నవంబర్ 1
1915 : ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత, వట్టికోట ఆళ్వారుస్వామి జననం (మ.1961).1919 : ప్రముఖ చిత్రకారుడు మరియు శిల్పి అంట్యాకుల పైడిరాజు జననం (మ.1986).
1945 : భారతీయ హేతువాది మరియు మహారాష్ట్రకు చెందిన రచయిత నరేంద్ర దభోల్కర్ జననం (మ.2013).
1956 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్ట మొదటి ముఖ్యమంత్రి గా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం.
1959 : ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ రాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టబడింది.
1973 : ప్రముఖ భారతీయ సినిమా నటి మరియు మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ జననం.
1974 : భారతదేశ క్రికెట్ క్రీడాకారుడు వి.వి.యెస్.లక్ష్మణ్ జననం.
1989 : తెలుగు సినిమా నటుడు హరనాథ్ మరణం (జ.1936).
1996 : సంగీత విద్వాంసుడు మల్లాది వెంకట సత్యనారాయణ రావు మరణం (జ.1932).
నవంబర్ 2
1938 : అమెరికన్ మితవాద రాజకీయ వ్యాఖ్యాత, రచయిత, సిండికేటెడ్ కాలమిస్ట్, రాజకీయవేత్త పాట్ బుకానన్ జననం.1941 : భారతీయ విలేఖరి, రచయిత, మేధావి మరియు రాజకీయవేత్త అరుణ్ శౌరీ జననం.
1950 : ఐర్లండుకు చెందిన ఒక ప్రముఖ రచయిత జార్జి బెర్నార్డ్ షా మరణం (జ.1856).
1956 : ప్రముఖ రంగస్థల కళాకారిణి రాజ్యం. కె జననం.
1962 : ప్రముఖ రచయిత, తెలుగు సినిమా దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ (జ. 1910).
1965 : భారతీయ నటుడు, అలాగే చిత్ర నిర్మాత మరియు టెలివిజన్ వ్యాఖ్యాత షారుఖ్ ఖాన్ జననం.
1976: భారత రాజ్యాంగం యొక్క 42వ సవరణ ను లోక్‌సభ ఆమోదించింది.
1984 : సుప్రసిద్ధ సర్వోదయ కార్యకర్త మరియు కావూరులోని వినయాశ్రమం వ్యవస్థాపకురాలు తుమ్మల దుర్గాంబ మరణం (జ.1907).
నవంబర్ 3
1906 : భారతీయ నాటకరంగానికి ఆద్యుడు మరియు హిందీ సినీ పరిశ్రమలో పేరొందిన కళాకారుడు పృథ్వీరాజ్ కపూర్ జననం (మ.1972).1933 : భారతీయ తత్త్వ శాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్యా సేన్ జననం.
1936 : ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రాయ్ ఎమర్సన్ జననం.
1940 : ప్రముఖ రచయిత, సాహితీకారుడు పెండ్యాల వరవరరావు జననం.
1968 : ప్రముఖ రంగస్థల కళాకారిణి మణిబాల. ఎస్ జననం.
1984 : ప్రధాని ఇందిరా గాంధీ మరణానంతరం ఢిల్లీలో జరిగిన హింసాకాండలో 3000 మంది మరణించారు.
1998 : విలక్షణమైన నటుడు, నాటక ప్రయోక్త పి.ఎల్. నారాయణ మరణం (జ.1935).
నవంబర్ 4
1888 : ప్రముఖ వ్యాపారవేత్త, భారత స్వాతంత్య్ర సమరయోధుడు జమ్నాలాల్ బజాజ్ జననం (మ.1942).1929 : ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ మరియు జ్యోతిష శాస్త్రవేత్త శకుంతలా దేవి జననం (మ.2013).
1946: యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ఏర్పాటయింది.
1947 : ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు రాడ్ మార్ష్ జననం.
1986 : భారతీయ వ్యాపారి, IT బహుళ జాతి సంస్థ అయిన గ్లోబల్స్ ఇంక్ సంస్థాపకుడు సుహాస్ గోపీనాథ్ జననం.
1995: ఇజ్రాయిల్ ప్రధాని ఇత్జాక్ రబీన్ , ఇజ్రాయిల్ హంతకుడి చేతిలో హతుడయ్యాడు (జ.1922).
2007: ప్రసిద్ద తెలుగు నాటక మరియు సినిమా నటుడు అర్జా జనార్ధనరావు మరణం (జ.1926).
నవంబర్ 5
1885 : ఒక ప్రసిద్ధ అమెరికన్ చరిత్రకారుడు, తత్వవేత్త మరియు ధార్మికుడు విల్ డ్యురాంట్ జననం (మ.1981).1870 : ప్రముఖ బెంగాళీ న్యాయవాది మరియు స్వాతంత్ర్యోద్యమ నేత చిత్తరంజన్ దాస్ జననం (మ.1925).
1920 : భారతీయ రెడ్‌క్రాస్ ఏర్పడింది.
1925 : ప్రముఖ తెలుగు కవి, కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆలూరి బైరాగి జననం (మ.1978).
1952 : తత్వవేత్త, పర్యావరణ ఉద్యమకారిణి, పర్యావరణ స్త్రీ వాది మరియు రచయిత్రి వందన శివ జననం.
1959 : కెనడియన్ రాక్ గాయకుడు, పాటల రచయిత మరియు ఛాయా చిత్రకారుడు బ్రయాన్ ఆడమ్స్ జననం.
1987 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ఆస్థానకవి దాశరథి కృష్ణమాచార్య మరణం (జ.1925).
1988 : భారతదేశపు అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు విరాట్ కోహ్లి జననం.
నవంబర్ 6
1860: అబ్రహాం లింకన్ అమెరికా 16వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.1913: దక్షిణాఫ్రికాలో భారతీయ గనికార్మికులతో ప్రదర్శన జరపగా, మహాత్మా గాంధీ అరెస్టయ్యాడు. ఆయనకు 9నెలల జైలుశిక్ష వేశారు.
1923: వారానికి ఐదు రోజులతో రష్యా ప్రయోగాత్మక కాలమాన పద్ధతిని ప్రవేశపెట్టింది.
1937 : భారతీయ రాజకీయ నాయకుడు మరియు మాజీ భారత ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా జననం.
1941: నౌఖాలీ ఊచకోత జరిగిన ప్రాంతాల్లో గాంధీజీ పర్యటించారు.
1943: అండమాన్ నికోబార్ దీవులను జపాన్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్‌కు అప్పగించింది. ఆయన వాటికి షహీద్, స్వరాజ్య అని నామకరణం చేసాడు.
నవంబర్ 7
1858: లాల్, బాల్, పాల్ త్రయంలో ఒకడైన బిపిన్ చంద్ర పాల్ జననం.1867 : ప్రసిద్ధ భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త మేరీ క్యూరీ జననం.
1888: ప్రముఖ శాస్త్రవేత్త, చంద్రశేఖర్ వెంకటరామన్ జననం.
1954 : ప్రముఖ భారతీయ సినిమా నటుడు కమల్ హాసన్ జననం.
1978 : ఇంగ్లీష్ ఫుట్‌బాల్ ఆటగాడు రియో ఫెర్డినాండ్ జననం.
1980 : భారతీయ చిత్ర నేపథ్యగాయకుడు కార్తీక్ జననం.
1981 : భారతీయ సినీ నటి అనుష్క శెట్టి జననం.
2000 : సుప్రసిద్ధ భారతీయుడు, భారతరత్న గ్రహీత సి.సుబ్రమణ్యం మరణం.
2005 : సువిశాల భూభాగంలో నిర్మితమైన హిందూ దేవాలయాల సముదాయం అక్షరధామ్ ప్రారంభం.
నవంబర్ 8
1627 : మొఘల్ సామ్రాజ్యపు నాల్గవ చక్రవర్తి జహాంగీర్ మరణం.1656 : ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, భూగర్భ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త ఎడ్మండ్ హేలీ జననం.
1884 : ప్రముఖ మనో విజ్ఞాన శాస్త్రవేత్త హెర్మన్ రోషాక్ జననం.(మ.1922)
1893 : ప్రముఖ వాయులీన విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు జననం.
1927 : భారతీయ జనతా పార్టీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ జననం.
1947 : ప్రసిద్ధ భారతీయ పాప్ గాయని ఉషా ఉతుప్ జననం.
1977: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి మరణం.
2013 : తెలుగు సినిమా ప్రముఖ హాస్యనటుడు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం మరణం.(జ.1957)
నవంబర్ 9
1895 : ప్రముఖ తెలుగు కవి దువ్వూరి రామిరెడ్డి జననం.1927 : స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వనిత, సమాజ సేవిక, రచయిత్రి మాగంటి అన్నపూర్ణాదేవి మరణం.
1934 :అమెరికన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు,ఖగోళ భౌతిక శాస్త్రజ్ఞుడు, రచయిత కార్ల్ సాగాన్ జననం.
1936 : ప్రముఖ రంగస్థల కళాకారిణి రేకందాస్ అనసూయాదేవి జననం.
1948 : ప్రముఖ సంగీత విధ్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ జననం.
1962 : ప్రముఖ సంఘసంస్కర్త ధొండొ కేశవ కర్వే మరణం.
2000: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడింది.
2005: భారత మాజీ రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ మరణం.
నవంబర్ 10
అటవీ అమరవీరుల సంస్మరణ దినం1483 : క్రైస్తవ మత సంస్కరణోద్యమ నిర్మాత మార్టిన్ లూథర్ జననం.
1798 : తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జననం.
1848 : బ్రిటిష్ పరిపాలనలో తొలినాటి భారత రాజకీయ నాయకులలో ఒకరైన సురేంద్రనాథ్ బెనర్జీ జననం.
1938 : ఉద్యమకారుడు. రిపబ్లిక్ ఆఫ్ టర్కీ వ్యవస్థాపకుడు ముస్తఫా కమాల్ అతాతుర్క్ మరణం.
1949 : ప్రముఖ మానవతావాది, కవి ఏటుకూరి వెంకట నరసయ్య మరణం.
2004 : స్వాతంత్ర్యపోరాట యోధుడు, మాజీ న్యాయ, దేవాదాయ మరియు రెవిన్యూ శాఖామంత్రి తెన్నేటి విశ్వనాధం జననం.
నవంబర్ 11
భారత జాతీయ విద్యా దినోత్సవం1872 : హిందుస్తానీ సంగీతంలోని కిరాణా ఘరానాకు చెందిన వారిలో ప్రముఖుడు అబ్దుల్ కరీంఖాన్ జననం (మ.1937).
1888 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జననం (మ.1958).
1918 : బిర్లా కుటుంబానికి చెందిన సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త కృష్ణ కుమార్ బిర్లా జననం (మ.2008),
1970: పద్మభూషణ మాడపాటి హనుమంతరావు మరణం (జ.1885).
1985 : భారత వన్డే మరియు ట్వంటీ-20 క్రికెట్ జట్టులో మెరుపులు మెరిపిస్తున్న యువ క్రికెట్ ఆటగాడు రాబిన్ ఊతప్ప జననం.
2002 : గ్రంథాలయోద్యమం నేత మరియు విశాలాంధ్ర ప్రచారకుడు కోదాటి నారాయణరావు మరణం (జ.1914).
నవంబర్ 12
జాతీయ కుటుంబ సౌహార్ద్ర దినోత్సవం1842 : భౌతిక శాస్త్రం లో నోబెల్ బహుమతి గ్రహీత జాన్ స్ట్రట్ జననం (మ. 1919).
1866 : చైనా దేశ మొట్టమొదటి అధ్యక్షుడు సన్ యాత్ సేన్ జననం (మ. 1925).
1885 : కొప్పరపు సోదర కవుల లో ఒకరైన కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి జననం (మ.1932).
1896 : విఖ్యాత పక్షిశాస్త్రవేత్త, పద్మవిభూషణుడు, రాజ్యసభ సభ్యుడు సలీం అలీ జననం (మ.1987).
1918 : ఆస్ట్రియా స్వాతంత్ర్యదినోత్సవం.
1925 : ప్రముఖ చలనచిత్ర నృత్యదర్శకుడు, పసుమర్తి కృష్ణమూర్తి జననం (మ.2004).
1946 :భారత స్వాతంత్ర్య సమరయోధుడు పండిత మదన్ మోహన్ మాలవ్యా మరణం (జ.1861).
1969 : పాకిస్థాన్ మొదటి అధ్యక్షుడు ఇస్కాందర్ మిర్జా మరణం (జ. 1899).
నవంబర్ 13
1780 : భారత దేశంలో సిక్కు సామ్రాజ్య స్థాపకుడు రంజిత్ సింగ్ జననం (మ.1839).1899 : చైనా చరిత్రకారుడు, మానవ వర్గ శాస్త్రజ్ఞుడు. హువాంగ్ గ్జియాన్ హన్ జననం (మ.1982).
1904 : బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత మరియు పాత్రికేయుడు పురిపండా అప్పలస్వామి జననం (మ.1982).
1925 : అలనాటి తెలుగు సినిమా నటి మరియు ప్రసిద్ధ గాయకురాలు టంగుటూరి సూర్యకుమారి జననం (మ.2005).
1926 : ప్రముఖ నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత ఎ.ఆర్.కృష్ణ జననం (మ.1992).
1935 : ప్రముఖ గాయకురాలు పి.సుశీల జననం.
1973 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు బారు అలివేలమ్మ మరణం (జ.1897).
1990 : మొట్టమొదటి వెబ్ పేజీ సృష్టించబడింది.
2002 : ప్రముఖ కవి, పద్మవిభూషణ , కాళోజీ నారాయణరావు మరణం (జ.1914).
నవంబర్ 14
బాలల దినోత్సవం1889: ప్రథమ భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జననం (మ.1964).
1891 : కెనడాకు చెందిన వైద్యుడు, వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ బాంటింగ్ జననం (మ.1941).
1922: ఐక్యరాజ్య సమితి కి 6 వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ జననం.
1931 : విజయనగరానికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు వంకాయల నరసింహం జననం.
1948 : వేల్స్ యువరాజు చార్లెస్ జననం.
1948 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ జననం.
1967 : ప్రముఖ భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు సి.కె.నాయుడు మరణం (జ.1895).
2005 : తెలుగు వికీపీడియా లో గోదావరి వ్యాసంతో విశేష వ్యాసాల పరంపర మొదలయింది.
నవంబర్ 15
1630 : ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు జోహాన్స్ కెప్లర్ మరణం (జ.1571).
1738 : వరుణ (యురేనస్) గ్రహాన్ని కనుగొన్న ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త విలియం హెర్షెల్ జననం (మ.1822).
1898 : స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు కల్లూరి చంద్రమౌళి జననం (మ.1992).
1902 : గోరా గా ప్రసిద్ధి చెందిన హేతువాది, భారతీయ నాస్తికవాద నేత గోపరాజు రామచంద్రరావు , ఒరిస్సా లోని [[ఛత్రపురం] లో జననం (మ.1975).
1935 : విజయవాడకు చెందిన నవలా రచయిత్రి తెన్నేటి హేమలత జననం (మ.1997).
1949 : గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు నాథూరామ్ గాడ్సే మరణం (జ.1910).
1982 : స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది, మహాత్మా గాంధీ యొక్క ఆధ్యాత్మిక వారసుడు వినోబా భావే మరణం (జ.1895).
1986 : భారతదేశ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జననం.
2000 : బీహారు రాష్ట్రం నుండి దక్షిణ ప్రాంతాన్ని వేరుచేసి జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారు.
నవంబర్ 16
జాతీయ పత్రికా దినోత్సవం
1890 : గొప్ప భాషా శాస్త్రవేత్త ఆదిరాజు వీరభద్రరావు జననం (మ.1973).
1908 : తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి జననం (మ.1977).
1922 : ప్రముఖ జర్మన్ భౌతిక శాస్త్రవేత్త మాక్స్ అబ్రహమ్ మరణం (జ.1875).
1963 : భారతీయ సినిమా నటి మీనాక్షి శేషాద్రి జననం.
1965 : రష్యా ప్రయోగించిన వీనస్-3 అంతరిక్ష నౌక శుక్రగ్రహం వైపు ప్రయాణం ప్రారంభించింది.
1973 : తెలుగు, తమిళ సినిమా నటి ఆమని జననం.
1973 : భారతదేశపు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జననం.
1923 : ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు కాంతారావు జననం (మ.2009).
నవంబర్ 17
1920 : సుప్రసిద్ధ తమిళ నటుడు జెమినీ గణేశన్ జననం.(మ.2005)
1928 : భారత్ కు చెందిన రచయిత మరియు రాజకీయనాయకుడు లాలా లజపతిరాయ్ మరణం.(జ.1865)
1942 : అమెరికన్ చలన చిత్ర దర్శకుడు, కథారచయిత, నిర్మాత, నటుడు మరియు చలన చిత్ర చరిత్రకారుడు మార్టిన్ స్కోర్సెస్ జననం.
1961 : ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు కు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా మరియు నిర్వహణ అధ్యక్షురాలు గా విధులు నిర్వర్తిస్తున్న చందా కొచ్చర్ జననం.
1972 : ప్రముఖ తెలుగు సినిమా నటి రోజా జననం.
1990 : భారత అర్చెరీ క్రీడకు చెందిన క్రీడాకారిణి ప్రణీత వర్థినేని జననం.
2009 : మాజీ పార్లమెంటు సభ్యులు మరియు మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర మరణం.(జ.1936)
2012 : మరాఠీల ఆరాధ్యదైవం, శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాల్ థాకరే మరణం.(జ.1926)
నవంబర్ 18
భారత సరిహద్దు సైన్య దినోత్సవం.
1493 : క్రిస్టోఫర్ కొలంబస్ మొట్టమొదట ప్యూయెటో రికో దీవిని కనుగొన్నాడు.
1901 : భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు మరియు నటుడు వి. శాంతారాం జననం (మ.1990).
1945 : శ్రీలంక ఆరవ అధ్యక్షుడు మహీంద్ర రాజపక్స జననం.
1962 : హైడ్రోజన్ పరమాణు వ్యాసార్థాన్ని కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్ మరణం (జ.1885).
1963 : మొట్టమొదట పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభమైనాయి.
1972 : భారత జాతీయ జంతువు గా పెద్దపులి ని స్వీకరించారు.
1982 : పురిపండా అప్పలస్వామి బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత మరియు పాత్రికేయుడు మరణం (జ.1904).
నవంబర్ 19
1828 : మరాఠా యోధుల పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి జననం (మ.1858).
1917 : పూర్వ భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జననం (మ.1984).
1928 : భారతదేశానికి చెందిన ప్రసిద్ధ మల్లయోధుడు మరియు సినిమా నటుడు దారా సింగ్ జననం (మ.2012).
1954 : ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ జననం.
1973 : ప్రముఖ భారతీయ నటి షకీలా జననం.
1975 : విశ్వ సుందరి పోటీలో విజేతగా ఎన్నుకొనబడి ప్రసిద్ధికెక్కిన భారతీయ నటి సుష్మితా సేన్ జననం.
1977: తుపానుయొక్క ఉప్పెన సృష్టించిన భీభత్సానికి ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా లోని దివిసీమ నాశనమయింది.
1995 : ప్రసిద్ధిచెందిన పురాణ ప్రవచకులు మరియు సంస్కృతాంధ్ర పండితులు రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి మరణం (జ.1908).
2007: ప్రసిద్ధ రచయిత, సీమ సిన్నోడు గా పిలువబడే రాయలసీమ వాసి పులికంటి కృష్ణారెడ్డి మరణం (జ.1931).
నవంబర్ 20
ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం
1750 : మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం (మ.1799).
1858 : బెంగాల్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త జగదీశ్ చంద్ర బోస్ జననం (మ.1937).
1910 : సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్ మరణం (జ.1828).
1923 : భారత దేశపు వాణిజ్య బ్యాంకులలో ముఖ్యమైనదైన ఆంధ్రా బ్యాంకు ప్రారంభం.
1925 : ఐ.ఐ.టి. రామయ్యగా అందరికీ సుపరిచితుడైన చుక్కా రామయ్య జననం.
1930 : 14వ లోక్‌సభ కు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు కొండపల్లి పైడితల్లి నాయుడు జననం (మ.2006).
1956 : తెలుగు సినిమా దర్శకుడు మరియు రచయిత వంశీ జననం.
నవంబర్ 21
ప్రపంచ మత్స్య దినోత్సవం
1694 : ఫ్రాన్సు దేశానికి చెందిన తాత్వికుడు వోల్టయిర్ జననం (మ.1778).
1854 : కాథలిక్ చర్చి యొక్క అధిపతి పోప్ బెనెడిక్ట్ XV జననం (మ.1922).
1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ళ విడుదలయింది. దీని విలువ మూడున్నర అణా లు.
1783: మొట్టమొదటి వేడి గాలి బెలూన్ ను ఫ్రాన్సు లో ఎగురవేశారు.
1970: ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, చంద్రశేఖర్ వెంకటరామన్ మరణం (జ.1888).
1996 : పాకిస్థాన్ భౌతిక శాస్త్రవేత్త , నోబెల్ బహుమతి గ్రహీత అబ్దుస్ సలామ్ మరణం (జ.1926).
నవంబర్ 22
1830 : ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని తలపించే అరుదైన చరిత్రకు ప్రతీక దళిత సిపాయి వీరనారి ఝల్కారీబాయి జననం (మ. 1857 లేదా 1890).
1907 : ప్రఖ్యాత గణితావధాని, గణిత శాస్త్రవేత్త లక్కోజు సంజీవరాయశర్మ జననం (మ.1997).
1913 : భారత దేశపు ఆర్థిక వేత్త మరియు భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పనిచేసిన 8 వ వ్యక్తి ఎల్.కె.ఝా జననం (మ.1988).
1963 : అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు గా పనిచేసిన జాన్ ఎఫ్ కెనడి మరణం (జ.1917).
1967 : జర్మనీకి చెందిన ఒక మాజీ ప్రపంచ నం. 1 టెన్నిస్ క్రీడాకారుడు బోరిస్ బెకర్ జననం.
1968 : మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడు గా మార్చే బిల్లును లోక్‌సభ ఆమోదించింది.
1970 : శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్ మర్వన్ ఆటపట్టు జననం.
1988: బాబా ఆమ్టే కు ఐరాస మానవహక్కుల పురస్కారం లభించింది.
1997: హైదరాబాదు లో ఇండో అరబ్ సాంస్కృతిక కేంద్రానికి పాలస్తీనా నేత యాస్సిర్ ఆరాఫత్ శంకుస్థాపన చేసాడు.
2006 : ప్రముఖ భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త అసీమా చటర్జీ మరణం (జ.1917).
నవంబర్ 23
1926 : 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు సత్య సాయి బాబా జననం (మ.2011).
1930 : హిందీ చలన చిత్ర గీతాలు ఆలపించిన భారతీయ నేపథ్య గాయకురాలు గీతా దత్ జననం (మ.1972).
1937: ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త, జగదీశ్ చంద్ర బోస్ మరణం (జ.1858).
1967 : దక్షిణ ఆఫ్రికా యొక్క మాజీ క్రికెట్ ఆటగాడు గారీ క్రిస్టెన్ జననం.
1986 : తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగ చైతన్య జననం.
1971: 'పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా' (పి.ఆర్.ఒ) ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు తొలిసారిగా హాజరయ్యారు.
1997: ప్రసార భారతి చట్టం అమల్లోకి వచ్చింది.
నవంబర్ 24
1859 : ఛార్లెస్ డార్విన్ తన "ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్" ను ప్రచురించాడు.
1880 : స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య జననం (మ.1959).
1924 : సుప్రసిద్ధ తెలుగు, తమిళ మరియు హిందీ సినిమా దర్శకులు తాతినేని ప్రకాశరావు జననం (మ.1992).
1952 : భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు బ్రిజేష్ పటేల్ జననం.
1953 : ఆంధ్ర విశ్వకళా పరిషత్, హిందీ విభాగములో ఆచార్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ జననం.
1955 : ఇంగ్లాండుకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు మరియు ప్రస్తుత క్రికెట్ వ్యాఖ్యాత ఇయాన్ బోథం జననం.
1961 : భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి అరుంధతీ రాయ్ జననం.
నవంబర్ 25
అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినము
అంతర్జాతీయ శాకాహారుల దినోత్సవం.
1926 : 21 వ భారత ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా జననం (మ. 2012).
1952 : పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు ఇమ్రాన్ ఖాన్ జననం.
1964 : ప్రముఖ వాయులీన విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు మరణం (1893).
1966 : భారతీయ సినిమా నటి రూపా గంగూలీ జననం.
1974 : ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన యూ థాంట్ మరణం (జ.1909).
2010 : ఆంధ్రప్రదేశ్ 16 వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
నవంబర్ 26
భారత జాతీయ న్యాయ దినోత్సవం
1949 : స్వతంత్ర భారత రాజ్యాంగం ఆమోదించబడింది.
1954 : శ్రీలంకలో ఎల్.టి.టి.ఇ. ఉగ్రవాద సంస్ఠ వ్యవస్థాపకుడు మరియు నాయకుడు, వేలుపిళ్ళై ప్రభాకరన్ జననం (మ.2009).
1956 : తమిళనాడు రాష్ట్రం ఏర్పడింది.
1960 : భారత టెలిఫోన్లు STD సౌకర్యాన్ని ప్రవేశపెట్టాయి.
1967 : వెస్ట్ ఇండీస్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు రిడ్లీ జాకబ్స్ జననం.
1975 : తెలుగు సినిమా ప్రముఖ హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య మరణం (జ. 9 ఆగష్టు 1910).
2006 : తెలుగు సినిమా నటి జి.వరలక్ష్మి మరణం (జ.1926).
2008 : 2008 ముంబై లో టెర్రరిస్ట్ దాడులు జరిగినవి.ఈ దాడిలో...
"ఏంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్" అధిపతి హేమంత్ కర్కరే మరణం.
ముంబై పోలీసు అడిషనల్ కమీషనర్ అశోక్ కాంమ్టే మరణం.
సీనియర్ పోలీసు అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సలస్కర్ మరణం.
నవంబర్ 27
1888: లోక్‌సభ మొదటి అధ్యక్షుడు జి.వి.మావలాంకర్ జన్మించాడు.
1940: ప్రంచ ప్రసిద్ద యుద్ద వీరుడు బ్రూస్ లీ జననం (మ.1973)
నవంబర్ 28
1890: ప్రముఖ తత్వవేత్త జ్యోతీరావ్ ఫులే మరణం.(జ.1827)
1931: రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
1954 : ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త, ఎన్ రికో ఫెర్మి మరణం.(జ.1901)
1962: ప్రముఖ భారతీయ గాయకుడు,నటుడు కె.సి.డే మరణం.(జ.1972)
1997: ఐ.కె.గుజ్రాల్ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడు నెలల తరువాత పడిపోయింది.
నవంబర్ 29
1759 : ప్రముఖ గణిత శాస్త్రవేత్త నికోలస్ బెర్నోలీ మరణం. (జ.1687)
1877 : థామస్ ఆల్వా ఎడిసన్ చే మొదటిసారి ఫోనోగ్రాఫ్ ప్రదర్శింపబడినది.
1929 : భూ దక్షిణ ధృవం గగన తలంలో మొట్టమొదటిసారి యు.ఎస్ అడ్మిరల్ రిచర్డ్ బయర్డ్ ఎగిరాడు.
1947 : హైదరాబాదు నిజాము, భారత ప్రభుత్వము మధ్య యథాతథస్థితి ఒప్పందం కుదిరింది.
నవంబర్ 30
1858: ప్రముఖ వృక్షశాస్త్రవేత్త, జగదీశ్ చంద్ర బోస్ జననం. (మ.1937)
1915: కన్యాశుల్కం నాటక కర్త, గురజాడ అప్పారావు మరణం. (జ 1862)
1900: ప్రముఖ నవలా రచయిత, కవి ఆస్కార్ వైల్డ్ మరణం. (జ.1854)
1990: నార్వే దేశానికి చెందిన చదరంగం క్రీడాకారుడు మాగ్నస్ కార్ల్సన్ జననం.
2012: భారతదేశ 12 వ ప్రధాని ఐ.కె.గుజ్రాల్ మరణం. (జ.1919)
1938: పున్నాగై అరసి బిరుదునందుకున్న నటి కె ఆర్ విజయ జననం.
No comments:
Post a Comment