మార్చి 1
1901 : ఆంధ్ర రాష్ట్ర ప్రధమ శాసనసభ సభాపతి నల్లపాటి వెంకటరామయ్య జననం (మ.1983).1908 : సుప్రసిద్ధ సాహిత్యవేత్త ఖండవల్లి లక్ష్మీరంజనం జననం (మ.1986).
1947 : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రారంభం.
1968 : భారతీయ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కుంజరని దేవి జననం.
1969 : భారతీయ రైల్వేలు రాజధాని ఎక్స్‌ప్రెస్ లను ప్రవేశపెట్టాయి. మొదటి రైలు ఢిల్లీ, కోల్‌కతాల మధ్య మొదలైంది.
మార్చి 2
1807: అమెరికా కాంగ్రెస్ బానిసలను దిగుమతి చేసుకోవడాన్ని చట్టపరంగా నిషేధించింది.1935 : ఆంధ్రప్రదేశ్ శాసనసభా స్పీకర్ గా పనిచేసిన దుద్దిల్ల శ్రీపాద రావు జననం.
1836: టెక్సాస్ విప్లవం ద్వారా టెక్సాస్ రిపబ్లిక్ కు మెక్సికో దేశం నుండి స్వతంత్రం లభించింది.
1956: మొరాకో దేశానికి ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్యం లభించింది.
1949: స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రిసరోజినీ నాయుడు మరణం.(జ.1879).
1977 : ఆంగ్ల భాషలో గాయకుడు, గేయ రచయిత క్రిస్ మార్టిన్ జననం.
మార్చి 3
1847 : టెలిఫోను ను కనుక్కున్న అలెగ్జాండర్ గ్రాహంబెల్ జననం (మ.1922).1895 : నార్వే ఆర్థికవేత్త రాగ్నర్ ఫ్రిష్ జననం.
1937 : ప్రముఖ తెలుగు రచయిత సత్యం శంకరమంచి జననం.
1967 : నక్సల్బరీ ఉద్యమం మొదలైంది.
1982 : అమెరికా నటీమణి మరియు పూర్వపు మోడల్ జెస్సికా బీల్ జననం.
1991 : కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము (విశాఖపట్నం).
2002 : ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మరియు తొలి దళిత లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి.బాలయోగి మరణం.
మార్చి 4
భారత జాతీయ భద్రతా దినోత్సవం.1680: పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మరణం.
1856 : ప్రముఖ భారతీయ రచయిత్రి తోరూదత్ జననం.
1961: భారత మొదటి విమాన వాహక నౌక ఐ.ఎన్.ఎస్.విక్రాంత్ పని మొదలుపెట్టింది.
1973 : తెలుగు సినిమా దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి జననం.
1980 : ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న జననం.
1987 : ప్రముఖ తెలుగు సినిమా నటి శ్రద్దా దాస్ జననం.
మార్చి 5
1827 : ప్రముఖ ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు పియర్ సైమన్ లాప్లేస్ మరణం (జ.1749).1901 : సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు మరియు గాయకుడు కల్యాణం రఘురామయ్య జననం (మ.1975).
1913 : కిరాణా ఘరానాకు చెందిన హిందుస్థానీ సంగీత విద్వాంసురాలు గంగూబాయి హనగల్ జననం (మ.2009).
1931 : గాంధీ- ఇర్విన్ ఒడంబడిక కుదిరింది.
1937 : కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, నటుడు అయిన నెమలికంటి తారకరామారావు జననం.
1953 : రష్యా నేత సోవియట్ యూనియన్‌కు బ్యూరోక్రాటిక్ పాలకుడు జోసెఫ్ స్టాలిన్ మరణం (జ.1878).
1987 : రష్యా దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి అన్నా చక్వతడ్జే జననం.
మార్చి 6
1475: ప్రముఖ చిత్రకారుడు మైఖేలాంజెలో జననం (మ.1564).1913 : హాస్యనటులకు ప్రాధాన్యత సంతరింపజేసిన ప్రముఖ హాస్యనటుడు కస్తూరి శివరావు జననం (మ.1966).
1978: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరవ ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు పదవీ విరమణ (10 డిసెంబర్ 1973 నుంచి 6 మార్చి 1978 వరకు).
ఏడవ ముఖ్యమంత్రిగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ప్రమాణ స్వీకారం చేసాడు (ఆయన పదవీకాలం 6 మార్చి 1978 నుంచి 11 అక్టోబర్ 1980 వరకు)
మార్చి 7
1921 : తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు ఎమ్మెస్ రామారావు జననం.1938 : అమెరికా దేశానికి చెందిన జీవశాస్త్రవేత్త మరియు నోబెల్ బహుమతి గ్రహీతడేవిడ్ బాల్టిమోర్జననం.
1952 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు వివియన్ రిచర్డ్స్ జననం.
1952 : పరమహంస యోగానంద పరమపదించారు.(జ.1893)
1961 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు గోవింద్ వల్లభ్ పంత్ మరణం.
1970 : ఆంగ్ల నటి మరియు రూపకర్త రాచెల్ వీజ్ జననం.
మార్చి 8
అంతర్జాతీయ మహిళా దినోత్సవం1879 : కేంద్రక విచ్చిత్తి పై విశేషమైన కృషిచేసి నోబెల్ బహుమతి పొందిన భౌతిక శాస్త్రవేత్త అట్టోహాన్ జననం.
1897 : ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు జననం.
1917 : ప్రఖ్యాత విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు జననం.
1921 : సుప్రసిద్ధ ఉర్దూ కవి మరియు బాలీవుడ్ గేయరచయిత సాహిర్ లుధియానవి జననం.
1974 : ఫ్రాన్సు రాజధాని పారిస్ లో చార్లెస్-డి-గాల్ విమానాశ్రయం ప్రారంభం.
మార్చి 9
1916 : పోలెండ్‌పై జర్మనీ యుద్ధం ప్రకటించింది.1934 : అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడిగా చరిత్రపుటలకెక్కిన రష్యన్ వ్యోమగామి యూరీ గగారిన్ జననం (మ.1968).
1934 : మహాత్మా గాంధీ మొదటిసారిగా హైదరాబాదు లో పర్యటించాడు.
1943 : ప్రపంచ చదరంగ కిరీటాన్ని గెలిచి ఆ ఘనత సాధించిన తొలి అమెరికన్‌గా రికార్డు నెలకొల్పిన బాబీ ఫిషర్ జననం(మ.2008).
1952 : రష్యన్ కమ్యూనిస్ట్ నాయకురాలు మరియు దౌత్యవేత్త అలెక్సాండ్రా కొల్లొంటాయ్ మరణం (జ.1872).
1979 : గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య మరణం (జ.1890).
1981 : మాలిక్యులర్ బయాలజీకి మార్గదర్శకుడు మాక్స్ డెల్‌బ్రక్ మరణం (జ.1906).
1985 : భారతీయ క్రికెట్ ఆటగాడు పార్థివ్ పటేల్ జననం.
1994 : సుప్రసిద్ధ భారతీయ నటి మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దేవికారాణి మరణం (జ.1908).
1997 : ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి మరణం (జ.1907).
మార్చి 10
భారత కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ దినోత్సవం.1876: టెలిఫోనును కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ దానిని మొదటిసారిగా ఉపయోగిస్తూ, పక్క గది లోని వాట్సన్‌తో మాట్లాడాడు.
1985: భారత్ పాకిస్తాన్‌ను ఓడించి ప్రపంచ క్రికెట్ చాంపియన్ ట్రోఫీ గెలిచింది.
మార్చి 11
1689 : మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ మరణం.1922 : తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మరియు రంగస్థల నటుడు మాధవపెద్ది సత్యం జననం.
1955 : పెన్సిలిన్ ను కనిపెట్టిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరణించాడు.
1990 : సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి లిథ్వేనియా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
1999 : అమెరికా లోని నాస్‌డాక్ స్టాక్‌ఎక్ఛేంజీలో లిస్టు అయిన తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ అవతరించింది.
2013 : రోగాలను , రాగాలను సరిచేసిన సవ్యసాచి పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి మరణం.
మార్చి 12
మారిషస్ గణతంత్ర దినోత్సవం1930: భారత స్వాతంత్ర ఉద్యమములో ప్రముఖ ఘట్టమైన దండి యాత్ర (200 మైళ్ళ దూరం) ప్రారంభమైంది.
1993: ముంబైలో బాంబు పేలుళ్ళు
1912: జూలియట్ గార్డన్ లో గర్ల్ (బాలికల) స్కౌట్స్ ప్రారంభించాడు.
1962: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రి గా దామోదరం సంజీవయ్య పదవీ విరమణ (11 జనవరి 1960 నుంఛి 12 మార్చి 1962 వరకు).
1962: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడవ ముఖ్యమంత్రి గా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం (12 మార్చి 1962 నుంఛి 29 ఫిబ్రవరి 1964 వరకు).
మార్చి 13
1733: ఆక్సిజన్‌ను కనుగొన్న జోసెఫ్ ప్రీస్ట్‌లీ జన్మించాడు.1889: హైదరాబాదు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జన్మించాడు.
1940: జలియన్ వాలా బాగ్ దురంతానికి కారకుడైన మైఖెల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో కాల్చిచంపాడు.
1963: అర్జున అవార్డును ప్రారంభించారు.
మార్చి 14
1664: సిక్కుల ఎనిమిదవ గురువు గురు హర్‌కిషన్ ఢిల్లీలో మరణించాడు.1879: ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఉల్మ్, జర్మనీలో జన్మించాడు.
1883: ప్రఖ్యాత తత్వవేత్త, రాజకీయ-ఆర్థికవేత్త మరియు విప్లవ కారుడు కారల్ మార్క్స్ మరణించాడు.
1888: అత్యధిక సర్క్యులేషన్ కల మలయాళ వార్తాపత్రిక మలయాళ మనోరమను కందత్తిల్ వర్ఘీస్ మాప్పిల్లై స్థాపించాడు.
1917: స్వరబ్రహ్మగా పేరొందిన ప్రఖ్యాత స్వరకర్త కె.వి. మహదేవన్ జన్మించాడు.
1931: భారతదేశములో తొలి టాకీ చిత్రము అర్దెషీర్ ఇరానీ దర్శకత్వము వహించిన ఆలం ఆరా ముంబైలో విడుదలయ్యింది.
మార్చి 15
1493 :అమెరికా మొదటి పర్యటన అనంతరం స్పెయిన్ చేరిన కొలంబస్.1564 : మొఘల్ చక్రవర్తి అక్బర్ జిజియా పన్నును రద్దు చేశారు.
1767 : అమెరికా మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్జననం.
1915 : మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కాన్‌స్టాంటినోపిల్ సంధి జరిగింది.
1934 : భారత దేశంలో ప్రముఖ దళిత నేత కాన్షీరాంజననం. (మరణం: 2006)
1937 : ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్యజననం.
1977 : భారత సైనికదళం మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ (మరణం: 2008)
1985 : మొట్టమొదటి అంతర్జాల డొమైన్ పేరు నమోదు. (symbolics.com).
1990 : మొట్టమొదటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా గోర్బచేవ్ ఎన్నిక.
మార్చి 16
1901 : అమరజీవి పొట్టి శ్రీరాములు జననం.1925 : తెలుగు కథను సుసంపన్నం చేసిన రచయిత మునిపల్లె రాజు జననం.
1928 : రేడియో వ్యాఖ్యాత మరియు సాహిత్య రచయిత ఉషశ్రీ జననం.
1935 : నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త జాన్ జేమ్స్ రికర్డ్ మెక్లియాడ్ మరణం.
1953 : అమెరికన్ సాఫ్టువేర్ స్వేచ్ఛ కార్యకర్త మరియు కంప్యూటర్ ప్రోగ్రామర్ రిచర్డ్ స్టాల్‌మన్ జననం.
1969 : బార్బడస్ కు చెందిన వెస్ట్‌ఇండీస్ జట్టు మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఓటిస్ గిబ్సన్ జననం.
1993 : శాస్త్రీయ మరియు లలిత సంగీత గాయకురాలు శ్రీరంగం గోపాలరత్నం జననం.
మార్చి 17
ప్రపంచ వికలాంగుల దినోత్సవం763 : ప్రఖ్యాతిగాంచిన అబ్బాసీయ ఖలీఫా హారూన్ రషీద్ జననం.
1892 : ప్రముఖ కవి రాయప్రోలు సుబ్బారావు జన్మించాడు.
1896 : పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధుడు మందుముల నరసింగరావు జననం.
1962 : ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి మరియు వ్యొమనౌక యంత్ర నిపుణురాలు కల్పనా చావ్లా జననం.
1963 : వెస్టీండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు రోజర్ హార్పర్ జననం.
1975 : పంజాబీ గాయకుడు-పాటల రచయిత, నటుడు, మరియు నిర్మాత బబ్బూ మన్ జననం.
1982 : కేరళలో రాష్ట్రపతి పాలన
1990 : ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ సాధించిన తొలి మహిళ సైనా నెహ్వాల్ జననం.
మార్చి 18
భారత ఆయుధ కర్మాగారాల దినోత్సవం.1858 : రుడ్ఫోల్ఫ్ డీసెల్, జర్మన్ ఆవిష్కర్త జననం (మరణం:1913).
1871 : భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత మరియు తర్క శాస్త్రవేత్త అగస్టస్ డీ మోర్గాన్ మరణం (జననం:1806).
1922 : మహత్మా గాంధీ కి, శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు, 6 సంవత్సరముల జైలు శిక్ష విధించబడింది.
1837 : అమెరికా మాజీ అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్‌లాండ్ జననం (మ.1908).
1938 : ప్రముఖ చలన చిత్ర నటుడు శశి కపూర్ జననం.
1965 : అలెక్షీ లియనోవ్ అనే రోదసీ యాత్రికుడు తన అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిముషాలు బయటకు వచ్చి, అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు.
మార్చి 19
1900 : ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫెడ్రిక్ జోలియట్ జననం.(మరణం.1958)1952 : తెలుగు సినిమా నటుడు మోహన్ బాబు జననం.
1954 : ప్రముఖ భారత విద్యావేత్త ఇందూ షాలిని జననం.
1955 : అమెరికన్ నటుడు, నిర్మాత మరియు సంగీతకారుడు బ్రూస్ విల్లీస్ జననం.
1966 : ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి.చదలవాడ ఉమేశ్ చంద్ర జననం.
1982 : ఆచార్య జె.బి.కృపలానీ మరణం.
1984 : భారత దేశంలో ప్రముఖ సినీ నటి తనూశ్రీ దత్తా జననం.
2008 : ప్రముఖ సినీనటుడు రఘువరన్ మరణం.(జననం.1958)
మార్చి 20
1351 : ఢిల్లీ సుల్తాను ముహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం.1602 : డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడినది.
1726 : ప్రముఖ శాస్త్రవేత్త, సర్ ఐజాక్ న్యూటన్ మరణం. (జననం;1642)
1855 : మొట్టమొదట సిమెంట్ ను కనుగొన్న జె.ఏస్పిడిన్ మరణం..(జ.1788)
1951] : భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు మదన్‌లాల్ జననం.
1966 : భారత గాయకురాలు అల్కా యాగ్నిక్ జననం.
2008: తెలుగు సినీ నటుడు శోభన్ బాబు మరణం.
2010 : నేపాల్ మాజీ ప్రధానమంత్రి గిరిజాప్రసాద్ కొయిరాలా మరణం
మార్చి 21
అంతర్జాతీయ ఎర్త్ డే (భూగోళ దినోత్సవము)ప్రపంచ జాతి వివక్ష నిర్మూలనా దినం
ప్రపంచ అటవీ దినోత్సవం
భూమిపై పగలు రాత్రి సమయాలు సరిసమానంగా ఉండే రోజు.
1768: ఫ్రాన్స్ కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త జోసెఫ్ ఫోరియర్ జననం (మ.1830).
1916: ప్రముఖ సెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జననం (మరణం:2006).
1923: సహజ యోగ సంస్థ ప్రారంభకురాలైన భారత మహిళ నిర్మల శ్రీవాత్సవ జననం (మరణం:2011).
1978: ప్రముఖ భారత సినీనటి రాణీ ముఖర్జీ జననం.
1990 : దక్షిణాఫ్రికా పాలనలో 75 సంవత్సరములు గల నమీబియా కు స్వాతంత్ర్యం.
మార్చి 22
ప్రపంచ జల దినోత్సవం1739 : నాదిర్షా ఢిల్లీ ని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు.
1868 : అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ (మరణం1953)
1946 : బ్రిటిష్ పరిపాలనలో గల జోర్డాన్ కు స్వాతంత్ర్యం లబించింది.
1957 : భారత ప్రభుత్వం శకసంవత్సరాన్ని జాతీయ సంవత్సరంగా స్వీకరించింది.
1960 : ఆర్థర్ లియొనార్డ్ మరియు చార్లెస్ హెచ్ టౌన్స్ లు లేజర్ పై మొదటి పేటెంట్ హక్కులు పొందారు.
1982 : నాసా యొక్క స్పేస్ షటిల్ "కొలంబియా" కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగింపబదినది.
2000 : భారత కృత్రిక ఉపగ్రహం ఇన్సాట్-3బి ప్రయోగం విజయవంతం.
2007 : ప్రముఖ భారత తత్వవేత్త ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి మరణం. (జననం:1918)
2009: తెలుగు సినిమా నటుడు తాడేపల్లి లక్ష్మీ కాంతారావుమరణం.
మార్చి 23
ప్రపంచ వాతావరణ దినోత్సవం1749 : ప్రముఖ ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త,ఖగోళ శాస్త్రవేత్త పియరీ సైమన్ లాప్లాస్ జననం. (మ.1827)
1893 : భారత దేశ ప్రముఖ ఆవిష్కర్త,ఇంజనీర్ జి.డి.నాయుడు జననం. (మరణం:1974)
1910: ప్రముఖ సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త రాంమనోహర్ లోహియా జన్మించాడు.
1931 : భారత స్వాతంత్ర్యోద్యమంలో కృషి చేసిన భగత్ సింగ్(జ. 1907),రాజ్ గురు(జ. 1908) మరియు సుఖ్ దేవ్(జ. 1907) లు ఉరి తీయబడ్డారు.
1942 : రెండవ ప్రపంచ యుద్ధంలో హిందూ మహాసముద్రములో అండమాన్ దీవులను జపనీయులు ఆక్రమించుకున్నారు.
1956 : ప్రపంచంలో మొదటి ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంగా పాకిస్తాన్ అవతరించింది.(పాకిస్థాన్ గణతంత్ర దినోత్సవం)
1992: ప్రముఖ ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ హేయక్ మరణం.
1994: కపిల్ దేవ్ చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన రోజు
మార్చి 24
1603 : 44 సంవత్సరాలు పాలించిన బ్రిటిషు మహారాణి ఎలిజబెత్ మరణం.1775 : భారత దేశానికి చెందిన ప్రముఖ కవి, రచయిత,వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులుజననం(మ.1835)
1882 : క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్‌క్యులాసిస్ ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
1977 : భారత ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ నియమితుడైనాడు.
1984 : భారత హాకీ క్రీడాకారుడు ఆడ్రియన్ డీసౌజా జననం.
1896 : చరిత్రలో మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఎ.ఎస్.పోపోవ్ సృష్టించాడు.
1998 : భారత లోక్‌సభ స్పీకర్‌గా జి.యమ్.సి.బాలయోగి పదవిని స్వీకరించాడు.
2008 : ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణకోసం ఏర్పాటు చేసిన సంఘం), తన నివేదికను ఈ రోజున ఆర్ధిక శాఖామంత్రికి సమర్పించింది.
మార్చి 25
1655 : శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం అయిన టైటాన్ ను క్రిస్టియాన్ హైగెన్స్ కనుగొన్నాడు.1914 : అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్జననం.
1927 : పాండిచ్చేరి రాస్ట్రానికి 13 వ ముఖ్యమంత్రి పి.షణ్ముగం జననం.(మరణం.2013)
1983 : ప్రముఖ పాత్రికేయుడు మణికొండ చలపతిరావు మరణం.
1992 : మిర్ అంతరిక్ష కేంద్రములో 10 నెలలు గడిపిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త సెర్జీ క్రికాలేవ్ భూమి పైకి చేరారు.
2008 : పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజా గిలానీ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు.
మార్చి 26
1875 : జర్మన్ భౌతిక శాస్త్రవేత్త మాక్స్ అబ్రహమ్ జననం.(మరణం. 1922)1933 : ప్రముఖ రచయిత ఆచార్య కుబేర్ నాథ్ రాయ్ జననం.
1971 : పాకిస్థాన్ నుండి తూర్పు పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొంది బంగ్లాదేశ్ గా అవతరించింది.(బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం)
2000: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యాడు.
2006 : ప్రముఖ రాజకీయవేత్త అనిల్ బిశ్వాస్ మరణం.(జననం.1944)
2006 : తెలుగు సినీ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుమరణం.
2008: భూటాన్ లో తొలిసారిగా జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో గెలిచి జిగ్మీ ధిన్లే ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.
మార్చి 27
ప్రపంచ రంగస్థల దినోత్సవం1845 : ఎక్స్ కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత, విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ జననం.(మరణం.1923)
1903 : ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు హెచ్.వి.బాబు జననం.
1968 : అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవునిగా చరిత్రకెక్కిన యూరీ గగారిన్ మరణం.
1981 : భారత బాక్సింగ్ క్రీడకారుడు అఖిల్ కుమార్ జననం.
1998 : ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు వయాగ్రా మందును మగవారి నరాలబలహీనత కు ఔషధంగా ధ్రువీకరించారు.
1898 : భారత విద్యావేత్త, ముస్లిం తత్వవేత్త, సామాజిక వేత్త మరియు రాజకీయవేత్త సయ్యద్ అహ్మద్ ఖాన్ మరణం. (జననం.1817)
2008: వికీపీడియా లో 10వ మిలియన్ వ్యాసం వ్రాయబడినది.
మార్చి 28
1552 : భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ మరణించారు. (జననం.1504)1868: ప్రసిద్ధ రష్యను రచయిత మాక్సిం గోర్కీ జన్మించాడు.
1904: ప్రముఖ నటుడు చిత్తూరు నాగయ్య జన్మించాడు.
1915: సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు జన్మించాడు.
1955: ఆంధ్ర రాష్ట్ర్రంలో రాష్ట్రపతి పాలన ముగింపు
1955:స్వాతంత్ర్య సమరయోధులు బెజవాడ గోపాల రెడ్డి ఆంధ్ర రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం.
2006 : భారత తత్వవేత్త వేథాత్రి మహర్షి మరణం. (జననం. 1911)
మార్చి 29
1790: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ టేలర్ జననం.1857: మొదటి భారత స్వాతంత్ర్య పోరాటం -సిపాయిల తిరుగుబాటు.
1952 : ప్రముఖ రచయిత కె.ఎన్.వై.పతంజలి జననం.
1953 : హైదరాబాదు రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జమలాపురం కేశవరావు జననం.
1982: తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించాడు.
1997 : భరతదేశ ప్రముఖ కళాకారిణి మరియు రచయిత్రి పుపుల్ జయకర్ మరణం.
మార్చి 30
1842 : ఈథర్ ను మత్తుమందుగా అమెరికన్ శస్త్రవైద్యుడు డా. క్రాఫోర్డ్ లాంగ్ మొదటిసారిగా ఉపయోగించాడు.1867 : అలాస్కా ను రష్యా నుండి అమెరికా కొనుగోలు చేసింది.
1908 : సుప్రసిద్ధ భారతీయ నటి మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దేవికారాణి జననం.
1935 : ప్రముఖ తెలుగు సాహితీకారుడు తంగిరాల వెంకట సుబ్బారావు జననం.
1953 : ప్రముఖ స్వాతంత్ర్య పోరాట యోధుడుజమలాపురం కేశవరావు మరణం.
1983 : ప్రముఖ భారతీయ నటుడు నితిన్ జననం.
2002 : ప్రముఖ సంగీత దర్శకుడు ఆనంద్ బక్షీ మరణం.(b. 1930)
2005 : ఒ.వి.విజయన్, భారత దేశ రచయిత, కార్టూనిస్ట్ మరణం. (జననం.1930)
2011 : ప్రసిద్ది చెందిన హాస్య నటుడు మరియు ప్రతినాయకుడు నూతన్ ప్రసాద్ మరణం.
మార్చి 31
1727 : భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ మరణం (జ.1643).1919 : హైదరాబాదు లో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయింది.
1928 : పాలమూరు జిల్లాకు చెందిన కవులలో ప్రముఖుడు కపిలవాయి లింగమూర్తి జననం.
1933 : ప్రముఖ నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణ జననం (మ.2011).
1959 : 14 వ దలైలామా, టెన్‌జిన్ జియాట్సో భారత సరిహద్దును దాటి భారత్ వచ్చాడు.
1972 : భారత చలనచిత్ర నటీమణి మీనా కుమారి మరణ (జననం.1932)
1987 : ప్రముఖ చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి జననం.
1995 : మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి, నర్తకి సెలీనా మరణం (జ.1971)
No comments:
Post a Comment