ఏప్రిల్ 1
1578 : గుండె పనిచేసే తీరును, శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతిని తెలియజేసిన ప్రముఖ ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే జననం (మ.1657).1889 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు డా.కె.బి.హెడ్గేవార్ జననం (మ.1940).
1911 : ప్రముఖ మానవతావాది, కవి ఏటుకూరి వెంకట నరసయ్య జననం (మ.1949).
1914 : కాశీనాథుని నాగేశ్వరరావు ప్రారంభించిన వారపత్రిక అయిన ఆంధ్రపత్రిక దినపత్రికగా మారింది.
1922 : స్విట్జర్లాండ్ కు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. మానసిక విశ్లేషకుడు హెర్మన్ రోషాక్ మరణం (జ.1884).
1933 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు బాపూ నాదకర్ణి జననం.
1935 : భారతీయ రిజర్వు బ్యాంకు స్థాపించబడింది.
1936 : కళింగ లేదా ఉత్కళ్ అని పిలువబడే ఒరిస్సా భారత దేశం లో క్రొత్త రాష్ట్రంగా అవతరించింది.
1941 : భారత దేశపు మాజీ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ అజిత్ వాడేకర్ జననం.
ఏప్రిల్ 2
1725 : వెనిస్ కు చెందిన ఒక సాహసికుడు మరియు రచయిత గియాకోమో కాసనోవా జననం (1798).1872 : అమెరికన్ చిత్రకారుడు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త సామ్యూల్ F. B. మోర్స్ మరణించాడు (జ. 1791).
1915 : తెలుగు సినిమా మరియు రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు మరియు నేపధ్యగాయకుడు కొచ్చర్లకోట సత్యనారాయణ జననం (మ.1969).
1969 : భారత సినీ నటుడు అజయ్ దేవగన్ జననం.
1933 : ప్రముఖ క్రికెట్ ఆటగాడు మహారాజా రంజిత్ సింహ్‌జీ మరణించాడు(జ.1872). ఈయన పేరిటే భారత్ లో రంజీ ట్రోఫి పోటీని మొదలుపెట్టారు.
1972 : చార్లీ చాప్లిన్ అమెరికా కు తిరిగి వచ్చాడు
2011 : భారత్ టీం ( టీమిండియా ) 28 ఏళ్ళ కలను సాకారం చేసుకుని ప్రపంచ కప్ గెలుచుకుంది.
ఏప్రిల్ 3
1955 : భారత దేశ ప్రసిద్ధ గాయకుడు హరిహరన్ జననం.1961 : అమెరికన్ నటుడు, గాత్ర నటుడు, చిత్ర దర్శకుడు, నిర్మాత, హాస్యనటుడు ఎడీ మర్ఫీ జననం.
1962 : జయప్రద, తెలుగు సినీనటి మరియు పార్లమెంటు సభ్యురాలు జననం.
1964 : భారత క్రికెట్ క్రీడాకారుడు అజయ్ శర్మ జననం.
1680 : ఛత్రపతి శివాజీ మరణం .
1973 : భారత దేశ చలనచిత్ర నృత్యదర్శకుడు, నటుడు ప్రభు దేవా జననం
1973 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు నీలేష్ కులకర్ణి జననం.
1984 : మొదటి భారతీయ రోదశి యాత్రికుడు, రాకేశ్ శర్మ అంతరిక్షంలో ప్రయాణించాడు.
ఏప్రిల్ 4
1818 : అమెరికా సంయుక్త రాష్ట్రాలు 13 చారలు మరియు 20 నక్షత్రాల జాతీయ జండాను నిర్ధారించింది.1905 : కాంగ్రా భూకంపం లో 20,000 మంది ప్రజలు మరణించారు.
1919 : సర్ విలియం క్రూక్స్, ఇంగ్లీష్ భౌతిక మరియు రసాయన శాస్త్రవేత్త.మరణం (జననం . 1832).
1968 : అమెరికా కు చెందిన పాస్టర్, ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ మరణం (జ. 1929).
1975 : మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించబడింది.
1979 : ప్రముఖ భావకవి అబ్బూరి రామకృష్ణారావు మరణం (జ.1896).
ఏప్రిల్ 5
1908 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు జగ్జీవన్ రామ్ జననం (మ.1986).1922 : భారతీయ సంఘ సంస్కర్త పండిత రమాబాయి మరణం (జ.1858).
1930 : మహాత్మా గాంధీ 241 మైళ్ళ దండి సత్యాగ్రహాన్ని పూర్తిచేసారు.
1937 : భారత మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు తెలుగు సినిమా నిర్మాత చేగొండి వెంకట హరిరామజోగయ్య జననం.
1993 : భారతీయ సినిమానటి దివ్యభారతి మరణం (జ.1974).
1994 : అమెరికాకు చెందిన ఒక పాటల రచయిత మరియు స్వరకర్త కర్ట్ కోబెన్ మరణం (జ.1967).
ఏప్రిల్ 6
1896 : 1,500 సంవత్సరాల అనంతరం ఏథెన్స్ లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభించబడ్డాయి.1922 : వక్త మరియు సాహితీ వ్యాఖ్యాత శ్రీభాష్యం అప్పలాచార్యులు జననం.
1928 : DNAను కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ జన్మించాడు.
1930 : మహాత్మాగాంధీ నేతృత్వంలో గుజరాత్ లోని దండి వద్ద ఉప్పు సత్యాగ్రహం ముగిసింది.
1931 : ప్రముఖ కమ్యూనిస్టు నేత నల్లమల గిరిప్రసాద్ జన్మించాడు.
1956 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు దిలీప్ వెంగ్‌సర్కార్ జననం.
1989 : ప్రముఖ గుజరాతీ భాషా రచయిత పన్నాలాల్ పటేల్ మరణం.
2002 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ మరణం.
2011 : మలయాళ నటి సుజాత మరణం.
ఏప్రిల్ 7
ప్రపంచ ఆరోగ్య దినం1770 : సుప్రసిద్ధ ఆంగ్ల కవి విలియం వర్డ్స్ వర్త్ జననం (మ.1850).
1885 : సుప్రసిద్ధ స్పానిష్ కవయిత్రి, నోబెల్ బహుమతి గ్రహీత గబ్రియేలా మిస్ట్రాల్ జననం (మ.1957).
1920 : భారతీయ సంగీత విద్వాంసుడు రవి శంకర్, జననం.(మరణం . 2012)
1925 : ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య జననం (మ.2012).
1948 : ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబడినది.
1857 : బ్రిటిష్ వారు మంగళ్ పాండేని ఉరితీసి, దళం మొత్తాన్ని విధులనుండి బహిష్కరించారు.
1962 : భారతీయ సినిమా దర్శకుడు మరియు నిర్మాత రాం గోపాల్ వర్మ జననం.
1991 : ప్రసిద్ధ కవి, హేతువాది, చలనచిత్ర సంభాషణ రచయిత కొండవీటి వెంకటకవి మరణం (జ.1918).
2007 : ప్రఖ్యాత భారత విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు మరణం (జ.1917).
ఏప్రిల్ 8
1846 : ప్రసిద్ధ కవి, పండితుడు దాసు శ్రీరాములు జననం (మ.1908).1894 : వందేమాతరం గీత రచయిత, బంకించంద్ర ఛటర్జీ మరణం (జ.1838).
1904 : బ్రిటిష్ ఆర్థికవేత్త జాన్ రిచర్డ్ హిక్స్ జననం (మ.1989).
1938 : ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ జననం .
1950 : భారత్, పాకిస్తాన్ లు లియాఖత్-నెహ్రూ ఒడంబడిక పై సంతకాలు చేశాయి.
1857 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే మరణం (జ.1827).
1977 : మా తెలుగు తల్లికి మల్లె పూదండ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి మరణం (జ.1914).
1983 : అల్లు అర్జున్ జననం.
1984 : ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ జననం.
2013 : బ్రిటన్ తొలి మహిళా ప్రధాని మార్గరెట్ థాచర్ మరణం (జ.1925).
ఏప్రిల్ 9
1860 : మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడినది. (ఫొనాటోగ్రాఫ్ యంత్రం ద్వారా)1893 : ప్రముఖ రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు రాహుల్ సాంకృత్యాయన్ జననం.( మ. 1963)
1930 : ప్రముఖ సినిమా నటుడు మన్నవ బాలయ్య జననం.
1936 : పాలస్తీనాకు చెందిన రచయిత ఘసన్ కనాఫానీ జననం (మ.1972).
1948 : ప్రముఖ హింది నటి, మరియు అమితాబ్ బచ్చన్ భార్య జయ బచ్చన్ జననం.
1989 : ప్రముఖ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ఏ.యం.రాజా మరణం (జ.1929).
1994 : ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు చండ్ర రాజేశ్వరరావు మరణం (జ.1915).
2011 :అన్నా హజారే కు ఐ.ఐ.పి.ఎం రవీంధ్రనాథ్ ఠాగూర్ అంతర రాష్ట్రీయ శాంతి పురస్కారం లభించింది.
ఏప్రిల్ 10
1755 : హోమియోపతి వైద్యవిధానాన్ని కనిపెట్టిన క్రిస్టియన్ ఫ్రెడెరిక్ శామ్యూల్ హానిమాన్ జననం .1857 : భారత మెదటి స్వాతంత్ర్య యుద్ధం మీరట్‌లో మొదలయ్యింది.
1809 : ప్రముఖ అధ్యాపకుడు మరియు పండితుడు, కవి హెన్రీ డెరోజియో జననం.
1813 : సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు జోసెఫ్ లూయిస్ లెగ్రాంజ్ మరణం.
1894 : ఘన్ శ్యామ్ దాస్ బిర్లా జననం.
1898 : ప్రముఖ హేతువాది ఎ.టి.కోవూర్ జననం.
1931 : ప్రముఖ భారతీయ హిందుస్తానీ సంగీత విద్వాంసురాలు కిషోరీ అమోంకర్ జననం.
1995 : భారత మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయి మరణం
ఏప్రిల్ 11
1919: అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పడింది.1827 : ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతీరావ్ పూలే జననం. (మ.1890)
1869 : భారత స్వాతంత్రోద్యమ కర్త,మహాత్మా గాంధీ సతీమణి కస్తూరిబాయి గాంధీ జననం.(మ. 1944)
1904 : భారత ప్రఖ్యాత గాయకుడు మరియు నటుడు కుందన్ లాల్ సైగల్ జననం.(మ. 1947)
ఏప్రిల్ 12
599 BC: జైన మతం స్థాపించిన మహావీరుడి జననం (మ. 527 BC)1961 : రష్యా అంతరిక్ష శాస్త్రవేత్త యూరీ గగారిన్ Vostok 3KA-2 (Vostok 1) ఉపగ్రహంలో ప్రయాణించి, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మానవునిగా నిలిచాడు.
1962 : మోక్షగుండం విశ్వేశ్వరయ్య మరణం (జ. 1861)
1981 : ప్రపంచపు మొట్టమొదటి స్పేస్ షటిల్ (అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి రాగల వ్యోమనౌక) "కొలంబియా" ను అమెరికా విజయవంతంగా ప్రయోగించింది.
2006 : ప్రముఖ కన్నడ చలనచిత్ర నటుడు మరియు గాయకుడు రాజ్‌కుమార్ మరణం (జ. 1929)
ఏప్రిల్ 13
1905 - న్యాయపతి రాఘవరావు రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, జననం (మ.1984).1919 :పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్ నందు సమావేశమైన భారతీయ ఉద్యమ కారులపై జనరల్ డయ్యర్ కాల్పులు జరిపాడు.
2007: ప్రసిద్ధ సినిమా నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి మరణం.(జ.1921)
2007: ప్రసిద్ధ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి మరణం.(జ.1933)
ఏప్రిల్ 14
అగ్నిమాపక దళ దినం.1893: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత బి.ఆర్.అంబేద్కర్ జననం.(మ.1956)
1912: టైటానిక్ ఓడ మునిగిపోయింది.
1939 : సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహితీకారుడు గొల్లపూడి మారుతీరావు జననం.
1950 : శ్రీ రమణ మహర్షి , భారత తత్వవేత్త. మరణం.(జ. 1879)
1963: ప్రముఖ చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు రాహుల్ సాంకృత్యాయన్ మరణం.( జ. 1893 )
1968 : ప్రముఖ హేతువాది , మానవతా వాది బాబు గోగినేని జననం.
ఏప్రిల్ 15
1452 : గణిత శాస్త్రజ్ఞుడు, ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీత కళాకారుడు లియొనార్డో డావిన్సి జననం.(మరణం.1519)1469 : భారత ఆధ్యాత్మిక గురువు, సిక్కుమత స్థాపకుడు గురునానక్ జననం.(మరణం . 1539)
1707 : లియొనార్డ్ ఆయిలర్, ప్రసిద్ధ స్విస్ గణిత శాస్త్రవేత్త జననం.(మరణం . 1783)
1865 : అమెరికా పూర్వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ మరణం.(జననం.1909)
1925 : గోదావరి జిల్లా ను, కృష్ణా జిల్లా ను విడదీసి, పశ్చిమ గోదావరి ప్రత్యేక జిల్లాగా ఏర్పరిచారు. అప్పటినుండి, గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడిన తరువాత, తూర్పు గోదావరి జిల్లా గా పేరు మార్చుకొంది.
ఏప్రిల్ 16
1919 : అమృతసర్ ఉదంతంలో మరణించిన ఉద్యమకారులకు నివాళులర్పిస్తూ మహాత్మా గాంధీ ఒకరోజు "ప్రార్థన మరియు ఉపవాసం" నిర్వహించాడు.1848 : ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జననం ( మ.1919 )
1853 : భారత్ లో రైళ్ళ నడక మొదలయింది. మొదటి ప్రయాణీకుల రైలు బోరి బందర్, బొంబాయి నుండి థానే వరకు ప్రారంభించబడినది.
1889: ప్రముఖ హాస్యనటుడు చార్లీ చాప్లిన్ జననం (మ.1977)
1946: ప్రముఖ నటుడు బళ్ళారి రాఘవ మరణం (జ.1880)
ఏప్రిల్ 17
1790 : గొప్ప రచయిత, చిత్రకారుడు, రాజకీయ నాయకుడు, శాస్త్రవేత్త, మేధావి బెంజమిన్ ఫ్రాంక్లిన్ మరణం.1946: ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం మరణం ( జ. 1867).
1961 : ప్రముఖ బిలియర్డ్స్ ఆటాగాడు గీత్ సేథి జననం.
1964: వాయుమార్గం ద్వారా భూగోళాన్ని చుట్టివచ్చిన మొట్టమొదటి మహిళ జెర్రీ మాక్.
1966: తమిళ సినిమా హీరో విక్రం జననం.
1972 : శ్రీలంక కు చెందిన ప్రముఖ క్రికెట్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జననం.
1975: భారత మాజీ రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ మరణం. (జ.1888).(చిత్రం లో)
2004: ప్రముఖ సినిమా నటి సౌందర్య మరణం. (జ. 1972).
ఏప్రిల్ 18
1858 : ప్రముఖ మహిళోద్ధారకుడు, భారతరత్న పురస్కార గ్రహీత ధొండొ కేశవ కర్వే జననం.1859 : తాంతియా తోపే, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు మరణం.(జ. 1814)
1880 : ప్రముఖ విమర్శకులు మరియు పండితులు టేకుమళ్ళ అచ్యుతరావు జననం.
1923 : అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో అన్నవరం పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది.
1930 : భారత స్వాతంత్ర్యోద్యమము లోసూర్య సేన్ ఇతర విప్లవకారులతో కలిసి చిట్టగాంగ్ లోని ఆయుధాగారాన్ని ముట్టడించారు.
1955 : ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మరణం. (జ. 1879)(ప్రక్క చిత్రంలో)
1958: వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు మాల్కం మార్షల్ జననం. (మ.1999)
ఏప్రిల్ 19
1882 : ఇంగ్లాండుకు చెందిన ప్రకృతివాది, జీవపరిణామ సిద్ధాంత కర్త చార్లెస్ డార్విన్ మరణం.1906 : ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పియరీ క్యూరీ మరణం (జ. 1859).
1957 : రిలయన్స్ కంపెనీ అధినేత ముకేష్ అంబానీ జననం.(ప్రక్క చిత్రంలో)
1969 : సిద్ద భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత గిడుగు వేంకట సీతాపతి మరణం.
1971 : మొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 1 ప్రయోగం.
1975 : భారత తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్టను సోవియట్ భూభాగం నుంచి ప్రయోగించారు.
1977 : ప్రపంచ ఛాంపియన్‌షిప్ అథ్లెటిక్స్ పోటీలలో కాంస్య పతకం విజేత అంజు బాబీ జార్జ్ జననం.
2006 : అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న మరణం.
ఏప్రిల్ 20
570: ఇస్లాం మతాన్ని స్థాపించిన ముహమ్మద్ జననం (వివాదాస్పదము)1526 : మొదటి పానిపట్టు యుద్ధం లో ఇబ్రహీం లోడీని బాబరు ఓడించాడు.
1761 : అమరావతి సంస్థాన పాలకుడు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు జననం.
1889 : జర్మనీ ని 12 సంవత్సరాల పాటు పాలించిన ఎడాల్ఫ్ హిట్లర్ జననం.(మ. 1945)
1904 : ప్రముఖ తొలితరం తమిళ సినిమా నిర్మాత మరియు దర్శకుడు కె.సుబ్రమణ్యం జననం.
1950 : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు జననం.(ప్రక్క చిత్రంలో)
1955 : మద్రాసు ప్రాంతానికి చెందిన భారతీయ గణిత శాస్త్రవేత్త తిరుక్కన్నపురం విజయరాఘవన్ మరణం.
1972 : హిందీ సినీనటి మమతా కులకర్ణి జననం.
1992 : తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు ఎమ్మెస్ రామారావు మరణం.
ఏప్రిల్ 21
1938 : ఉర్ధూ మరియు పారశీక భాషా కవి, సారే జహాసె అచ్చా గీత రచయిత ముహమ్మద్ ఇక్బాల్ మరణం. (జ. 1877).1944 : ఫ్రాన్స్ లో మహిళలు వోటు వేయడానికి అర్హత పొందారు.
1994 : సౌర మండలం బయట ఇతర గ్రహాలను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
1997 : భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్ నియమితుడైనాడు.
2013 : ప్రపంచ ప్రసిద్ద గణిత, ఖగోళ మరియు జ్యోతిష్య శాస్త్రవేత్త.శకుంతలా దేవి మరణం.(జ.1929)
ఏప్రిల్ 22
1870 : రష్యా విప్లవనేత లెనిన్ జననం (మరణం 1924).1914 : దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, హిందీ చలనచిత్ర దర్శకుడు బి.ఆర్.ఛోప్రా జననం (మరణం 2008).(ప్రక్క చిత్రంలో)
1936 : జాతీయ బీసీ కమిషన్ అధ్యక్షుడిగా నియమితులైన తెలుగు వ్యక్తి మకాని నారాయణరావు జననం.
1959 : భారత పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జననం.
1970 : ఐక్యరాజ్యసమితి ధరిత్రీ దినోత్సవం గా ప్రకటించింది. మొదటి ధరిత్రీ దినోత్సవం.
1971 : ప్రముఖ టెన్నిస్ ఆటగాడు (స్వీడను దేశస్థుడు) నిక్లాస్ కుల్టి జననం.
1980 : జర్మన్ భౌతిక శాస్త్రవేత్త, ఫ్రిట్జ్ స్ట్రాస్‌మాన్ మరణం (జననం 1902).
1994: అమెరికా 37వ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మరణం (జననం 1913).
ఏప్రిల్ 23
1616 : ప్రముఖ నాటక రచయిత విలియం షేక్‌స్పియర్ మరణం.1850 : సుప్రసిద్ధ ఆంగ్ల కవి విలియం వర్డ్స్ వర్త్ మరణం. (జ.1770)
1858 : ప్రముఖ జర్మన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మాక్స్ ప్లాంక్ జననం.(మ. 1947)
1858 : భారతీయ సంఘ సంస్కర్త పండిత రమాబాయి జననం.
1891 : ప్రముఖ రచయిత, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి జననం.(మరణం.1961)
1938 : ప్రముఖ నేపథ్యగాయని ఎస్.జానకి జననం.(ప్రక్క చిత్రంలో)
1992 : ప్రముఖ భారత సినీ దర్శకుడు సత్యజిత్ రే మరణం.(జననం.1921)
2007 :రష్యా లోని ప్రముఖ రాజకీయ వేత్త బోరిస్ యెల్సిన్ మరణం.(జననం.1931)
ఏప్రిల్ 24
1927 : తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు నండూరి రామమోహనరావు జననం.
1929 : కన్నడ ప్రముఖ నటుడు, కన్నడ కంఠీరవుడుగా పేరుపొందిన రాజ్ కుమార్ జననం.
1969 : సుప్రసిద్ధ ఖగోళ, జ్యోతిష శాస్త్ర పండితుడు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి జననం.
1970 : మొదటిసారి చైనా "డాంగ్ ఫాంగ్ హాంగ్ 1" అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించింది.
1973 : ప్రముఖ భారతదేశ క్రికెట్ ఆటగాడు సచిన్ టెండుల్కర్ జననం.(ప్రక్క చిత్రంలో)
1974 : ప్రముఖ హిందీ కవి రామ్‌ధారీ సింహ్ దినకర్ మరణం.(జననం.1908)
1993 : పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది.
2005 : దక్షిణ కొరియా లో మొదటిసారి క్లోనింగ్ ప్రక్రియ ద్వారా జన్మించిన కుక్క స్నప్పీ
2011 : ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త పుట్టపర్తి సత్య సాయి బాబా మరణం.(జ. 1926)
ఏప్రిల్ 25
1874 : ప్రముఖ శాస్త్రవేత్త రేడియో ఆవిష్కర్త గూగ్లి ఎల్మో మార్కోని జననం. (మ.1937)(ప్రక్క చిత్రంలో)1900 : వోల్ఫ్‌గాంగ్ ఎర్నస్ట్ పౌలీ, ఆస్ట్రేలియా భౌతిక శాస్త్రవేత్త,నోబెల్ బహుమతి గ్రహీత జననం (మ. 1958)
1974 : ప్రముఖ సినిమా నటి దివ్యభారతి జననం.
1992 : ప్రముఖ సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి వసంతరావు వెంకటరావు మరణం.
2005 : స్వామి రంగనాథానంద, భారత ఆధ్యాత్మిక గురువు మరణం.(జ. 1908)
2005 : అలనాటి తెలుగు సినిమా నటి మరియు ప్రసిద్ధ గాయకురాలు టంగుటూరి సూర్యకుమారి మరణం (జ.1925)
ఏప్రిల్ 26
570 : ఇస్లాం మతస్థాపకుడు మహమ్మదు ప్రవక్త జననం.(మ. 632)1762 : సంగీత త్రిమూర్తులలో మూడవవాడైన శ్యామశాస్త్రి జననం.
1904 : ప్రజా సేవకులు, విద్యా సంపన్నులు, పరిపాలనా దక్షులు పైడి లక్ష్మయ్య జననం.
1916 : అల్లూరి సీతారామరాజు ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు.
1920 : భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ మరణం.(జ. 1887)(ప్రక్క చిత్రంలో)
1986 : అత్యంత ప్రమాదకరమైన సంఘటన చెర్నొబైల్ అణువిద్యుత్ కేంద్రంలో జరిగినది.
1987 : ప్రముఖ సంగీత దర్శకుల ద్వయం శంకర్ జైకిషన్ లలో శంకర్ మరణం.
ఏప్రిల్ 27
1791 : అమెరికన్ శాస్త్రవేత్త,టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త,చిత్రకారుడు శామ్యూల్ మోర్స్ జననం.(మ. 1872)(ప్రక్క చిత్రంలో)1908 : నాలుగవ ఒలింపిక్ క్రీడలు లండన్ లో ప్రారంభం.
1955 : గూగుల్ ఛైర్మన్/CEO ఎరిక్ ఇ. ష్మిత్ జననం.
1974 : ప్రముఖ తెలుగు సినిమా నటి శ్రీరంజని (జూనియర్) మరణం.
1989 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు తమనపల్లి అమృతరావు మరణం.
1994 : దక్షిణ ఆఫ్రికా దేశానికి స్వతంత్రం లభించింది.
2001 : తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటయింది.
2004 : శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన నటుడు జె.వి. సోమయాజులు మరణం.
2009 : ప్రముఖ హిందీ సినిమా నటుడు ఫిరోజ్ ఖాన్ మరణం.(జ.1939)
ఏప్రిల్ 28
1758 : అమెరికా రాజకీయవేత్త, 5 వ అధ్యక్షుడు జేమ్స్ మన్రో జననం.(మ. 1831)1881 : సుప్రసిద్ధ నాటక కర్త...సంఘ సంస్కర్త... ప్రథమాంధ్ర ప్రచురణ కర్త కాళ్ళకూరి నారాయణరావు జననం.
1897 : ప్రముఖ రచయిత, నటుడు మరియు నాటక కర్త భమిడిపాటి కామేశ్వరరావు జననం.
1946 : ప్రముఖ రాజకీయవేత్త కోటగిరి విద్యాధరరావు జననం.
1978 : మహమ్మద్ దావుద్ ఖాన్, ఆఫ్ఘనిస్థాన్ మొదటి అధ్యక్షుడు మరణం. (జ. 1909)
1987 : ప్రజా సేవకులు, విద్యా సంపన్నులు, పరిపాలనా దక్షులు పైడి లక్ష్మయ్య మరణం.
1992 : కన్నడ భాష చెందిన సాహిత్యవేత్త.కన్నడ ప్రసిద్ధకవి వినాయక కృష్ణ గోకాక్ మరణం.
1998 : రమాకాంత్ దేశాయ్, భారత క్రికెటర్ మరణం.(జ.1939)
2001 : డెన్నిస్ టిటో, ప్రపంచంలో మొదటి అంతరిక్ష పర్యాటకుడుగా చరిత్రలో నిలిచాడు
ఏప్రిల్ 29
1917 : ప్రసిద్ధిచెందిన హేతువాది ఆవుల గోపాలకృష్ణమూర్తి జననం.1990: బొరిక్ ఎల్సిన్ రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైనాడు.
1848 : భారత ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ జననం.(మ.1906)(చిత్రంలో)
1970 : ప్రముఖ అమెరికన్ టెన్నిస్ క్రీడాకారుడు ఆండ్రి అగస్సీ జననం.
1979 : భారత క్రికెట్ క్రీడాకారుడుఆశిష్ నెహ్రా జననం.
2003 : స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది వావిలాల గోపాలకృష్ణయ్య మరణం (జ.1906)
ఏప్రిల్ 30
1777 : జర్మనీకి చెందిన సుప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు కార్ల్ ఫ్రెడెరిక్ గాస్ జననం.1870 : భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత, భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జననం.(మ.1944)( చిత్రంలో)
1945 : జర్మనీలో నాజీ పార్టీ వ్యవస్థాపకుడు ఎడాల్ఫ్ హిట్లర్ మరణం.
1946 : మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పదవి చేపట్టాడు.
1910 : మహాకవి శ్రీరంగం శ్రీనివాస రావు (శ్రీశ్రీ) జననం. (మరణం 1983)
1968 : ప్రముఖ మత్తుమందు వైద్యుడు మరియు రాజకీయ నాయకుడు దాడిచిలుక వీర గౌరీశంకర రావు జననం.
1987 : భారత దేశ క్రికెట్ క్రీడాకారుడు రోహిత్ శర్మ జననం.
No comments:
Post a Comment