చూడడు. అలా చూసేవాడు కళాకారుడే కాదు.

కళలన్నీ నిరుపయోగమైనవి.

ఎర్ర గులాబి స్వార్ధపూరితం  కాదు.

చరిత్ర సృష్టించడం తేలిక,రచనే  కష్టం.

జనాలను నీ నుండి దూరం చేసుకోవడానికి త్వరితమైన మార్గం నీ మీద నువ్వే జాలిపడటమే.

ఓ పుస్తకంగాని ఓ కవితగాని జాలి లేకుండా వ్రాయడం కంటే వ్రాయకపోవడం మిన్న.

ప్రశ్నేలేదు! జీవించడం అన్నింటికంటే ఓ గొప్ప కళ.

చెడ్డగా జీవించే చక్కటి మరణం కంటే తేలిక విషయాలు వున్నాయి.

కళ జీవితాన్ని అనుసరించే కంటే జీవితమే కళను అనుకరిస్తుంది.

పురుషుడు జీవితాన్ని ముందుగా తెలుసుకుంటే స్త్రీ చాలా ఆలస్యంగా తెలుసుకుంటుంది.

నేటి రోజుల్లో ప్రతి గొప్పవాడికి అనుచరులుంటారు.ఎల్లప్పుడూ వాళ్ళ జీవితచరిత్రలు వ్రాస్తారు.

నా జీవితంలో నేనే తప్పు చెయ్యలేదని నా ఎదురుగా అంటారు. నా వెనుక మాత్రం కాదు.

తల్లి అర్ధం చేసుకున్నట్లు తండ్రి అర్ధం చేసుకోడు.

ప్రతి స్త్రీ తన తల్లిలాగే మారుతుంది. అది వారి విషాదం.పురుషుడు అలా కాదు అది అతని సొంతం.

మంచి తీర్మానాలు చెయ్యడమంటే  ఖాతాలేని బ్యాంకు నుండి చెక్కు ద్వారా డబ్బుతీసుకోవడం వంటిది.

ఆమె ఒక్క అందంలో తప్ప అచ్చం నెమలే.

కొన్ని సమయాల్లో దుఃఖమే అసలైన సత్యం.

దేశ భక్తి దుర్మార్గుల పాలిట అదృష్టం.

నేటి యువత డబ్బే అంతా అని ఊహిస్తోంది. పెద్దవాళ్ళు అయింతర్వాత సరైన విలువ తెలుస్తుంది.

నేను యువకుడిగా ఉన్నప్పుడు దానం చాలా ముఖ్యమనుకున్నాను. ఇప్పుడు నేను వృద్దుడ్ని. ఇప్పుడు అంతే.

ముందు షేక్స్ ఫియర్ వ్రాసినవన్నీ చందోబద్ధంకాని పిచ్చి కావ్యాలే.

నిజాయితీ తగ్గితే ప్రమాదం,మరీ ఎక్కువైతే మరణసదృశం.

నిన్నటి గురించి భయపడకు. దాన్ని తిరిగి పొందలేమని  చెప్తే నమ్మకు.

నిరాశావాది: రెండు చెడుల్లో ఒక దాన్ని ఎన్నుకోమంటే రెండిటిని కోరతాడు.

అన్నింటి కంటే భాధాకరం నిశ్శబ్దం.

ప్రపంచం ఏ పుస్తకాలను నీతి బాహ్యమని చెప్తుందో అవి ప్రపంచంలోని కుళ్లును భహిర్గతం చేస్తున్నట్లు లెక్క.

సత్యం అరుదుగా మాత్రమే నిష్కల్మషం. అది చిన్న విషయం కాదు.

అసంతృప్తి మనిషికి గాని జాతికి గాని అభివృద్ధికి అడ్డంకి.

మంచి సమాజంలోకి మనం వెళ్ళాలంటే వాళ్లకు పెట్టాలి,ఆనందింప   చెయ్యాలి, లేకుంటే దిగ్భ్రాంతికి గురి చెయ్యాలి.

అసమానమైన స్వభావం యొక్క ఫలితమే అసమానమైన కళ.

సాధువుకి పాపికి ఒకటే తేడా. సాధువుకి గతం ఉంటుంది,పాపికి భవిష్యత్తు వుంటుంది.

సాహిత్యం జీవితాన్ని ముందుగా చూస్తుంది, జీవితాన్ని చూసి వ్రాయబడదు. అవసరం కోసం మార్చుకుంటుంది.

చరిత్రను చదివితే అనంగీకారమే మానవుని సుగుణంగా  కనిపిస్తుంది.

సంపూర్ణ స్వేచ్చ,అలాగే న్యాయానికి లోబడి ఉండే స్వేచ్చ, రెండూ ఒకదానికొకటి మానవ జీవితంలో పొసగవు.    

శత్రువును క్షమించు.అతనికి అంతకంటే బాధాకర విషయంలేదు.

నాకేది తక్కువ  విలువ ఉన్నదిగా కనిపించదు. తన నుండి తానూ పొందింది తప్ప.

అద్బుతమైన విలువైన దాన్ని దేన్నైనా నమ్ముతాను.

నేటి నేర ప్రపంచానికి కారణం దుర్గుణం, ఆకలి మాత్రమే.

ఎక్కువ ఉన్నవాడు   ఆశాపరుడై ఉంటాడు.తక్కువ వున్నవారు ఎల్లప్పుడూ పంచుకుంటారు.

మనం బాగా చదివి తెలివైన వాళ్లమవుదామనే కాలంలో జీవిస్తున్నాం.

పనికొచ్చే పని ఇంకేది చెయ్యలేనప్పుడు  కష్టించి పని చెయ్యడమే గతి.

ప్రకృతి దేవాలయం కాదు ఓ కర్మాగారం , పని కోరడం మన హక్కు.

ముసలివాళ్ళ బాధ వాళ్ళు మసలివాళ్ళు అవడం కాదు, కొందరు యువకులుగా  వుండడం.
పేదవాళ్ళు తెలివైనవారు, దయార్ద హృదయులు మనకంటే బాగా స్పందిస్తారు.

నీతివంతమైన  పుస్తకాలు, అవినీతికరమైన పుస్తకాలు అని రెండు రకాలు వుండవు. బాగా వ్రాసినవి. బాగా వ్రాయనివి.

అత్యంత తెలివైన వాళ్ళం  కావాలని అతి ఎక్కువగా చదివే  కాలంలో మనం జీవిస్తున్నాం.
సిగరెట్టు సంపూర్ణకరమైన సంపూర్ణ ఆనందం.

ప్రజల్ని చెడు మంచిగా విడగొట్టలేము.అయితే కొందరు మనోహరంగా మరికొందరు చీదరగా కనిపిస్తారు.
మన ప్రతి వారిలో తమదైన ధ్యేయం వుంది. అది ప్రపంచాన్ని నరకప్రాయం చేస్తుంది.

నేను డైరీ లేకుండా ప్రయాణించను. రైల్లో ప్రయాణించాలంటే ఎవరైనా ఏదో ఒక సంచలనాత్మకమైన పుస్తకం చదవడానికి కావాలి.

ప్రాణ త్యాగానికి ఏ విషయమైనా సత్యమే అయ్యుండాలని లేదు.

శాస్త్ర విజ్ఞానం తెలియని విషయాలను తెలుసుకునేంతగా విస్తరించింది. అది ప్రార్ధనను మరింత  లోతుకు చేర్చుతుంది.

దేవుడు మనల్ని శిక్షించదలచుకుంటే మన ప్రార్ధనకు సమాధానం చెప్తాడు.

మనసు,పిరికితనం వేరు కాదు. మనసనేది సంస్థ పేరు.

బెర్నార్డ్ షాకు   ఈ ప్రపంచంలో  శత్రువులు లేరు. కాని అతని మిత్రులేవారు అతణ్ణి  ఇష్టపడరు.

ఎక్కువగా జనాలు ముచ్చటించుకొనే వ్యక్తి సహజంగా ఆకర్షిస్తాడు. ఎందుకంటే  ప్రతివాడు ఏదో ఒక గొప్పతనం వుందని భావిస్తాడు.

మూఢత్వాన్ని  మించిన పాపం లేదు.

అన్నింటి వెల తెలిసి ఏమిటి, ఉపయోగం తెలియనివాడు.

ఖచ్చితమైన యుక్తి కలవాడివని పేరుపొందాలంటే ప్రతి స్త్రీతో నువ్వామెను ప్రేమిస్తున్నట్లు మాట్లాడు. ప్రతి పురుషుడితో అతడు నిన్ను విసిగిస్తున్నట్లు మాట్లాడు.

 యువకులంటే పాతతరంలో వుండే గౌరవం చాలా త్వరగా నశిస్తోంది.

జీవితానికి రహస్యం లేదు. జీవిత లక్ష్యం ఒకటే. అదెప్పుడు కోరికల వైపు చూస్తుంది.

అర్ధం అయ్యేంత వరకు ఉద్దేశ్యాలు గాని కార్యక్రమాలు గాని సరిగా వెలకట్టలేము.

వివాహం మీద స్త్రీలందరిది  ఒకే అభిప్రాయం పురుషులది మాత్రం వేర్వేరు.

ప్రతివాడు ఎప్పుడు ప్రేమలో ఉండాలి.అందుకే పెళ్లి చేసుకోకుండ ఉండడం ఏకైక మార్గం.

శత్రువులను ఎన్నుకోవడంలో ఓ మనిషి అతి జాగ్రత్తగా వ్యవహరించడు.

సంతోషం కోసమే బతకాలి.

విలియమ్ షేక్ స్పియర్ కొటేషన్లు

బాలలు తల్లిదండ్రుల సంపద.

అందరినీ ప్రేమించు, కొందరినే నమ్ము, ఎవరికీ  హాని తలపెట్టకు.

డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కానీ, డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టు కోవడం మాత్రం మంచిది కాదు.

పిరికివాళ్ళు చావుకి ముందు ఎన్నోసార్లు చస్తూ బ్రతుకుతుంటారు,

కానీ ధైర్యసాహసాలు  గలవాళ్ళు జీవితంలో ఒకే ఒక్కసారి చస్తారు.

ఒక  సారి   నీ   నమ్మకాన్ని  వమ్ము  చేసిన వారిని ఇంకెన్నడూ నమ్మకు.

ప్రపంచంలో మంచి మాటలు ఎంతో కొరతతో కూడినవి అందుచే వ్యర్ధంగా పాడు చెయ్యవద్దు.

వివేక శూన్యుడైన మిత్రుడు , వివేకవంతుడైన శత్రువు కంటే ప్రమాదం.

మంచి చెడు అనేది ఏమి లేదు, ఆలోచనే అలా చేస్తుంది.

పుకారు అనేది ఊహలు,భావనలు,అసూయ కలిపి  ఉదాబడే పిల్లనగ్రోవి.

సద్గుణాన్ని  మించిన సౌందర్యం లేదు.

దొంగవాడు ధనవంతుని దోచుకొని జీవనం సాగిస్తున్నాడు.

మంచి కాలం పుడుతుందనే నమ్మకం తప్ప బలహీనులకు వేరే మందు లేదు.

మనస్సులో తప్పు చేశామన్న భావన వున్నవారు ప్రతి కళ్లు తమను చూస్తూన్నాయని తలుస్తారు.

రాజకీయ నాయకులు భగవంతుణ్ణే ఎదురించే తెలివి గలవారు.

మనసు తప్ప కొరత ఉన్నది ప్రకృతిలో వేరే లేదు. ప్రేమ లేనివారే అంగ విహీనులు.

నిజమైన నమ్మకం వివేకవంతమైనది. పక్షి కంటే అది వేగంగా ఎగురుతుంది. రాజులను అది దేవతలను చేస్తుంది. సామాన్యులను అది రాజులను చేస్తుంది.

ఎప్పుడు మనం అదృష్టం అనే దేవతను అధికముగా కోరుకుంటున్నమో అప్పుడు ఆ దేవత మనను ఎక్కువగా దభాయించి  చూస్తుంది.

చట్టం యొక్క ముఖ్యమైన లక్షణం జాలి. జాలి లేని దుర్మార్గులు దానిని ఘోరమైన ఆయుధముగా ఉపయోగిస్తున్నారు.

 సంగీతానికి ఒక మైమరపించే శక్తి కలదు. చెడుని మంచి దానిగా చేస్తుంది. మంచి దానిని చెడుగా మారుస్తుంది.

తప్పు చేసిన మనసును అనుమానం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది.

ఊహలు, భావనలు, అసూయ కలగలిసిన శ్రావ్యగీతాలే వదంతులు.

తక్కువ కళతో  ఎక్కువ విషయాన్ని చెప్పాలి.  

ఒక పని వంద మాటలతో సమానం. 

యండమూరి వీరేంద్రనాథ్ కొటేషన్లు

సంతృఫ్తి కోసం బ్రతకవద్దు. సంతృప్తితో బ్రతకాలి.

ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవటం కాదు. నువ్వులేనప్పుడు నవ్వుని,నువ్వున్నప్పుడు కాలాన్నీ పారేసుకోవడం.

పెళ్లయిన తర్వాత జీవిత భాగస్వామిని ప్రేమించటం అన్నిటికన్నా ఆరోగ్యకరమైన ప్రేమ.

ఎక్కడయితే  శత్రుత్వం వుంటుందో అక్కడ ప్రతి మనిషి తనకంటూ ఒక రీజన్ ఏర్పరచుకొని వాదించటం ప్రారంభిస్తాడు. ఎక్కడ 'ప్రేమ' ఉంటుందో అక్కడ రీజన్ వుండదు.

ప్రేమ ఒక లెక్క లాంటిది. సంతోషం గుణకారం,దుఖం భాగహారం,స్నేహం కూడిక,శత్రుత్వం తీసివేత.

ఒకరి అందం,అర్హతల వాళ్ళ మొదట ఆకర్షణ ఏర్పడి, వారి ప్రవర్తనవల్ల అది స్నేహంగా మారి వ్యక్తిత్వం వల్ల ప్రేమగా మారుతుంది.

ప్రేమించటానికి హృదయం ఉండాలి. ప్రేమింపబడటానికి వ్యక్తిత్వం ఉండాలి.

ప్రేమకు మొదటి స్టెప్పు ఆసక్తే.

ప్రేమనీ,ఆకర్షణనీ ఏ పాయింటు దగ్గర విడగొట్టలన్నది  ఏ  ఐన్ స్టీను కనుక్కోలేదు.

ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.

ప్రేమ ఇంద్రధనుస్సు అయితే ఆ ఏడు రంగులూ- ఆకర్షణ,అవగాహన,ఇష్టం,తాదాత్మ్యత ,స్పర్శ,కామం,ఓదార్పు.

ప్రేమ అన్న ఒక్క అర్హతవల్లె మనిషి మిగతా జీవాల్నుంచి విడివడ్డాడు.

ప్రేమంటే సృతిమించినప్పుడు,శుష్కించినప్పుడు  ఒకేలా వుండేది.

ఏ దూరదేశాల్లో నీవుంటావో నాకు తెలియదు నేస్తం! కానీ, ఏదో ఒకరోజు రాత్రి ఎప్పటికన్నా చంద్రుడు ఆరోజు మరింత ప్రకాశవంతంగా ఉన్నట్టు నీకనిపిస్తే... ఏ దూరదేశపు పాత స్నేహితురాలు నిన్ను తలుస్తున్నదనడానికి సంకేతంగా దాన్ని గ్రహించు... చాలు!

ప్రేమంటే మనిషి తర్కాన్ని వదిలిపెట్టడమే కదా! తన ప్రవర్తన తనకి అంతుపట్టకపోవడం కూడా ప్రేమే!

నోరుజారి అవతలివాళ్ళు ఒక మాటంటే దాన్ని పట్టుకొని వాదనలో గెలవడం, అవతలివారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవటం గొప్పవాళ్ళ లక్షణమైతే అయ్యుండవచ్చు. కానీ, అవతలివాళ్ళు మాటజారితే మనం దాన్ని గుర్తించలేదన్నట్టు ప్రవర్తించడం మహోన్నతుల లక్షణం.

మరణం అంటే ఏమిటి? లేకపోవడమేగా? మనం ఉండం. అంతా ఉంటుంది. మందాకినీ గలగలలు, నీహారికా బిందు సందోహాలు, దూకే జలపాతాలు, గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు, మలయ మారుతాలూ, మయూర నృత్యాలూ...అన్నీ ఉంటాయి.

వినేవాళ్ళుంటే మనిషికి తన ఫ్లాష్ బేక్ లు చెప్పడంకన్నా ఆనందం ఇంకేముంటుంది?

దేవుడికి దీపం అవసరంలేదు, చీకట్లో మగ్గుతున్న మీ అంతరాత్మలో దీపం వెలిగించి భగవంతుడి ముందు ఆత్మ విమర్శ చేసుకోండి. అప్పటికీ మీలో కళంకం లేదనిపిస్తే అప్పుడు మీరు నిజమైన దైవభక్తులు.

దేశ సరిహద్దులు మనిషి నిర్మించుకున్నవి. ఒక గీత కి కేవలం అటూ ఇటూ ఉండటం వల్ల ఇద్దరు వ్యక్తులు శత్రువులవటం దురదృష్టకరం.

కన్నీరా! క్రిందకు జారకే! ఋతువుకాని ఋతువులో గోదావరికి వరదొచ్చిందేమిటి అని భయపడతారే!!

జీవితం అంటే తాళం చెవుల గుత్తికాదు- మరొకళ్ళ చేతుల్లో పెట్టి హాయిగా నిద్రపోవడానికి. ముందు మిమ్మల్ని సంస్కరించుకోండి. దాని వల్ల మీ వ్యక్తిత్వం పెరుగుతుంది.

ప్రపంచంలో గొప్పవాళ్ళందరూ కీర్తి శిఖరాలను ఒక్క అంగలో గెంతి అధిరోహించలేదు. భార్యతో సహా ప్రపంచం అంతా గాఢనిద్రలో విశ్రాంతి తీసుకుంటున్న సమయాన ఒక్కొక్క అడుగు కష్టపడుతూ పైకి పాకారు.

విజయమా, విజయమా! వెళుతూ వెళుతూ అధఃపాతాళానికి తోస్తావు, వస్తూ వస్తూ అందలాన్నెక్కిస్తావు-నీకిది న్యాయమా?

దెయ్యాలు శ్మశానంలో ఉండవు, మనిషి మనసులోనే ఉంటాయి, భయం అన్న పేరుతో.

అపనమ్మకంతో గెలిచిన గెలుపుకంటే, నమ్మకంతో వచ్చిన ఓటమే గొప్ప సంతృప్తి నిస్తుంది.

యద్దనపూడి సులోచనా రాణి కొటేషన్లు

మనసులో అనుక్షణం డబ్బు గురించి బెంగ పెట్టుకునే మనుష్యులు జీవితంలో సాహసించి ఏ సుఖము పొందలేరు.

ఆడపిల్లలకి డిగ్రీలు,హోదాలు  కాకుండా మంచి చెడులు  గ్రహించ గలిగిన విచక్షణ, తనకి అన్యాయం జరగకుండా చూసుకునే తెలివితేటలు కుడా చాలా ముఖ్యం.

 అభిమానమే ప్రాణంగా భావించుకొనే వ్యక్తులకి అది చంపుకొని తిరగటం కంటే ఘోరమైన చిత్రవధ ఏదీలేదు.
ఈ ప్రపచంలో దేనికి లేని శక్తి మనిషి మాటకుంది.

 ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ గుండెల మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా  నాకెలాంటి బాధ లేదు, నేను నిశ్చింతగా ఉన్నాను అని చెప్పలేరు.

డబ్బు లేకపోతే లేదనేది ఒక్కటే బాధ, డబ్బుంటే దానితో వచ్చే బాధలు అనేకం.

ఒక్కోసారి కొంతమంది చూడగల శక్తి ఉండి  కూడా గుడ్డివాళ్ళు అవుతారు.

స్నేహం గురించిన సూక్తులు

స్నేహమూ డబ్బూ నూనె నీరు లాంటివి.

స్నేహితులు వారి ప్రేమను కష్టకాలలోనే చూపిస్తారు. 

స్నేహం అనేది ఒక ఆత్మ,రెండు దేహాలు వసించే చోటు. 

వేదనతో నిరాశ చెందిన ప్రేమకు, స్నేహం అనేది తప్పనిసరిగా ఉపశమనం కలిగించే ఉత్తమమైన ఔషధం.

స్నేహం జీవితంలోని మంచిని రెట్టింపు చేస్తుంది,చెడును విభజిస్తుంది.

స్నేహానికి మాటలు చాలవు. ఇది ఒంటరితనపు వేధన నుండి ఏకాంతం చేస్తుంది

స్నేహం అనేది ఏదో ఒకటి కాదు పాఠశాల. 

మీ శత్రువులను ప్రేమించుట కంటే, మీ స్నేహితులతో కొద్దిగా బాగా ప్రవర్తించండి.

అనంతమైన ప్రేమ స్నేహం కంటే తక్కువే.

ప్రేమికులు నిన్ను అన్నిచోట్లా మోసం చెయ్యవచ్చు, స్నేహితులు కాదు.

నిజమైన ప్రేమ అరుదైనది, నిజమైన స్నేహం అపూర్వమైనది

స్నేహపు పరిభాష మాటలలో లేదు కాని వాటి అర్ధాలలో దాగుంది.

స్నేహితుడ్ని కలిగి ఉండేందుకు ఏకైక మార్గం ఒకటిగా ఉండడం

మిత్రులు,మంచి నడత సంపద వెళ్లలేని చోటుకు కూడా మిమ్మల్ని తీసుకువెళుతుంది.

నా వెనుక నడవవద్దు.నేను దారి మారి పోనూ,నాకు ముందు నడవవద్దు. నేను నిన్ను అనుసరించను.సరిగ్గా నా ప్రక్కకు రా, నా స్నేహితునిగా... 

స్నేహితులు జన్మిస్తారు,రూపొందించబడరు. 

స్నేహం అనేది శ్వాసించే రోజా వంటిది.దాని ప్రతి భాగమూ మకరందంతో నిండివుంటుంది.

నుండి నేర్చుకొనేందుకు..కాని నీకు స్నేహానికి అర్ధం తెలియకుంటే మాత్రం నీకు ఏది తెలియనట్లే. 

ఒక పాత స్నేహితుడు ఎదుగుదలకు సుధీర్ఘ సమయం పడుతుంది.

నిజమైన స్నేహం కంటే విలువైన బహుమానమేది లేదు ఈ పుడమిపై.

నీ గురించి అన్ని తెలిసిన ఏకైక వ్యక్తి ఇప్పటికి నిన్ను ఇష్టపడేది నీ స్నేహితుడు మాత్రమే.