మే 1
అంతర్జాతీయ కార్మికదినోత్సవము ... మే డే.1707: ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ కలిసి పోయి 'యునైటెడ్ కింగ్ డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్' గా ఏర్పడింది.
1751: మొట్టమొదటి అమెరికన్ క్రికెట్ పోటీ జరిగింది.
1945: అడాల్ఫ్ హిట్లర్ మరణించినట్లు జర్మనీ ప్రకటించింది.
1960: గుజరాత్ మరియు మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి.
1971: ప్రముఖ భారతీయ నటుడు అజిత్ కుమార్ జన్మదినం.
1988: ప్రముఖ భారతీయ నటి అనుష్క శర్మ జన్మదినం.
2008: ప్రముఖ గాంధేయవాది, రాజ్యసభ సభ్యురాలు నిర్మలా దేశ్‌పాండే మరణం (జ. 1929).
2009: మన్యసీమ తెలుగు మాసపత్రిక తొలి ప్రచురణ.
మే 2
1519 : గణిత శాస్త్రజ్ఞుడు, ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీత కళాకారుడు లియొనార్డో డావిన్సి మరణం.(జననం.1452).1911: తెలుగు చిత్ర నిర్మాత, దర్శకుడు. పి.పుల్లయ్య జననం .(మ. 1985)
1921 : ప్రముఖ భారతీయ సినిమా దర్శకుడు సత్యజిత్ రే జననం.(మరణం.1992)(ప్రక్క చిత్రంలో)
1929 : ప్రముఖ తెలుగు వచన కవితా ప్రవీణులు పెనుమర్తి విశ్వనాథశాస్త్రి జననం.
1969 : వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడు బ్రియాన్ లారా జననం
2011 : బిన్ లాడెన్ ను పాకిస్తాన్ లో, అమెరికన్ సి.ఐ.ఏ కాల్చి చంపింది.
మే 3
1830: ప్రతీ రోజూ ప్రయాణీకులను తీసుకువెళ్ళటానికి, ఆవిరితో నడిచే రైలు సేవలు,మొదటి సారిగా మొదలయ్యాయి.1913 : భారత దేశం సినీ చరిత్రలో మొదటి చలన చిత్రం రాజా హరిశ్చంద్ర విడుదల.
1932 : ప్రసిద్ధ భాషావేత్త, బూదరాజు రాధాకృష్ణ జననం.(మరణం.2006)
1939 : నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాడు.
1969 : భారత మూడవ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణం.(జననం.1897)
1981 – భారత సినిమా నటి నర్గీస్ మరణం.(జననం. 1929)
మే 4
1008 : ఫ్రాన్సు చక్రవర్తి మొదటి హెన్రీ జననం.(మరణం.1060)1767 : కర్ణాటక సంగీత విద్వాంసుడు త్యాగరాజు జననం.(మరణం.1847)
1799 : ప్రముఖ మైసూరు రాజు.టిప్పు సుల్తాన్ మరణం.(జననం.1750)
1947 : ప్రముఖ రాజకీయవేత్త, సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత దాసరి నారాయణరావు జననం.
1979 : ఇంగ్లాండ్ ఎన్నికలలో మార్గరెట్ థాచర్ ఘన విజయం.
1979 : ప్రముఖ రచయిత గుడిపాటి వెంకట చలం మరణం.(జననం.1894).(చిత్రంలో)
మే 5
1494 : క్రిస్టోఫర్ కొలంబస్ జమైకా ద్వీపాన్ని కనుగొన్నాడు.1821 : ఫ్రాన్సు చక్రవర్తి నెపోలియన్ మరణం.(జ.1769)
1916 : భారత మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్ జననం.(మరణం.1987)
1930 : ప్రముఖ సినీ సంగీత దర్శకులు పిఠాపురం నాగేశ్వరరావు జననం.(మ.1996)(చిత్రంలో)
1955 : పశ్చిమ జర్మనీ పూర్తి సార్వభౌమాధికారాన్ని పొందినది.
1989 : భారతీయ సినీ నటి లక్ష్మీ రాయ్ జననం.
1995 : తెలుగు సినిమా నటుడు,రంగస్థల నటుడు నాగభూషణం మరణం.
2003 : దక్షిణాఫ్రికా ఉద్యమనేత వాల్టర్ సిసులు మరణం.
మే 6
1856 : ఉత్తర ధృవాన్ని చేరిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించిన రాబర్ట్ పియరీ జననం.(మ.1920)1861 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు మోతీలాల్ నెహ్రూ జననం.(మ.1931)
1868 : రష్యా జారు చక్రవర్తి రెండో నికోలస్ జననం (మ.1918)
1910 : ఇంగ్లాండు చక్రవర్తి ఏడవ హెన్రీ మరణం.
1910 : ఇంగ్లాండు చక్రవర్తిగా ఐదవ జార్జి పదవిలోకి వచ్చాడు.
1932 : సంగీత విద్వాంసుడు మల్లాది వెంకట సత్యనారాయణ రావు జననం.
1953 : బ్రిటను మాజీ ప్రధానమంత్రి టోని బ్లెయిర్ జననం.
1954 : మైలు దూరాన్ని 4 నిమిషాలలోపు పరిగెత్తిన తొలి వ్యక్తిగా రోజర్ బాన్నిస్టర్ రికార్డు సృష్టించాడు.
మే 7
1861 : విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ జననం.(మ.1941)1921 : తెలుగు నాటక రచయిత, సినీకవి ఆత్రేయ జననం.(మ.1989)
1924 : స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామ రాజు మరణం.(జ.1897)
1946 : సోని కార్పొరేషన్ ను జపాన్ లో స్థాపించారు.
1972 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మరణం.(జ.1921)
1983 : 7 వ అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో ఇందిరా గాంధీ అధ్యక్షతన ప్రారంభం.
మే 8
1864: రెడ్‌క్రాస్ సంస్థ స్థాపించబడింది.1886: న్యూయార్క్ హార్బరులో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ రూపు దిద్దుకుంటున్న సమయంలో, అక్కడికి 1150 కి.మీ. దూరంలో ఉన్న అట్లాంటా లో జాన్ పెంబర్టన్ అనే ఫార్మసిస్ట్ కోకా కోలా పానీయమును తయారుచేసాడు.
1965 : భారతదేశపు ప్రముఖ అథ్లెటిక్ క్రీడాకారిణి షైనీ అబ్రహం జననం.
1973 : ఆంధ్రవిశారద తాపీ ధర్మారావు మరణం.(జ.1887 )
1973 : తెలుగు సినీపరిశ్రమలో జర్నలిస్ట్, రచయిత బులెమోని వెంకటేశ్వర్లు జననం.
మే 9
1408 : తెలుగు సాహితీ చరిత్రలో మొదటి వాగ్గేయకారుడు అన్నమయ్య జననం.(చిత్రంలో)1540 : మేవార్ రాజపుత్ర రాజులలో ప్రముఖుడు. గొప్ప యుద్ధవీరుడు రాణాప్రతాప్ జననం.
1866 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, గోపాలకృష్ణ గోఖలే జననం(మ.1915)
1933 : ప్రముఖ నాదస్వర విద్వాంసులు దోమాడ చిట్టబ్బాయి జననం.
1950 : ప్రముఖ తెలుగు హాస్యనటి కల్పనా రాయ్ జననం.
1950 : తెలుగు సినిమా హాస్యనటుడు మరియు దర్శకుడు ఎం. ఎస్. నారాయణ జననం.
1954 : సుప్రసిద్ధ భారతీయ నాట్యకత్తె మల్లికా సారాభాయ్ జననం.
1970 : తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి కొమ్మూరి పద్మావతీదేవి మరణం.
1981 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు దుర్గాబాయి దేశ్‌ముఖ్ మరణం.(జ.1909)
1986 : ఎవరెస్టు పర్వతం ఎక్కిన మొదటి విజేత, టెన్సింగ్ నార్కే మరణం.(జ.1914)
మే 10
1787 : ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త విల్లియం వాట్సన్ మరణం.(జ. 1715)1850 : ఫ్రెంచి భౌతిక రసాయన శాస్త్రవేత్త జోసెఫ్ లూయీస్ గే-లూసాక్ మరణం. (జ. 1778)
1857 : భారత స్వాతంత్ర్యోద్యమము: ఢిల్లీ దగ్గర ఉన్న మీరట్‌కాజెర్న్ సిపాయిల తిరుగుబాటు తో మొదటి స్వాతంత్ర్య యుద్ధం మొదలైన రోజు.
1908 : మాతృదినోత్సవం మొట్ట మొదటి సారిగా అమెరికా లోని పడమటి వర్జీనియా లోని గ్రాఫ్టన్ అనే ఊరిలో జరిగింది.
1922 : నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త కొర్రపాటి గంగాధరరావు జననం.
1980 : తెలుగు సినిమా నటీమణి నమిత జననం.
1986 : ఆంద్రప్రదేశ్ కు చెందిన చదరంగం క్రీడాకారుడు పెండ్యాల హరికృష్ణ జననం.
1993 : రెండుసార్లు ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కిన మొదటి స్త్రీ సంతోషి యాదవ్ రెండోసారి ఎక్కిన రోజు.
1994 : నెల్సన్ మండేలా దక్షిణ ఆఫ్రికా మొట్ట మొదటి నల్లజాతి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసాడు.(చిత్రం లో)
2002 :తెలుగు, తమిళ, మలయాళ సినిమా నటి దేవిక మరణం.
మే 11
2014 : మాతృ దినోత్సవం1918 : భారతీయ సాంప్రదాయ నృత్యకళాకారిణి,నృత్యదర్శకురాలు మృణాళినీ సారభాయ్ జననం.
1922 : తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మరియు రంగస్థల నటుడు మాధవపెద్ది సత్యం జనన (మ.2000).
1928 : తెలుగు మరియు ఉర్దూ రచయిత, హిందుస్తానీ సంగీత పండితుడు సామల సదాశివ జననం (మ.2012).
1961 : హైదరాబాదులో ప్రముఖ సమావేశ మందిరం, రవీంద్ర భారతి ప్రారంభించబడింది.
1977 : తెలుగు సినిమా నటుడు పోసాని సుధీర్ బాబు జననం.
1998 : భారత్ రెండోసారి అణుపరీక్షలు జరిపింది. ఈ తేదీని జాతీయ వైజ్ఞానిక దినోత్సవంగా జరుపుతున్నారు.
మే 12
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం.1820 : లేడీ విత్ ద లాంప్ గా పేరు గాంచిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జననం. (మ.1910).
1871 : నక్షత్ర మేఘాల పట్టికను తయారుచేసిన ప్రముఖ శాస్త్రవేత్త జాన్ ఎఫ్.డబ్లు. హెర్షెల్ మరణం (జ.1792).
1895 : జిడ్డు కృష్ణమూర్తి, ప్రముఖ భారతీయ తత్వవేత్త జననం (మ. 1986)
1920 : ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు వింజమూరి అనసూయ జననం.
1924 : ప్రముఖ నాదస్వర విద్వాంసుడు షేక్ చిన మౌలానా జననం (మ.1999).
1937 : అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు జార్జ్ కార్లిన్ జననం.
1985 : ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త బి. విజయలక్ష్మి మరణం.
1986 : అమెరికాకు చెందిన 'ఫ్రెడ్ మార్ఖం' తన రెండుచక్రాల సైకిలు పై, గంటకు 65 మైళ్ళ (104.607 కి.మీ) వేగం సాధించాడు.
1992 : ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి బెల్జియం దేశ మహిళ 'ఇన్‌గ్రిడ్ బేయెన్స్'.
మే 13
1857 : మలేరియా వ్యాధి కారకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రోనాల్డ్ రాస్ జననం.(మ.1932)(చిత్రంలో)1905 : భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ జననం.(మ.1977)
1918 : భారత నృత్య కళాకారిణి బాలసరస్వతి జననం.(మ. 1984)
1939 : మొట్టమొదటి వాణిజ్య ఎఫ్. ఎం. రేడియో WDRC మొదలైన రోజు.
1952 : భారతదేశ ప్రధమ లోక్‌సభ తొలిసారిగా సమావేశమైంది.
1956 : ప్రముఖ హిందూ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ రవి శంకర్ జననం.
1962 : భారత రెండవ రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ అధికారం చేపట్టాడు.
1969 : ప్రముఖ రాజకీయ వేత్త అసదుద్దీన్ ఒవైసీ జననం.
2001 :ప్రముఖ భారతీయ రచయిత ఆర్.కే. నారాయణ్ మరణం
మే 14
మాతృ దినోత్సవం. దేవమాత రియాకు నివాళులు అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీకు దేశంలో నిర్వహించారు.1574 : ప్రముఖ సిక్కు గురువు గురు అమర్‌దాస్ మరణం.(జ. 1479)(చిత్రంలో)
1657 : మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ జననం.
1811 : పరాగ్వే జాతీయదినోత్సవం. ఈ రోజు స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది.
1946 : కృత్రిమ గుండె "జార్విక్ 7" ను కనిపెట్టిన వైద్యుడు రాబర్ట్ జార్విక్ జననం.
1984 : అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్ మరియు ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌బర్గ్ జననం.
1987 : తెలుగు, మళయాళ మరియు హిందీ చిత్రాల నటీమణి మధురిమ జననం.
2004 : డాక్టర్ వై. ఎస్. రాజశేఖర రెడ్డి, ఆంధ్రప్రదేశ్ 20వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
అంతర్జాతీయ వలసపక్షుల దినం
మే 15
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం1803: గోదావరి కి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టిన సర్ ఆర్థర్ కాటన్ ఇంగ్లాండు లో జననం (మ.1899)
1817 : భారత మత సంస్కర్త, దేవేంద్రనాథ్ ఠాగూర్ జననం.(మ.1905)
1859 : ప్రముఖ ఫ్రెంచి శాస్త్రవేత్త పియరీ క్యూరీ జననం.(మ. 1906)
1907 : భారత స్వాతంత్ర్యోద్యమకారుడు సుఖ్‌దేవ్ జననం.(మ. 1931)
1923 : భారత సినిమా నటుడు జానీవాకర్ జననం. (మ.2003)
1928: మిక్కీ మౌస్ ప్లేన్ క్రేజీ అనే కార్టూన్ ద్వారా అరంగేట్రం చేసింది.
1967 : ప్రముఖ సినీ నటి మాథురీ దీక్షిత్ జననం.
మే 16
డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్1804: ఫ్రెంచి సెనేటు నెపోలియన్ బోనపార్టె ను చక్రవర్తిగా ప్రకటించింది.
1830: ఫ్రాన్సు కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త జోసెఫ్ ఫోరియర్ మరణం (జ. 1768).
1831: మైక్రోఫోను సృష్టికర్త డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్ జననం (మ.1900).
1881: మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ట్రాము, బెర్లిన్ (జర్మనీ) సమీపంలో, ప్రజల కు అందుబాటు (ప్రజసేవ) లోకి వచ్చింది.
1960: భారతదేశంలో మొట్టమొదటి సారిగా భారత-బ్రిటన్ల మధ్య టెలెక్స్ సర్వీసు ప్రారంభమైంది
1996: భారత ప్రధానమంత్రి గా అటల్ బిహారీ వాజపేయి నియమితుడైనాడు.
2007: వై.యస్.రాజశేఖరరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా 3 ఏళ్ళు పూర్తి చేశాడు.
మే 17
నార్వే జాతీయదినోత్సవంప్రపంచ టెలీకమ్యూనికేషన్ల దినం
1749 : ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్ జననం(మ1823).
1945 :భారత క్రికెటర్ బి.ఎస్.చంద్రశేఖర్ జననం.
1865: మొదటి అంతర్జాతీయ టెలిగ్రాఫ్ యూనియన్ ఒప్పందాన్ని పారిసు లో ఆమోదించారు.
2007 : భారత దేశ కవి, రచయిత టి.కె.దొరైస్వామి మరణం(జ. 1921).
మే 18
1048: పర్షియా మహాకవి ఒమర్ ఖయ్యాం ఇరాన్ లోని నైషాపూర్ లో జననం (మ.1131).1876: తెలుగు లో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత కొమర్రాజు వెంకట లక్ష్మణరావు జననం (మ.1923).(చిత్రంలో)
1894: ప్రముఖ స్త్రీవాద రచయిత గుడిపాటి వెంకటాచలం జననం (మ.1979).
1913: భారత రాష్ట్రపతి గా, పనిచేసిన నీలం సంజీవరెడ్డి జననం (మ.1996).
1974: భారత్ మొట్టమొదటి సారిగా రాజస్థాన్ ఎడారిలోని పోఖ్రాన్ వద్ద అణు పరీక్షలు నిర్వహించింది.
1986: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన ప్రముఖ ఇంజనీరు కె.ఎల్.రావు మరణం (జ.1902)
1987: ఆసియా దేశాల పేదరికం పై రచనలు చేసిన ప్రముఖ ఆర్థికవేత్త గున్నార్ మిర్థాల్ మరణం (జ.1898).
2007: హైదరాబాదు మక్కా మసీదు లో బాంబులు పేలాయి.
మే 19
1890: అమెరికా ను గడగడ లాడించిన వియత్నాం నాయకుడు హొ చి మిన్ జననం (మ.1969).1894 : సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి మరియు సంఘసంస్కర్త గుడిపాటి వెంకట చలం జననం (మ.1979).
1904 : భారత దేశంలో పెట్టుబడిదారుడు, పారిశ్రామికవేత్త, పారిశ్రామిక రంగ పురోగమనంలో ప్రముఖుడు జమ్సేట్జి టాటా మరణం (జ.1839).
1913 : భారత 6 వ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జననం. (మ.1996)(చిత్రంలో)
1938 : ప్రముఖ రచయిత,నటుడు,సినిమా దర్శకుడు గిరీష్ కర్నాడ్ జననం.
1952 : భరత నాట్యానికి, కర్ణాటక సంగీతమునకు, అంతరించిపోతున్న భారతదేశ కళలకు ఎనలేని సేవ చేసిన బెంగుళూరు నాగరత్నమ్మ మరణం (జ.1878).
1955 : కంప్యూటర్ శాస్త్రవేత్త , జావా అనే కంప్యూటర్ భాషకు తండ్రి లాంటి వాడు అయిన జేమ్స్ గోస్లింగ్ జననం.
1970 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సంపాదకుడు కోలవెన్ను రామకోటీశ్వరరావు మరణం (జ.1894).
1985: కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య మరణం (జ.1913).
మే 20
1498 : భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామా కాలికట్ తీరంలో అడుగుపెట్టాడు.1506 : అమెరికా ను కనుగొన్న ఇటాలియన్ నావికుడు క్రిస్టోఫర్ కొలంబస్ మరణం (జ.1451).
1932 : లాల్, బాల్, పాల్ త్రయములోని బిపిన్ చంద్ర పాల్ మరణం (జ.1858).
1955 : ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జననం
1957 : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మరణం (జ.1872).
1983 : సినిమా నటుడు జూనియర్ ఎన్.టి.ఆర్ జననం.(చిత్రంలో)
1984 : తెలుగు నటుడు, మరియు ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ కుమార్ జననం.
1994 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మరణం (జ.1909).
సమ్మక్క - సారక్క జాతర ముగింపు రోజు.
మే 21
ఉత్తర ధృవంపై డ్రిప్టింగ్ ఐస్ స్టేషన్ వద్ద ఇవాన్ పాపనిన్1502 : 'సెయింట్ హెలెనా' దీవిని పోర్చుగీస్ కి చెందిన నౌకాదళాధికారి అడ్మిరల్ 'జో డ నోవా' కనుగొన్నాడు.
1829 : సికింద్రాబాదు కు ఆ పేరు రావటానికి కారణమైన సికిందర్ జా అసఫ్ జాహి మరణం (జ.1768 ).
1886 : ప్రాణవాయువు ను కనుగొన్న శాస్త్రవేత్త కార్ల్ విల్‌హెల్మ్ షీలే మరణం (జ.1742).
1937 : ఆర్కిటిక్ మహాసముద్రం మంచు ఖండాల మీద సోవియట్ రష్యా తన మొట్టమొదటి వైజ్ఞానిక పరిశోధక కేంద్రం మొదలు పెట్టింది.
1991 : భారత 6 వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మరణం (జ.1944).
1994 : భారత దేశానికి చెందిన సుష్మితా సేన్ ,18 సంవత్సరాల వయసులో, 43వ విశ్వ సుందరి గా ఎన్నికైంది.
మే 22
అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం.యెమన్ జాతీయదినోత్సవం
1772 : సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ జననం. (మ. 1833).(చిత్రంలో)
1888 : సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు భాగ్యరెడ్డివర్మ జననం.
1942 : రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక అవతరించింది.
1948 : పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి జననం.
1952 : ప్రముఖ హేతువాది గుమ్మా వీరన్న జననం.
2004 : భారత 12వ ప్రధానమంత్రి గా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. (14వ లోక్ సభ -13వ ప్రధాని)
2008 : నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చుటకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది
2009 : భారత 13వ ప్రధానమంత్రి గా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు.
2010 : మంగళూరు విమానాశ్రయంలో విమానం కూలి 158 మంది మృతిచెందారు.
2010 : సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి మరణం. (జ.1936)
మే 23
1707 : ప్రముఖ స్వీడన్ జీవ శాస్త్రవేత్త మరియు వైద్యుడు, ఆధునిక వర్గీకరణ శాస్త్ర పితామహుడు కరోలస్ లిన్నేయస్ జననం.1984: మొట్టమొదటి సారిగా ఒక భారత మహిళ బచేంద్రీ పాల్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది.
1942: ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు జననం.(చిత్రంలో)
1945 : మలయాళ భాషా రచయిత, చిత్రానువాదకుడు, మరియు చిత్రనిర్మాత పద్మరాజన్ జననం.
1953 : భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణం.
1965 : తెలుగు సినిమా దర్శకుడు వై.వి.యస్.చౌదరి జననం.
1995: జావా ప్రోగ్రామింగ్ భాష మొదటి వర్షన్ విడుదలైంది.
మే 24
1543 : మధ్యయుగానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త నికోలాస్ కోపర్నికస్ మరణం.1819: బ్రిటన్ రాణి విక్టోరియా జననం (మ. 1901).(చిత్రంలో)
1844: మొట్టమొదటి టెలిగ్రాఫు సందేశాన్ని సామ్యూల్ F. B. మోర్స్ అను శాస్త్రవేత్త వాషింగ్టన్ డీ.సీ. నుండి బాల్టిమోర్ కు ప్రసారము చేశాడు.
1875: సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ స్కూల్ ను స్థాపించాడు. ఇదే 1920 లో అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ గా అవతరించినది.
2013 : ప్రముఖ రచయిత, సాహితీ వేత్త రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు మరణం.
మే 25
1865 : నోబెల్ బహుమతి గ్రహీత, డచ్చి భౌతిక శాస్త్రవేత్త పీటర్ జీమన్ జననం (మ. 1943).1886 : భారత స్వాతంత్ర్యోద్యమ కారుడు రాస్ బిహారి బోస్ జననం (మ. 1945)(చిత్రంలో)
1897 : స్వాతంత్ర్య సమరయోధుడు. తెలుగు, కన్నడ పండితుడు, వక్త మరియు కవి కల్లూరు సుబ్బారావు జననం.
1899 : బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు ఖాజీ నజ్రుల్ ఇస్లాం జననం (మ.1976 ).
1924 : బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త అశుతోష్ ముఖర్జీ మరణం.
1936 : భారత క్రికెటర్ రూసీ సూర్తీ జననం. (మ. 2013).
1972 : భారత దేశ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత మరియు నటుడు కరణ్ జోహార్ జననం.
1975 : స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి పద్మజా నాయుడు మరణం.
2001 : 32 సంవత్సరాల ఎరిక్ వైహెన్‌మాయెర్ ప్రపంచ అత్యున్నత ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి అంధుడుగా చరిత్రకెక్కాడు.
మే 26
1894: రష్యా జార్ గా రెండవ జాన్ నికోలస్ నియమించబడ్డాడు.1942 : ప్రముఖ భారత ఆధ్యాత్మిక వేత్త గణపతి సచ్చిదానంద స్వామి జననం.
1949 : మొట్టమొదట వికీపీడియా ను అభివృద్ధి చేసిన అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్ వార్డ్ కన్నింగ్‌హమ్ జననం.
1945 : భారత రాజకీయవేత్త విలాస్‌రావు దేశ్‌ముఖ్ జననం. (మ. 2012).
1969 : చంద్రుని పైకి పంపిన వ్యోమనౌక అపోలో 10 తన ఎనిమిది రోజుల యాత్ర అనంతరం భూమిని చేరింది.
1972 : అమెరికా, సోవియట్ యూనియన్ లు క్షిపణి వ్యతిరేక ఒప్పందం పై సంతకాలు చేశాయి.
1986 : యూరోపియన్ పతాకాన్ని యూరోపియన్ కమ్యూనిటీ ఆమోదించింది
2014 : భారత దేశ 15 వ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం.
మే 27
1332 : ప్రసిద్ధ చరిత్రకారుడు, పండితుడు, ధార్మిక శాస్త్రవేత్త, మరియు రాజకీయ వేత్త ఇబ్నె ఖుల్దూన్ జననం.1910 : జర్మనీకి చెందిన ప్రపంచ ప్రసిద్ధ వైద్యుడు మరియు శాస్త్రవేత్త రాబర్ట్ కోచ్ మరణం.
1919 : భారత దేశ ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు మరణం (జ. 1848).
1931 : మలయాళంలో ప్రసిద్ధ కవి, సినీ గేయకర్త ఒ.ఎన్.వి.కురుప్ జననం.(చిత్రంలో)
1934 : రెండవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇటలీ లో ప్రారంభమయ్యాయి.
1962 : భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు రవిశాస్త్రి జననం.
1964 : భారత తాత్కాలిక ప్రధానమంత్రి గా గుల్జారీ లాల్ నందా నియామకం.
1964 : భారత దేశపు ప్రథమ ప్రధాన మంత్రిజవహర్ లాల్ నెహ్రూ మరణం (జ.1889).
1980 : ప్రసిద్ధ తెలుగు, కన్నడ సినిమా సంగీత దర్శకులు సాలూరు హనుమంతరావు మరణం.
1982 : రస్నా బేబీగా పేరొందిన తెలుగు సినిమా కథానాయిక అంకిత జననం.
మే 28
నందమూరి తారక రామారావు1896 : పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు సురవరం ప్రతాపరెడ్డి జననం (మ. 1953).
1923 : నందమూరి తారక రామారావు జననం (మ.1996).
1994 : ఐ.ఎన్.ఎస్. షంకుల్ (జలాంతర్గామి) భారతీయ నౌకాదళం లో చేరిన రోజు.
1997 : కుమ్మరి మాస్టారు అని పిలువబడే, ప్రసిద్ధిచెందిన బుర్రకథ కళాకారుడు, దార అప్పలనారాయణ మరణం (జ.1930).
2008 : సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన తరువాత నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
మే 29
1932 : కొప్పరపు సోదర కవులు లో ఒకరైన కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి మరణం (జ.1885).1953 : టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీ లు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తులుగా రికార్డు సృష్టించారు.(చిత్రంలో)
1829 : ప్రముఖ రసాయన శాస్త్రవేత్త హంఫ్రీ డేవీ మరణం (జ.1778)
1903 : ప్రపంచ ప్రసిద్ధిచెందిన హాస్యజీవి బాబ్ హోప్ జననం (మ.2003).
1980 : తెలుగు నేపథ్య గాయని ఉష జననం.
1987 : భారత దేశ 5 వ ప్రధానమంత్రి చరణ్ సింగ్ మరణం (జ.1902)
1987 : మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత పి.పుల్లయ్య మరణం (జ.1911).
మే 30
1921: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు కంచనపల్లి పెదవెంకటరామారావు జననం.1987 : గోవా కి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది.
1950 : భారతీయ నటుడు పరేష్ రావెల్ జననం.
1962 : ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు చిలీ లో ప్రారంభమయ్యాయి.
2007 : ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ మరణం.(జ.1927)
2008 : కర్ణాటక ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడ్యూరప్ప ప్రమాణస్వీకారం.
మే 31
ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం. (ప్రపంచ పొగాకు దినం)526 : టర్కీ లో సంభవించిన భయంకరమైన భూకంపం 2,50,000 మందిని పొట్టనబెట్టుకుంది.
1725 : మరాఠా రాజ్య రక్షణకు, హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడిన ధీర వనిత అహల్యా బాయి హోల్కర్ జననం.
1911 : ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మారిస్ అలైస్ జననం (మ.2010).
1930 : సుప్రసిద్ధ అమెరికన్ నటుడు, దర్శకుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ జననం.
1942 : తెలుగు సినిమా నటుడు, దర్శకుడు,నిర్మాత మరియు భారత పార్లమెంటు సభ్యుడు సూపర్‌స్టార్ కృష్ణ జననం.
1964 : స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు వెళ్ళిన మెట్టమెదటి ఆంధ్ర మహిళ దువ్వూరి సుబ్బమ్మ మరణం.
2002 : దక్షిణ కొరియా, జపాన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ కప్ సాకర్ పోటీలు ప్రారంభమయ్యాయి.
No comments:
Post a Comment