అక్టోబర్ 1
ప్రపంచ వృద్ధుల దినోత్సవం, చైనా జాతీయదినోత్సవం, నైజీరియా జాతీయదినోత్సవం.1847 : హోమ్‌రూల్ ఉద్యమకర్త అనీ బిసెంట్ జననం (మ.1933).
1928 : సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటుడు శివాజీ గణేశన్ జననం (మ.2001).
1951 : ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన లోక్‌సభ సభ్యుడు మరియు తొలి దళిత లోక్‌సభ సభాపతి జి.ఎం.సి.బాలయోగి జననం (మ.2002).
1862 : సంఘసంస్కర్త రఘుపతి వెంకటరత్నంనాయుడు జననం (మ.1939).
1869 : ప్రపంచములో తొలిసారిగా పోస్టుకార్డు ను ఆస్ట్రియా దేశంలో విడుదల చేశారు.
1922 : ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య జననం (మ.2004).
1935 : భారత సుప్రీంకోర్టు నెలకొల్పబడింది.
1946 : ప్రఖ్యాత సినిమా దర్శకుడు మరియు సంపాదకుడు గూడవల్లి రామబ్రహ్మం మరణం(జ.1902).
1953 : కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ.
1953 : టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర్ర (ఆంధ్రప్రదేశ్ కాదు) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
1958 : భారతదేశంలో [మెట్రిక్ కొలతల పద్ధతి] ప్రవేశపెట్టబడింది.
అక్టోబర్ 2
అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవంఅంతర్జాతీయ అహింసా దినం, భారతదేశంలో గాంధీ జయంతి.
1869: గుజరాత్ లోని పోర్‌బందర్ లో మహాత్మా గాంధీ జన్మించాడు (మ.1948).
1904: భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి మరియు దేశ స్వాతంత్ర్యోద్యమములో ప్రముఖ పాత్రధారి లాల్ బహదూర్ శాస్త్రి జననం (మ.1966).
1928 : సాహితీవేత్త, బహుముఖ కళా శిల్పి ఎస్.వి.జోగారావు జననం (మ.1992).
1966 : భారతదేశం లోని 16 రైల్వే జోన్‌లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే ప్రారంభం.
1975 : తమిళనాడుకు చెందిన భారత రాజకీయనాయకుడు, భారత రత్న పురస్కార గ్రహీత కె.కామరాజ్ మరణం (జ.1903).
2006 : డా. జయప్రకాశ్ నారాయణ్ చే లోక్ సత్తా పార్టీ స్థాపించబడినది.
2009 : తుంగభద్ర నది ఉప్పొంగి కర్నూలు, మంత్రాలయం లతో సహా కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలలోని తుంగభద్ర తీరాన ఉన్న వందలాది గ్రామాలు నీటమునిగాయి.
అక్టోబర్ 3
1923 : బ్రిటిషు సామ్రాజ్యములో పట్టభద్రురాలైన తొట్టతొలి వనితలలో ఒకరు, స్త్రీవిమోచన కార్యకర్త కాదంబినీ గంగూలీ మరణం (జ.1861).
1957 : ఆకాశవాణి (All India Radio) యొక్క విశిష్ట సేవ వివిధ భారతి ప్రారంభం.
1964 : ఆంగ్ల నటుడు క్లైవ్ ఓవెన్ జననం.
1965 : ప్రముఖ భారతీయ సినీనటి రాధ జననం.
1990 : బెర్లిన్ గోడ తొలగింపుతో జర్మనీ విలీనం జరిగినది.
2006 : ప్రసిద్ధి చెందిన తమిళ, తెలుగు సినిమా నటి మరియు నాట్య కళాకారిణి ఇ.వి.సరోజ మరణం.
అక్టోబర్ 4
1920 : ప్రముఖ హేతువాది మరియు వామపక్షవాది తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి జననం (మ.2013).
1947 : ప్రఖ్యాత జర్మన్ భౌతిక శాస్త్రవేత్త, క్వాంటం భౌతిక శాస్త్రానికి ఆద్యుడు అయిన మాక్స్ ప్లాంక్ మరణం (జ.1858).
1957: ప్రపంచపు మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1 ని సోవియట్ రష్యా ప్రయోగించింది.
1977 : కన్నడ మరియు తెలుగు సినిమా నటి సంఘవి జననం.
2004: మాజీ ఒరిస్సా ముఖ్యమంత్రి నీలమణి రౌత్రాయ్ కటక్ లో మరణించాడు (జ.1920).
అక్టోబర్ 5
ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవము
1864 లో కలకత్తా లో వచ్చిన పెను తుపానులో నగరం నాశనమైంది. 60,000 మందికి పైగా మరణించారు.
1929 : భారత లోక్‌సభ సభ్యుడు గుడిసెల వెంకటస్వామి జననం.
1932 : భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు మాధవ్ ఆప్టే జననం.
1946 : ప్రముఖ సినిమా నటి రమాప్రభ జననం.
1952 : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర విభాగము యొక్క అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త మరియు రచయిత కంచ ఐలయ్య జననం.
1975 : ప్రముఖ ఇంగ్లీషు నటి మరియు గాయని కేట్ విన్స్‌లెట్ జననం.
1989 : దలైలామా కు నోబెల్ శాంతిబహుమతి వచ్చింది.
2001 : ప్రముఖ సంఘసేవకురాలు మరియు ఖాదీ ఉద్యమ నాయకురాలు కల్లూరి తులశమ్మ మరణం (జ.1910).
2011 : యాపిల్ ఇన్‌కార్పొరేటేడ్ కు చైర్మెన్ మరియు CEO స్టీవ్ జాబ్స్ మరణం (జ.1955).
అక్టోబర్ 6
1860 - ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షాస్మృతి చట్టమైన రోజు
1892 : బ్రిటన్‌కు చెందిన అత్యంత ప్రసిద్ధి చెందిన ఆంగ్ల కవి టెన్నిసన్ మరణం (జ.1809).
1893 : భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మేఘనాధ్ సాహా జననం (మ.1956).
1896 : ప్రముఖ తెలుగు రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మ జననం (మ.1978).
1942 : ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రముఖ గణాంకశాస్త్రజ్ఞుడు, ఆచార్యుడు బి.ఎల్.ఎస్.ప్రకాశరావు జననం.
1963 : నెహ్రూ జంతుప్రదర్శనశాల హైదరాబాదు లో స్థాపించబడినది.
1974: భారతదేశపు మాజీ రక్షణ మంత్రి వి.కె.కృష్ణమీనన్ మరణం (జ.1896).
1981: ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్ హత్య (జ.1918).
2012 : మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి మరణం (జ.1921).
1967 : మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య (సి.పుల్లయ్య ) మరణం. (జ.1898)
అక్టోబర్ 7
1708: సిక్కుల పదవ, చివరి గురువు, గురు గోవింద సింగ్ మరణం (జ.1666).
1737: 40 అడుగుల ఎత్తున లేచిన సముద్ర కెరటాలు బెంగాలును ముంచెత్తగా, దాదాపు 3 లక్షల మంది మరణించారు.
1914 : ప్రముఖ గజల్ గాయని బేగం అక్తర్ జననం (మ.1974).
1900 : ప్రముఖ తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి మరియు కులపతి గంటి జోగి సోమయాజి జననం (మ.1987).
1919 : నవజీవన్ పత్రికను మహాత్మా గాంధీ ప్రారంభించాడు.
1940 : ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత కూచి నరసింహం మరణం (జ.1866).
1950 : కలకత్తా లో మిషనరీస్ ఆఫ్ చారిటి, మదర్ తెరెసా చే ప్రారంభం.
1979 : భారతదేశంకు చెందిన మోడల్ మరియు నటి యుక్తా ముఖీ జననం.
అక్టోబర్ 8
1891 : ప్రముఖ నవలా రచయిత మరియు నాటక కర్త భోగరాజు నారాయణమూర్తి జననం (మ.1940).
1895 : బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త అడివి బాపిరాజు జననం (మ.1952).
1902 : ఆర్ధిక శాస్త్రవేత్త మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి, వాసిరెడ్డి శ్రీకృష్ణ జననం (మ.1961).
1918 : ప్రముఖ తెలుగు సినిమా నటుడు పేకేటి శివరాం జననం (మ.2006).
1932: భారతీయ వైమానిక దళం ఏర్పాటయింది.
1935 : ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుడు, పరుగు వీరుడు, ఫ్లయింగ్ సిఖ్ మిల్ఖా సింగ్ జననం.
1963 : చిలకలపూడి సీతారామాంజనేయులు, విలక్షణమైన తెలుగు నటుడు మరణం (జ.1907).
1976 : ప్రముఖ తెలుగు రచయిత, కవి మరియు అనువాదకుడు కందుకూరి రామభద్రరావు మరణం (జ.1905).
1979 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు మరియు రాజకీయ నాయకుడు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మరణం (జ.1902).
1981:తెలుగు దర్శకుడు దాసరి మారుతి జననం.
అక్టోబర్ 9
ప్రపంచ తపాలా దినోత్సవం
1562 : ప్రపంచ ప్రసిద్ధిచెందిన శరీర నిర్మాణ శాస్త్రవేత్త మరియు వైద్యుడు గాబ్రియల్ ఫెలోపియో జననం.
1874 : హైదరాబాదు రైల్వే స్టేషను ప్రారంభం.
1945 : ప్రముఖ భారతీయ సరోద్ విద్వాంసుడు అంజద్ అలీఖాన్ జననం.
1967 : దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు మరియు రాజకీయ నాయకుడు చే గెవారా మరణం.
2008 : తొలి తెలుగు గిరిజన దినపత్రిక ‘మన్యసీమ’ మొదటి ప్రతి ప్రచురించబడింది.
2009 : నార్వే నోబెల్ కమిటీ ఒబామాకు 2009 నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించింది.
2013 : తెలుగు చలనచిత్రన నటుడు శ్రీహరి మరణం.
అక్టోబర్ 10
680 : ముహమ్మద్ ప్రవక్త మనుమడు హుసేన్ ఇబ్న్ అలీ ఇబ్న్ అబీతాలిబ్ మరణం (జ.626).
1731 : బ్రిటిష్ తత్వవేత్త మరియు శాస్త్రవేత్త హెన్రీ కేవిండిష్ జననం (మ.1810).
1906 : ప్రముఖ భారతీయ రచయిత ఆర్.కే. నారాయణ్ జననం (మ.2001).
1908 : అన్ని పాత్రలలో రాణించిన అద్భుతమైన సహాయ నటుడు ముదిగొండ లింగమూర్తి జననం (మ.1980).
1908 : స్త్రీ పాత్రధారణలో గొప్ప పేరు సంపాదించుకున్న నటనాగ్రేసరుడు బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి జననం.
1960 : ప్రముఖ తెలుగు సినిమా ప్రతినాయకుడు, హాస్యనటుడు రఘు బాబు జననం.
1990 : వరంగల్లు సమీపంలో ఒక రైలు బోగీకి నక్సలైట్లు నిప్పంటించిన సంఘటనలో 60 మందికి పైగా మరణించారు.
2011 : ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ మరణం (జ.1941).
అక్టోబర్ 11
1827 : నిజాం పరిపాలకులలో ఐదవ అసఫ్ జాహీ రాజు అఫ్జల్ ఉద్దౌలా జననం (మ.1869).
1902 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు మరియు రాజకీయ నాయకుడు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జననం (మ.1979).
1918 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, సర్వోదయ ఉద్యమ నాయకురాలు గ్యాన్ కుమారీ హెడా జననం (మ.2008).
1942 : ప్రముఖ భారతీయ సినిమా నటుడు అమితాబ్ బచ్చన్ జననం.
1972 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు సంజయ్ బంగర్ జననం.
1999: అటల్ బిహారీ వాజపేయి భారతదేశానికి ప్రధానమంత్రి గా నియమితుడయ్యాడు.
అక్టోబర్ 12
1911 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు విజయ్ మర్చంట్ జననం (మ.1987).
1929 : సంఘసేవకుడు, దాత, కళాపోషకుడు మరియు విద్యావేత్త రామినేని అయ్యన్న చౌదరి జననం (మ.2000).
1932 : జపాన్ కు చెందిన పర్వతారోహకుడు యుషిరో మియురా జననం.
1946 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు అశోక్ మన్కడ్ జననం.
1948 : ఒక భారతీయ మోడల్, ఒడిస్సీ సాంప్రదాయ భారతీయ నృత్య కళాకారిణి ప్రొతిమా బేడి జననం (మ.1998).
1949 : తెలుగు కథకుడు పంతుల జోగారావు జననం.
1963 : భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త నారాయణ కొచ్చెర్లకోట జననం.
1967 : ప్రముఖ సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త రామమనోహర్ లోహియా మరణం (జ.1910).
1986 : తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు దర్శకులు పి.ఎస్. రామకృష్ణారావు మరణం (జ.1918).
అక్టోబర్ 13
ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం
1679 : పెను తుపానులో కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలో 20 వేలకు పైగా మృతిచెందారు.
1911 : వివేకానందు ని శిష్యురాలు, పూర్వాశ్రమంలో మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ అనే పేరుగల సిస్టర్ నివేదిత మరణం (జ.1867).
1936 : ప్రసిద్ధ సంగీతజ్ఞుడు, ప్రముఖ వైణికుడు చిట్టిబాబు జననం (మ.1996).
1987 : ప్రముఖ హిందీ సినీ గాయకుడు కిషోర్ కుమార్ మరణం (జ.1929).
అక్టోబర్ 14
1956 : నాగపూరు లో అంబేద్కర్ రెండు లక్షల మంది అనుచరులతో సహా బౌద్ధమతం స్వీకరించాడు.
1985 : అస్సాం గణ పరిషత్ స్థాపించబడింది.
1969 : సినిమా రచయిత, చిత్ర దర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్ మరియు ఛాయాగ్రహకుడు అర్దెషీర్ ఇరానీ మరణం (జ.1886).
1981 : ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు గౌతమ్ గంభీర్ జననం.
1994 : బొగద సొరంగానికి నిర్మాణపు పనులు మొదలుపెట్టారు.
1998 : అమర్త్యసేన్ కు ఆర్ధికశాస్త్రం లో నోబెల్ బహుమతి వచ్చింది.
అక్టోబర్ 15
1542 : మొఘల్ చక్రవర్తి అక్బర్ సింధు ప్రాంతంలోని అమర్‌కోట్‌లో జన్మించాడు (మ.1605).
1908 : ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్ జననం (మ.2006).
1918 : భారతీయ అధ్యాత్మిక గురువు, హిందూ, ముస్లిం ల ఆరాధ్య దైవం షిర్డీ సాయిబాబా పరమపదించాడు (జననం తెలియదు).
1918 : సారస్వత నికేతనం తెలుగు గ్రంథాలయం ప్రకాశం జిల్లా వేటపాలెం లో ప్రారంభం.
1920 : ప్రముఖ సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత భూపతిరాజు విస్సంరాజు జననం (మ. జూన్ 8, 2002).
1931 : భారత దేశపు మాజీ రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ జననం.
1937 : స్వాతంత్ర్య సమరయోధుడు, కొచ్చిన్ సంస్థానం యొక్క మాజీ దీవాన్ నెమిలి పట్టాభి రామారావు మరణం (జ.1862).
అక్టోబర్ 16
ప్రపంచ ఆహార దినోత్సవం
1846: మొట్టమొదటిసారిగా వైద్యరంగంలో మత్తుమందు (ఎనెస్థీసియా) ను ఉపయోగించారు. ఈరోజును ప్రపంచ ఎనెస్థీసియా దినోత్సవంగా భావిస్తారు.
1854 : ఐర్లండుకు చెందిన నాటక రచయిత, నవలా రచయిత, కవి మరియు కథా రచయిత ఆస్కార్ వైల్డ్ జననం (మ.1900).
1905: బ్రిటిషు వారు బెంగాల్ రాష్ట్రాన్ని తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ గా విభజించారు. తూర్పు బెంగాలే నేటి బంగ్లాదేశ్
1958 : ప్రముఖ తెలుగు రచయిత. అభ్యుదయ కవి, కథారచయిత మరియు నాటకకర్త తెన్నేటి సూరి మరణం (జ.1911).
1977 : ఒక అమెరికన్ వాద్యకారుడు జాన్ మేయర్ జననం.
1982 : భారతీయ చిత్ర నటుడు, నేపథ్య గాయకుడు, మరియు నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ జననం.
అక్టోబర్ 17
1817 : భారతీయ విద్యావేత్త, రాజకీయ నాయకుడు, ఇస్లామీయ సామాజిక సంస్కర్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ జననం (మ.1898).
1920: భారతీయ కమ్యూనిస్టు పార్టీ తాష్కెంట్ లో ఏర్పడింది.
1901 : సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు, వైద్యుడు జి.ఎస్.మేల్కోటే జననం (మ.1982).
1929: విమర్శకుడు, ఉత్తమ పరిశోధకుడు, ఆదర్శ ఆచార్యుడు. కవి. నాటకకర్త కొర్లపాటి శ్రీరామమూర్తి కోనసీమ లోని, కొర్లపాటి వారి పాలెం లో జననం (మ. 26 జూలై 2011).
1929 : ప్రముఖ గాంధేయవాది నిర్మలా దేశ్ పాండే జననం (మ.2008).
1940: గాంధీజీ పిలుపుతో వినోబా భావే 'వ్యక్తి సత్యాగ్రహా'న్ని ఆచరించిన రోజు.
1970: ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు అనిల్ కుంబ్లే జననం.
1981 : తమిళ కవి మరియు భావకవి కన్నదాసన్ మరణం (జ.1927).
1979: మదర్ థెరీసా కు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.
అక్టోబర్ 18
1976 : తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ మరణం (జ.1895).
1871 : ఇంగ్లీషు గణితశాస్త్రవేత్త, తత్త్వవేత్త, మెకానికల్ ఇంజనీరు ఛార్లెస్ బాబేజ్ మరణం (జ.1791).
1931 : విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్ మరణం (జ.1847).
1956 : ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా జననం.
1965 : ప్రముఖ ఇస్లామీయ పండితుడు. ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపకుడు డాక్టర్ జాకిర్ నాయక్ జననం.
1968 : ప్రముఖ భారత క్రికెటర్ నరేంద్ర హిర్వాణి జననం.
అక్టోబర్ 19
1864 : తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు ఆచంట సాంఖ్యాయన శర్మ జననం (మ.1933).
1910: భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ జననం (మ.1995).
1952: ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ పొట్టి శ్రీరాములు తన ఆమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టాడు.
1986 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య మరణం (జ.1919).
2003: మదర్ థెరీసా కు పోప్‌జాన్‌పాల్- 2 దైవత్వం (బీటిఫికేషన్) ఆపాదించిన రోజు.
2006 :ప్రముఖ భారతీయ చలనచిత్ర నటి శ్రీవిద్య (నటి) మరణం (జ.1953).
అక్టోబర్ 20
1891 : న్యూట్రాన్ కనుగొనినందుకు భౌతిక శాస్త్రము లో నోబుల్ బహుమతి గ్రహీత జేమ్స్ చాడ్విక్ జననం (మ.1974).
1927: ప్రముఖ కవి, విమర్శకుడు, గుంటూరు శేషేంద్ర శర్మ జననం (మ.2007).
1938 : ఆంధ్రుల అబిమాన హాస్య నటుడు, దాతృత్వంలో తన చేతికి ఎముక లేదని చాటుకున్న నటుడు పుణ్యమూర్తుల అప్పలరాజు అలియాస్ రాజబాబు జననం (మ.1983 ఫిబ్రవరి 14).
1947: ఐక్యరాజ్యసమితి పతాకం ఆమోదించబడింది.
1956 : ఆంగ్ల దర్శకుడు, నిర్మాత డానీ బాయిల్ జననం.
1963 : మాజీ భారతీయ క్రికెట్ బ్యాట్స్‌మన్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ జననం.
1978 : భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు వీరేంద్ర సెహ్వాగ్ జననం.
2010 : ప్రముఖ నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు అయిన పాగ పుల్లారెడ్డి మరణం (జ.1919).
అక్టోబర్ 21
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం.
1833 : ప్రముఖ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కారకుడు ఆల్‍ఫ్రెడ్ నోబెల్ జననం (మ.1896).
1902 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు అన్నాప్రగడ కామేశ్వరరావు జననం.
1915 : తెలుగు వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు విద్వాన్ విశ్వం జననం.
1920 : ప్రముఖ నాయకుడు మరియు గాంధేయవాది తమనపల్లి అమృతరావు జననం (మ.1989).
1967 : మాజీ భారతీయ క్రీడాకారిణి అశ్వని నాచప్ప జననం.
1996 : చిత్రకళారంగంలో అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు పాకాల తిరుమల్ రెడ్డి మరణం (జ.1915).
అక్టోబర్ 22
1879: బ్రిటిషు వారు మొట్ట మొదటి రాజద్రోహ నేరాన్ని నమోదు చేసారు. వాసుదేవ బల్వంత ఫడ్కే మొదటి ముద్దాయి.
1894 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సంపాదకుడు కోలవెన్ను రామకోటీశ్వరరావు జననం (మ.1970).
1900 : భారతీయ స్వంతంత్ర సమరయోధుడు అష్ఫాకుల్లా ఖాన్ జననం (మ.1927).
1949 : ఫ్రాన్సు దేశానికి చెందిన ఒక ఫుట్ బాల్ నిర్వాహకుడు ఆర్సేన్ వెంగెర్ జననం.
1963: భాక్రా నంగల్ ఆనకట్టను ప్రధాని నెహ్రూ జాతికి అంకితం చేసాడు.
1966: సోవియట్ యూనియన్ లూనా 12 అంతరిక్ష నౌక ను ప్రయోగించింది.
అక్టోబర్ 23
1623: హిందీ భాషలో రామాయణాన్ని రచించిన తులసీదాసు మరణించాడు.
1924 : ప్రముఖ చిత్రకారుడు ఆర్.కె.లక్ష్మణ్ జననం.
1924 : తెలుగు నాటక రచయిత, నటుడు మరియు నాటక సమాజ స్థాపకుడు కె.ఎల్. నరసింహారావు జననం.
1940 : బ్రెజిల్ దేశానికి చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు పీలే మరణం.
1969 : ఒక అమెరికన్ నాడీ శస్త్రచికిత్సకుడు సంజయ్ గుప్తా జననం.
1977 : దూరదర్శన్ సప్తగిరి చానల్ ప్రారంభం.
2007 : తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఉత్పల సత్యనారాయణాచార్య
అక్టోబర్ 24
ఐక్యరాజ్యసమితి దినోత్సవం
1577: నాలుగో సిక్కు గురువైన గురు రాందాస్ అమృత్‌సర్ నగరాన్ని స్థాపించాడు.
1851: కలకత్తా, డైమండ్ హార్బర్ ల మధ్య భారత దేశపు మొదటి టెలిగ్రాఫ్ లైను ప్రారంభమయింది.
1914 : ప్రముఖ సంఘసేవకురాలు మరియు రాజ్యసభ సభ్యురాలు లక్ష్మీ సెహగల్ జననం.
1924: ప్రసిద్ధ తెలుగు సినిమా నటి సూర్యకాంతం జననం.
1953 : ప్రముఖ రంగస్థల కళాకారిణి నర్రా విజయలక్ష్మి జననం.
1966 : రష్యాకు చెందిన ఒక యూదు వ్యాపారవేత్త రోమన్ అబ్రమోవిచ్ జననం.
1974 : భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు గగన్ ఖోడా జననం.
2008 : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన మానవ రహిత చంద్రయాన కార్యక్రమము చంద్రయాన్ ప్రయోగం.
2013 : ప్రముఖ నేపథ్య గాయకుడు మన్నా డే మరణం.
అక్టోబర్ 25
1929 : ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం జననం.(మ.2012)
1946 : ప్రముఖ కవి, సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు కలేకూరు ప్రసాద్ జననం.
1955 : ప్రసిద్ధ హిందుస్తానీ సంగీత విద్వాంసుడు డి.వి. పలుస్కర్ మరణం.(జ.1921)
1980 : సుప్రసిద్ధ ఉర్దూ కవి మరియు బాలీవుడ్ గేయరచయిత సాహిర్ లుధియానవి మరణం. (జ.1921)
1881 : స్పానిష్ శిల్పి, చిత్రకారుడు. చిత్రలేఖనంలో క్యూబిజం ను ప్రోత్సహించిన కళాకారుడు పాబ్లో పికాసో జననం.(మ.1973)
1982 : ప్రముఖ తెలుగు రచయిత, కుందుర్తి ఆంజనేయులు మరణం
1984 : అమెరికన్ గాయని-గీత రచయిత్రి మరియు సంగీతకారిణి కాటి పెర్రీ జననం.
1999 - తెలుగు చలనచిత్ర చరిత్రలో ప్రముఖ సంగీతదర్శకుడు సాలూరు రాజేశ్వరరావు మరణం.
1946 : ప్రముఖ కవి, సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు కలేకూరు ప్రసాద్ జననం.
1955 : ప్రసిద్ధ హిందుస్తానీ సంగీత విద్వాంసుడు డి.వి. పలుస్కర్ మరణం.(జ.1921)
1980 : సుప్రసిద్ధ ఉర్దూ కవి మరియు బాలీవుడ్ గేయరచయిత సాహిర్ లుధియానవి మరణం. (జ.1921)
1881 : స్పానిష్ శిల్పి, చిత్రకారుడు. చిత్రలేఖనంలో క్యూబిజం ను ప్రోత్సహించిన కళాకారుడు పాబ్లో పికాసో జననం.(మ.1973)
1982 : ప్రముఖ తెలుగు రచయిత, కుందుర్తి ఆంజనేయులు మరణం
1984 : అమెరికన్ గాయని-గీత రచయిత్రి మరియు సంగీతకారిణి కాటి పెర్రీ జననం.
1999 - తెలుగు చలనచిత్ర చరిత్రలో ప్రముఖ సంగీతదర్శకుడు సాలూరు రాజేశ్వరరావు మరణం.
అక్టోబర్ 26
1947 : రెండు సార్లు అమెరికా అధ్యక్ష పదవికి చేపట్టిన బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ జననం.
1950: కలకత్తా లో మిషనరీస్ ఆఫ్ చారిటీని మదర్ థెరీసా స్థాపించింది.
1962: భారత్ పై చైనా దాడి పర్యవసానంగా, దేశంలో మొట్టమొదటిసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
1985 : కేరళ రాష్ట్రం నుండి వచ్చిన ఒక భారతీయ చిత్ర నటి ఆసిన్ జననం.
1990: దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత, వి.శాంతారాం మరణం.
అక్టోబర్ 27
1811 : ఈ రోజు మనము వాడుతున్న కుట్టు మిషను రూపకర్త ఐజాక్ మెరిట్ సింగర్ జననం (మ.1875).
1858 : అమెరికా 26వ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నాయకుడు థియోడర్ రూజ్‌వెల్ట్ జననం (మ.1919).
1914 : ప్రముఖ పండితుడు మరియు కవి శిఖామణి బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు మరణం (జ.1875).
1928 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు దత్తా గైక్వాడ్ జననం.
1939 : ప్రముఖ రచయిత, చిత్రకారుడు చలసాని ప్రసాదరావు జననం (మ.2002).
1966 : భారత దేశానికి చెందిన ప్రముఖ చదరంగం (ఛెస్) క్రీడాకారుడు దివ్యేందు బారువా జననం.
1977 : శ్రీలంకకు చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు కుమార సంగక్కర జననం.
1984 : ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్ జననం.
అక్టోబర్ 28
1867 : వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ సోదరి నివేదిత జననం (మ.1911).
1886: అమెరికా లోని న్యూయార్క్ లో స్టేట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని ఆవిష్కరించిన రోజు. ఈ విగ్రహాన్ని అమెరికా కు ఫ్రాన్సు బహూకరించింది.
1892 : బెంగాలీ పాత్రికేయుడు లాల్ బెహారీ డే మరణం (జ.1824).
1900 : జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు మాక్స్ ముల్లర్ మరణం (జ.1823).
1909: ప్రముఖ తెలుగు రచయిత కొడవటిగంటి కుటుంబరావు జననం (మ.1980).
1924 : సుప్రసిద్ధ తెలుగు సినిమా నటీమణి సూర్యకాంతం జననం (మ.1996).
అక్టోబర్ 29
1899 : తొలితరం తెలుగు భావకవి. భారత స్వాతంత్ర్యసమరయోధుడు నాయని సుబ్బారావు జననం (మ.1978).
1950 : రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త, కథ, నవలా రచయిత తల్లావజ్ఝుల సుందరం జననం.
1961 : తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు, నిర్మాత కొణిదల నాగేంద్రబాబు జననం.
1985 : ఒలంపిక్స్ లో పతకము సాధించిన భారతీయ కుస్తీ (బాక్సింగ్) ఆటగాడు విజయేందర్ సింగ్ జననం.
1971 : ఆస్ట్రేలియా కు చెందిన ఒక మాజీ క్రికెట్ ఆటగాడు మాథ్యూ హేడెన్ జననం.
1959 : గోవిందరాజులు సుబ్బారావు , ప్రముఖ తెలుగు సినిమా నటుడు మరణం (జ.1895).
1996: ప్రపంచం లోనే అరుదైన మానవ తయారీ యురేనియం తో పనిచేసే 30 మె.వా. అణు రియాక్టర్ కామిని , తమిళనాడు లోని కల్పక్కం లో పని చెయ్యడం ప్రారంభమయింది.
అక్టోబర్ 30
ప్రపంచ పొదుపు దినోత్సవం
1883: ఆర్య సమాజం స్థాపకుడైన స్వామి దయానంద సరస్వతి మరణం (జ. 1824).
1938 : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఎక్కిరాల భరద్వాజ జననం (మ.1989).
1910: రెడ్ క్రాస్ సంస్థ స్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ మరణం (జ.1828).
1945: ఐక్యరాజ్యసమితి లో భారత్ సభ్యత్వం పొందింది.
1909: ప్రముఖ అణుశాస్త్రవేత్త హోమీ జహంగీర్ భాభా జననం (మ.1966).
1990 : భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు మరియు నటుడు వి. శాంతారాం మరణం (జ.1901).
1976: అత్యవసర పరిస్థితి సమయంలో కేంద్ర ప్రభుత్వం, లోక్‌సభ ఎన్నికల ను మరోమారు 1978 కి వాయిదా వేసింది.
అక్టోబర్ 31
జాతీయ సమైక్యతాదినోత్సవం
1875 : భారత దేశపు ఉక్కు మనిషి గా పేరుగాంచినసర్దార్ వల్లభ్‌భాయి పటేల్ జననం (మ.1950).
1895 : భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ సి.కె.నాయుడు జననం (మ.1967).
1925 : తెలుగు సినిమా దర్శకుడు కోటయ్య ప్రత్యగాత్మ జననం (మ.2001).
1937 : ప్రముఖ రచయిత నరిశెట్టి ఇన్నయ్య జననం.
1975 : భారతీయ సంగీత కారుడు. ఖ్యాతిగడించిన బాలీవుడ్ సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్ మరణం (జ.1906).
1984 : భారత ప్రధాని ఇందిరా గాంధీ మరణం (జ.1917).
1990 : కర్ణాటక సంగీత విద్వాంసురాలు మరియు దక్షిణ భారత చలనచిత్రరంగంలో ప్రముఖ నేపథ్యగాయని ఎం. ఎల్. వసంతకుమారి మరణం (జ.1928).
2004 : ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత కొమ్మూరి వేణుగోపాలరావు మరణం (జ.1935).
2008 : అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళములతో బాటు తెలుగు భాషను భారత ప్రభుత్వము చేర్చింది.
2005 : మళయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని పి.లీల మరణం (జ.1934).
No comments:
Post a Comment