జనవరి 1
1877: 1866 నాటి డొక్కల కరువు నాడు పూటకు ఎనిమిది వేల మందికి గంజి ఇచ్చి వేలాదిమంది ప్రాణాలు కాపాడిన బుడ్డా వెంగళరెడ్డి కి సన్మానసభ ఢిల్లీలో 1877 జనవరి 1వ తేదీన జరిగింది.1894 : బెంగాలి గణిత శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ జననం.
1909 : వేద పండితులు, గాంధేయవాది మరియు ప్రాచీన గ్రంథాల అనువాదకులు చర్ల గణపతిశాస్త్రి జననం (మ.1996).
1940 : తెలుగు గ్రంథకర్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు మరణం (జ.1865).
1951 : ప్రముఖ ఉర్దూ కవి అష్ఫక్ హుస్సేన్ జననం.
1955 : ప్రముఖ రసాయనశాస్త్రవేత్త, శాంతిస్వరూప్ భట్నాగర్ మరణం (జ.1894)
1972 : మణిపూర్ రాష్ట్రం అవతరించింది.
2007: ప్రసిద్ధ తెలుగు సినిమా నిర్మాత డూండీ మరణం (జ.1941).
జనవరి 2
1910: మహాకవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) జన్మించారు.1922: నోబెల్ బహుమతి గ్రహీత, డా.హరగోవింద ఖురానా జన్మించారు.
2007: ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య మరణించారు.
జనవరి 3
1921 : ప్రముఖ భారతీయ సినిమా దర్శకుడు కథా రచయిత చేతన్ ఆనంద్ జననం.(మ. 1997)1831 : ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రీ ఫులే జననం.
1981 : ప్రముఖ భారతీయ సినిమా నేపధ్య గాయకుడు నరేష్ అయ్యర్ జననం.
1985: రవిశాస్త్రి ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
1999: ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరో ను ప్రవేశపెట్టారు.
2013 : ప్రముఖ వాయులీన విధ్వాంసులు ఎం.యస్. గోపాలకృష్ణ మరణం.(జ. 1931)
జనవరి 4
1643 : సుప్రసిద్ధ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ జననం.(మ.1727)1809: అంధులకు ప్రత్యేక లిపిని (బ్రెయిలీ లిపి) రూపొందించిన లూయీ బ్రెయిలీ జననం.
1915: ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి జననం.(మ.1996)
1945 : నటుడు, నాటక రచయిత, దర్శకుడైన ఎస్.కె. మిశ్రో జననం.
1988 : భారత దేశంలో మొట్టమొదటి "టెస్ట్ ట్యూబ్ బేబీ" ని ప్రముఖ వైద్యులు ఇందిరా హిందుజా జన్మింపజేశారు.
2007: ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యుడు కోరాడ నరసింహారావు మరణం. (జ.1936)
జనవరి 5
ప్రపంచ పాల దినోత్సవం1531 : మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ మరణం.(జ.1483)
1592 : మొఘల్ సామ్రాజ్యపు ఐదవ చక్రవర్తి షాజహాన్ జననం.(మ.1668)
1893 : భారత దేశం లో ప్రముఖ గురువు పరమహంస యోగానంద జననం.(మ.1952)
1931 : తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ జననం.
1955 : పశ్చిమ బెంగాల్ మొదటి మహిళా ముఖ్యమంత్రిణి మమతా బెనర్జీ జననం.
1968 : భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు అర్జున్ ముండా జననం.
1971 : మొట్టమొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ ఆస్ట్రేలియా, ఇంగ్లండుల మధ్య జరిగింది.
1973 : బాలీవుడ్ నటుడు,నిర్మాత, సహాయ దర్శకుడు ఉదయ్ చోప్రా జననం.
1986 : భారతీయ సూపర్ మోడల్ మరియు బాలీవుడ్ నటి. దీపిక పడుకొనే జననం.
జనవరి 6
1847 : ప్రసిద్ధ వాగ్గేయకారుడు త్యాగయ్య మరణం.(జ.1767)1852 : గుడ్డివారికి లిపిని (బ్రెయిలీ లిపి) రూపొందించిన లూయీ బ్రెయిలీ మరణం.(జ.1809)
1867 : స్వాతంత్ర సమరయోధుడు బయ్యా నరసింహేశ్వరశర్మ జననం.
1929 : మదర్ తెరెసా భారత దేశంలోని కలకత్తా నగరం వచ్చి పేదలకు మరియు రోగులకు సేవ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు.
1932 : ప్రముఖ సంగీత విద్వాంసులు మరియు రేడియో కళాకారులు బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి జననం.
1959 : ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు కపిల్ దేవ్ జననం.
1966 : ప్రసిద్ద సంగీత దర్శకుడు, గాయకుడు ఎ.ఆర్.రెహమాన్ జననం.
1971 : ప్రసిద్ధ భారతీయ ఇంద్రజాలికుడు పి.సి.సర్కార్ మరణం.
జనవరి 7
1927 : కృత్రిమ పాదం జైపూర్ ఫూట్ సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ జననం.1935: భారత జాతీయ సైన్సు అకాడమీని కలకత్తాలో నెలకొల్పారు.
1937 : ప్రముఖ రాజకీయవేత్త మరియు మంత్రివర్యులు దొడ్డపనేని ఇందిర జననం.
1950 : సామాజిక సేవికురాలు, సంఘ సంస్కర్త. బాల కార్మికులపై చేసిన కృషికి రామన్ మెగస్సే అవార్డు గ్రహీత శాంతా సిన్హా జననం.
1964 : అమెరికన్ నటుడు నికోలస్ కేజ్ జననం.
జనవరి 8
1642 : ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త.గెలీలియో గెలీలి మరణం.(జ.1564)1942 : వోటార్‌న్యూరాన్ వ్యాధితో అంగుళమైనా కదలలేని స్థితిలో ఉన్న ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త, స్టీఫెన్ విలియం హాకింగ్ జననం.
1962 : లియోనార్డో డావిన్సీ అద్భుతసృష్టి 'మోనాలిసా' పెయింటింగ్‌ను అమెరికాలో తొలిసారి ప్రదర్శనకు పెట్టారు.
1975 : తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు సంగీత దర్శకుడు హేరిస్ జైరాజ్ జననం.
1983 : ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నటుడు తరుణ్ జననం.
1983 : తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న జననం.
1987 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు నానా జోషి మరణం.(జ.1926)
1994 : కంచి కామకోటి పీఠము యొక్క జగద్గురు పరంపర లో 68వ వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి మరణం.(జ.1894)
జనవరి 9
ప్రవాస భారతీయుల దినోత్సవం. 1915 లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్‌కు తిరిగివచ్చిన ఈ తేదీని, 2003 నుండి ప్రభుత్వం అలా జరుపుతున్నది.1922 : నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడుహరగోవింద్ ఖురానా జననం. (మ.2011)
1934 : భారతీయ నేపథ్య గాయకుడు మహేంద్ర కపూర్ జననం.(మ.2008)
1965 : భారతీయ సినిమా దర్శకులు, నటి మరియు కొరియాగ్రాఫర్ ఫరా ఖాన్ జననం.
1968 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు జిమ్మీ ఆడమ్స్ జననం.
1969 : మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము ప్రారంభమైనది.
1982 :ల బృందం మొదటిసారి అంటార్కిటికా ను చేరింది.
2009 : ప్రపంచ తెలుగు సమాఖ్య 8వ ద్వైవార్షిక సమావేశాలు విజయవాడలో ప్రారంభమయ్యాయి.
జనవరి 10
1863 : లండన్‌లో భూగర్భరైల్వే ప్రారంభం.1894 : ప్రసిద్ధ తెలుగు కవి పింగళి లక్ష్మీకాంతం జననం.
1920 : నానాజాతి సమితిలో భారత్ సభ్యత్వం పొందింది.
1940 : భారత దేశ సినీ నేపద్య గాయకుడు,సంగీత విధ్వాంసుడు యేసుదాస్ జననం.
1946 : ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తొలి సమావేశం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ సెంట్రల్‌హాల్‌లో జరిగింది. ఈ సమావేశానికి మొత్తం 51 దేశాలు హాజరయ్యాయి.
1966 : పూర్వ భారత ప్రధానమంత్రి, లాల్ బహదూర్ శాస్త్రి మరణించాడు.
1972 : ప్రసిద్ధ తెలుగు కవి పింగళి లక్ష్మీకాంతం మరణించాడు.
1973 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి సారిగా రాష్ట్రపతి పాలన విధించబడినది.
జనవరి 11
1922 : మధుమేహ రోగులకు ఇన్సులిన్ వాడకం ప్రారంభించిన రోజు.1928 : ప్రకృతి ధర్మవాద సమయంలో ఒక ఆంగ్ల నవలారచయిత మరియు కవి థామస్ హార్డీ మరణం.
1944 : భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ జననం.
1966 : మహానుభావుడు భారత దేశ రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణం.
1973 : భారత క్రికెట్ క్రీడాకారుడు రాహుల్ ద్రవిడ్ జననం.
1991 : అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త . ఎలక్ట్రాన్ కు వ్యతిరేక కణమైన పాజిట్రాన్ కనుగొన్న శాస్త్రవేత్త కార్ల్ డేవిడ్ అండర్సన్ మరణం.
2008 : న్యూజీలాండుకు చెందిన పర్వతారోహకుడు మరియు అన్వేషకుడు ఎడ్మండ్ హిల్లరీ మరణం.
జనవరి 12
1863 : ప్రముఖ హిందూ యోగి స్వామి వివేకానంద జననం.(మ.1902) ఈ రోజును జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తారు.1869 : భారతీయ తత్వవేత్త భగవాన్ దాస్ జననం.
1895 : ప్రముఖ వైద్య శాస్త్రవేత్త, యల్లాప్రగడ సుబ్బారావు జననం.(మ.1948)
1896 : అమెరికాకు చెందిన డా.హెన్రీ.యెల్.స్మిథ్ మొట్టమొదటి ఎక్స్-రే తీశాడు.
1908 : చాలా దూర ప్రాంతాలకు రేడియో సందేశాలను ఈఫిల్ టవర్ నుండి మొట్టమొదటిసారి ప్రసారం చేసారు.
1940: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎం.వీరప్ప మొయిలీ జననం.
1998 : పంతొమ్మిది యూరోపియన్ దేశాలు మానవ క్లోనింగ్‌పై ఆంక్షలు విధించేందుకు ముందుకొచ్చాయి.
2004 : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే మరణం.
జనవరి 13
1610 : గెలీలియో బృహస్పతి నాలుగవ ఉపగ్రహమైన కాలిస్టో ను కనుకొన్నాడు1879 : 'లయన్స్‌క్లబ్' స్థాపకుడు మెల్విన్‌జోన్స్‌జననం.
1888 : వాషింగ్టన్ నగరంలో నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ స్థాపించబడింది.
1919 : ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి డా.మర్రి చెన్నారెడ్డి జననం.
1930: వాల్ట్‌డిస్నీ సృష్టించిన కార్టూన్ పాత్ర 'మిక్కీ మౌస్' కామిక్ స్ట్రిప్ తొలిసారి ఓ పత్రికలో ప్రచురితమైంది.
1938 : శాస్త్రసాంకేతిక విషయాలను చర్చి పెద్దలు అంగీకరించని కాలంలో డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతానికి చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ ఆమోదం లభించింది.
1948 : గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టాడు. హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ కలకత్తాలో ఈ దీక్షకు పూనుకున్నాడు.
1949 : భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ జననం.
1977 : ఆంగ్ల సినీనటుడు ఒర్లాండో బ్లూమ్ జననం.
1983 : భారతీయ సినిమా నటుడు ఇమ్రాన్ ఖాన్ జననం.
జనవరి 14
ఇస్లామీయ కేలండర్ ప్రకారం మూడవ నెల అయిన రబీఉల్ అవ్వల్ 12 వ తేదీన ముహమ్మద్ ప్రవక్త , మక్కా పట్టణం లో జన్మించారు. వీరి జయంతినే మీలాదె నబి అనీ అంటారు. ఈ తేదీనే వీరు పరమదించారు కూడా.1742 : ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, భూగర్భ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, మెటెరాలజిస్టు మరియు భౌతిక శాస్త్రవేత్త ఎడ్మండ్ హేలీ మరణం.(జ.1656)
1857 : ఇండియన్ బ్యాంకు, హిందూ పత్రికల వ్యవస్థాపకుల్లో ఒకడైన న్యాపతి సుబ్బారావు జననం.
1875 : ఉత్తమ సేవాదృక్పదం కలిగిన వైద్య నిపుణుడు, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ స్విట్జర్ జననం.
1892 : 'గ్రాండ్ ఓల్డ్‌మ్యాన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్'గా పేరొందిన దినకర్ బల్వంత్ దేవధర్ జననం.
1896 : స్వతంత్ర భారత దేశపు తొలి రిజర్వ్ బాంక్ గవర్నర్ సి.డి.దేశ్‌ముఖ్ జననం. (మ.1982)
1937 : ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కధా నాయకుడు శోభన్ బాబు జననం.
1951: తెలుగు సినీ రచయిత , దర్శకుడు, హాస్య బ్రహ్మ జంద్యాల జననం,(మ.2001) .
ప్రఖ్యాత తెలుగు సినీ నటుడు రావు గోపాలరావు జననం
1969 : మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడు గా మార్చారు.
1987 : దూరదర్శన్ తెలుగు ప్రసారాలు పూర్తిస్థాయిలో హైదరాబాద్ నుంచే ప్రారంభమయ్యాయి.
జనవరి 15
1887 : ప్రముఖ హేతువాద రచయిత, సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి జననం (మ.1943).1915 : ప్రముఖ తెలుగు రచయిత, చాసో గా అందరికీ సుపరిచితుడు చాగంటి సోమయాజులు జననం (మ.1994).
1929 : అమెరికా కు చెందిన పాస్టర్, ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జననం (మ.1968).
1929 : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మరియు ఆంధ్ర ప్రదేశ్ గవర్నరు గా పనిచేసిన రాంలాల్ జననం (మ.2002).
1934 : భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనర్ వి. ఎస్. రమాదేవి జననం (మ.2013).
1940 : వాడుక భాష ఉద్యమ పిత గిడుగు రామమూర్తి మరణం (జ.1863).
1967 : తెలుగు సినిమా నటి భానుప్రియ జననం.
1998 : పూర్వ తాత్కాలిక ప్రధానమంత్రి గుల్జారీలాల్ నందా మరణం (జ.1898).
జనవరి 16
1938 : ప్రముఖ మల్ల వీరుడు, కలియుగ భీముడు బిరుదు పొందిన కోడి రామమూర్తి మరణం (జ.1885).1938 : ప్రముఖ బెంగాలీ నవలా రచయిత మరియు కథా రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ్ మరణం (జ.1876).
1942 : ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు ఎస్.జైపాల్ రెడ్డి జననం.
1943 : ప్రముఖ సంఘసంస్కర్త, త్రిపురనేని రామస్వామి మరణం (జ.1887).
1946 : భారతీయ బుల్లితెర మరియు చలనచిత్ర నటుడు కబీర్ బేడి జననం.
1988 : భారత దేశపు ఆర్థిక వేత్త ఎల్.కె.ఝా మరణం (జ.1913).
జనవరి 17
1706 : గొప్ప రచయిత, చిత్రకారుడు, రాజకీయ నాయకుడు, శాస్త్రవేత్త, మేధావి బెంజమిన్ ఫ్రాంక్లిన్ జననం.1905 :ప్రసిద్ధ భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్ జననం.
1908 : తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎల్.వి.ప్రసాద్ జననం.
1917 : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినిమా నటుడు, ఎం.జి.రామచంద్రన్ జననం.
1951 : భారతీయ సినిమా నటి బిందు జననం.
1989 : మొదటిసారి ఒక భారతీయుడు - కల్నల్ జె.కె.బజాజ్ - దక్షిణ ధృవాన్ని చేరుకున్నాడు.
1997 : ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం ఇచ్చేది లేదని భారత ప్రభుత్వం ప్రకటించింది.
2010 : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుధీర్ఘకాలం పాటు పనిచేసిన జ్యోతిబసు మరణం.
జనవరి 18
1927 : భారత పార్లమెంటు భవనం ప్రారంభించబడింది.1927 : సుప్రసిద్ధ సంగీత విధ్వంసుడు సుందరం బాలచందర్ జననం.(మ.1990)
1936 : ప్రసిద్ధ ఆంగ్ల రచయిత మరియు కవి రుడ్యార్డ్ కిప్లింగ్ మరణం.
1947 : భారతీయ గాయకుడు, నటుడు కుందన్ లాల్ సైగల్ మరణం.
1950 : ప్రముఖ హేతువాది, సాహితీకారుడు అదృష్టదీపక్ జననం.
1972 : భారత క్రికెట్ ఆటగాడు జననం వినోద్ కాంబ్లి జననం.
1978 : భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అపర్ణా పోపట్ జననం
1996 : ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు మరణం
2003 : ప్రముఖ కవి హరి వంశ రాయ్ బచ్చన్ మరణం (జ.1907)
జనవరి 19
1597: ఉదయపూర్ రాజు రాణా ప్రతాప్ సింగ్ మరణించాడు.1736 : ప్రఖ్యాత శాస్త్రవేత్త. ఆవిరి యంత్రంతోప్రాముఖ్యత పొందిన జేమ్స్ వాట్ జననం.(మ.1819)
1905 : భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం.(b. 1817)
1918 : తెలుగు పండితుడు, రచయిత, వక్త మరియు విమర్శకుడు వావిలాల సోమయాజులు జననం.
1920: ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్ జననం.
1946 : అమెరికా గాయని, పాటల రచయిత, రచయిత, బహుళ పరికరాల వాద్యకారిణి, నటి మరియు దాత డాలీ పార్టన్ జననం.
1990 : ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో మరణం.(జ.1931)
జనవరి 20
1265 : లండను లోని వెస్ట్‌మినిస్టర్ భవనం లో ఇంగ్లాండు పార్లమెంటు తొలిసారిగా సమావేశమైంది.1900 : సంస్కృతాంధ్ర పండితుడు, ప్రముఖ తత్వవేత్త పరవస్తు వెంకట రంగాచార్యులు మరణం (జ.1822).
1907 : సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు బందా కనకలింగేశ్వరరావు జననం (మ.1968).
1940 : తెలుగు సినిమా కథానాయకుడు మరియు రాజకీయ నాయకుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జననం.
1957 : భారత దేశపు మొట్టమొదటి అణు రియాక్టర్, అప్సర ను ట్రాంబే లో ప్రారంభించారు.
1960 : ప్రముఖ తెలుగు సినీనటి విజయ నిర్మల కుమారుడు ,హాస్య నటుడు మరియు రాజకీయవేత్త విజయ నరేష్ జననం.
1964 : భారతీయ-అమెరికన్ పాత్రికేయుడు మరియు రచయిత ఫరీద్ జకారియ జననం.
1995 : తాజ్‌మహల్ చుట్టుపక్కల ఉన్న 84 కాలుష్యకారక పరిశ్రమల ను మూసేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
1995 : రష్యా రూబుల్ విలువ కనిష్ట స్థాయికి (ఒక్క డాలర్ కు 3,947 రూబుళ్ళు) పడిపోయింది.
జనవరి 21
1924 : రష్యా నాయకుడు లెనిన్ మరణం.(జ.1870)1945 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు రాష్ బిహారీ బోస్ మరణం.
1959 : ప్రముఖ తెలుగు రచయిత ఎండ్లూరి సుధాకర్ జననం.
1950 : ప్రసిద్ధి చెందిన ఒక ఆంగ్ల రచయిత మరియు పాత్రికేయుడు జార్జ్ ఆర్వెల్ మరణం.(జ.1903)
1972 : త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
2011 : తెలుగు సినిమా ప్రరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ మరణం.
జనవరి 22
1666 : ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్‌మహల్ నిర్మాత షాజహాన్ మరణం (జ.1592).1882: ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు జననం (మ.1962).
1885: ఆంధ్ర పితామహ గా పేరుగాంచిన మాడపాటి హనుమంతరావు జననం (మ.1970).
1900 అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన ఒక శాస్త్రవేత్త మరియు సంగీత కారుడు డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్ మరణం (జ.1831).
1901: అరవైమూడేళ్లపాటు యునైటెడ్ కింగ్‌డమ్ ను ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన విక్టోరియా మహారాణి మరణం (జ.1819).
1909: ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన యూ థాంట్ జననం (మ.1974).
1940 : తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి మరణం (జ.1863).
1972: స్వామి రామానంద తీర్థ మరణం (జ.1903).
2014 : తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరణం (జ.1923).
జనవరి 23
1863 : భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకుడు, ధర్మసమాజ స్థాపకుడు వావిలికొలను సుబ్బారావు జననం (మ.1939).1890 : ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణురాలు హిల్డా మేరీ లాజరస్ జననం (మ.1978).
1897: నేతాజీ సుభాష్ చంద్ర బోసు కటక్ ఒరిస్సా లో జననం (మ.1945).
1911 : హైదరాబాదు తొలి మహిళా మేయరు, సంఘసేవిక జానంపల్లి కుముదినీ దేవి జననం (మ.2009).
1926 : శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాల్ థాకరే జననం (మ.2012).
1972 : స్వాతంత్ర్య సమరయోధుడు, శాసనసభ్యుడు కె. అచ్యుతరెడ్డి మరణం (జ.1914).
1978 : ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణురాలు హిల్డా మేరీ లాజరస్ మరణం (జ.1890).
1989 : ప్రఖ్యాత చిత్రకారుడు సాల్వడార్ డాలీ మరణం (జ.1904).
జనవరి 24
1924 : స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు కాటం లక్ష్మీనారాయణ జననం.1950 : జనగణమన గీతాన్ని జాతీయ గీతం గా భారత ప్రభుత్వం స్వీకరించింది.
1950 : రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం జరిగింది.
1966 : సుప్రసిద్ధ అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్ భాభా మరణం.
1980 : పాత తరానికి చెందిన నటుడు. హాస్యం, క్రౌర్యం, శోకం లాంటి అన్ని పాత్రలలో రాణించిన ముదిగొండ లింగమూర్తి మరణం.
1981 : తొలితరం నటీమణులలో ప్రసిద్ధులైన చిత్తజల్లు కాంచనమాల మరణం.
2005 : తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి మరణం.
2011 : ప్రముఖ సంగీతకారుడు, భారత రత్న గ్రహీత భీమ్‌సేన్ జోషి మరణం.
జనవరి 25
అంతర్జాతీయ ఉత్పాదకత దినోత్సవం1736 : సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు జోసెఫ్ లూయిస్ లెగ్రాంజ్ జననం.
1882 : ఇంగ్లీష్ రచయిత, ప్రచురణకర్త, కథానికల రచయిత వర్జీనియా వూల్ఫ్ జననం.
1918 : ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత కొండవీటి వెంకటకవి జననం.
1925 : ప్రముఖ హేతువాది, సంఘ సంస్కర్త. పి. అచ్యుతరాం జననం.
1954 : ప్రముఖ హేతువాది, మానవవాది ఎం.ఎన్.రాయ్ మరణం.
1980: విశ్వమాత మదర్ థెరీసా ను భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సత్కరించింది.
2004: అమెరికా ప్రయోగించిన ఆపర్చ్యూనిటీ వ్యోమ నౌక అంగారక గ్రహం మీద క్షేమంగా దిగింది.
జనవరి 26
1925 : ప్రసిద్ది చెందిన అమెరికన్ నటుడు, చిత్ర దర్శకుడు, సాహసికుడు, మానవతావాది పాల్ న్యూమాన్ జననం.1935 : తెలుగు సినీ రచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత, వక్త, వ్యాఖ్యాత , రూపకకర్త, మరియు ఆకాశవాణి ప్రసంగికుడు భావశ్రీ జననం.
1950 :భారత్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
1950: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.
1950: భారత సుప్రీం కోర్టు పనిచెయ్యడం మొదలుపెట్టింది.
1956 : భారతదేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారిణి డయానా ఎడుల్జీ జననం.
1968 : ప్రముఖ తెలుగు సినిమా నటుడు రవితేజ జననం.
2010 : తెలుగు సినిమా ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు మరణం.
జనవరి 27
1926: మొట్టమొదటి సారి టెలివిజన్ ను - లండన్ లో - ప్రదర్శించారు.1928: ప్రముఖ కవి, రచయిత, న్యాయవాది, కళాప్రపూర్ణ, పోతుకూచి సాంబశివరావు జననం.
1974 : శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు చమిందా వాస్ జననం.
1979 : ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు డానియెల్ వెట్టోరీ జననం.
1986 : ప్రముఖ న్యాయవాది మరియు మంత్రివర్యులు అనగాని భగవంతరావు మరణం.
1988: భారత్ లో హెలికాప్టర్ ద్వారా ఉత్తరాల రవాణాను ప్రారంభించారు.
2009 : ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర సమరయోధుడు రామస్వామి వెంకట్రామన్ మరణం.
జనవరి 28
1865: ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, పంజాబ్ కేసరి, లాలా లజపతి రాయ్ జననం.1885 : ప్రసిద్ద భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత గిడుగు వేంకట సీతాపతి జననం.
1920 : 'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు మరియు నిర్మాత బి.విఠలాచార్య జననం.
1930 : హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, మేవాతి ఘరానాకు చెందిన ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ సంగీత గాయకుడు పండిట్ జస్రాజ్ జననం.
1955 : ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా జననం.
1898: వివేకానందుని ప్రబోధాలతో ప్రభావితమై సిస్టర్ నివేదిత భారత్ వచ్చింది.
1929 : భారత అణు శాస్త్రవేత్త రాజారామన్న జననం.
జనవరి 29
1901 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మరియు పార్లమెంటు సభ్యులు మొసలికంటి తిరుమలరావు జననం.1920 : తెలుగు సినిమా సంగీత దర్శకుడు బాలాంత్రపు రజనీకాంత రావు జననం.
1932 : ప్రఖ్యాత ఆంగ్ల దేశపు క్రికెట్ ఆటగాడు పంగులూరి రామన్ సుబ్బారావు జననం.
1936 : సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి జననం.
1939:: రామకృష్ణ మఠం ప్రారంభించబడింది.
1953: భారత సంగీత నాటక అకాడమీ స్థాపించబడింది.
1951 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఆండీ రాబర్ట్స్ జననం.
1970 : భారతీయ షూటర్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ జననం.
జనవరి 30
అమర వీరుల దినోత్సవం.1889 : ఆధునిక హిందీ సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తుల్లో ఒకరు జయశంకర్ ప్రసాద్ జననం.
1910 : భారత దేశం ఆహారధాన్యాల స్వయంసంవృద్ధి సాధించడంలో దోహదపడిన సి.సుబ్రమణ్యం జననం.
1913 : ప్రముఖ చిత్రకారిణి అమృతా షేర్ జననం.
1927 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ చర్మవైద్యులు బెండపూడి వెంకట సత్యనారాయణ జననం.
1948 : జాతిపిత మహాత్మా గాంధీ ని నాథూరాం గాడ్సే హత్య చేసాడు.
1981 : బల్గేరియన్ ఫుట్ బాల్ ఆటగాడు డిమిటార్ బెర్బటోవ్ జననం.
జనవరి 31
1865 : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శాస్త్రీజీ మహరాజ్ జననం.1902 : ప్రముఖ దౌత్యవేత్త, రాజకీయవేత్త మరియు రచయిత ఆల్వా మిర్థాల్ జననం.
1905 : ప్రముఖ తెలుగు రచయిత, కవి మరియు అనువాదకుడు కందుకూరి రామభద్రరావు జననం.
1926 : తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావెళ్ళ వెంకట రామారావు జననం.
1969 : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మెహర్ బాబా మరణం.
1975 : ప్రముఖ భారతీయ సినీనటి ప్రీతీ జింతా జననం.
2004 : ప్రముఖ హిందీ నటి ,గాయని సురయ్యా మరణం.
2009 : దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు మరియు రంగస్థల నటుడు నగేష్ మరణం.
No comments:
Post a Comment