జూన్ 1
1874 : ఈస్టిండియా కంపెనీ రద్దు అమలులోకి వచ్చినది.1930 : భారత్‌లో మొదటి డీలక్స్ రైలు (దక్కన్ క్వీన్) బొంబాయి - పూణేల మధ్య ప్రారంభించబడింది.
1955 : అస్పృశ్యతను (అంటరానితనం) నేరంగా పరిగణించే చట్టం అమలులోకి వచ్చింది.
1964 : నయాపైసా, పైసాగా మార్చబడింది.
1964 : తెలుగు సినిమా దర్శకుడు, నటుడు, సంగీతదర్శకుడు, కథారచయిత, నిర్మాత, గాయకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి జననం.
1968 : అంధ మరియు బధిర అమెరికన్ రచయిత్రి, ఉద్యమకర్త హెలెన్ కెల్లర్ మరణం.(జ.1880)
1975 : ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లీశ్వరి జననం.(చిత్రంలో)
1996 : ఆరవ భారత రాష్ట్రపతి, నీలం సంజీవరెడ్డి మరణం (జ.1913).
2001 : నేపాల్ రాజప్రాసాదం లో రాకుమారిడి ఊచకోత.
జూన్ 2
1889 : ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జననం (మ.1928).1897 : చారిత్రక పరిశోధకుడు కొత్త భావయ్య జననం.
1896 : ఇటలీకి చెందిన మార్కోనీ రేడియో ను కనుగొన్నాడు.
1943 : భారత ప్రముఖ గాయకుడు, సినిమా గీత రచయిత, సంగీత దర్శకుడు ఇళయరాజా జననం.(చిత్రంలో)
1956 : భారత దేశ ప్రముఖ సినిమా దర్శకుడు మణిరత్నం జననం.
1988 : భారత దేశ ప్రముఖ హిందీ నటుడు, దర్శకుడు మరియు నిర్మాత రాజ్‌కపూర్ మరణం (జ .1924)
1988 : తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నేపథ్య గాయకుడు హేమచంద్ర జననం.
1995 : ప్రముఖ వైద్య నిపుణురాలు డా.హర్షిత చౌదరి జననం.
2014 : భారత దేశంలో 10 జిల్లాలతో కూడిన 29 వ రాష్ట్రంగా తెలంగాణ అవతరణ.
2014 : భారత దేశంలో 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ.
జూన్ 3
1578 : రక్తప్రసరణ వ్యవస్థను కనుగొన్న బ్రిటిషు వైద్యుడు విలియం హార్వే జననం (మ. 1657).1924 : తమిళనాడు 15 వ ముఖ్యమంత్రి కరుణానిధి జననం.
1929 : గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి చిమన్‌భాయి పటేల్ జననం (మ.1994).
1930 : భారత రాజకీయవేత్త జార్జి ఫెర్నాండెజ్ జననం.
1965 : భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు సురీందర్ ఖన్నా జననం.
1972 : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు టి. హరీశ్ రావు జననం.(చిత్రంలో)
1984 : అమృత్‌సర్ నందు గల సిక్కుల ప్రసిద్ధ దేవాలయం స్వర్ణదేవాలయం లో ఆపరేషన్ బ్లూస్టార్ మొదలైనది. ఇది జూన్ 6 వరకు జరిగినది.
1989 : ఇరానీ మతనాయకుడు మరియు పండితుడు ఆయతొల్లాహ్ ఖొమైనీ జననం.
2011 : కష్టే ఫలీ అనే నానుడి నిజము చేసిన గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త కరుటూరి సూర్యారావు మరణం.
జూన్ 4
1798 : ఇటలీ లోని వెనిస్ కు చెందిన ఒక సాహసికుడు గియాకోమో కాసనోవా మరణం.1934 : రేడియం మూలకాన్ని కనుగొన్న మహిళా శాస్త్రవేత్త మేరీ క్యూరీ మరణం (జ.1867).
1941 : భారత దేశ ఆర్గానిక్ కెమిస్ట్రీ శాస్త్రవేత్త దర్శన్ రంగనాథన్ జననం.
1944 : సుప్రసిద్ధ శాస్త్రవేత్త మరియు పత్రికా సంపాదకులు కిడాంబి రఘునాథ్ జననం.
1998 : ప్రముఖ తెలుగు కవి, పరిశోధకుడు ఆరుద్ర మరణం (జ.1925).
1946 : ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం జననం.(చిత్రంలో)
1984 : ప్రముఖ భారతీయ నటి, జాతీయ ఉత్తమ నటి పురస్కార విజేత ప్రియమణి జననం.
2004 : భారత లోక్‌సభ సభాపతిగా సోమనాధ్ చటర్జీ పదవిని స్వీకరించాడు.
2006 : ప్రసిద్ధ భాషావేత్త బూదరాజు రాధాకృష్ణ మరణం (జ.1932).
జూన్ 5
అంతర్జాతీయ ప్రపంచ పర్యావరణ దినోత్సవం1908 : భారత సంఘ సంస్కర్త, కమ్యూనిస్టు పార్టీ సహ స్థాపకుడు రావి నారాయణరెడ్డి జననం.(మ. 1991)(చిత్రంలో)
1910 : ప్రఖ్యాత అమెరికన్ రచయిత ఓ.హెన్రీ మరణం.
1932 : భారతీయ మహిళా శాస్త్రవేత్తల సంఘం నకు మొదటి అధ్యక్షులు సుమతి భిడే జననం.
1934 : భారత పార్లమెంటు సభ్యురాలు మరియు సంఘ సేవిక చెన్నుపాటి విద్య జననం.
1961 : భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రమేశ్ కృష్ణన్ జననం.
1968 : ప్రముఖ తెలుగు సినిమా ఛాయాగ్రాహకుడు మూరెళ్ల ప్రసాద్ జననం.
1977 : మొదటి వ్యక్తిగత కంప్యూటర్ "ఆపిల్ 2" అమ్మకమునకు విడుదల.
1995 : బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్ ను మొదటి సారి సృష్టించారు.
1996 : భారతీయ రచయిత ఆచార్య కుబేర్‌నాథ్ రాయ్ (జ. 1933)
జూన్ 6
స్వీడన్ జాతీయదినోత్సవం.1674 : మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ కి పట్టాభిషేకం జరిగిన రోజు.
1799 : ఆధునిక రష్యా సాహిత్యానికి పితామహుడు అలెగ్జాండర్ పుష్కిన్ జననం.
1891 : ప్రముఖ కన్నడ రచయిత మాస్తి వెంకటేశ అయ్యంగార్ జననం.
1902 : ప్రసిద్ధ ఇంజనీరు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపకర్త కె.ఎల్.రావు జననం.(మ.1986)
1909 : స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు రాజకీయ నాయకురాలు చోడగం అమ్మన్నరాజా జననం.
1915 : భారత కమ్యూనిస్టు నేత చండ్ర రాజేశ్వరరావు జననం.(మ.1994)(చిత్రంలో)
1928 : ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు మొదటి ప్రచురణ జేమ్స్ ముర్రే సంపాదకత్వంలో వెలువడింది.
1929 : భారత సినిమా నటుడు,రాజకీయవేత్త సునీల్‌దత్ జననం. (మ. 2005)
1946 : అమెరికన్ నటుడు, చిత్ర నిర్మాత, రచయిత, సినిమా దర్శకుడు సిల్వెస్టర్ స్టాలోన్ జననం.
జూన్ 7
632: ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ ప్రవక్త మదీనాలో పరమపదించాడు. ఆయన తరువాత కాలిఫ్ అభు బకర్ ఆయన బాధ్యతలు స్వీకరించాడు.1893: గాంధీజీ మొట్టమొదటి సహాయ నిరాకరణ.
1966: మాజీ హాలీవుడ్ సినిమా నటుడు, రోనాల్డ్ రీగన్ 33వ కాలిఫోర్నియా గవర్నరు అయ్యాడు.
1974 : భారత టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి జననం.
1979: భాస్కర-1 అనే భారతీయ ఉపగ్రహం ప్రయోగించబడింది.
1991: అగ్ని పర్వతం పినతూబో పేలి, 7 కి.మీ (4.5 మై) ఎత్తుకు బూడిద చిమ్మింది.
2002 : భారత రాజకీయ వేత్త , 5 వ ఉప రాష్ట్రపతి బసప్ప దానప్ప శెట్టి మరణం (జ. 1912)
2011 : ప్రముఖ నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణ మరణం.(జ.1933).
జూన్ 8
1936 : భారతదేశపు సివిల్ రేడియో నెట్‌వర్కుకు ఆలిండియా రేడియో గా నామకరణం చేశారు.1948 : భారత ఇంగ్లాండు మధ్య విమాన రాకపోకలు ప్రారంభమైనవి. భారతదేశము నుండి విదేశాలకు విమాన ప్రయాణాలకు ఇదే నాంది.
1957 : భారత హిందీ సినిమా నటి డింపుల్ కపాడియా జననం.
1958 : ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్వీడన్ లో ప్రారంభమయ్యాయి.
1975 : భారత హిందీ సినిమా నటి శిల్పా శెట్టి జననం.
జూన్ 9
1900 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా బ్రిటిష్ జైలులో అనూహ్యమైన రీతిలో మరణం.1949 : భారత దేశ ప్రముఖ మహిళా పోలీసు అధికారి, సామాజిక కార్యకర్త కిరణ్‌బేడీ జననం.
1964: భారత ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి నియమితుడైనాడు.
1995: భారత స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య ఎన్.జి.రంగా మరణం.
2011:అంతర్జాతీయంగా ప్రఖ్యాతులున్న భారతీయ చిత్రకారుడు ఎమ్.ఎఫ్. హుస్సేన్ గుండెపోటుతో మరణం.
జూన్ 10
పోర్చుగల్ జాతీయదినోత్సవంసమయపాలనను ఖచ్చితంగా అమలుజరపటం కోసం జపాన్ లో సమయపాలన దినం గా పాటిస్తారు.
1928: చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన భారత స్వాతంత్ర్యసమరయోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మరణం (జ.1889).
1938 : ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త రాహుల్ బజాజ్ జననం.
1960 : తెలుగు సినిమా నటుడు నందమూరి బాలకృష్ణ జననం.
1966: భారత వాయుసేనకు సంబంధించిన రష్యన్ మిగ్ విమానాల తయారీ నాసిక్ లో ప్రారంభమయ్యింది.
1998: ప్రపంచ కప్పు ఫుట్‌బాల్ పోటీలు ఫ్రాన్సు లో ప్రారంభమయ్యాయి.
జూన్ 11
1866 : ప్రస్తుత అలహాబాదు హైకోర్టు (ఆగ్రా హైకోర్టుగా) స్థాపించబడినది.1920 : నేపాల్ రాజుగా పనిచేసిన మహేంద్ర. జననం.
1935 : అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని అల్పైన్ నగరంలో మొట్టమొదటిసారిగా ఎడ్విన్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే శాస్త్రజ్ఞుడు ఎఫ్.ఎమ్ రేడియో ప్రసారాన్ని ప్రజలకు ప్రదర్శించాడు.
1947 : బీహార్ రాజకీయ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ జననం.
1963 : బౌద్ధ భిక్షువులపై జరుగుతున్న అమానుష దాడులకు నిరసనగా దక్షిణ వియత్నాంలోని సైగాన్ పట్టణపు కూడలిలో టాయ్ క్వాంగ్ డుచ్ అనే బౌద్ధ భిక్షువు నిప్పంటించుకొని నిలువునా దహనమయ్యాడు.
1988 : సాధారణ ప్రజా లైసెన్సు (GPL) అనే పేరును మొట్టమొదటిసారి ఉపయోగించడం జరిగింది
1998 : తొమ్మిది బిలియన్ల అమెరికా డాలర్ల ఖర్చుతో కాంపాక్ కంప్యూటరు కంపెనీ, డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పోరేషనును కొనుగోలు చేసింది.
2001 : ఓక్లహోమా బాంబు దాడిలో నిందితుడు టిమోతీ మెక్‌వీకు మరణశిక్ష అమలుపరిచారు.
జూన్ 12
1898 : స్పెయిన్ దేశం నుండి ఫిలిప్పీన్స్‌కు విముక్తి, ఫిలిప్పీన్స్ స్వాతంత్ర్య దినం.1902 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు పాలకోడేటి శ్యామలాంబ జననం.(మ.1953)
1957 : ప్రముఖ పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు జావెద్ మియాందాద్ జననం.
1964 : దక్షిణ ఆఫ్రికాలో నెల్సన్ మండేలాకు జీవిత ఖైదు విధించబడింది.
1987 : కోల్డ్ వార్: బెర్లిన్ గోడను పగలగొట్టమని అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ బహిరంగంగా మిఖయిల్ గోర్బచెవ్ కు సవాల్ విసిరాడు.
1987 : 13 సంవత్సరాల కౄర పాలనకు శిక్షగా మధ్య ఆఫ్రికా మహారాజు జీన్-బెడెల బొకాస్సాకు మరణశిక్ష విధించబడింది.
1996 : భారత లోక్‌సభ స్పీకర్‌గా పి.యన్.సంగ్మా పదవిని స్వీకరించాడు.
1999 : ఆంధ్ర ప్రదేశ్ 6 వ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మరణం.(జ.1921)
జూన్ 13
1831 : ప్రముఖ భౌతిక, గణిత శాస్త్రవేత్త జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్ జననం (మ.1879)1889 : సాలార్‌జంగ్ మ్యూజియం యొక్క ప్రధాన సేకరణ కర్త అయిన మీర్ యూసుఫ్ అలీఖాన్ (మూడవ సాలార్‌జంగ్) జన్మించాడు (మ.1949).
1954 : సుమారు రెండు శతాబ్దాల ఫ్రెంచిపాలన నుండి యానాం విమోచనం చెందింది.
1965 : భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు మణీందర్ సింగ్ జననం.
1893 : మొదటి మహిళల గోల్ఫ్ ఛాంపియన్‌షిప్ రాయల లీథం అనే చోట నిర్వహించబడింది.
1937 : ప్రముఖ కంప్యూటర్ శాస్త్రవేత్త మరియు టూరింగ్ అవార్డు గ్రహీత డా.రాజ్ రెడ్డి జననం.
జూన్ 14
1956 : తొలి తెలుగు సినీ గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, మరియు నాటకకర్త చందాల కేశవదాసు మరణం.(జ.1876)1900 : హవాయి అమెరికాలో ఒక భాగమయ్యింది.
1926 : అమెరికన్ చిత్రకారిణి మరియు ముద్రణాకర్త మేరీ కస్సట్ మరణం.
1928 :దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు మరియు రాజకీయ నాయకుడు చే గెవారా జననం.(మ.1967)
1938 : మొట్టమొదటి సూపర్‌మ్యాన్ పుస్తకము విడుదలయ్యింది.
1967 : భారతీయ పారిశ్రామికవేత్త. ఇతను ఆదిత్య బిర్లా గ్రూప్ (వ్యాపార సముదాయం) అధ్యక్షుడు కుమార్ మంగళం బిర్లా జననం.
1969 : జర్మనీకి చెందిన ఒక మాజీ ప్రపంచ నంబర్ 1 టెన్నిస్ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్ జననం.
1982: ఫాక్ లేండ్ దీవులు, సౌత్ జార్జియా, సౌత్ సాండ్ విచ్ దీవుల లిబరేషన్ రోజు.
2005: ప్రపంచ రక్త దాతల రోజు;
జూన్ 15
1884 : బ్రిటీష్ వ్యతిరేక బెంగాలీ భారతీయ విప్లవాత్మక మరియు అంతర్జాతీయ విద్వాంసుడు తారక్‌నాథ్ దాస్ జననం.1890 :భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రసిద్ధ జాతీయవాది, బహుభాషా కోవిదుడు ఈడ్పుగంటి రాఘవేంద్రరావు జననం.(మ.1942]]
1916: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత హెర్బర్ట్ సైమన్ జననం.
1924 : ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు ద్వారం భావనారాయణ రావు జననం.(మ.2000)
1937 : భారతీయ సామాజిక కార్యకర్త అన్నా హజారే జననం.
1948 : సుప్రసిద్ద దక్షిణాది సినిమా నటి జయమాలిని జననం.
1980 :తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు చక్రి జననం.
1983 : తెలుగు జాతి గర్వించే మహాకవి శ్రీశ్రీ మరణం
జూన్ 16
1723 : అర్థశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన ఆడం స్మిత్ జననం.(మ.1790)1870 : ప్రముఖ బెంగాలీ న్యాయవాది మరియు స్వాతంత్ర్యోద్యమ నేత, దేశబంధుగా ప్రసిద్ధి చెందిన చిత్తరంజన్ దాస్ జననం.(మ.1925)
1903 : సుప్రసిద్ధ ప్రసార ప్రముఖులు, చిత్రకారులు ఆచంట జానకీరాం జననం.(మ.1994)
1917 : ప్రముఖ తెలుగు కవి, పండితుడు మరియు అష్టావధాని నముడూరు అప్పలనరసింహం జననం.(మ.1986)
1944 : బెంగాలీ విద్యావేత్త మరియు ప్రసిద్ధ రసాయన శాస్త్రజ్ఞుడు ప్రఫుల్ల చంద్ర రాయ్ మరణం(జ.1861)
1963 : లెఫ్టినెంట్ వాలెంతినా తెరిష్కోవా తన 26వ ఏట, మొట్టమొదటి మహిళా రోదసీ యాత్రికురాలు గా (రోదసీలోనికి వెళ్ళిన 5వ వ్యక్తి), వోస్తోక్-6 (రోదసీ నౌక పేరు) లో, రోదసీలోనికి ప్రయాణించింది.
1994 : భారత దేశ ప్రముఖ గాత్ర కళాకారిణి ఆర్య అంబేద్కర్ జననం.
2001: దేవాదుల ప్రాజెక్టు కు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశాడు.
జూన్ 17
1832 : బ్రిటిషు భౌతిక మరియు రసాయన శాస్త్రవేత్త విలియం క్రూక్స్ జననం(మ.1919).1858: ఝాన్సీ మహారాణిగా పేరుగాంచిన రాణీ లక్ష్మీబాయి మరణం (జ.1828).
1911 : భారతీయ తమిళ స్వాతంత్ర్య కార్యకర్త వంఛినాథన్ మరణం(జ.1886).
1946: ప్రసిద్ధ తెలుగు రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం మరణం(జ.1867).
1957 : పాతతరం తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు ఓగిరాల రామచంద్రరావు మరణం(జ.1905).
1973 : భారత టెన్నిసు క్రీడాకారుడు లియాండర్ పేస్ జననం.
1980 : అమెరికాకు చెందిన అగ్రశ్రేణి టెన్నిసు క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ జననం.
జూన్ 18
పితృ దినోత్సవం (ఫాదర్స్ డే)1868 : ప్రముఖ రష్యన్ రచయిత మాక్సిం గోర్కీ జననం (మ.1936).
1929 : సుప్రసిద్ధ పండితుడు, కవి మరియు విమర్శకుడు వేదం వేంకటరాయ శాస్త్రి మరణం(జ.1853).
1953 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు పాలకోడేటి శ్యామలాంబ మరణం (జ.1902).
1983 : ప్రపంచకప్ క్రికెట్ లో కపిల్ దేవ్ జింబాబ్వే పై 175 పరుగులు సాధించి ఒక రోజు క్రికెట్‌లో భారత్ తరఫున తొలి శతకాన్ని నమోదుచేశాడు.
1986 : ప్రముఖ సాహితీవేత్త, పరిశోధకుడు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం మరణం (జ.1908).
2006 : మొదటి కజక్ దేశపు ఉపగ్రహం 'కజ్ శాట్' ప్రయోగించారు.
జూన్ 19
1947 : ఆంగ్ల రచయిత బొంబాయి లో సల్మాన్ రష్దీ జననం.1961 : యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటను) నుంచి కువాయిట్ స్వాతంత్ర్యం పొందింది.
1970 : భారతదేశ రాజకీయనాయకుడు మరియు భారతదేశ పార్లమెంట్ లో సభ్యుడు రాహుల్ గాంధీ జననం.
1966 : ముంబయ్ (బొంబాయి) లో శివసేన అనే ప్రాంతీయ రాజకీయ పార్టీని స్థాపించారు.
1981 : భారత్ తొలి జియోస్టేషనరీ కమ్యూనికేషన్ శాటిలైట్ అయిన ఆపిల్ ను ఫ్రెంచి గయానా నుండి ప్రయోగించింది.
1985 : సినీనటి కాజల్ అగర్వాల్ జననం
2001 : సినీ రచయిత ,దర్శకుడు, హాస్య బ్రహ్మ జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి మరణం (జ.1951).
జూన్ 20
ప్రపంచ శరణార్థుల దినోత్సవం.1876 : తొలి తెలుగు సినీ గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, మరియు నాటకకర్త చందాల కేశవదాసు జననం(మ.1956).
1939 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రమాకాంత్ దేశాయ్ జననం.
1945: నోబెల్ శాంతి గ్రహీత అంగ్ సాన్ సూక్యీ జననం.
1952 : భారతీయ ఆంగ్ల నవలా రచయిత, కవి మరియు పద్మశ్రీ పురస్కార గ్రహీత విక్రమ్ సేఠ్ జననం.
1889: చీరాల-పేరాల ఉద్యమనేత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జననం (మ.1928).
1957: సోవియట్ రష్యా తొలి ఉపగ్రహం స్పుత్నిక్ 1 ని అంతరిక్షంలోకి పంపింది.
1987: ప్రముఖ భారత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ మరణం (జ.1896).
2003: వికీమీడియా ఫౌండేషన్ స్థాపన.
జూన్ 21
ప్రపంచ సంగీత దినోత్సవం1527 : తత్వవేత్త, రచయిత మరియు ఇటలీకి చెందిన రాజకీయవేత్త మాకియవెలీ మరణం(జ.1469).
1768 : ఫ్రాన్సు కు చెందిన భౌతిక మరియు గణిత శాస్త్రవేత్త జోసెఫ్ ఫోరియర్ జననం(మ.1830).
1940 : హిందూ జాతీయవాద సంస్థ అయినటువంటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్.యస్.యస్.) వ్యవస్థాపకుడు కె.బి.హెడ్గేవార్ మరణం(జ.1889).
1948 : చక్రవర్తి రాజగోపాలాచారి భారతదేశానికి చివరి గవర్నరు జనరల్ గా నియమితుడైనాడు.
1953 : పాకిస్తాన్ యొక్క మొదటి మరియు నేటి వరకు ఏకైక మహిళా ప్రధాన మంత్రి బెనజీర్ భుట్టో జననం(మ.2007).
2011: తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ మరణం (జ.1934).
జూన్ 22
1932 :ప్రముఖ భారత సినిమా నటుడు అమ్రీష్ పురి జననం(మ.2005).1940 : సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు.
1952 : విశాలాంధ్ర, తెలుగు దినపత్రిక ప్రారంభమైనది.
1969 : అమెరికాకు చెందిన సుప్రసిద్ధ నటి, గాయకురాలు మరియు అభినేత్రి జూడీ గార్లాండ్ మరణం(జ.1922).
1975 :ప్రముఖ దేశ సేవకుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు అన్నే అంజయ్య మరణం(జ.1905).
2008 :అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు, మరియు రచయిత జార్జ్ కార్లిన్ మరణం(జ.1937).
జూన్ 23
1696 : ప్రపంచంలో మొట్టమొదటి సాయంకాలపు దినపత్రిక 'డాక్స్ న్యూస్' వెలువడింది.1935: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు జననం.
1953 : జన సంఘ్ పార్టీ స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ లో చెరసాలలో మరణం (జ. 1901).
1937 : ప్రముఖ భావకవి మరియు నాటికా రచయిత కొంపెల్ల జనార్దనరావు మరణం(జ.1907).
1980 : భారత మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి మరణం(జ.1894).
1980 : సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణం (జ.1948 ).
1980 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు రాంనరేష్ శర్వాన్ జననం.
1985 : భారతదేశానికి చెందిన చర్మ సాంకేతిక శాస్త్రవేత్త వై.నాయుడమ్మ కనిష్క విమాన ప్రమాదంలో మరణం (జ. 1922).
జూన్ 24
1902 : ప్రఖ్యాత సినిమా దర్శకుడు మరియు సంపాదకుడు గూడవల్లి రామబ్రహ్మం జననం(మ.1946).1915 : ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాలగుమ్మి పద్మరాజు జననం(మ.1983).
1927 : ప్రముఖ తమిళ కవి మరియు భావకవి కన్నదాసన్ జననం (మ.1981).
1963 : భారత తంతి తపాళా శాఖవారు టెలెక్స్ సేవలను ప్రారంభించారు.
1964 : దక్షిణ భారత సినీ రంగంలో విశ్వ నట భారతి గా వినుతికెక్కిన విజయశాంతి జననం.
జూన్ 25
1903 : ప్రసిద్ధి చెందిన ఆంగ్ల రచయిత మరియు పాత్రికేయుడు జార్జ్ ఆర్వెల్ జననం(మ.1950).1932 : భారత క్రికెట్ జట్టు మొట్టమొదటి ఆధికారిక క్రికెట్ టెస్టును లార్డ్స్ మైదానం లో ఆడింది.
1945 : ప్రముఖ తెలుగు సినిమా నటి శారద జననం.
1946 : ప్రపంచ బ్యాంకు ఏర్పాటై, కార్యకలాపాలు మొదలు పెట్టింది.
1950 : కొరియా యుద్ధం మొదలైనది.
1975 : భారతదేశంలో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి ని ప్రకటించింది.
1983 : భారత్ తొలిసారిగా క్రికెట్ లో ప్రపంచ కప్ (ప్రుడెన్షియల్ వరల్డ్ కప్) ను గెలుచుకుంది.
2009 : అమెరికాకు చెందిన ప్రముఖ సంగీత కళాకారుడు మైకల్ జాక్సన్ మరణం (జ.1958).
జూన్ 26
1966 : ప్రఖ్యాత ఆంగ్ల పాత్రికేయుడు రాజు నరిశెట్టి జననం.1980 : తెలుగు మరియు తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు ఉదయకిరణ్ జననం.(మ.2014)
2007 : ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము ప్రారంభం.
జూన్ 27
1838: వందేమాతర గీత రచయిత బంకించంద్ర ఛటర్జీ జననం (మ.1894).1880 : అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారధిగా ప్రపంచ స్థాయిలో పేరొందిన హెలెన్ కెల్లర్ జననం (మ.1968).
1950: కొరియా యుద్ధానికి అమెరికా తన బలగాన్ని పంపించడానికి నిశ్చయించుకుంది.
1955 : ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెవిన్ రైట్ జననం.
1967: ఇంగ్లాండు లోని ఎన్‌ఫీల్డ్ నగరంలో మొట్టమొదటి ఎ.టి.ఎం యంత్రాన్ని ప్రవేశపెట్టారు.
1979: ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ మహమ్మద్ ఆలీ వృత్తి నుండి తప్పుకున్నాడు.
2007: యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి గా టోని బ్లెయిర్ రాజీనామా చేసాడు. ప్రధాన మంత్రి బాధ్యతలను గోర్డన్ బ్రౌన్ స్వీకరించాడు.
2008 : సాహసోపేత భారత సైనికుడు, జాతీయ హీరో ఫీల్డ్ మార్షల్ మానెక్‌షా మరణం (జ.1914).
1978 : సహకార రంగానికి ఎనలేని సేవచేసిన జవ్వాది లక్ష్మయ్యనాయుడు మరణం (జ.1901).
జూన్ 28
1914 : ఆస్ట్రియా రాజు ఆర్చ్ డ్యూక్ ఫెర్డినాండ్ ను సెర్బియా దేశస్థుడు హత్యచేశాడు. ఈ సంఘటనే మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది.1921 : భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు, పాములపర్తి వెంకట నరసింహారావు జననం(మ.2004).
1931: ప్రముఖ తెలుగు చిత్ర రచయిత మరియు నిర్మాత ముళ్ళపూడి వెంకటరమణ జన్మించాడు (మ. 2011).
1969 : తెలుగులో ప్రచురించబడుతున్న వ్యవసాయదారుల సచిత్ర మాసపత్రిక అన్నదాత ప్రారంభం.
1972 : భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన పి.సి.మహలనోబిస్ మరణం(జ.1893).
1976 : భారతదేశానికి చెందిన ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు జస్పాల్ రాణా జననం.
2005 : భారతీయ పౌరసత్వ చట్టము అమలులోకి వచ్చింది.
జూన్ 29
1858: పనామా కాలువ ను కట్టిన ఇంజినీరు జార్జి వాషింగ్టన్ గోఎథల్స్ జననం (మ.1928).1879 : భారత రాజకీయనాయకుడు, బళ్ళారికి చెందిన దివ్యజ్ఞాన సమాజస్థుడు ఆర్కాట్ రంగనాథ మొదలియారు జననం (మ.1950).
1893 : భారత ప్రణాళిక పథానికి నిర్దేశకుడిగా పేరు పొందిన పి.సి.మహలనోబిస్ జననం (మ.1972).
1916 : బోయింగ్ విమానం మొదటిసారిగా ఎగిరిన రోజు.
1958 : అమెరికాకు చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు మైకల్ జాక్సన్ జననం (మ.2009).
1976 : సీ చెల్లెస్ దేశం బ్రిటిష్ ప్రభుత్వం నుంచి స్వాతంత్ర్యం పొందినది.
1998 : కమలాకర కామేశ్వరరావు, ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు (జ.1911).
జూన్ 30
1833 : సంస్కృతాంధ్ర కవి, పండితులు మండపాక పార్వతీశ్వర శాస్త్రి జననం.1917: తొలితరం రాజకీయ మరియు సామాజిక నాయకుడు దాదాభాయి నౌరోజీ మరణం. (జ.1825).
1928 : ప్రముఖ తెలుగు సినిమా నటుడు జె.వి. సోమయాజులు జననం.
1934 : ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త. భారతరత్న పురస్కార గ్రహీత చింతామణి నాగేశ రామచంద్ర రావు జననం.(చిత్రంలో)
1961 : అమెరికన్ ఆవిష్కర్త లీ డి ఫారెస్ట్ మరణం.
1969 : శ్రీలంక క్రికెట్ క్రీడాకారుడు సనత్ జయసూర్య జననం.
1982 : తెలుగు సినిమా కథానాయకుడు, హాస్య నటుడు అల్లరి నరేష్ జననం.
1984 : తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు రాయప్రోలు సుబ్బారావు మరణం.
1988 : తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు మామిడిపల్లి వీరభద్ర రావు మరణం
No comments:
Post a Comment