డిసెంబర్ 1
1905 :ప్రఖ్యాత పాత్రికేయుడు, కవి, సంపాదకుడు నార్ల వేంకటేశ్వరరావు జననం (మ.1985).1963 : నాగాలాండ్ భారతదేశానికి 16 వ రాష్ట్రం గా అవతరించింది.
1965 :భారతదేశంలో సరిహద్దు భద్రతా దళం ప్రారంభింపబడినది.
2003: ప్రపంచ ఎయిడ్స్ దినం.
1980: భారత క్రికెట్ క్రీడాకారుడు ముహమ్మద్ కైఫ్ జననం.
డిసెంబర్ 2
ప్రపంచ కాలుష్య నియంత్రణ దినం1912: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, బి.నాగిరెడ్డి జననం (మ.2004).
1937: మహారాష్ట్ర 15వ ముఖ్యమంత్రి మనోహర్ జోషి జననం.
1960 : తెలుగు సినీనటి సిల్క్ స్మిత జననం (మ.1996).
1985: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటయింది.
1989 : భారత దేశపు 8వ ప్రధానమంత్రిగా వి.పి.సింగ్ నియమితుడైనాడు.
1996 :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి మరణం (జ.1919).
డిసెంబర్ 3
ప్రపంచ వికలాంగుల దినోత్సవం.1884: మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ జననం (మ.1963).
1889: భారత స్వాతంత్ర్యోద్యమకారుడు ఖుదీరామ్ బోస్ జననం (మ.1908).
1971: భారత్-పాకిస్తాన్ 3వ యుద్ధం ప్రారంభం.
1979: ప్రసిద్ధ హాకీ ఆటగాడు, ధ్యాన్ చంద్ మరణం (జ.1905).
1984: భోపాల్ విషవాయు దుర్ఘటనలో 2200 మంది చనిపోయారు.
2011: ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు దేవానంద్ మరణం (జ.1923).
డిసెంబర్ 4
నౌకాదళ దినోత్సవం1829: సతీ సహగమన దురాచారాన్ని నిషేధించారు.
1910 : ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర సమరయోధుడు, భారత 8 వ రాష్ట్రపతి రామస్వామి వెంకట్రామన్ జననం.(మ.2009)
1919 : భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త ఐ.కె.గుజ్రాల్ జననం.(మ.2012)
1977 : భారతదేశానికి చెందిన క్రికెట్ ఆటగాడు అజిత్ అగార్కర్ జననం.
1922: ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జననం.(మ.1974)
1936: అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఏర్పడింది.
1981 : తెలుగు నటి, రూపదర్శి మరియు కాస్ట్యూం డిజైనర్ రేణూ దేశాయ్ జననం.
డిసెంబర్ 5
రాజ్యాంగ దినోత్సవం1886 : భారతీయ సినిమా మొదటి మూకీ మరియు టాకీ దశకు చెందిన రచయిత, చిత్రదర్శకుడు, నటుడు, పంపిణీదారుడు, ప్రదర్శకుడు మరియు ఛాయాగ్రహకుడు అర్దెషీర్ ఇరానీ జననం (మ.1969).
1896 : ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యోగీశ్వరుడు మరియు అణు భౌతిక శాస్త్రవేత్త స్వామి జ్ఞానానంద జననం (మ.1969).
1901 : అమెరికన్ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు, కథా రచయిత, గొంతు కళాకారుడు, చిత్రకారుడు, వ్యాపారవేత్త వాల్ట్ డిస్నీ జననం (మ.1966).
1905 : జమ్ము కాశ్మీర్ రాష్ట్ర మాజీ ప్రధాన మంత్రి షేక్ అబ్దుల్లా జననం (మ.1982).
1940 : పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ గజల్ గాయకుడు గులాం అలి జననం.
1972: ఒంగోలు జిల్లా, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్థము ప్రకాశం జిల్లా గా నామకరణము చేయబడినది.
2008 : ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నటుడు కొమ్మినేని శేషగిరిరావు మరణం (జ.1939).
2008 : ప్రముఖ సాహితీకారుడు మహ్మద్ ఇస్మాయిల్ మరణం (జ.1943).
డిసెంబర్ 6
1823 : జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు మాక్స్ ముల్లర్ జననం (మ.1900).1898 : స్వీడిష్ ఆర్థికవేత్త అయిన గున్నార్ మిర్థాల్ జననం (మ.1987)
1936 : ప్రముఖ సినిమా నటి సావిత్రి జననం (మ.1981).
1956 : భారత రాజ్యాంగ నిర్మాత, బి.ఆర్.అంబేద్కర్ మరణం.
1992 : కరసేవకులు అయోధ్య లోని బాబ్రి మసీదు ను ధ్వంసం చేసారు.
1950 : ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి మరియు ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శి నిరుపమ రావు జననం.
1995 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన అవధూత కాశీనాయన మరణం.
2013 : దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మరణం (జ.1918).
డిసెంబర్ 7
భారత సాయుధ దళాల పతాక దినోత్సవం1792 : భారతదేశం లో పోలీసు వ్యవస్థ ను ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది.
1856 : వితంతు పునర్వివాహ చట్టం అమలు లోకి వచ్చిన తరువాత, మొదటి వివాహం ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగింది.
1921 : ప్రముఖ భారత ఆధ్యాత్మిక గురువు ప్రముఖ్ స్వామీ మహరాజ్ జననం.
1946 : ఐక్యరాజ్యసమితి ఆధికారిక చిహ్నాన్ని ఆమోదించారు.
1980 : ఇంగ్లీష్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడు జాన్ టెర్రీ జననం.
2013: తెలుగు సినిమా హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరణం.(జ.1960)
డిసెంబర్ 8
1935 : ప్రముఖ హిందీ సినిమా నటుడు ధర్మేంద్ర జననం.1942 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు హేమంత్ కనిత్కర్ జననం.
1967: భారతదేశపు మొదటి జలాంతర్గామి, ఐ.ఎన్.ఎస్.కాల్వరి, నౌకాదళప్రవేశం చేసింది.
1903 : ఆంగ్లభాషా తత్వజ్ఞుడు, జీవశాస్త్రజ్ఞుడు, సమాజశాస్త్రజ్ఞుడు హెర్బర్ట్ స్పెన్సర్ మరణం.(జననం.1820)
1938 : ప్రముఖ పార్లమెంటు సభ్యురాలు మరియు సంఘ సేవకురాలు ఎ.కె.ప్రేమాజం జననం.
2002 : ప్రముఖ కార్టూనిస్ట్ భగవాన్ మరణం (జననం: 1939).
డిసెంబర్ 9
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం1868 : ప్రముఖ రసాయన శాస్త్రవేత్త ఫ్రిట్జ్ హేబర్ జననం (మ.1934).
1908 : ప్రసిద్ధిచెందిన పురాణ ప్రవచకుడు మరియు సంస్కృతాంధ్ర పండితుడు రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి జననం (మ.1995).
1946 : భారత జాతీయ కాంగ్రెసు కు అధ్యక్షురాలు మరియు భారత మాజీ ప్రధానమంత్రి, రాజీవ్ గాంధీ యొక్క భార్య సోనియా గాంధీ జననం.
1946: భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగింది.
1961: పోర్చుగీసు వారి నుండి గోవా విముక్తి చెంది భారత్ లో విలీనమైనది.
2003 : తెలుగు వికీపీడియా ఆవిర్భవించింది.
డిసెంబర్ 10
ప్రపంచ మానవహక్కుల దినం
1878: రాజాజీ (చక్రవర్తుల రాజగోపాలాచారి) జననం (మ.1972).
1880: ప్రముఖ విద్యావేత్త, కట్టమంచి రామలింగారెడ్డి జననం (మ.1951).
1896 : ప్రముఖ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త ఆల్‍ఫ్రెడ్ నోబెల్ మరణం (జ.1833).
1952 : దక్షిణ భారత సినిమా నటి సుజాత (నటి) జననం (మ.2011).
1955: కృష్ణా నది పై నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు శంకుస్థాపన జరిగింది.
2003 : తెలుగు వికీపీడియా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ప్రారంభం.
2004: టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన క్రీడాకారునిగా అనిల్ కుంబ్లే అవతరించాడు.
డిసెంబర్ 11
1891: తెలుగునాట మొట్టమొదటి వితంతు పునర్వివాహం కందుకూరి వీరేశలింగం పంతులు ఆధ్వర్యంలో, రాజమండ్రి లో జరిగింది.
1882 : తమిళ కవి, స్వాతంత్ర్య యోధుడు సుబ్రహ్మణ్య భారతి జననం (మ.1921).
1931 : ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో జననం (మ.1990).
1934 : భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు సలీం దుర్రానీ జననం.
1935 : భారత 13 వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జననం.
1946: రాజ్యాంగ పరిషత్తు అధ్యక్ష ఎన్నికలలో రాజేంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు.
1948: దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు రఘువరన్ జననం (మ.2008).
1994 : కన్నడ రచయిత మరియు కవి కువెంపు మరణం (జ.1904).
2013 : శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్, మైసూర్ రాజ కుటుంబం యొక్క వారసుడు, గుండెపోటుతో మరణించాడు.
డిసెంబర్ 12
కెన్యా జాతీయదినోత్సవం
1884 : తెలుగు భాషాభిమాని సి.పి.బ్రౌన్ మరణం (జ.1798).
1905 : ఒక భారతీయ ఆంగ్ల రచయిత, ముల్క్ రాజ్ ఆనంద్ జననం (మ.2004).
1931 : అలనాటి తెలుగు సినీ కథానాయిక షావుకారు జానకి జననం.
1950 : భారతీయ సినీ కథానాయకుడు రజినీకాంత్ జననం.
1970 : స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి కొండా వెంకటరంగారెడ్డి మరణం (జ.1890).
1971 : ప్రముఖ రంగస్థల నటుడు పెమ్మరాజు రామారావు మరణం.
1981 : భారత దేశపు క్రికెట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ జననం.
డిసెంబర్ 13
1048 : ఒక పర్షియన్ 'తజకి' ముస్లిం, బహుముఖ ప్రజ్ఞాశాలి అల్ బెరూని మరణం (జ.973).
1952 : సుప్రసిద్ధ దక్షిణ భారతీయ నటీమణి లక్ష్మి జననం.
1960 : ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు దగ్గుబాటి వెంకటేష్ జననం.
1968 : నాసా అంతరిక్షనౌక అపోలో 8 లో ప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర పుటలకెక్కారు.
1989 : అమెరికా గాయకురాలు, పాటల రచయిత టేలర్ స్విఫ్ట్ జననం.
1994 : భారతీయ కమ్యూనిస్టు నేత మరియు మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సోదరుడు నీలం రాజశేఖరరెడ్డి మరణం (జ.1918).
2001 : సాయుధ ఇస్లామిక్ తీవ్రవాదులు భారత పార్లమెంటు పై దాడి చేసారు.
2007 : స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రెసు నాయకురాలు తేళ్ల లక్ష్మీకాంతమ్మ మరణం (జ.1924).
డిసెంబర్ 14
భారత జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం
1998: ఆలమట్టి ఆనకట్ట ఎత్తును 509 మీ. కంటె పెంచరాదని, కర్ణాటక స్వంత పూచీకత్తుపై 26 క్రెస్టు గేట్లను అమర్చుకోవచ్చని, సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.
డిసెంబర్ 15
1903: రైటు సోదరులు తయారుచేసిన విమానం మొదటిసారి ఎగిరింది.
1933: ప్రముఖ చిత్రకారుడు బాపు జననం. (మ.2014)(చిత్రంలో)
1959: ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, డా.భోగరాజు పట్టాభి సీతారామయ్య మరణం (జ.1980).
1996: ప్రసిద్ధ తెలుగు సినిమా నటి సూర్యకాంతం మరణం. (జ.1924).
డిసెంబర్ 16
1971: భారత్-పాకిస్తాన్ మూడవ యుద్ధం ముగిసినది.
1971: బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది.
1951: సాలార్‌జంగ్ మ్యూజియం ను అప్పటి ప్రధానమంత్రి, జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించాడు.
డిసెంబర్ 17
1273 : పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త మరియు సూఫీ జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి మరణం.(జ.1207)
1778 : బ్రిటన్ కు చెందిన ప్రసిద్ధ రసాయన శాస్త్రవేత్త మరియు నూతన ఆవిష్కర్త హంఫ్రీ డేవీ జననం.(మ.1829)
1866 : ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత కూచి నరసింహం జననం. (మ.1940)
1903: రైటు సోదరులు తయారుచేసిన విమానం మొదటిసారి ఎగిరింది.
1905 : ప్రముఖ న్యాయవాది, భారత ప్రధాన న్యాయమూర్తి. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన మహమ్మద్ హిదయతుల్లా జననం.(మ.1992)
1959: ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, డా.భోగరాజు పట్టాభి సీతారామయ్య మరణం. (జ.1880).
1959: సినీనటి జయసుధ పుట్టినరోజు.
1996: ప్రసిద్ధ తెలుగు సినిమా నటి సూర్యకాంతం మరణం. (జ.1924 ).
డిసెంబర్ 18
1824 : బెంగాలీ పాత్రికేయుడు లాల్ బెహారీ డే జననం (మ.1892).
1883 : ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస భార్య. యోగిని. శారదా మాతగా ప్రసిద్ధిచెందిన శారదా దేవి జననం (మ.1920).
1878 : రష్యాకు చెందిన కమ్యూనిస్ట్ నేత మరియు అధ్యక్షుడు స్టాలిన్ జననం (మ.1953).
1946 : అమెరికా కు చెందిన సుప్రసిద్ధ సినీదర్శకుడు, రచయిత మరియు నిర్మాత స్టీవెన్ స్పీల్‌బెర్గ్ జననం.
1952: ప్రసిద్ధ స్వాతంత్ర్యోద్యమ కవి, గరిమెళ్ళ సత్యనారాయణ మరణం (జ.1893).
1961 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు లాల్‌చంద్ రాజ్‌పుత్ జననం.
1963 : అమెరికాకు చెందిన నటుడు మరియు చలన చిత్ర నిర్మాత బ్రాడ్ పిట్ జననం.
1973 : ప్రముఖ సినీ గీత రచయిత. డిబి చారి జననం.
డిసెంబర్ 19
1927 : భారతీయ స్వంతంత్ర సమరయోధుడు అష్ఫాకుల్లా ఖాన్ మరణం.(జ.1900)
1934:భారత దేశ 12 వ రాష్ట్రపతిప్రతిభా పాటిల్ జననం.
1935 :భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రాజ్‌సింగ్ దుంగార్పుర్ జననం.
1952: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ లోక్‌సభలో ప్రకటించాడు.
1961: భారత సైనిక దళాలు పోర్చుగీసు పాలన నుండి, గోవా ను విముక్తి చేసాయి.
1974 : ఆస్ట్రేలియా క్రికెట్ క్రీడాకారుడు రికీ పాంటింగ్ జననం.
1978: ఇందిరా గాంధీ ని లోక్‌సభ నుండి బహిష్కరించి, అప్పటి సమావేశాలు ముగిసే వరకు ఆమెకు జైలుశిక్ష విధించారు. డిసెంబర్ 26 న ఆమెను విడుదల చేసారు.
డిసెంబర్ 20
1942 : కోల్‌కతా పై మొదటిసారి జపాన్ వైమానికదాడి చేసింది.
1988 : వోటు వేసే కనీస వయసును 21 నుండి 18 కి తగ్గిస్తూ చేసిన 62 వ రాజ్యాంగ సవరణ పార్లమెంటు ఆమోదం పొందింది.
1990 : అమెరికన్ పాప్ గాయని మరియు గీత రచయిత జోజో జననం.
1996 : అమెరికన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు,ఖగోళ భౌతిక శాస్త్రజ్ఞుడు, రచయిత, కాస్మోలజిస్ట్ కార్ల్ సాగాన్ మరణం.(జ.1934)
2012 : భారత హాకీ క్రీడాకారుడు లెస్లీ క్లాడియస్ మరణం. (జ.1927)
డిసెంబర్ 21
1853 : సుప్రసిద్ధ పండితుడు, కవి మరియు విమర్శకుడు వేదము వేంకటరాయ శాస్త్రి జననం.
1926 : ప్రసిద్ద తెలుగు నాటక మరియు సినిమా నటుడు అర్జా జనార్ధనరావు జననం.
1931 : ముఖ సాహితీవేత్త, నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు జననం.
1959 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు కృష్ణమాచారి శ్రీకాంత్ జననం.
1962 : ప్రముఖ సాహితీ వేత్త మరియు ప్రఖ్యాతి పొందిన న్యాయవాది ఉప్మాక నారాయణమూర్తి మరణం.(జ.1896)
1969 : తొలితరం తెలుగు సినిమా మరియు రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు మరియు నేపధ్యగాయకుడు కొచ్చర్లకోట సత్యనారాయణ మరణం.(జ.1915)
1991 : ఒకప్పటి కమ్యూనిస్టు అగ్రరాజ్యమైన సోవియట్ యూనియన్, 16 దేశాలుగా విడిపోయింది.
2012 : డూమ్స్ డే లేదా యుగాంతం గా పిలువ బడుతోంది. ఈ రోజున మొత్తం తొమ్మిది గ్రహాలు ఒకే సరళ రేఖపైకి వస్తాయి.
డిసెంబర్ 22
సంవత్సరంలో అతితక్కువ పగటి సమయం ఉండే రోజు.
1666 : సిక్కుమత పదవ గురువు గురు గోవింద సింగ్ జననం.(మ.1708)
1887 : ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త, శ్రీనివాస రామానుజన్ జననం.(మ.1920)
1899 : ప్రసిద్ధి పొందిన వైద్యశాస్త్ర ప్రముఖులు శొంఠి దక్షిణామూర్తి జననం.(మ.1975)
1932 : భారత దేశానికి చెందిన ఆర్థిక వేత్త, రిజర్వ్ బ్యాంకు గవర్నరుగా పనిచేసిన సి.రంగరాజన్ జననం.
1947 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు దిలీప్ దోషి జననం.
డిసెంబర్ 23
1841 : కలకత్తాలోని హిందూ కళాశాల యొక్క నియమిత అధ్యాపకుడు మరియు పండితుడు, కవి హెన్రీ డెరోజియో మరణం.(జ.1809)
1902 : భారతదేశ ఐదవ ప్రధానమంత్రి చరణ్ సింగ్ జననం.(మ.1987)
1926 : ప్రముఖ భారత విద్యావేత్త స్వామి శ్రద్దానంద మరణం.
1933 : ప్రముఖ కవి, సంపాదకుడు శిరోమణి సహవాసి జననం.
1987 : ప్రముఖ వీణ విద్వాంసుడు ఈమని శంకరశాస్త్రి మరణం.(జ.1922)
1997 : సుప్రసిద్ధ పండితులు గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి మరణం. (జ.1880)
1998 : లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ కు మరణానంతరం భారతరత్న పురస్కారం లభించింది.
2004 : భారతదేశ 9 వ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు మరణం.(జ.1921)
డిసెంబర్ 24
1924 : హిందీ, ఉర్దూ, మరాఠీ మరియు తెలుగు భాషల సినిమా నేపధ్యగాయకుడు మహమ్మద్ రఫీ జననం.(మ.1980)
1932 : ఇంగ్లాండుకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు కొలిన్ కౌడ్రి జననం.
1956 : భారతీయ నటుడు మరియు నిర్మాత అనిల్ కపూర్ జననం.
1973 : అమెరికన్ రచయిత్రి స్టెఫెనీ మేయర్ జననం.
1987: తమిళనాడు రాజకీయాలను మలుపుతిప్పిన ఎం.జి.రామచంద్రన్ మరణం.(జ.1917)
2005: ప్రముఖ బహుభాషా చలచిత్ర నటి, దర్శకురాలు, నిర్మాత, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, సంగీత దర్శకురాలు, గాయని, పద్మశ్రీ భానుమతీ రామకృష్ణ మరణం.(జ.1925)
డిసెంబర్ 25
ఏసు క్రీస్తు పుట్టిన రోజు. దీనిని క్రిస్ట్‌మస్ గా క్రైస్తవులు జరుపుకుంటారు.
1846 : కేరళలోని తిరువంకూరు మహారాజు, గొప్ప భక్తుడు మరియు రచయిత స్వాతి తిరునాళ్ మరణం.(జ.1813)
1876 : భారత్‌ను విభజించి పాకిస్తాన్ ను ఏర్పాటుచేసిన నాయకుడు ముహమ్మద్ అలీ జిన్నా జననం.(మ.1948)
1901: ప్రముఖ కవి, తెలుగులెంక బిరుదు పొందిన తుమ్మల సీతారామమూర్తి జననం.
1919 : భాతర సినిమా సంగీతకారుడు. బాలీవుడ్ కు చెందిన ఓ ప్రసిద్ధ సంగీతకారుడు నౌషాద్ జననం.
1924: పూర్వ భారత ప్రధానమంత్రి, అటల్ బిహారీ వాజపేయి జననం.
1972: స్వతంత్ర భారత్ కు తొలి, తుది భారతీయ గవర్నర్ జనరల్, రాజాజీ మరణం.
1977: విషాదం నేపథ్యంలో నవ్వులు పండించిన హాస్యనటుడు చార్లీచాప్లిన్ మరణం.
డిసెంబర్ 26
బాక్సింగ్ డే
భారత జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం.
1791 : ప్రోగ్రామబుల్ కంప్యూటర్ ఆవిష్కర్త, ఇంగ్లీషు గణిత శాస్త్రవేత్త, తత్వవేత్త ఛార్లెస్ బాబేజ్ జననం.
1914 : ప్రముఖ సంఘ సంస్కర్త మురళీధర్ దేవదాస్ ఆమ్టే జననం.
1925: భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) స్థాపన.
1935 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు రోహన్ కన్హాయ్ జననం.
1940 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉద్దమ్ సింగ్ జననం.
1981: మహానటి కొమ్మారెడ్డి సావిత్రి మరణం (జ.1936 ).
1999 : ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోదుడు మరియు పండితుడు భారత 9 వ రాష్ట్రపతి శంకర దయాళ్ శర్మ మరణం.
డిసెంబర్ 27
1571: ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు జోహాన్స్ కెప్లర్ జననం.
1822 : ప్రముఖ ఫ్రెంచి జీవ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ జననం.
1911: జాతీయ గీతం జనగణమన ను మొదటిసారి కలకత్తాలో కాంగ్రెసు సభల్లో పాడారు.
1945: ప్రపంచబ్యాంకు ఏర్పాటయింది. 28దేశాలు సంతకాలు చేసాయి.
1953 : ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెవిన్ రైట్ జననం.
1965 : బాలీవుడ్ చిత్రాలలో కనిపించే భారతీయ నటుడు సల్మాన్ ఖాన్ జననం.
1992: అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.
2007 : రెండుసార్లు పాకిస్థాన్ ప్రధానిగా పనిచేసిన బెనజీర్ భుట్టో మరణం.
డిసెంబర్ 28
1612 : మొట్టమొదట నెప్ట్యూన్ గ్రహాన్ని పరిశీలించిన ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో
1875 : ప్రముఖ పండితులు మరియు కవి శిఖామణి బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు జననం.
1932 : ఇండియా - ధీరుభాయ్ అంబానీ, పారిశ్రామికవేత్త.
1937 : భారత పారిశ్రామికవేత్త రతన్ టాటా జననం.
1954 : అమెరికన్ నటుడు, సినీరచయిత, దర్శకుడు మరియు చిత్ర నిర్మాత డెంజెల్ వాషింగ్టన్ జననం.
1969 : అమెరికా సాఫ్టువేర్ ఇంజనీరు మరియు హ్యాకర్, ఓపెన్ సోర్సు లినక్స్ కెర్నల్ అభివృద్ధికారుడు లినస్ టోర్వాల్డ్స్ జననం.
డిసెంబర్ 29
1904 : కన్నడ రచయిత మరియు కవి కువెంపు జననం.(మ.1994)
1901 : ప్రముఖ సినీ రచయిత పింగళి నాగేంద్రరావు జననం. (మ.1971)
1917 : ప్రముఖ భారతీయ దర్శకుడు, నిర్మాత రామానంద్ సాగర్ జననం.(మ.2005)
1930 : తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి టీ.జి. కమలాదేవి జననం.(మ.2012)
1942 : హిందీ సినిమా నటుడు, నిర్మాత మరియు రాజకీయ వేత్త రాజేష్ ఖన్నా జననం.(మ.2012)
1953: రాష్ట్రాల పునర్విభజన విషయమై ఫజల్‌ఆలీ కమిషన్ ఏర్పాటయింది.
1960 : ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు డేవిడ్ బూన్ జననం.
డిసెంబర్ 30
1879 : ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త భగవాన్ రమణమహర్షి జననం (మ.1950).
1887 : కొప్పరపు సోదర కవుల లో ఒకరైన కొప్పరపు వెంకటరమణ కవి జననం (మ.1942).
1968 : ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శి ట్రిగ్వేలీ మరణం (జ.1896).
1971: ప్రముఖ శాస్త్రవేత్త డా.విక్రం సారాభాయ్ మరణం (జ.1919).
1973: ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు చిత్తూరు నాగయ్య మరణం (జ.1904).
1975 : అమెరికన్ ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ జననం.
2006: ఇరాక్ మాజీ అధ్యక్షుడు, సద్దామ్ హుసేన్ ను ఉరితీసారు (జ.1937).
డిసెంబర్ 31
1600: ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది.
1926 : భారతీయ సముద్ర-జీవశాస్త్ర శాస్త్రవేత్త ఎస్.జడ్. ఖాసిమ్ జననం.
1928: కళావాచస్పతి, ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు కొంగర జగ్గయ్య జననం.(మ.2004)
1953 : విప్లవ ప్రధానమైన సినిమాల నిర్మాత, నటుడు, హేతువాది ఆర్.నారాయణమూర్తి జననం.
1964 : వెస్టీండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు విన్‌స్టన్ బెంజిమన్ జననం.
1965 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు లక్ష్మణ్ శివరామకృష్ణన్ జననం.
1971 : భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థ కు ఆద్యుడు విక్రం సారాభాయ్ మరణం.(జ.1919)
1984 : ప్రముఖ భారతీయ సినిమా నటి, జంతుబలుల ఉద్యమకారిణి కవితా రాధేష్యం జననం.